ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసి ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
Instant Policy, No Medical Check-ups

భారతీయుల కోసం సింగపూర్ టూరిస్ట్ వీసా

భారతీయ పౌరుల కోసం సింగపూర్ టూరిస్ట్ వీసా పూర్తి సమాచారం

మీరు గాలిలో థ్రిల్ పొందే ఆహ్లాదకరమైన, ఆనందమైన స్థలాన్ని గురించి చూస్తున్నారా? అలా అయితే మీకు సింగపూర్ ఉత్తమ ఎంపిక!

నైట్ లైఫ్ కు మరియు అద్భుతమైన గ్రీనరీకి సింగపూర్ పెట్టింది పేరు. ఇక్కడ అన్వేషించేందుకు, కొత్త విషయాలను అనుభవించేందుకు టూరిస్టులకు ఎంతో అవకాశం ఉంటుంది. సింగపూర్ లో ఉన్న చాంగి విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను ఆకర్షిస్తుంది.

కుటుంబాలను, ఒంటరి ప్రయాణికులను మరియు యువ ప్రయాణికులను అందర్నీ ఆకర్షించే ప్రదేశం. సింగపూర్ లో షాపింగ్ ఫెస్టివల్, ఇండోర్ స్కై డైవింగ్ కొరకు ప్రపంచంలోనే అతిపెద్దదైన విండ్ టన్నెల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ప్రేమికుల మనసు దోచుకునే నేషనల్ ఆర్ట్ మ్యూజియం వంటి ఎన్నో రకాల ఆకర్షణలు ఉన్నాయి! దాని గురించి చెప్పుకునే ముందు అసలు సింగపూర్ టూరిస్ట్ వీసాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి చర్చిద్దాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం!

భారతీయ పౌరులు ప్రపంచంలోని అనేక దేశాలకు ట్రావెల్ చేసేందుకు ఆమోదించబడిన వీసా అవసరం. అటువంటి దేశాల్లో సింగపూర్ ఒకటి! 

భారతీయులు సింగపూర్ వెళ్లేందుకు వీసా అవసరమా?

అవును సింగపూర్ వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం. సింగపూర్ కు ట్రావెల్ చేసే టూరిస్ట్ ల సంఖ్యలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ కారణంగా వీసా ప్రాసెసింగ్ సులభంగా, వేగవంతంగా పూర్తవుతుంది.

ఎంబసీ మీకు జారీ చేసిన టూరిస్ట్ వీసా గరిష్టంగా 30 రోజుల వరకు ఉండేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. అంతే కాకుండా 2 సంవత్సరాల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మల్టీపుల్ ఎంట్రీ పర్మిట్ అంటే మీరు సింగపూర్ ట్రావెల్ చేసే ప్రతిసారీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు!

 

వీసా ఆమోదం కొన్ని ప్రాథమిక షరతులపై ఆధారపడి ఉంటుంది:

  • సింగపూర్ కు చేరుకున్న తేదీ నుంచి 6 నెలల వ్యాలిడిటీతో కూడిన పాస్ పోర్ట్ ఇండియన్ సిటిజన్స్ వద్ద ఉండాలి.

  • దేశంలో ఉన్న కాలంలో పాస్ పోర్ట్ హోల్డర్ బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధులు ఉండాలి.

భారతీయ పౌరుల కోసం సింగపూర్ వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తోందా?

లేదు. భారతీయుల కోసం సింగపూర్ వీసా ఆన్ అరైవల్ సేవలను అందించడం లేదు. కావున ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఇది వరకే ఆమోదించబడిన వీసా ఉండాలి. అలా అయితేనే సింగపూర్ సందర్శించొచ్చు. మూడో దేశానికి ఆకాశ మార్గాన ప్రయాణించే భారతీయులు 96 గంటల వీసా ఫ్రీ పెసిలిటీ పొందుతారు.

భారతీయులు సింగపూర్ టూరిస్ట్ వీసా పొందేందుకు కావాల్సిన పత్రాలు

ప్రతి దేశం వీసా ప్రాసెసింగ్ కోసం దాని సొంత నియమాలను కలిగి ఉంటుంది. వీసా అప్లికేషన్ ఆమోదం పొందేందుకు సరైన ఆధారాలు అందించడం తప్పనిసరి. సింగపూర్ వీసా కోసం మీకు కావాల్సిన పత్రాలు:

  • సింగపూర్‌లోకి ప్రవేశించిన తేదీ నుంచి 6 నెలల వ్యాలిడిటీతో ఉన్న ఇండియన్ పాస్ పోర్ట్ మీకు పాత పాస్ పోర్ట్ ఉంటే దానిని కూడా జతపరచండి.

  • ఇటీవల దిగిన 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, 35mm X45mm కొలతలతో ఉన్నవి. వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉండి 80% ఫేస్ క్లోజ్ అప్, మ్యాట్ ఫినిష్. మీరు ఫొటోలో ధరించిన మీ పైభాగం దుస్తులు తెలుపు రంగుకు విరుద్ధమైన రంగులో ఉండాలి. ఒక ఫొటోను పాస్ పోర్ట్ మీద గ్లూతో అతికించి దాని మీద సంతకం చేయాలి. రెండో ఫొటోను వీసా దరఖాస్తు ఫారం కోసం ఉంచాలి.

