Third-party premium has changed from 1st June. Renew now
సమగ్ర కార్ బీమాను కొనుగోలు చేయండి/పునరుద్ధరించండి మరియు 75% వరకు ఆదా చేసుకోండి
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
- కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ కార్ ఇన్సూరెన్స్‌లో థర్డ్ పార్టీ నష్టాలు, ఓన్ డ్యామేజెస్ అన్నీ కవర్ అవుతాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి, అనుకోని నష్టాల నుంచి ఇది మన కారును కాపాడుతుంది.
- అడిషనల్‌గా, డిజిట్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌తో మీరు మీ పాలసీని జీరో డిప్రిషియేషన్ కవర్, రిటర్న్ టు ఇన్వాయిస్, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ లాంటి ఎన్నో యాడ్–ఆన్ కవర్లతో కస్టమైజ్ చేసుకోవచ్చు.
కింది వాటి గురించి మరింత తెలుసుకోండి:
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ప్రమాదం ఎంతదైనా అది నష్టం కలిగించేదే. అందుకే ఈ పాలసీ మీకు, మీ కారుకు జరిగే అన్ని దురదృష్టకర యాక్సిడెంట్లను కవర్ చేస్తుంది.
మీరు ఎంతగానో ఇష్టపడే మీ కారు దురదృష్టవశాత్తు చోరీకి గురైతే– కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ మీ పరిస్థితిని బెటర్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
మీ కారుకు జరిగే మేజర్, మైనర్ యాక్సిడెంట్లకు సంబంధించి ఇతరులపై కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన వాటిని చూసుకుంటుంది!
ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. కాబట్టి మీకు ఒక కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ఉంటే అది మిమ్మల్ని భారీ నష్టాల నుంచి కాపాడుతుంది.
ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరిగినపుడు కార్ డ్యామేజ్ అవడమే మాత్రమే కాకుండా వ్యక్తిగత గాయాలు, ఇంకా పెద్ద అనర్థాలు కూడా సంభవించవచ్చు. ఒకవేళ మీకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ఉంటే అలాంటివాటికి కవర్ చేయబడతారు. (మీకు PA కవర్ ఉంటే అందజేయబడుతుంది)
చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా ఒక్కోసారి పెద్ద నష్టానికి దారితీస్తుంది. అది మీ కారులోని విలువైన భాగాలను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మీకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ చాలా అవసరం.
మీ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను కస్టమైజ్ చేసేందుకు అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో అందుబాటులో ఉన్న కింది యాడ్–ఆన్స్‌తో మీ కారుకు మంచి కవరేజీ పొందండి.
మీ కారు కనుక ఐదేళ్ల కంటే పాతది కానప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు డిప్రిషియేషన్ చార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరింత సమాచారం కొరకు Zero Depreciation Car Insurance.
ఒక్కోసారి మన అందరికీ సాయం అవసరం అవుతుంది! అలా అవసరం అయినపుడు సాయం చేసేందుకే ఈ పాలసీ ఉంది. ఈ పాలసీ సాయంతో మేము మీకు కావాల్సిన సాయం అందిస్తాము. మరింత చదవండి Roadside Assistance.
ఇది ఇంజన్ గేర్ బాక్స్ కవర్ లాంటిదే. ఈ పాలసీ యాక్సిడెంట్ అయినపుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో మీ కార్ టైర్లను కవర్ చేస్తూ ఉంటుంది. మరింత సమాచారం కొరకు tyre protect add-on
మనం సాధారణ కార్ ఇన్సూరెన్స్ చేయిస్తే అది యాక్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో ఇంజన్, గేర్ బాక్స్‌లకు జరిగే డ్యామేజ్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. కానీ, మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ కనుక చేయించుకుంటే అన్ని సందర్భాల్లోనూ ఇంజన్, గేర్ బాక్స్‌లను కవర్ చేస్తుంది. మరింత చదవండి Engine Protection cover.
ఈ పాలసీ కొత్త కార్లకు అనువైనది. కొత్త కార్లను ఎవరైనా దొంగతనం చేసినా లేదా ఏదైనా పెద్ద డ్యామేజ్ సంభవించినా ఈ కవర్ వలన మీ ఇన్వాయిస్ అమౌంట్ మొత్తం మీకు లభిస్తుంది. మరింత సమాచారం కొరకు RTI in car insurance.
కారులో ప్రతి చిన్న పార్ట్ కూడా ఎంతో విలువైనదే. కాబట్టి ఈ పాలసీ మీ కారులోని అన్ని పార్ట్‌లను కవర్ చేస్తుంది. ఇంజన్ ఆయిల్, స్క్రూలు, నట్స్ మొదలైనవి, ఏ విధమైన యాక్సిడెంట్స్ అన్నది అవసరం లేకుండా. మరింత చదవండి Consumable cover.
మీ కాంప్రెహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ఎలాగూ కవర్ చేస్తుంది. మరి మీతోపాటు కారులో ప్రయాణించే వ్యక్తికి కూడా ఎందుకు వర్తించకూడదు? మరింత చదవండి Passenger Cover.
కవర్ కానివి ఏంటంటే?
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ మీ కారుకు 360- డిగ్రీల పాలసీ కవర్‌ను అందిస్తుంది. కానీ, ప్రతీ మంచిదానికి పరిమితులు ఉన్నట్లే దీనిలో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
మీరు మద్యపానం సేవించి వాహనం నడిపినపుడు జరిగే సంఘటనలకు సంబంధించి చేసే క్లెయిమ్‌లు పరిగణించబడవు.
