Select Number of Travellers
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
మీరు గాలిలో థ్రిల్ పొందే ఆహ్లాదకరమైన, ఆనందమైన స్థలాన్ని గురించి చూస్తున్నారా? అలా అయితే మీకు సింగపూర్ ఉత్తమ ఎంపిక!
నైట్ లైఫ్ కు మరియు అద్భుతమైన గ్రీనరీకి సింగపూర్ పెట్టింది పేరు. ఇక్కడ అన్వేషించేందుకు, కొత్త విషయాలను అనుభవించేందుకు టూరిస్టులకు ఎంతో అవకాశం ఉంటుంది. సింగపూర్ లో ఉన్న చాంగి విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను ఆకర్షిస్తుంది.
కుటుంబాలను, ఒంటరి ప్రయాణికులను మరియు యువ ప్రయాణికులను అందర్నీ ఆకర్షించే ప్రదేశం. సింగపూర్ లో షాపింగ్ ఫెస్టివల్, ఇండోర్ స్కై డైవింగ్ కొరకు ప్రపంచంలోనే అతిపెద్దదైన విండ్ టన్నెల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ప్రేమికుల మనసు దోచుకునే నేషనల్ ఆర్ట్ మ్యూజియం వంటి ఎన్నో రకాల ఆకర్షణలు ఉన్నాయి! దాని గురించి చెప్పుకునే ముందు అసలు సింగపూర్ టూరిస్ట్ వీసాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి చర్చిద్దాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం!
భారతీయ పౌరులు ప్రపంచంలోని అనేక దేశాలకు ట్రావెల్ చేసేందుకు ఆమోదించబడిన వీసా అవసరం. అటువంటి దేశాల్లో సింగపూర్ ఒకటి!
అవును సింగపూర్ వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం. సింగపూర్ కు ట్రావెల్ చేసే టూరిస్ట్ ల సంఖ్యలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ కారణంగా వీసా ప్రాసెసింగ్ సులభంగా, వేగవంతంగా పూర్తవుతుంది.
ఎంబసీ మీకు జారీ చేసిన టూరిస్ట్ వీసా గరిష్టంగా 30 రోజుల వరకు ఉండేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. అంతే కాకుండా 2 సంవత్సరాల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మల్టీపుల్ ఎంట్రీ పర్మిట్ అంటే మీరు సింగపూర్ ట్రావెల్ చేసే ప్రతిసారీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు!
వీసా ఆమోదం కొన్ని ప్రాథమిక షరతులపై ఆధారపడి ఉంటుంది:
సింగపూర్ కు చేరుకున్న తేదీ నుంచి 6 నెలల వ్యాలిడిటీతో కూడిన పాస్ పోర్ట్ ఇండియన్ సిటిజన్స్ వద్ద ఉండాలి.
దేశంలో ఉన్న కాలంలో పాస్ పోర్ట్ హోల్డర్ బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధులు ఉండాలి.
లేదు. భారతీయుల కోసం సింగపూర్ వీసా ఆన్ అరైవల్ సేవలను అందించడం లేదు. కావున ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఇది వరకే ఆమోదించబడిన వీసా ఉండాలి. అలా అయితేనే సింగపూర్ సందర్శించొచ్చు. మూడో దేశానికి ఆకాశ మార్గాన ప్రయాణించే భారతీయులు 96 గంటల వీసా ఫ్రీ పెసిలిటీ పొందుతారు.
ప్రతి దేశం వీసా ప్రాసెసింగ్ కోసం దాని సొంత నియమాలను కలిగి ఉంటుంది. వీసా అప్లికేషన్ ఆమోదం పొందేందుకు సరైన ఆధారాలు అందించడం తప్పనిసరి. సింగపూర్ వీసా కోసం మీకు కావాల్సిన పత్రాలు:
సింగపూర్‌లోకి ప్రవేశించిన తేదీ నుంచి 6 నెలల వ్యాలిడిటీతో ఉన్న ఇండియన్ పాస్ పోర్ట్ మీకు పాత పాస్ పోర్ట్ ఉంటే దానిని కూడా జతపరచండి.
ఇటీవల దిగిన 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, 35mm X45mm కొలతలతో ఉన్నవి. వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉండి 80% ఫేస్ క్లోజ్ అప్, మ్యాట్ ఫినిష్. మీరు ఫొటోలో ధరించిన మీ పైభాగం దుస్తులు తెలుపు రంగుకు విరుద్ధమైన రంగులో ఉండాలి. ఒక ఫొటోను పాస్ పోర్ట్ మీద గ్లూతో అతికించి దాని మీద సంతకం చేయాలి. రెండో ఫొటోను వీసా దరఖాస్తు ఫారం కోసం ఉంచాలి.
వెళ్లేందుకు, తిరిగి విమాన టికెట్లు.
కనీసం 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్.
వీసా అప్లికేషన్ ఫారం-14 A.
