మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని, మీ వాహనాన్ని (వెహికిల్‌ను) సంరక్షిస్తుంది. (కార్/బైక్/కమర్షియల్ వాహనం) మీరు కనుక వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రకృతి విపత్తులు, దొంగతనాలు, అనుకోని సందర్భాల నుంచి మీ కారును కాపాడుతుంది. భారతదేశంలో ప్రస్తుతం 3 రకాల మోటార్ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?
మోటార్ వెహికిల్ చట్టం 1988 ప్రకారం వాహనాలకు ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. భారతదేశంలో ఒక వాహనం రోడ్డు మీద తిరగాలంటే కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ అయినా ఉండాలి. అలా కాకుండా మీరు మీ వాహనాన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటే కాంప్రహెన్సివ్ పాలసీ ని తీసుకోవాలి. ఈ పాలసీ మీకు చాలా ఉపయోగపడుతుంది.
మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత ముఖ్యం?
- భారతదేశంలో వాహనం నడిపేందుకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. (Third-Party Liability Policy is mandatory in India)
- అనుకోని సందర్భాల్లో మీ వాహనం వల్ల ఎవరైనా థర్డ్ పార్టీకీ నష్టం వాటిల్లినప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.
- ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు సంభవించినపుడు ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని కాపాడుతుంది.
- ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
- ప్రాపర్టీ డ్యామేజ్ అయినపుడు నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
- యాక్సిడెంట్ వలన చనిపోయిన సందర్భంలో మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడకుండా ఆర్థికంగా ఆదుకుంటుంది.
నోట్: మీరు ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి బెనిఫిట్లు మారుతుంటాయి. మీకు ఎక్కువ బెనిఫిట్స్ కావాలంటే కాంప్రహెన్సివ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం చాలా ఉత్తమం.
డిజిట్ అందించే మోటార్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలి?
మోటార్ ఇన్సూరెన్స్ రకాలు
కార్ ఇన్సూరెన్స్
కార్ ఇన్సూరెన్స్ అనేది అనుకోని విపత్తుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా కాపాడుతుంది. యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల నుంచి మీ వాహనాన్ని సంరక్షిస్తుంది.
మేము ముఖ్యంగా రెండు రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాం; అందులో ఒకటి థర్డ్ పార్టీ పాలసీ, ఈ పాలసీ కేవలం థర్డ్ పార్టీ వలన అయిన డ్యామేజెస్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. మరొకటి కాంప్రహెన్సివ్ పాలసీ ; ఈ పాలసీ థర్డ్ పార్టీ డ్యామేజ్లతో పాటు స్వంత డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది.
ప్రతి కారుకు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒకేలా ఉండదు. ఇది ఒక్కో కారుకు ఒక్కోలా ఉంటుంది. కారు మోడల్, ఫ్యూయల్, ఇంజన్ రకం, పాత ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు ఇంకా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
అన్ని రకాల కార్ ఇన్సూరెన్స్ సంబంధిత క్లెయిమ్స్ సాయంతో సెటిల్ చేయబడతాయి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఫిజికల్ పేపర్ వర్క్ జీరో ఉంటుంది. సెల్ఫ్ ఇన్స్పెక్షన్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
కార్ ఇన్సూరెన్స్ తీసుకోండిబైక్ ఇన్సూరెన్స్
- ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని రక్షించడంలో బైక్ ఇన్సూరెన్స్ కీలకపాత్ర పోషిస్తుంది. మీకు బైక్ ఇన్సూరెన్స్ ఉంటే అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
- మేము రెండు రకాల బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాం; అందులో ఒకటి థర్డ్ పార్టీ పాలసీ, ఇది కేవలం థర్డ్ పార్టీలకు జరిగిన డ్యామేజ్ల వల్ల ఏర్పడే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. మరొకటి కాంప్రహెన్సివ్ పాలసీ; ఇది థర్డ్ పార్టీ డ్యామేజ్లతో పాటు స్వంత డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది.
- మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీ స్కూటర్ లేదా బైక్ మోడల్, రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- టూ వీలర్ ఇన్సూరెన్స్లకు సంబంధించిన క్లెయిమ్స్ కూడా jiffy సాయంతోనే సెటిల్ చేయబడతాయి. ఈ ప్రాసెస్‌లో కూడా జీరో ఫిజికల్ పేపర్ వర్క్ ఉంటుంది. దీనిలో కూడా సెల్ఫ్ ఇన్స్పెక్షన్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్
- కమర్షియల్ వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే కమర్షియల్ వాహనాలకు చాలా రిస్కులు ఉంటాయి.
- కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ లయబిలిటీస్, టోయింగ్ వెహికిల్స్, వాహన డ్రైవర్‌కు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కూడా కలిగి ఉంటాయి.
