మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
Select Number of Travellers
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
జపాన్ అనేది ఆసియా ఖండానికి చెందినది. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో జపాన్ కల్చర్ వెరైటీగా ఉంటుంది. ఇదొక ద్వీప దేశం. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలకంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. జపాన్ అనేది చెర్రీ బ్లోసమ్ గార్డెన్స్ మరియు శిల్పాలు, కవివత్వానికి ప్రసిద్ధి చెందింది. జపాన్ లో పది కంటే ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో మౌంట్ ఫుజి అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం.
హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, ఒసాకా క్యాస్టిల్, మరియు ఐలాండ్ ష్రైన్ ఆఫ్ ఇట్సుకిషిమా వంటి ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయి. జపాన్ కు ట్రావెల్ చేసేందుకు బెస్ట్ టైం మార్చి నుంచి మే మధ్యలో మరియు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉంటుంది.
అవును. జపాన్ వెళ్లేందుకు ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లందరికీ తప్పకుండా వీసా కావాలి.
లేదు. దురదృష్టవశాత్తు జపాన్ కు ట్రావెల్ చేసే ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు మీ జపాన్ వీసా కోసం దరఖాస్తు చేసినప్పటి నుంచి బయలుదేరేందుకు మీరు వేసుకున్న ప్లాన్ గడువుకు కనీసం 60-90 రోజుల సమయం ఉండాలి.
జపాన్ అనేది ఇటీవల ఇండియన్ టూరిస్ట్ లు ఎక్కువగా సందర్శిస్తున్న ప్లేస్ గా మారింది. ఇంతకుముందు రోజుల్లో జపాన్ టూరిస్ట్ వీసాను పొందడం అంత సులభంగా లేకుండేది. అయితే తర్వాతి కాలంలో జపాన్ ఎంబసీ వీసా నిబంధనలలో కొంత సడలింపు చేసింది. మీరు జపాన్ టూరిస్ట్ వీసా దరఖాస్తు చేసుకునేందుకు ఈ కింది పత్రాలు అవసరం అవుతాయి.
జపాన్ కు చేరుకున్న తేదీ నుంచి 6 నెలల చెల్లుబాటుతో ఉండే ఒరిజినల్ పాస్ పోర్ట్.
మ్యాట్ ఫినిష్ వైట్ బ్యాక్ గ్రౌండ్తో ఉన్న రెండు కలర్ ఫొటోలు.
కన్ఫర్మ్ అయిన విమాన టికెట్లు.
సరైన వివరాలతో పూరించిన వీసా అప్లికేషన్.
మీ ట్రావెల్ ప్రణాళిక (పూర్తి ప్లాన్)
ఒకవేళ క్యాండిడేట్ ఉద్యోగి అయితే అతడి చివరి 3 నెలల జీతం వివరాలు (సాలరీ స్లిప్స్).
ఒకవేళ అభ్యర్థి ఉద్యోగి అయితే అతడి ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్.
బ్యాంక్ అధికారులు సంతకం చేసి, స్టాంప్ వేసిన చివరి 6 నెలల ఒరిజినల్ బ్యాంక్ స్టేట్మెంట్లు.
ఫామ్ 16 లేదా గత 3 సంవత్సరాలుగా దాఖలు చేసిన ఐటీఆర్.
పాఠశాల/కాలేజ్/ఆఫీస్ నుంచి సెలవు మంజూరు చేస్తూ జారీ అయిన ఒరిజినల్ లెటర్.
ఒకవేళ దరఖాస్తుదారుడు విద్యార్థి అయితే అతడి కాలేజ్/స్కూల్ ఐడీ.
దరఖాస్తుదారుడు రిటైర్డ్ ఉద్యోగి అయితే అతడి పెన్షన్ పాస్ బుక్.
ఇండియన్ సిటిజన్లు అప్లికేషన్ ఫీజుగా సింగిల్ ఎంట్రీ కోసం ఎంబసీకి 3000 యెన్లు (జపాన్ కరెన్సీ), అదే విధంగా డబుల్ ఎంట్రీ కోసం 6000 యెన్లను చెల్లించాలి. ఇవి మాత్రమే కాకుండా టూరిస్ట్ వీసా కోసం 700 యెన్ (జపాన్ కరెన్సీ) వరకు ఉంటుంది.
ఇండియాలో ఉన్న ప్రధాన నగరాల్లో దాదాపు 16 వీసా అప్లికేషన్ సెంటర్లు ఉన్నాయి. జపనీస్ టూరిస్ట్ వీసా కోసం అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు సులభం.
జపాన్ ఎంబసీ వెబ్సైట్ నుంచి వీసా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా పూరించండి.
వీసా అప్లికేషన్ సెంటర్ లేదా ఎంబసీలో అపాయింట్మెంట్ తీసుకోండి.
పేర్కొన్న వీసా ఫీజును చెల్లించండి.
మీరు షెడ్యూల్ చేసుకున్న తేదీన ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.
అన్ని వివరాలైన బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ సమర్పించండి.
అధికారుల నుంచి వచ్చే స్పందన కోసం వెయిట్ చేయండి.
మీ పాస్ పోర్ట్ ను సేకరించి వీసా ఆమోదం/తిరస్కరణ పొందండి.
జపాన్ ఎంబసీ మీ వీసాను ప్రాసెస్ చేసేందుకు 5 పని రోజుల సమయం తీసుకుంటుంది. మీరు అప్లికేషన్ ను సమర్పించిన రోజు లెక్కలోకి రాదు.
జపాన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం. ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి మెడికల్ అవసరాలు వచ్చి విదేశాల్లోని ఆసుపత్రిలో చేరాల్సి వస్తే మెడికల్ ఖర్చులను అరికట్టడంలో ఇది సహాయపడుతుంది. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు పొందగలిగే ఇతర ప్రయోజనాలు:
ట్రావెల్ ఇన్సూరెన్స్ ను ఎంచుకునే క్రమంలో మీకు అవసరం అయిన వాటిని ట్రావెల్ పాలసీ కవర్ చేస్తుందని నిర్దారించుకునేందుకు మీరు తీసుకున్న కవర్స్ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఓ సారి చెక్ చేయండి.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 25-10-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.