General
General Products
Simple & Transparent! Policies that match all your insurance needs.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
Life
Life Products
Digit Life is here! To help you save & secure your loved ones' future in the most simplified way.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
Claims
Claims
We'll be there! Whenever and however you'll need us.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
Resources
Resources
All the more reasons to feel the Digit simplicity in your life!
37K+ Reviews
7K+ Reviews
Scan to download
37K+ Reviews
7K+ Reviews
Select Number of Travellers
24x7
Missed Call Facility
100% Claim
Settlement (FY23-24)
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
మంత్రముగ్ధులను చేసే కోటలు, అనేక కథలు మరియు పండుగలు, ప్రసిద్ధ జిఓటి (GOT) లొకేషన్స్ మరియు మనోహరమైన తీరప్రాంతాలు. కొన్ని సంవత్సరాలుగా, ఐర్లాండ్ అత్యంత ఇష్టపడే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా మారింది. మీరు కూడా హాలీడే కోసం త్వరలో దేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా మీకు టూరిస్ట్ వీసా అవసరం. మీరు దానిని ఎలా పొందుతారు? మీకు మార్గనిర్దేశం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము.
అవును, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌ను సందర్శించడానికి భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఐరిష్ వీసా అవసరం. కానీ మీరు ఉత్తర ఐర్లాండ్‌ని సందర్శించాలనుకుంటే, యుకె (UK) వీసా సరిపోతుంది.
కొన్ని రోజులు ఉండేందుకు, ఐర్లాండ్‌కు వెళ్లేందుకు భారతీయులందరికీ టూరిస్ట్ వీసా అవసరం. వారి గరిష్ట బస 90 రోజులు ఉండవచ్చు మరియు ఈ వీసాలను 'సి' కేటగిరీ వీసా అంటారు. టూరిస్ట్ వీసా సందర్శకులను ఈ క్రిందివి చెయ్యడానికి అనుమతించదని తెలుసుకోవాలి:
పెయిడ్ లేదా అన్ పెయిడ్ పని ఏదైనా చేయడం.
ఆసుపత్రి వంటి ఏదైనా ప్రజా సౌకర్యాన్ని ఉపయోగించడం.
ఐరిష్ టూరిస్ట్ వీసా గరిష్టంగా 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.
లేదు, ఐర్లాండ్‌కు వెళ్లే భారతీయులకు వీసా ఆన్ అరైవల్ లేదు. కాకపోతే, చెల్లుబాటు అయ్యే యుకె (UK) వీసా ఉన్నవారు ఇప్పటికీ ఉత్తర ఐర్లాండ్‌కు ప్రయాణించవచ్చు.
వీసా రకం |
ఫీ (సేవా ఫీ మినహాయించబడింది) |
సింగిల్ ఎంట్రీ |
USD 90.68 (EUR 84) |
మల్టిపుల్ ఎంట్రీ |
USD 180.28 (EUR167) |
మీకు అవసరమైన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది:
ప్రింటెడ్ మరియు సైన్ చేసిన అప్లికేషన్ ఫారం: తేదీలు, స్థలాలు మరియు వ్యవధి వంటి ప్రయాణానికి సంబంధించిన డిటెయిల్స్ పేర్కొనండి.
పాస్ పోర్ట్ సైజు రంగు ఛాయాచిత్రాలు. ఛాయాచిత్రం 35X45 మిమీ తెలుపు నేపథ్యం మరియు మాట్ ఫినిష్ తో ఉండాలి. ముఖంలో 70-80% కనిపించేలా చూసుకోండి.
కనీసం ఒక ఖాళీ పేజీతో ఒరిజినల్ పాస్ పోర్ట్. వీసా స్టిక్కర్‌ను అతికించడానికి ఇది అవసరం. పాస్ పోర్ట్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి.
హోటల్ రిజర్వేషన్లు వంటి ఐర్లాండ్‌లో బస చేసేందుకు రుజువు.
లోపలికి మరియు వెలుపలికి విమాన టిక్కెట్లు.
దరఖాస్తుదారు ఐర్లాండ్‌లో ఉన్న సమయంలో అతని లేదా ఆమె ఐటినరి.
మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ.
గత 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాపీ.
అభ్యర్థి యొక్క సుమారు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు.
ప్రస్తుత సంస్థ యొక్క చివరి 3 నెలల జీతం స్లిప్ (పని చేస్తున్నట్లయితే వర్తిస్తుంది).
మీరు బిజినెస్ నడుపుతుంటే, వ్యాపార రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం.
విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లయితే, వారు బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా ఐడి (ID) రుజువును సమర్పించాలి.
ఒంటరి మహిళ ఐర్లాండ్‌కు ప్రయాణిస్తుంటే భర్త నుండి ఎన్ఓసి (NOC).
ఐర్లాండ్ టూరిస్ట్ వీసా కోసం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులభం మరియు ఆన్లైన్లో అమలు చేయవచ్చు. అభ్యర్థి ఈ స్టెప్స్ అనుసరించాలి:
Http://www.inis.gov.ie వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు ఆన్లైన్లో ఫామ్‌ను పూరించండి.
నమోదు చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి.
సమాచారాన్ని రెండుసార్లు చదివిన తర్వాత జాగ్రత్తగా ఫామ్‌ను సమర్పించండి.
టూరిస్ట్ వీసా కోసం అవసరమైన ఫీ చెల్లించండి.
సమీప ఐర్లాండ్ వీసా అప్లికేషన్ కేంద్రంలో అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయండి.
అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మరియు ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత, ప్రాసెసింగ్ ఎంబసీ చేతిలో ఉంటుంది.
ఐర్లాండ్ టూరిస్ట్ వీసాను ప్రాసెస్ చేయడానికి సాధారణంగా 10-15 పని దినాలు పడుతుంది.
మీ చేతుల్లో వీసా మరియు బుకింగ్‌లు ధృవీకరించబడినందున, ఐర్లాండ్‌లో వినోదభరితమైన అన్య దేశ విహారయాత్ర కోసం మీ బ్యాగ్‌లను ప్యాక్ చేయండి.
విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం మరియు పునరుజ్జీవనం పొందడం విహారయాత్ర యొక్క ఉద్దేశ్యం. ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీ ట్రిప్‌ను భద్రపరచడం వలన ఊహించని పరిస్థితులలో కూడా మీరు ఒత్తిడికి గురికాకుండా లేదా ఆందోళన చెందకుండా ఉంటారు. మీ ఐర్లాండ్ పర్యటన కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క కొన్ని ప్రయోజనాలు క్రిందివి:
అన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులను కవర్ చేయడానికి. మీరు ఉత్సాహం గా జెయింట్ కాజ్వే, కో అంట్రిమ్ చేచేరుకున్నారనుకోండి. అక్కడ అంట్రిమ్ లో మీ పాదాలు రాళ్లలో ఒకదానిలో ఇరుక్కుపోయి, మీ చీలమండను తిప్పి, చిన్న రక్తస్రావంతో మీరు గాయపడ్డారు. చికిత్స కోసం మీకు వైద్య సహాయం అవసరం. మీ ట్రావెల్ పాలసీతో, వైద్య ఖర్చులను కవర్ చేయవచ్చు.
మీరు ఐర్లాండ్‌లోని నార్త్ మోస్ట్ పాయింట్‌లోని మాలిన్ హెడ్లో ఉన్నారని అనుకుందాం. ఏదో ఒకవిధంగా మీరు స్కిడ్ మరియు తీవ్రమైన గాయాలు తగిలినందున మీరు ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు మీరు కదలలేరు కానీ మీరు ఆసుపత్రికి చేరుకోవాలి. సురక్షితమైన ప్రదేశానికి ఇటువంటి వైద్య తరలింపు ప్రయాణ పాలసీ కింద వర్తిస్తుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ యజమాని మరణించినందున మీరు సెలవులు రద్దు చేసుకోవాల్సిన దురదృష్టకరమైన సంఘటనల్లో హోటల్లు మరియు టిక్కెట్ల బుకింగ్ మొత్తాలు వంటి క్యాన్సిలేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది.
మీ పాస్ పోర్ట్ మరియు ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్న మీ బ్యాగ్‌ను మీరు పోగొట్టుకున్న సమయాల కోసం. మీ పాస్ పోర్ట్ వంటి ఎటువంటి ముఖ్యమైన పత్రాలు లేకుండా, ఏదైనా విదేశీ దేశంలో జీవించడం కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ మీరు ట్రావెల్ పాలసీని కలిగి ఉంటే, అది మీకు పరిహారం కూడా ఇస్తుంది.
ప్రతిసారీ మన చర్యల పట్ల జాగ్రత్తగా ఉండలేము. మీరు వేరొకరి ఆస్తిని డ్యామేజ్ చేయడం జరిగిందని ఊహించుకోండి, అటువంటి లయబిలిటీ నుండి మీరు రక్షించబడతారు.
మీరు మీ లగేజీ మొత్తంతో క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న క్షణం గురించి చూస్తున్నారనుకోండి, మరియు ఎవరైనా రెప్పపాటుతో మీ వస్తువులన్నింటినీ దొంగిలించారనుకొండి. అలాంటి నష్టాలన్నింటికీ మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 13-02-2025
CIN: L66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.