ఇండియా నుంచి జపాన్ టూరిస్ట్ వీసా
ఇండియన్ల కోసం జపాన్ వీసా గురించి పూర్తి సమాచారం
జపాన్ అనేది ఆసియా ఖండానికి చెందినది. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో జపాన్ కల్చర్ వెరైటీగా ఉంటుంది. ఇదొక ద్వీప దేశం. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలకంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. జపాన్ అనేది చెర్రీ బ్లోసమ్ గార్డెన్స్ మరియు శిల్పాలు, కవివత్వానికి ప్రసిద్ధి చెందింది. జపాన్ లో పది కంటే ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో మౌంట్ ఫుజి అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం.
హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, ఒసాకా క్యాస్టిల్, మరియు ఐలాండ్ ష్రైన్ ఆఫ్ ఇట్సుకిషిమా వంటి ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయి. జపాన్ కు ట్రావెల్ చేసేందుకు బెస్ట్ టైం మార్చి నుంచి మే మధ్యలో మరియు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉంటుంది.
జపాన్ వెళ్లేందుకు ఇండియన్లకు వీసా కావాలా?
అవును. జపాన్ వెళ్లేందుకు ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లందరికీ తప్పకుండా వీసా కావాలి.
ఇండియన్ సిటిజన్ల కోసం జపాన్ ఆన్ అరైవల్ వీసా సౌకర్యాన్ని అందిస్తోందా?
లేదు. దురదృష్టవశాత్తు జపాన్ కు ట్రావెల్ చేసే ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు మీ జపాన్ వీసా కోసం దరఖాస్తు చేసినప్పటి నుంచి బయలుదేరేందుకు మీరు వేసుకున్న ప్లాన్ గడువుకు కనీసం 60-90 రోజుల సమయం ఉండాలి.
జపాన్ టూరిస్ట్ వీసాకు అవసరం అయ్యే పత్రాలు
జపాన్ అనేది ఇటీవల ఇండియన్ టూరిస్ట్ లు ఎక్కువగా సందర్శిస్తున్న ప్లేస్ గా మారింది. ఇంతకుముందు రోజుల్లో జపాన్ టూరిస్ట్ వీసాను పొందడం అంత సులభంగా లేకుండేది. అయితే తర్వాతి కాలంలో జపాన్ ఎంబసీ వీసా నిబంధనలలో కొంత సడలింపు చేసింది. మీరు జపాన్ టూరిస్ట్ వీసా దరఖాస్తు చేసుకునేందుకు ఈ కింది పత్రాలు అవసరం అవుతాయి.
ఇండియన్ సిటిజన్లకు జపాన్ వీసా కోసం ఉండే ఫీజులు
ఇండియన్ సిటిజన్లు అప్లికేషన్ ఫీజుగా సింగిల్ ఎంట్రీ కోసం ఎంబసీకి 3000 యెన్లు (జపాన్ కరెన్సీ), అదే విధంగా డబుల్ ఎంట్రీ కోసం 6000 యెన్లను చెల్లించాలి. ఇవి మాత్రమే కాకుండా టూరిస్ట్ వీసా కోసం 700 యెన్ (జపాన్ కరెన్సీ) వరకు ఉంటుంది.
జపాన్ వీసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇండియాలో ఉన్న ప్రధాన నగరాల్లో దాదాపు 16 వీసా అప్లికేషన్ సెంటర్లు ఉన్నాయి. జపనీస్ టూరిస్ట్ వీసా కోసం అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు సులభం.
జపాన్ ఎంబసీ వెబ్సైట్ నుంచి వీసా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా పూరించండి.
వీసా అప్లికేషన్ సెంటర్ లేదా ఎంబసీలో అపాయింట్‌మెంట్ తీసుకోండి.
పేర్కొన్న వీసా ఫీజును చెల్లించండి.
మీరు షెడ్యూల్ చేసుకున్న తేదీన ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.
అన్ని వివరాలైన బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ సమర్పించండి.
అధికారుల నుంచి వచ్చే స్పందన కోసం వెయిట్ చేయండి.
మీ పాస్ పోర్ట్ ను సేకరించి వీసా ఆమోదం/తిరస్కరణ పొందండి.
జపాన్ టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ టైమ్
జపాన్ ఎంబసీ మీ వీసాను ప్రాసెస్ చేసేందుకు 5 పని రోజుల సమయం తీసుకుంటుంది. మీరు అప్లికేషన్ ను సమర్పించిన రోజు లెక్కలోకి రాదు.
నేను జపాన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?
జపాన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం. ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి మెడికల్ అవసరాలు వచ్చి విదేశాల్లోని ఆసుపత్రిలో చేరాల్సి వస్తే మెడికల్ ఖర్చులను అరికట్టడంలో ఇది సహాయపడుతుంది. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు పొందగలిగే ఇతర ప్రయోజనాలు:
ట్రావెల్ ఇన్సూరెన్స్ ను ఎంచుకునే క్రమంలో మీకు అవసరం అయిన వాటిని ట్రావెల్ పాలసీ కవర్ చేస్తుందని నిర్దారించుకునేందుకు మీరు తీసుకున్న కవర్స్ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఓ సారి చెక్ చేయండి.