  • వెళ్లేందుకు, తిరిగి విమాన టికెట్లు.

  • కనీసం 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్.

  • వీసా అప్లికేషన్ ఫారం-14 A.

  • మీరు ఎందుకోసం సింగపూర్ వెళ్తున్నారనే వివరాలతో కూడిన కవర్ లెటర్.

భారతీయ పౌరుల కోసం సింగపూర్ వీసా ఫీజు

భారతీయ పౌరుల కోసం వీసా ప్రాసెసింగ్ ఫీజు 30 ఎస్జీడీ (ఒక్కోక్కరికి). ఈ ఫీజు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చెల్లించబడదు. మీ ఎంబసీ ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. ఇలా కాకుండా వీసాను తీసుకొచ్చే కొంత మంది ఏజెంట్లు ఉన్నారు కానీ వారు దాని కోసం చార్జ్ చేస్తారు.

భారతదేశం నుంచి సింగపూర్ టూరిస్ట్ వీసాను ఎలా అప్లై చేయాలి?

ఇండియా నుంచి సింగపూర్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. ఇది ఈ కింది విధంగా ఉంటుంది:

సింగపూర్ టూరిస్ట్ వీసా ప్రక్రియ సమయం

సింగపూర్ టూరిస్ట్ వీసా పొందేందుకు దాదాపు 3-4 రోజుల సమయం పడుతుంది. అందుకోసమే తెలివిగా వ్యవహరించి కనీసం 7 రోజుల ముందు దరఖాస్తు చేసుకోండి. ఆ రోజులన్నింటినీ మీ ట్రావెల్ డేస్ లాగే పరిగణించండి.

ఒక వేళ మీరు ఏజెంట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా ప్రక్రియ సమయం వేగవంతం చేయవచ్చు. కానీ వారు ఆ సర్వీసుకు అదనపు రుసుమును వసూలు చేస్తారు.

నేను సింగపూర్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

మీరు సెలవులను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్తుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పకుండా కొనుగోలు చెయ్యాలి. మీరు కొంతమేరకు ఆనందం, సంతోషం పొందుతున్నప్పుడు మీకు ఎటువంటి గందరగోళం అవసరం లేదు. మీరు పూర్తి నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తుండే సమయంలో సింగపూర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మిమల్ని సేవ్ చేస్తుంది. ట్రావెల్ పాలసీ మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ ఉంది:

భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్ల కోసం సింగపూర్ టూరిస్ట్ వీసా ప్రాసెస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నేను ఈ ఏడాది మార్చి 29న సింగపూర్ వెళ్లాలని అనుకుంటున్నాను. నేను వీసా కోసం ఎప్పుడు అప్లై చేయాలి?

మీరు వీసా కోసం కనీసం 30 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేయబడింది. ఇటువంటి సందర్భంలో మీరు ఫిబ్రవరి చివర్లోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

నేను సింగపూర్ లో ఉండగా అనుకోకుండా నా పాస్ పోర్ట్ ను కోల్పోతే ఏం జరుగుతుంది?

ఇలా జరిగినప్పుడు మీరు వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలి. మీ పాస్ పోర్ట్ పోయిందని తెలుపుతూ ఒక రిపోర్ట్ అడగండి. పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం అది అవసరం పడుతుంది. కొత్త పాస్ పోర్ట్ (రెన్యూవల్) కోసం అయిన ఖర్చులను మీరు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ చేసేటప్పుడు ఈ పత్రం చాలా ముఖ్యం.

నేను నిర్దేశిత ఫీజులు చెల్లించిన తర్వాత కూడా నా వీసా ఆమోదించబడకపోతే నేను ఆ ఫీజులను వాపసు పొందొచ్చా?

లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫీజు రిఫండ్ చేయబడదు. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించరు.

సింగపూర్ దేశం భారతీయుల కోసం ఆన్ అరైవల్ వీసాలు జారీ చేస్తుందా?

లేదు. ప్రస్తుతం సింగపూర్ భారతీయుల కోసం ఎటువంటి వీసా ఆన్ అరైవల్ సేవలను అందించడం లేదు. స్టాండర్డ్ వీసా లేదా ఈ-వీసా కోసం మీరు తప్పనిసరిగా ఎంబసీ ని సందర్శించాల్సి ఉంటుంది.

నేను సింగపూర్ కు ఏ అవసరం మీద వెళ్తున్నాను. అనేదానికి ఏవైనా కారణాలు చూపాలా?

మీరు సింగపూర్ ను ఎందుకు సందర్శించాలనుకుంటున్నారనే విషయాలతో కూడిన కవర్ లెటర్ లేకపోతే మీ అప్లికేషన్ ప్రాసెస్ అసంపూర్తిగా ఉంటుంది. దయచేసి విస్తృతంగా వివరించండి.