కమర్షియల్ వాహనాల ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా రకాలుంటాయి. కాబట్టి hello@godigit.com ఈమెయిల్‌పై మా టీమ్‌ను సంప్రదించి మీ వాహనానికి సరైన ఇన్సూరెన్స్‌ను ఎంపిక చేసుకోండి.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోండిసరైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడమెలా?
ప్రస్తుత రోజుల్లో వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఈజీ. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సెటిల్మెంట్ విషయంలో త్వరగా పూర్తయ్యే పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఎన్ని విషయాలు తనిఖీ చేసినా కానీ ఫాస్ట్‌గా క్లెయిమ్స్ పూర్తి కావడం అనేది ఇన్సూరెన్స్‌లో ముఖ్యమైన భాగం.
మీ వాహనానికి సరైన మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం కోసం కింద కొన్ని టిప్స్ ఉన్నాయి.
- సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) – ఐడీవీ (IDV) అనేది మీ కారు మార్కెట్ విలువ. మీరు కట్టాల్సిన ప్రీమియం దీని మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఆన్లైన్లో సరైన మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని భావించినపుడు మీ ఐడీవీ (IDV) ని కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఐడీవీ (IDV) గురించి మరింత తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. IDV in Bike Insurance & IDV in Car Insurance
- సర్వీస్ బెనిఫిట్స్ - 24x7 కస్టమర్ సపోర్ట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్, క్యాష్‌లెస్ గ్యారేజెస్ యొక్క వైడ్ నెట్వర్క్ అనేవి ఉన్నాయా లేదా అనే విషయాలు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చూడండి.
- యాడ్–ఆన్ కవర్స్ గురించి – మీరు మీ వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యాడ్–ఆన్స్‌ను అందిస్తుందా లేదా అనే విషయం గమనించాలి. యాడ్–ఆన్స్ వలన గరిష్ట బెనిఫిట్స్ అందుతాయి. డిజిట్ ప్రొవైడ్ చేసే యాడ్–ఆన్స్ గురించి ఇక్కడ చెక్ చేయండి. Car Insurance add-ons & Bike Insurance add-on
- క్లెయిమ్ స్పీడ్ – ఇన్సూరెన్స్ పాలసీలో ఇదే ప్రధాన విషయం. మీరు ఎంచుకున్న మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్స్ ఫాస్ట్‌గా సెటిల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి.
- బెస్ట్ వ్యాల్యూ – సరైన ప్రీమియం, సర్వీస్ బెనిఫిట్స్, యాడ్–ఆన్ కవర్స్, క్లెయిమ్ స్పీడ్ వంటివి చెక్ చేసిన తర్వాత బెస్ట్ వ్యాల్యూ ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి.
మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం కానీ, కొత్తది తీసుకోవడం కానీ చేసినపుడు తప్పకుండా ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించాలి. దీని వలన మీరు ఎంచుకునే డిఫరెంట్ ప్లాన్ వలన ప్రీమియం ఎలా మారుతుందో ఈజీగా తెలిసిపోతుంది.
మీ వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇక్కడ క్యాలుక్యులేట్ చేసుకోండి. car insurance premium calculator , bike insurance premium calculator.
మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు
మీ ఇన్సూరెన్స్ పాలసీని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మీరు ఎంచుకునే పాలసీని బట్టి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది నిర్ణయించబడుతుంది. (థర్డ్ పార్టీ vs స్టాండర్ట్ /కాంప్రహెన్సివ్), అంతేకాకుండా మీ వాహనం మోడల్‌ను బట్టి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం మారుతూ ఉంటుంది. మీ వాహనం మార్కెట్ విలువ, మీరు నివసించే నగరం తదితర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. మీ వాహనంలో వాడే ఇంధనం కూడా పరిగణనలోకి వస్తుంది.
మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవడానికి టిప్స్
చాలా మంది యూజర్లు ప్రీమియం తక్కువగా ఉందని టెంప్ట్ అవుతారు. కానీ మీరు పాలసీని తీసుకునే సమయంలో మీ ఐడీవీ (IDV)ని సరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
మీకు, మీ వాహనానికి ఎలాంటి రిస్క్ ఉండకుండా ప్రీమియంను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్:
- మీ బోనస్ ట్రాన్స్ఫర్ చేసుకోండి: ఆటో ఇన్సూరెన్స్ అనేది ఓనర్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. మీరు కొత్త కారుకు ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మీ బోనస్‌ను ట్రాన్స్ఫర్ చేసుకుని చెల్లించాల్సిన డబ్బును తగ్గించుకోండి.
- ఎన్సీబీని వాడుకోండి: ఒక టర్మ్‌లో మీరు ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) దక్కుతుంది. ఆన్లైన్లో మీరు మీ పాలసీని రెన్యువల్ చేసుకుంటున్నప్పుడు ఇది మంచి డిస్కౌంట్‌ను అందిస్తుంది. కాబట్టి మీరు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపడంతో పాటు చిన్న చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకండి.