మీరు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కారు నడిపినపుడు జరిగే సంఘటనలకు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేరు.
మీరు ఏదైనా నిర్దిష్ట యాడ్–ఆన్ కొనుగోలు చేయనప్పుడు అది అందించే బెనిఫిట్లను పొందలేరు!
కాన్సీక్వెన్షియల్ డ్యామేజెస్ అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరిగేవి. ఏదైనా యాడ్–ఆన్ లో ఉంటే తప్ప అలాంటి డ్యామేజెస్ ఈ పాలసీలో కవర్ కావు.
సింపుల్‌గా చెప్పాలంటే, మీరు చేయకూడని పనులు చేయకండి.
ఒకవేళ మీకు లెర్నర్స్ లైసెన్స్ ఉంటే, మీరు వ్యాలిడ్ లైసెన్స్ హోల్డర్‌తో కలిసి డ్రైవింగ్ చేయాలి. లేకపోతే కార్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం వల్ల స్వంత కారుకు జరిగే డ్యామేజ్లు/నష్టాలు |
|
అగ్నిప్రమాదం వల్ల స్వంత కారుకు కలిగే డ్యామేజ్లు/నష్టాలు |
|
ప్రకృతి వైపరీత్యం వల్ల స్వంత కారుకు సంభవించే డ్యామేజ్లు/నష్టాలు |
|
థర్డ్–పార్టీ వాహనానికి జరిగే డ్యామేజ్లు |
|
థర్డ్–పార్టీ ప్రాపర్టీకి కలిగే డ్యామేజ్లు |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్–పార్టీ వ్యక్తి అయ్యే గాయాలు/ మరణం |
|
మీ కారు దొంగతనం జరిగినప్పుడు |
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్ |
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్స్‌తో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ల మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను ఎవరు తీసుకోవాలి?
కొత్త కారును కొనడం అనేది అందరికీ ఒక జీవితాశయం. కొత్త కారు కోసం చాలా ఖర్చు చేసిన వారు ఈ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే మనశ్శాంతితో ఉండొచ్చు.
పెద్ద సిటీల్లో కారును డ్రైవ్ చేయడమంటే ఆషామాషీ కాదు. చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి, మీరు సేఫ్ సైడ్ ఉండేందుకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం ఉత్తమ మార్గం.
మీకు BMW లేదా Audi లాంటి ఫ్యాన్సీ కార్లుంటే మీరు తప్పకుండా ఈ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఈ పాలసీ చాలా రకాలుగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
కొంత మంది తమ కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కారు మీద చిన్న గీత పడ్డా వారు తట్టుకోలేరు. కారుకు ఏదైనా అవుతుందేమోనని భయపడేవారు తప్పకుండా కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి!
మీరు కారును చాలా రాష్‌గా డ్రైవింగ్ చేసే వ్యక్తులయితే తప్పనిసరిగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది మీకు చాలా బెనిఫిట్ చేస్తుంది. ఇది అనేక సందర్భాల్లో మీకు ఉపయోగపడుతుంది.
మీరు మీ కారులో తరచూ ప్రయాణాలు చేస్తూ కొత్త ప్రదేశాలు చుట్టి వస్తూ ఉంటే, మీకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ట్రావెలింగ్‌లో ఉన్నపుడు ఊహించని పరిణామాలు, నష్టాల నుంచి ఈ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది.
మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌కు ఎందుకు అప్‌గ్రేడ్ కావాలి?
థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తక్కువ ధరకే వస్తుందని చాలా మంది దాన్ని తీసుకునేందుకు మొగ్గు చూపిస్తారు. కానీ ఇక్కడ వారు ఒక విషయాన్ని గమనించకుండా వదిలిస్తారు. ప్రీమియం తక్కువగా ఉందని థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను పొందుతారు కానీ ఏదైనా అనుకోని నష్టం వచ్చినపుడు వారు తమ జేబులో నుంచి డబ్బులను కట్టాల్సి ఉంటుంది. అదే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌లో అయితే ఇలా ఉండదు.
డిజిట్ లోనే మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు తీసుకోవాలంటే?
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి FAQలు
✓ జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్‌తో పోల్చితే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ఏ విధంగా భిన్నమైనది?
ఇవి రెండు పూర్తిగా డిఫరెంట్ థింగ్స్! కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక రకమైన కార్ ఇన్సూరెన్స్. జీరో డిప్రిషియేషన్ కార్ ఇన్సూరెన్స్ అనేది కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌కు ఒక యాడ్–ఆన్.
✓ పాత కారుకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచి ఆలోచనేనా?
ఇది మీ కారు ఎంత పాతది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీ కారును తీసుకుని 15 ఏళ్లు దాటకపోయి ఉండి, మీరు మీ కారును తరచూ ఉపయోగిస్తుంటే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. ఇది మిమ్మల్ని అనేక సందర్భాల్లో ప్రొటెక్ట్ చేస్తుంది.
✓ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పుడు కొనుగోలు చేయాలి?
మీరు ప్రస్తుతం థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను వాడుతున్నట్లయితే మీ పాలసీని వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం.