సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
ప్రయాణించడం ఇష్టపడేవాళ్లుగా, యూరప్‌ను చూడాలని ఎవరు కోరుకోరు? మెస్మరైజింగ్ ల్యాండ్‌స్కేప్ లతో కూడిన సతత హరిత ల్యాండ్ మార్క్ లు, ఇంతకంటే ఎక్కువ అడగగలరా? ఇక్కడ కూడా నిరంతరంగా ఉండే అడ్డంకి ఎక్కువ ఖర్చు.
అయితే, మీరు భారతదేశం నుండి చౌకగా ప్రయాణించగల పది యూరోపియన్ గమ్యస్థానాల జాబితా, దానికి సంబంధించిన ఖర్చు, వీసా అవసరాలు మరియు ల్యాండ్‌మార్క్‌ల తో పాటు మీ దగ్గర ఉంటే?
అయితే మీకో శుభవార్త ఎందుకంటే మేము మీ కోసం ఒక జాబితాను రూపొందించాం!
బడ్జెట్ లో మీకు మంచి అనుభూతిని అందించే యూరప్ దేశాల జాబితా ఇక్కడ ఉంది:
లాట్వియా
జార్జియా
అల్బేనియా
బల్గేరియా
ద చెక్ రిపబ్లిక్
హంగేరీ
స్లోవేకియా
రొమానియా
క్రోయేషియా
ఖర్చుల విషయంలో ఆరోహణ క్రమంలో ఉన్న ఈ దేశాలు సందర్శకులకు పూర్తి ప్యాకేజీలను అందిస్తాయి. ప్రకృతి- మానవ నిర్మితము మరియు సహజమైనది, ఆహారం, సంప్రదాయాలు మరియు సంస్కృతులు.
కాకపోతే, మీరు తక్కువ ఖర్చులో ఇండియా నుంచి యురోపియన్ దేశానికి వెళ్లాలని కలలు కనే దానికంటే ముందు ఆ దేశం సందర్శించేందుకు మీకు కావాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది - అదే వీసా!
మీ వీసా రిక్వైర్మెంట్స్ అనేవి మీరు వెళ్లాలని అనుకుంటున్న యురోపియన్ దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు స్కెంజెన్ ప్రదేశంలో ఉన్న దేశంలోపర్యటించాలి అనుకుంటున్నారు అనుకుందాం. వాటికి కామన్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ అవసరం ఉంటుంది.
అలాగే స్కెంజెన్ దేశాలను మీరు సందర్శించాలని అనుకున్నపుడు తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని ఉండాలని గుర్తుంచుకోండి.
మీ స్కెంజెన్ దేశాన్ని సందర్శించనప్పటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండడం మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు సురక్షితంగా ఉండొచ్చు.
ఇప్పుడు, ఇండియా నుంచి యూరోప్‌లో తక్కువ ఖర్చుతో సందర్శించే వీలున్న దేశాల జాబితావైపు ఒకసారి చూడండి!
ఆహారం, బసలు (1 రోజు) మరియు ఫ్లైట్ టికెట్లు (1 వే) కు సంబంధించి టోటల్ ఎక్స్పెన్స్ అరోహణ క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి.
మీ వద్ద మా వినూత్న గైడ్ బుక్ ఇక్కడ ఉంది!
బాల్టిక్ సముద్రం, రష్యా, లిథువేనియా, ఎస్తోనియా మరియు బెలారస్ దేశాలను లాట్వేనియా సరిహద్దులుగా కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు మరియు అందమైన పట్టణాలు కూడా ఉన్నాయి.
కావున మీరు మీ సెలవులను అందమైన గ్రామాలు, సుందరమైన అడవులు, ఆకర్షణీయమైన బీచ్ ల మధ్య గడపాలని అనుకుంటే ఇండియా నుంచి యూరప్ లో చవకైన దేశానికి ప్రయాణం ట్రావెల్ చెయ్యాలనుకుంటే మీకు లాట్వియా సరైన ఎంపిక అవుతుంది.
ఆహారం మరియు వసతి ఖర్చు:
ఫ్లైట్ చార్జెస్ – సుమారు రూ. 20,000 నుంచి రూ. 33,500 వరకు. మే నెలలో లాట్వియా ఫ్లైట్ బుక్ చేసుకుంటే చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
ప్రధాన ఆకర్షణలు – దేశంలో చూసేందుకు చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ క్రిందివి కావచ్చు.
దేనికి ప్రసిద్ధి - లాట్వియా అనేది దాని రొమాంటిక్ అప్పీయరెన్స్ తో జంటలకు చాలా అనువైన ప్రదేశంగా ఉంది. మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఈ దేశం అందించే సుందరమైన ప్రదేశాలను చూడండి!
ట్రావెల్ ఇన్సూరెన్స్– లాట్వియా కోసం మీరు డిజిట్ ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొందొచ్చు. వయోజనులకు రోజుకు సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ కు $50,000 రూ.177 మాత్రమే ప్రీమియం ఉంటుంది. (18 శాతం జీఎస్టీ అదనం).
జార్జియా అనేది దక్షిణ యూరోప్ కు ఆదర్శవంతమైన పరిచయం అవుతుంది. అద్భుతంగా ఉండే దృశ్యాలు, అంతే సుందరంగా ఉండే సాంస్కృతిక ప్రాంతాలు, సహజంగా ఉండే అరణ్యాలు ఈ దేశానికి వచ్చిన పర్యాటకులకు కనువిందు చేస్తాయి. జార్జియాలో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి ఉంది.
ఆహారం మరియు వసతి కాస్ట్– ఒక వ్యక్తికి ఆహారం మరియు వసతి గురించి ఒక రోజుకు ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ చూడండి –
ఫ్లైట్ చార్జెస్ – సగటున రూ. 18,720 నుంచి రూ. 25,000. ఫిబ్రవరిలో ముందస్తు బుకింగ్ చేసుకుని మీ ప్రయాణ ఖర్చులను మరింత తగ్గించుకోండి!
ప్రధాన ఆకర్షణలు – సుందరంగా ఉండే ప్రకృతి అందాలు జార్జియా సొంతం
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి – రోజూవారీ జీవితంలోని చికాకుల నుంచి ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని అనుకునే జంటలకు ఇది అనువైన ప్రదేశం.
ట్రావెల్ ఇన్సూరెన్స్- డిజిట్ నుంచి అతి తక్కువ ధరలో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. అందుకు వయోజనులకు కేవలం $50,000 సమ్ ఇన్సూర్డ్ కు రోజుకు ప్రీమియం రూ. 177 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. (18% జీఎస్టీ అదనం).
ఇటీవలి వరకు, అల్బేనియాలోని రంప్లెడ్ పర్వతాలు ప్రయాణ మ్యాప్‌లలో ఒక పుకారు మాత్రమే. ఎందుకంటే బయటి వ్యక్తులకు అవి మూసివేయబడ్డాయి కాబట్టి.
మెడిటరేనియన్ అనేది యూరప్ యొక్క చిక్కుముడి అని అంతా నమ్ముతారు. దేశంలో ఉన్న బీచ్ లు, మరియు అందమైన ప్రకృతి దృశ్యాలు ఇప్పుడు వారి జీవితంలోని హడావుడి నుంచి రెస్ట్ తీసుకునేందుకు సహాయపడతాయి.
ఫుడ్ మరియు వసతి కాస్ట్– మీరు ఈ సుందరమైన దేశంలో ఒక రోజు ఉండాలని అనుకుంటే అయ్యే ఖర్చు వివరాలు ఇక్కడ ఉన్నాయి –
ఫ్లైట్ చార్జెస్– కేవలం మీ ఫ్లైట్ టికెట్స్ కోసం రూ. 33,000 నుంచి రూ. 50,000 ఖర్చు అవుతుంది. (ఒక్కరికి వన్ వేలో). మీరు ఫిబ్రవరిలో వాటిని బుక్ చేసుకుంటే టికెట్లపై అయ్యే ఎక్స్పెన్స్ ను మరింత తగ్గించుకోవచ్చు.
ప్రధాన ఆకర్షణలు – ఈ దేశం అత్యంత ఎత్తయిన పర్వత శ్రేణులు, అందమైన సరస్సులను అందిస్తుంది. వీటితో పాటుగా -
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి – అల్బేనియా ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? మీ కుటుంబాన్ని, స్నేహితులను తీసుకెళ్లండి! రొటీన్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని కోరుకునే కుటుంబాలకు ఈ ప్లేస్ చాలా అనువైనది.
ట్రావెల్ ఇన్సూరెన్స్– ట్రావెల్ ఇన్సూరెన్స్ వయోజనులకు కేవలం రోజుకు రూ. 177 ప్రీమియం (18% ట్యాక్స్ అదనం) చెల్లించడం ద్వారా డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా $50,000 సమ్ ఇన్సూర్డ్ ఆనందించండి. ఇందులో ఉత్తమమైనది ఏంటంటే? ఎటువంటి చిక్కులు లేకుండా సాఫీగా పూర్తయ్యే క్లయిమ్ విధానం!
దాని భారీ ద్రవ్యోల్బణం మరియు క్షీణిస్తున్న వేతనాలతో సతమతమయ్యి , 2001లో అద్భుతమైన పరివర్తన సమయాన్ని కలిగి ఉన్న దేశం అయిన బల్గేరియా అత్యంత సుందరమైన దేశాలలో ఒకటిగా ఎప్పటికీ పేరు పొందింది.
అద్భుతమైన పర్వతాలు సోవియట్ పాలన అవశేషాలు, ఇసుకతో నిండిన బీచ్ లు, నల్లసముద్రం వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి!
ఆహారం మరియు వసతి ఖర్చు – ఆహారం మరియు వసతి కొరకు మీ మీ జేబు కు ఎక్కువ ఖర్చు కాదు.
ఫ్లైట్ చార్జెస్ – అంచనా వేయబడిన వన్ వే ఫ్లైట్ చార్జ్ రూ. 16,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటుంది. బల్గేరియాకు విమాన టికెట్లు ఫిబ్రవరిలో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.
ప్రధాన ఆకర్షణలు– బల్గేరియాలో ప్రధానంగా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి -
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి– ఈ ప్రదేశం బ్యాక్ ప్యాకర్లు మరియు కపుల్స్ కు బాగా నచ్చుతుంది. మీరు ఒంటరిగా లేదా మీ ప్రియమైన వారితో కలిసి ఇక్కడ విహరించాలని అనుకుంటున్నారా - అది మీ ఇష్టం!
ట్రావెల్ ఇన్సూరెన్స్ – డిజిట్ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొందండి. $50,000 సమ్ ఇన్సూర్డ్ ను కేవలం రోజుకు వయోజనుల కోసం రూ. 177 అతి తక్కువ ప్రీమియంతో సొంతం చేసుకోండి.(18% జీఎస్టీ మినహాయించబడింది).
1989లో సోవియట్ యూనియన్ పతనం అవడం పర్యాటకుల్లో చెక్ రిపబ్లిక్ దాని రాజధాని ప్రోగ్కు ఆదరణ కల్పించింది.
యూరోప్ లో ఉన్న నగరాల్లో అత్యంత ఆకర్షణీయమైనదిగా పేర్కొనే ఈ రాజధాని మధ్యయుగ ప్రపంచంలో చెక్కు చెదరకుండా ఉంది. గోతిక్ వాస్తు శిల్పం 14వ శతాబ్దపు బ్రిడ్జితో చాలా అందంగా ఉంటుంది.
ఆహారం మరియు వసతి ఖర్చు – గతంలో ప్రయాణించిన ట్రావెలర్స్ రికార్డులను పరిశీలిస్తే యూరప్ మొత్తం మీద ఇక్కడ చాలా తక్కువ ఖర్చు అవుతుంది.
ఫ్లైట్ చార్జెస్ – సగటు ధర రూ. 18,490 నుంచి రూ. 68,116. మీరు ఫిబ్రవరిలో కనుక టికెట్లను బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరలో పొందొచ్చు.
ప్రధాన ఆకర్షణలు– యూరప్ లో పర్యటించాలని అనుకునేవారికి చెక్ రిపబ్లిక్ ఎన్నో పర్యాటక ప్రదేశాలను అందిస్తుంది. ఈ జాబితా కింది వాటిని కలిగి ఉంది -
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి– చరిత్రను శోధించాలని అనుకునేవారికి మరియు కుటుంబీకులకు ఈ ప్లేస్ సరిగ్గా సూటవుతుంది. ఈ రెండు గ్రూపుల ఆసక్తికి అనుగుణంగా దేశం పర్యాటక ప్రదేశాలను అందజేస్తుంది!
