ఆన్లైన్లో బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/రెన్యువల్ చేయండి
బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ అవుతాయి
ఏమేం కవర్ కావంటే..
కవర్ అయ్యే విషయాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. కవర్ కాని విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైనా మీరు క్లెయిమ్ చేసే సమయంలో ఇది కవర్ కాదు అని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉంటారు. కింద పేర్కొన్న పరిస్థితుల్లో బీమా వర్తించదు:
మీరు డిజిట్ అందించే బజాజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?
మీ అన్ని అవసరాలకు తగిన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ
కాంప్రహెన్సివ్
ప్రమాదం వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
×
|
✔
|
అగ్నిప్రమాదాల వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి డ్యామేజ్ అయితే |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తికి డ్యామేజ్ అయితే |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వ్యక్తి మరణించినా/ గాయాలపాలైనా.. |
✔
|
✔
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగిలించబడితే |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోగలగడం |
×
|
✔
|
నచ్చిన యాడ్–ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
థర్డ్–పార్టీ, కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య తేడాలను గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా కానీ, రెన్యువల్ చేసినా కానీ టెన్షన్ ఫ్రీగా ఉండండి. సులభమైన 3 దశల్లో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.
స్టెప్ 1
1800-258-5956 నంబర్‌కు కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన పని లేదు.
స్టెప్ 2
మీ నమోదిత మొబైల్ నెంబర్‌కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీయండి. మేము దశలవారీగా ఏం చేయాలో మీకు తెలియజేస్తాం.
స్టెప్ 3
ఏ పద్ధతిలో మీరు మరమ్మతు చేయించుకోవాలని అనుకుంటున్నారో ఎంచుకోండి. రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత విధానాన్ని ఎంచుకుంటే మా నెట్వర్క్ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.
డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?
బీమా సంస్థను మార్చాలని చూసినపుడు ఎవరికైనా సరే మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. అలా ప్రశ్నించుకోవడం మంచిదేలెండి.
డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్ చదవండి.బజాజ్ ఆటో కంపెనీ గురించి క్లుప్తంగా..
బజాజ్ గ్రూప్ భారతదేశంలో ఉన్న టాప్–10 బైక్ బ్రాండ్లలో ఒకటిగా ఉంది. ఇది చాలా తక్కువ సమయంలోనే వివిధ రకాల రంగాలకు విస్తరించింది. గ్రూప్ విలువను పెంచేందుకు బజాజ్ ద్విచక్ర వాహనాలు చాలా తోడ్పడ్డాయి. బజాజ్ ఆటో కేవలం బైక్‌లను మాత్రమే కాకుండా స్కూటర్లను కూడా తయారు చేస్తుంది.
ఆరున్నర దశాబ్దాల క్రితం స్థాపించబడిన బజాజ్ ఆటో కంపెనీ.. ప్రస్తుతం అత్యుత్తమ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా 4వ ర్యాంకులో ఉంది. కొన్ని బజాజ్ ద్విచక్ర వాహనాల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- పల్సర్ 150
- డోమినర్ 400
- పల్సర్ NS200
- అవేంజర్ క్రూయిజ్ 220
- CT100
- పల్సర్ 220F
- ప్లాటినా 110
- చెతక్
- డిస్కవర్
బజాజ్ ద్విచక్ర వాహనాలు మార్కెట్ల గతినే మార్చేశాయి. చాలా రోజుల నుంచి భారతీయ మార్కెట్ ఆలోచనా విధానాన్నే మార్చేశాయి. ఈ కంపెనీ యొక్క అనేక మోడళ్లకు అధిక డిమాండ్ ఉంది. అనేక రోజుల నుంచి వినియోగదారుల్లో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలనే అవగాహన కూడా పెరిగింది. అందుకోసమే బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కొనుగోలు కూడా పెరుగుతూ ఉంది.
బజాజ్ టూ–వీలర్స్‌ను పాపులర్ చేసింది ఏంటి?
KB100 వంటి బైక్ నుంచి అవేంజర్ క్రూయిజ్ 220 వరకు బజాజ్ ఆటోలో మనకు ఎన్నో బైక్స్ కనిపిస్తాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ ప్రియులను బజాజ్ సంతృప్తి పరచింది. బజాజ్ ఎందుకు ప్రజలకు ఫేవరేట్ మోడల్‌గా మారిందో.. టాప్ కారణాలను ఇక్కడ తెలుసుకోండి.
సరసమైన ధరలకు టూ వీలర్స్ – ఎటువంటి శ్రేణి ప్రజలకైనా అందుబాటులో ఉండేలా ఈ సంస్థ బైకులను తీసుకొస్తుంది. ఎందరి ప్రయాణ అవసరాలనో తీర్చింది. బజాజ్ ఆటో తన ద్విచక్ర వాహనాలతో భారతీయ ప్రజలతో మమేకమైంది. ధరల విషయంలోనే ఇది ఎక్కువగా పాపులర్ అయింది.
సాంకేతికతో కూడిన విశ్వసనీయత – బజాజ్ ఆటో దినదినాభివృద్ధి చెందుతుంది. బజాజ్ బైక్ మోడళ్లలో ఉపయోగించే అధునాతన సాంకేతికత అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం చాలా రకాల బజాజ్ బైక్ మోడళ్లు ఎక్కువ శక్తి, ఎక్కువ ఫీచర్లతో వస్తున్నాయి. వీటిల్లో ప్రపంచస్థాయి DTS-i ఇంజిన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా పవర్ బ్రేకింగ్ సిస్టమ్ వలన బైక్ నడుపుతుంటే సౌఖ్యంగా అనిపిస్తుంది. ఇలా ఎన్నో ఫీచర్లు ఉండటం వలన బజాజ్ టూ వీలర్ మోడల్స్ కస్టమర్లకు ఎంతో ఇష్టమైనవిగా చలామణీ అవుతున్నాయి.
మచ్చలేని కీర్తి ప్రతిష్టలు – బజాజ్ ఆటో భారతదేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థగా వెలుగొందుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు పైగా తన మోడళ్లను విక్రయిస్తోంది.
ప్రతి ఒక్కరికీ ద్విచక్ర వాహనం – రోజువారీ అవసరాల కోసం వీరు ఎక్కువ ద్విచక్ర వాహన మోడళ్లను అందిస్తారు. ప్రతీరోజూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తున్నారు.
ఇలా అనేక కారణాల వలన బజాజ్ ఆటో అంటే భారతదేశంలో ఇంటిపేరుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.
బజాజ్ టూ వీలర్స్ పాపులారిటీ ఎంతలా ఉన్నా కానీ.. ఇప్పటికే ఈ కంపెనీ బైకులు అనేక ప్రమాదాలను, నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కానీ మీరు కనుక బీమా పాలసీని తీసుకుంటే ఆర్థిక నష్టాల నుంచి కవర్ చేయబడతారు. అనుకోని సందర్భాల్లో వచ్చే విపత్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బజాజ్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా టూ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
ఇప్పటికే ఉన్న బజాజ్ ఇన్సూరెన్స్ పాలసీని గడువు ముగియక ముందే రెన్యువల్ చేయించుకోండి. ఇలా చేయడం వలన వారి బైక్ అన్ని సందర్భాల్లో రక్షించబడుతుంది.
బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు 4 కారణాలు
ఇతర అన్ని రకాల వాహనాల కంటే ద్విచక్ర వాహనాలు చాలా ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. అంతేకాకుండా ద్విచక్ర వాహనాల యజమానులకు దొంగతనాల వలన జరిగే నష్టాల నుంచి కూడా రిస్క్ ఉంటుంది. బజాజ్ ఇన్సూరెన్స్ పాలసీని కింది కారణాల వలన తప్పనిసరిగా తీసుకోవాలి.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్లను తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కాంప్రహెన్సివ్ ప్లాన్లు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. మీరు తప్పనిసరిగా బజాజ్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.
పాలసీ లేకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు – మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతీ వాహనదారుడికి కనీసం థర్డ్ పార్టీ పాలసీ అయినా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మీ వాహనం వలన థర్డ్ పార్టీ వ్యక్తులకు కలిగే నష్టాల నుంచి ఇది కవర్ చేస్తుంది. బీమా లేకుండా బండి మీద రోడ్డుపై తిరగడం చట్టపరంగా నేరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన మీకు ట్రాఫిక్ జరిమానాలు పడే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తూ మొదటి సారి పట్టుబడితే రూ. 2,000, అలాగే, రెండోసారి పట్టుబడితే రూ. 4,000 వరకు జరిమానా విధించబడుతుంది.
వివిధ పరిస్థితులలో మీ వాహనానికి అయిన డ్యామేజీల ఖర్చులను రికవర్ చేసుకోండి – అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల వలన డ్యామేజ్ అయినపుడు మరమ్మతుల కోసం విడిభాగాలకు అయ్యే ఖర్చులకు బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఆర్థిక భరోసాను అందజేస్తుంది. పైన పేర్కొన్నటువంటి అన్ని విపత్కర సందర్భాల్లో మీరు బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిములు లేవనెత్తవచ్చు.
వ్యక్తిగత ప్రమాదాలకు కవరేజీ ప్రయోజనాలు – బజాజ్ మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ యాడ్–ఆన్ కవర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ బైక్ ప్రమాదానికి గురైనప్పుడు ఇది పనిచేస్తుంది. ఇటువంటి యాడ్–ఆన్‌లను తీసుకోవడం వలన మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ మిమ్మల్ని అనేక ఆర్థిక నష్టాల నుంచి కవర్ చేస్తుంది. నిబంధనల ప్రకారం బీమా చేయించుకునే ప్రతి వ్యక్తి.. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ని కలిగి ఉండాలి. ఒకవేళ ప్రమాదంలో బీమా చేయించిన వ్యక్తి చనిపోతే ఇటువంటి ప్లాన్లు కుటుంబసభ్యులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు అందజేస్తాయి. అటువంటి అనుకోని సందర్భంలో వ్యక్తులు తమ కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించగలరు.
థర్డ్ పార్టీ డ్యామేజ్‌కి కవరేజ్ ప్రయోజనాలు – బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు థర్డ్ పార్టీ వ్యక్తులు/ప్రాపర్టీలను కూడా కవర్ చేస్తాయి. కాంప్రహెన్సివ్ ప్లాన్‌లో పైన పేర్కొన్న వాటితో పాటుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు జరిగిన నష్టాలు కూడా భర్తీ అవుతాయి. అలాకాకుండా థర్డ్ పార్టీ లయబులిటీ ప్లాన్‌ను ఎంచుకోవడం వలన కూడా మీరు థర్డ్ పార్టీ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. ఒకవేళ మీరు బీమా చేయించుకుని ఉండి.. ఏదైనా ప్రమాదంలో మీ వలన థర్డ్ పార్టీ వ్యక్తులకు గాయాలైనా లేదా వారు మరణించినా కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అంతేగాక థర్డ్ పార్టీ వ్యక్తులు మరణించినా కానీ కవరేజ్ లభిస్తుంది.
బీమా పాలసీ అందించే కవరేజీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పోటీలో ఉన్న మంచి బీమా కంపెనీని ఎంచుకుని అత్యుత్తమ ఫీచర్లను ఎంజాయ్ చేయడం, ప్రయోజనాలను పొందడం ముఖ్యం. బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించే సమయంలో కూడా అచ్చం ఇలాగే ఉంటుంది.
డిజిట్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి.
మీ బజాజ్ బైక్ కోసం డిజిట్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలంటే..
డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అందజేసే బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు గరిష్ట ప్రయోజనాలతో వస్తాయి. ఇవే వీటిని మార్కెట్లో నెంబర్-1గా చేశాయి. డిజిట్ అందజేసే బజాజ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల వలన ప్రయోజనాలేంటో ఓసారి పరిశీలిస్తే..:
మీ బజాజ్ మోటార్ సైకిల్‌కు తగిన ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోండి – డిజిట్ ద్వారా మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో మీకు నచ్చిన బీమాను ఎంచుకోవచ్చు. కింద ఉన్న వివిధ ప్లాన్లను తనిఖీ చేసి మీకు సరిపోతుందని అనిపించే బీమా ప్లాన్‌ను తీసుకోండి.
a) థర్డ్ పార్టీ లయబులిటీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కవర్ – థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీరు థర్డ్ పార్టీ లయబులిటీ కవరేజ్ మాత్రమే పొందుతారు. మీ బీమా చేయబడిన బైక్ ద్వారా థర్డ్ పార్టీ వ్యక్తులకు లేదా ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఈ పాలసీ మిమ్మల్ని కవర్ చేస్తుంది.
b) కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కవర్ – పేరు మాదిరిగానే కాంప్రహెన్సివ్ బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎక్కువ కవరేజిని అందిస్తుంది. ప్రమాదాలు, దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వలన సొంత వాహనం డ్యామేజ్ అయినా కానీ ఇది కవర్ చేస్తుంది. ఇది మీకు థర్డ్ పార్టీ లయబులిటీని కూడా అందజేస్తుంది.
ఎవరైతే 2018 సెప్టెంబర్ తర్వాత బజాజ్ బైకులు కొనుగోలు చేశారో.. వారు తమ వాహనాన్ని ఓన్ డ్యామేజ్ కవర్‌తో సంరక్షించుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ప్రయోజనాలను మీకు అందజేస్తుంది.
బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం లేదా రెన్యువల్ చేయడం చాలా తేలిక – డిజిట్ ఇన్సూరెన్స్ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్లైన్లో సింపుల్ స్టెప్స్‌లో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు ప్రక్రియ ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా సౌకర్యంగా ఉంటుంది. తక్కువ డాక్యుమెంట్లు, డిజిటల్ అప్లికేషన్ ప్రక్రియ వలన బీమా పాలసీ చాలా వేగంగా కొనుగోలు చేసేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా మీరు ఆన్లైన్ ద్వారా కూడా డిజిట్ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.
నగదు రహిత మరమ్మతుల కోసం 4400 కంటే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజీలు – 4400 కంటే ఎక్కువగా ఉన్న నగదు రహిత నెట్వర్క్ గ్యారేజీలతో ఒకవేళ మీ బైక్ రిపేర్ అయితే మీరు డిజిట్ ద్వారా చాలా సులభంగా మరమ్మతులు చేయించుకోవచ్చు. ఈ గ్యారేజీల్లో మరమ్మతులు మొత్తం నగదు రహితంగా ఉంటాయి. అంటే మీరు ఎటువంటి డబ్బు వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా డిజిట్ ఇన్సూరెన్స్ అందించే బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మరెన్నో ప్రత్యేకతలున్నాయి.
కేవలం 3 స్టెప్స్‌లో పూర్తయ్యే.. పేపర్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ – మీరు ఒకసారి బజాజ్ టూ వీలర్ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినా లేదా రెన్యూవల్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నా మీ క్లెయిములు మూడు సింపుల్ స్టెప్స్‌లో పూర్తవుతాయి. మార్కెట్లో ఉన్న మిగతా కంపెనీల కంటే క్లెయిమ్ సెటిల్ చేసేందుకు డిజిట్ చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. డిజిట్లో క్లెయిమ్స్ అత్యంత వేగంగా పూర్తవుతాయి. డిజిట్ మీకు స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియను అందజేస్తుంది. పేపర్‌లెస్ విధానంలో క్లెయిములు ఉండటం వలన ఈ ప్రక్రియ చాలా త్వరగా ముగుస్తుంది. అంతేకాకుండా డిజిట్ ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను కలిగి ఉంటుంది. అందువల్ల మీ పాలసీలు తిరస్కరణకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువ యాడ్–ఆన్లు అదనపు భద్రతను అందిస్తాయి – డిజిట్ అందజేసే బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు అవసరమైన యాడ్–ఆన్స్ ద్వారా కూడా అదనపు రక్షణను పొందొచ్చు. డిజిట్ అందిస్తున్న ఈ యాడ్–ఆన్ల ద్వారా వాహనానికి అదనపు భద్రత కల్పించండి. కేవలం ఒకటి లేదా రెండు యాడ్–ఆన్స్‌ను మాత్రమే ఎంచుకోండి.