మీరు ఎందుకోసం సింగపూర్ వెళ్తున్నారనే వివరాలతో కూడిన కవర్ లెటర్.
భారతీయ పౌరుల కోసం వీసా ప్రాసెసింగ్ ఫీజు 30 ఎస్జీడీ (ఒక్కోక్కరికి). ఈ ఫీజు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చెల్లించబడదు. మీ ఎంబసీ ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. ఇలా కాకుండా వీసాను తీసుకొచ్చే కొంత మంది ఏజెంట్లు ఉన్నారు కానీ వారు దాని కోసం చార్జ్ చేస్తారు.
ఇండియా నుంచి సింగపూర్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. ఇది ఈ కింది విధంగా ఉంటుంది:
సింగపూర్ టూరిస్ట్ వీసా ఫారం (14-A) ను ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వివరాలను జాగ్రత్తగా నింపండి.
పైన పేర్కొన్న విధంగా మీ పాస్ పోర్ట్ వ్యాలిడిటీని కలిగి ఉందని నిర్దారించుకోండి.
వీసా అప్లికేషన్ తో జతచేయాల్సిన విమాన టికెట్లు మీ వద్ద ఉన్నాయని నిర్దారించుకోండి.
కారణం, తేదీ, మరియు ట్రావెల్ స్థలాలను పేర్కొంటూ దరఖాస్తుదారుడు రాసిన కవరింగ్ లెటర్. లేఖ మీద సింగపూర్ ఎంబసీ అని సంబోంధించాలి.
మీరు మొదటిసారి ప్రయాణిస్తున్న వారు అయితే గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను పత్రాలు మరియు బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించండి.
చిరునామా ప్రూఫ్ సమర్పించండి. మీరు నివసించే ప్రదేశం పాస్ పోర్ట్ లో పేర్కొన్న చిరునామాకు భిన్నంగా ఉంటే అప్పుడు రెండు చిరునామాలకు ధృవీకరణ అవసరం.
సింగపూర్ లోని హోటల్స్ ధృవీకరించిన బుకింగ్ జత చేయండి.
మీరు వ్యక్తిగతంగా లేదా ఆన్ లైన్ లో అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత వీసా కోసం కావాల్సిన ఫీజు చెల్లించండి.
మీకు ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు, మీరు వీసా ప్రాసెసింగ్ కొరకు వేచి ఉండవచ్చు.మీరు ఒకసారి వీసా అందుకున్న తర్వాత సింగపూర్ అసలు దూరమే కాదు.
సింగపూర్ టూరిస్ట్ వీసా పొందేందుకు దాదాపు 3-4 రోజుల సమయం పడుతుంది. అందుకోసమే తెలివిగా వ్యవహరించి కనీసం 7 రోజుల ముందు దరఖాస్తు చేసుకోండి. ఆ రోజులన్నింటినీ మీ ట్రావెల్ డేస్ లాగే పరిగణించండి.
ఒక వేళ మీరు ఏజెంట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా ప్రక్రియ సమయం వేగవంతం చేయవచ్చు. కానీ వారు ఆ సర్వీసుకు అదనపు రుసుమును వసూలు చేస్తారు.
మీరు సెలవులను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్తుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పకుండా కొనుగోలు చెయ్యాలి. మీరు కొంతమేరకు ఆనందం, సంతోషం పొందుతున్నప్పుడు మీకు ఎటువంటి గందరగోళం అవసరం లేదు. మీరు పూర్తి నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తుండే సమయంలో సింగపూర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మిమల్ని సేవ్ చేస్తుంది. ట్రావెల్ పాలసీ మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ ఉంది:
మెడికల్ ఎమర్జెన్సీలు లేదా ప్రమాదాలు ఎప్పుడు కూడా చెప్పి రావు. ఊహించుకోండి. మీరు ట్రిప్ లో ఉండగా మీకు మెడికల్ సహాయం అవసరం వస్తే. మీరు హోటల్ జిమ్ లో ఉండి ట్రెడ్మిల్ పై వ్యాయామం చేస్తుండగా కింద పడ్డారని అనుకుందాం. దీని వల్ల మీ మోచేతికి కొంత గాయం, నొప్పి, చిన్నపాటి రక్తస్రావం జరుగుతుంది. ట్రావెల్ పాలసీ కనుక ఉంటే ఇన్సూరెన్స్ సంస్థ మీకు వెంటనే కావాల్సిన మెడికల్ రిలీఫ్ ను దగ్గర్లోని ఆసుపత్రి నుంచి అందిస్తుంది. ఏదైనా వ్యాధి అయినా అందులో కవర్ అవుతుంది.
మీరు విలువైన వస్తువులు అంతే కాకుండా మీ వెంట తీసుకెళ్లిన పాస్ పోర్ట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్లే జోన్ లలో ఉన్న రైడ్స్ లో మీరు దానిని వదిలేశారు. ఆ విషయాన్ని గ్రహించలేదు. మీకు పరిహారం వచ్చేలా మీ ట్రావెల్ పాలసీ ఏర్పాట్లు చేస్తుంది.
ఎవరైనా ప్రయాణికుడికి ముందుగానే గుండె జబ్బు ఉందని అనుకుందాం. అతడు సింగపూర్ పర్యటనలో ఉండగా పెయిన్ వచ్చి అతడికి పాక్షిక పక్షవాతం వచ్చింది. దానికి వెంటనే మెడికల్ సహాయం అవసరం. అత్యవసర మెడికల్ సదుపాయంతో ఆ వ్యక్తి హోమ్ కు తిరిగి రావాలని అనుకుంటాడు. ట్రావెల్ పాలసీ పాలసీదారుకు దీనిని కవర్ చేస్తుంది.
ఒక కుటుంబం ట్రిప్ ప్రారంభించకముందే వారిలో ఒకరికి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లు నిర్దారణ అయింది. అది వారిని యాత్ర ప్రారంభించకుండా చేసింది. ఇప్పటికైనా ట్రిప్ వాయిదా వేయాలని టికెట్స్ రద్దు చేయాలని కుటుంబం మొత్తం కోరుకుంటోంది. అటువంటి సమయంలో పాలసీదారులు టికెట్ల రద్దు ఖర్చులను తిరిగి పొందేలా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయం చేస్తుంది.
దీని గురించి మరింత తెలుసుకోండి:
పాలసీ కవర్ పరిధి గురించి ప్రయాణికులు తెలుసుకోవాలి. అప్పుడే వారు దాని నుంచి పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ట్రావెల్ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరేం కాదు. కానీ మీరు మన దేశ భూభాగాన్ని విడిచి వేరే దేశాలకు ప్రయాణిస్తున్న సమయంలో పాలసీని తీసుకోవడం మంచిది.
మీరు వీసా కోసం కనీసం 30 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేయబడింది. ఇటువంటి సందర్భంలో మీరు ఫిబ్రవరి చివర్లోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
మీరు వీసా కోసం కనీసం 30 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేయబడింది. ఇటువంటి సందర్భంలో మీరు ఫిబ్రవరి చివర్లోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఇలా జరిగినప్పుడు మీరు వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలి. మీ పాస్ పోర్ట్ పోయిందని తెలుపుతూ ఒక రిపోర్ట్ అడగండి. పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం అది అవసరం పడుతుంది. కొత్త పాస్ పోర్ట్ (రెన్యూవల్) కోసం అయిన ఖర్చులను మీరు రీయింబర్స్మెంట్ క్లయిమ్ చేసేటప్పుడు ఈ పత్రం చాలా ముఖ్యం.
ఇలా జరిగినప్పుడు మీరు వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలి. మీ పాస్ పోర్ట్ పోయిందని తెలుపుతూ ఒక రిపోర్ట్ అడగండి. పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం అది అవసరం పడుతుంది. కొత్త పాస్ పోర్ట్ (రెన్యూవల్) కోసం అయిన ఖర్చులను మీరు రీయింబర్స్మెంట్ క్లయిమ్ చేసేటప్పుడు ఈ పత్రం చాలా ముఖ్యం.
లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫీజు రిఫండ్ చేయబడదు. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించరు.
లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫీజు రిఫండ్ చేయబడదు. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించరు.
లేదు. ప్రస్తుతం సింగపూర్ భారతీయుల కోసం ఎటువంటి వీసా ఆన్ అరైవల్ సేవలను అందించడం లేదు. స్టాండర్డ్ వీసా లేదా ఈ-వీసా కోసం మీరు తప్పనిసరిగా ఎంబసీ ని సందర్శించాల్సి ఉంటుంది.
లేదు. ప్రస్తుతం సింగపూర్ భారతీయుల కోసం ఎటువంటి వీసా ఆన్ అరైవల్ సేవలను అందించడం లేదు. స్టాండర్డ్ వీసా లేదా ఈ-వీసా కోసం మీరు తప్పనిసరిగా ఎంబసీ ని సందర్శించాల్సి ఉంటుంది.
మీరు సింగపూర్ ను ఎందుకు సందర్శించాలనుకుంటున్నారనే విషయాలతో కూడిన కవర్ లెటర్ లేకపోతే మీ అప్లికేషన్ ప్రాసెస్ అసంపూర్తిగా ఉంటుంది. దయచేసి విస్తృతంగా వివరించండి.
మీరు సింగపూర్ ను ఎందుకు సందర్శించాలనుకుంటున్నారనే విషయాలతో కూడిన కవర్ లెటర్ లేకపోతే మీ అప్లికేషన్ ప్రాసెస్ అసంపూర్తిగా ఉంటుంది. దయచేసి విస్తృతంగా వివరించండి.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 06-01-2025
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.