- మంచి తగ్గింపు కోసం నిర్ణయం తీసుకోండి: ఏదైనా వెహికిల్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేటప్పుడు డిడక్టబుల్ టోటల్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ ప్రీమియంను తగ్గించుకోవడం కోసం ఉపయోగపడుతుంది.
వివిధ మోటార్ ఇన్సూరెన్స్ కోట్స్‌ను పోల్చేందుకు టిప్స్
తక్కువ ప్రీమియం ఉంది కదా అని ఇన్సూరెన్స్ పాలసీని గుడ్డిగా తీసుకోకండి. మీరు ఆన్లైన్లో మోటార్ ఇన్సూరెన్స్ గురించి వెతికేటప్పుడు కింది విషయాలను గుర్తు పెట్టుకోండి.
- సర్వీస్ బెనిఫిట్స్: ఇబ్బుందుల్లో ఉన్నపుడు మంచి సర్వీస్ అనేది చాలా అవసరం. అందుకే ఒక్క పాలసీని మాత్రమే కాకుండా అన్ని రకాల కంపెనీలు అందజేసే సర్వీసులను పోల్చి చూడటం చాలా ముఖ్యం. డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ డోర్ స్టెప్ పికప్, రిపేర్ & డ్రాప్, 6 నెలల సర్వీస్ వారంటీని అందిస్తుంది. అలాగే ఇందులో ఉన్న 24*7 కస్టమర్ కేర్ సపోర్ట్ మీకు ఎప్పుడైనా ఆపదొస్తే సరైన విధంగా సలహాలు ఇస్తుంది. 1000+ క్యాష్‌లెస్ గ్యారేజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
- త్వరిత క్లెయిమ్ సెటిల్మెంట్స్: ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్ సెటిల్ టైమ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ కంపెనీ తప్పకుండా త్వరగా క్లెయిమ్ సెటిల్ చేస్తుందనే నమ్మకం ఉండాలి. డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ 90.4 శాతం కస్టమర్ల క్లెయిమ్స్‌ను కేవలం 30 రోజుల్లోపే సెటిల్ చేసింది. ఇక్కడ మనకు జీరో హార్డ్ కాపీ పాలసీ అందుబాటులో ఉంది. దీనర్థం మేము కేవలం సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాం. ఇక్కడ ప్రతీది పేపర్‌లెస్‌గా, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది.
- మీ ఐడీవీ (IDV)ని చెక్ చేసుకోండి: చాలా వరకు ఆన్లైన్లో తీసుకునే ఇన్సూరెన్స్లకు ఐడీవీ (IDV) (Insured Declared Value) తక్కువగా ఉంటుంది, అంటే మీ వాహనం యొక్క మార్కెట్ విలువ తక్కువగా ఉంటుందన్న మాట.
- బెస్ట్ వాల్యూ: చివరగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు దాని వ్యాల్యూను చూడాలి. తీసుకునే పాలసీలో క్లెయిమ్ స్పీడ్‌గా సెటిల్ అవుతుందా? టెన్షన్ ఫ్రీ పాలసీలు ఉన్నాయా అనే విషయం గమనించాల్సి ఉంటుంది.
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనేముందు లేదా రెన్యూ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
ఐడీవీ (IDV) అంటే ఏమిటి?
ఐడీవీ (IDV) అనేది మోటార్ ఇన్సూరెన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. IDV అనేది ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఆఫ్ వెహికిల్. (ఎంతమొత్తానికి మీరు మీ వాహనానికి ఇన్సూరెన్స్ చేశారనేదాన్ని ఐడీవీ వివరిస్తుంది.) దీనిని బట్టే మీకు క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.
ఐడీవీ మీ వాహనం మార్కెట్ విలువ (డిప్రిషియేషన్తో కలిపి) మీద ఆధరపడి ఉండటంతో పాటు మీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ మీ వాహనం డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి మీ ఐడీవీ ప్రభావితం అవుతుంది, తద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది
ఎన్సీబీ (NCB) అంటే ఏమిటి?
ఎన్సీబీ (NCB) అంటే నో క్లెయిమ్డ్ బోనస్ అని అర్థం. ఇది మీరు మీ పాలసీని రెన్యూ చేసేటపుడు మీ ప్రీమియం అమౌంట్‌ను చాలా వరకు తగ్గిస్తుంది. మీరు పాలసీ తీసుకుని ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉండటమే ఎన్సీబీ (NCB). దీని గురించి మరింత తెలుసుకోండి. NCB in Bike Insurance & NCB in Car Insurance.
ఇంధనం కూడా పరిగణనలోకి వస్తుంది
ముందుగా పేర్కొన్న విధంగా మీ వాహనానికి ఎటువంటి ఇంధనాన్ని వాడుతున్నారనే విషయం కూడా ఇక్కడ పరిగణనలోనికి వస్తుంది. ఉదాహరణకు: CNG, LPG లేదా డీజిల్‌తో నడిచే కార్లకు పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువ ప్రీమియం ఉంటుంది.