- a) బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్
- b) జీరో డిప్రిషియేషన్ కవర్
- c) ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ కవర్
- d) కంజూమబుల్ కవర్
- e) రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
24x7 అందుబాటులో కస్టమర్ కేర్ సర్వీస్ – డిజిట్ అందిస్తున్న 24x7 కస్టమర్ సపోర్ట్ కూడా.. మీ బజాజ్ బైక్ కోసం దీన్ని అత్యుత్తమైన ప్లాన్‌గా మారుస్తుంది. మీకు ఏ సమయంలోనైనా బీమా గురించి సందేహాలు వస్తే డిజిట్ ప్రతినిధులకు కాల్ చేస్తే సరిపోతుంది. జాతీయ సెలవు దినాల్లో కూడా డిజిట్ కస్టమర్ సర్వీస్ సేవలు అందిస్తుంది.
బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది. ప్రీమియం తగ్గింపును కూడా మీరు పొందొచ్చు. దీని వలన మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
మీ బజాజ్ బైక్‌కు ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు కింద ఉన్న విషయాలను గురించి కూడా తెలుసుకోండి.
మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా తగ్గించుకోవాలి?
కింద పేర్కొన్న చిట్కాలను అనుసరించి.. మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్‌పై డిస్కౌంట్ పొందండి:
అవసరమైన యాడ్-ఆన్స్‌ను మాత్రమే కొనుగోలు చేయండి – ఎక్కువ కవరేజీని అందించే యాడ్–ఆన్స్‌ను కొనుగోలు చేయండి. ఎందుకంటే ఒక్కో యాడ్–ఆడ్ను కొనుగోలు చేయడం వలన ప్రీమియం ధర పెరుగుతుంది. యాడ్–ఆన్‌లను జాగ్రత్తగా ఎంచుకోవడం వలన మీ ప్రీమియాన్ని పరిధిలో ఉంచుకోవడంతో పాటుగా.. గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది.
నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రయోజనాలను చూసుకోండి – ఎన్సీబీ (NCB) ప్రయోజనాలను ఆనందించేందుకు మీ బజాజ్ బైకులను రోడ్ల మీద చాలా జాగ్రత్తగా నడపండి. ఎన్సీబీ (NCB) ప్రయోజనాలను ఆస్వాదించండి. మీరు ఎటువంటి క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి మీ టూ–వీలర్ ప్రీమియం మీద డిజిట్ డిస్కౌంట్ అందజేస్తుంది. మీ బీమా సంస్థ నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని అందిస్తోందా? లేదా? అనేది తనిఖీ చేయండి. నో క్లెయిమ్ బోనస్ (NCB) డిస్కౌంట్లను పొంది మీ బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో డిస్కౌంట్ పొందండి.
వాలంటరీ డిడక్టబుల్స్ ఎంచుకోండి - మీరు కనుక మీ పాలసీ యొక్క ప్రీమియాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు అయితే, మీరు వాలంటరీ డిడక్టబుల్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మీరు వాలంటరీ డిడక్టబుల్స్ను ఎంచుకున్నపుడు బీమా కంపెనీ మీ ప్రీమియంను గణనీయంగా తగ్గిస్తుంది. రిపేర్ లేదా రిప్లేస్మెంట్ ఖర్చులను ఇది నామమాత్రంగా అందజేస్తుంది.
మీ పాలసీని నేరుగా బీమా కంపెనీ నుంచి కొనుగోలు చేయండి - మీరు పాలసీని తీసుకోవాలని భావించినప్పుడు ఎటువంటి మధ్యవర్తిని లేదా బ్రోకర్‌ను సంప్రదించకండి. నేరుగా బీమా కంపెనీనే సంప్రదించండి. అక్కడ మీకు తక్కువ ఖర్చుకు పాలసీలు అందుతాయి. ఎటువంటి థర్డ్ పార్టీకి అదనంగా చెల్లించకండి.
ఈ ముఖ్యమైన చిట్కాలను ఉపయోగించడం వలన మీరు తక్కువ ధరకు బీమా పాలసీని కొనుగోలు చేయొచ్చు.
ఈ సమాచారంతో ఈరోజే ఆన్లైన్ ద్వారా బజాజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి. ఆర్థిక నష్టాల నుంచి దూరంగా ఉండండి. అంతేకాకుండా గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు మీ పాలసీ గడువు ముగియక ముందే పునరుద్ధరించుకోండి.
Two Wheeler Insurance for Bajaj Bike models