ట్రావెల్ ఇన్సూరెన్స్– మీరు రోజూ వారీగా రూ. 177 నామమాత్రపు ప్రీమియం చెల్లించి పెద్దలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకోవచ్చు. (18% జీఎస్టీ అదనం) మీకు $50,000 సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ లభిస్తుంది
హంగేరి అనేది తన పర్యాటకుల కొరకు మరింత సుందరమైన కళలు, సంస్కృతి, సంగీతం, పెయింటింగ్స్ మొదలైన వాటికి అందిస్తుంది.
ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత వైన్ లు ఉన్నాయి. మీరు విన్నర్ గా నిలవొచ్చు!
ఆహరం మరియు వసతి ఖర్చు– ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణ ప్లాన్లతో పర్యాటకులు దేశంలోని రోజువారీ ఖర్చులకు సిద్ధంగా ఉండాలి –
ఫ్లైట్ చార్జెస్– ధరలు రూ. 19,589 నుంచి రూ. 32,595 ల మధ్య ఉంటాయి. మార్చిలో హంగేరికి టికెట్లు చాలా చవకగా ఉంటాయి.
ప్రధాన ఆకర్షణలు– ఇక అన్ని వర్గాల పర్యాటకుల అభిరుచులకు తగినట్లుగా హంగేరీ అనేక విషయాలను కలిగి ఉంటుంది. ఇది అందించే వాటి విషయానికి వస్తే -
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి – బ్యాక్ ప్యాకర్స్ మరియు జంటలకు ఒకే విధమైన అనువుగా ఉంటుంది. ఈ రెండు కేటగిరీల వారి అభిరుచులను తీర్చడంలో దేశం ముందు వరుసలో ఉంటుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్– డిజిట్ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకుని $50,000 సమ్ ఇన్సూర్డ్ కోసం వయోజనులు ప్రీమియం కొరకు రోజుకు రూ. 177 చెల్లిస్తే సరిపోతుంది. (18% జీఎస్టీ అనేది అదనం).
కల్పిత కథల భూమి - కోటలు, పర్వతాలు అక్కడక్కడ ఉండే పరిశ్రమలు స్లోవేకియాకు వెళ్లే సందర్శకులను ఆకట్టుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
తక్కువగా సందర్శించే తూర్పున అనేక విచిత్రమైన చర్చిలు ఉండగా తరచూ ఎక్కువ మంది సందర్శించే బ్రాటిస్లావన్ మాత్రం సమకాలీన సంస్కృతికి అద్దం పడుతోంది.
ఆహారం మరియు వసతి ఖర్చులు– సరసమైన జీవనోపాధితో పాటు స్లోవేకియా అందించే ఆఫర్లతో మీకు కాస్ట్ గురించి ఎటువంటి చింత లేకుండా ఉంటుంది!
ఫ్లైట్ చార్జెస్– దాదాపుగా రూ. 19,000 నుంచి రూ. 30,000 మధ్యలో ఉంటుంది. మీరు కనుక స్లోవేకియాకు ఫిబ్రవరిలో టికెట్లను బుక్ చేసుకుంటే మీరు తక్కువ ధరకు టికెట్లను పొందొచ్చు.
ప్రధాన ఆకర్షణలు– యూరోప్ గుండె కాయ స్థానంలో ఈ దేశం ఉంది. కావున ఇదంటే చాలా మందికి ఇష్టం–
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి– ఇక్కడ అనేక చారిత్రక విషయాల ఉన్నాయి. స్లోవేకియా అనేది కుటుంబాలు మరియు కపుల్స్ సందర్శించేందుకు సరైన ప్రదేశం.
ట్రావెల్ ఇన్సూరెన్స్– డిజిట్ అందించే $50,000 వేల ట్రావెల్ ఇన్సూరెన్స్ కు కేవలం రోజుకు ప్రీమియం రూ. 177 కడితే సరిపోతుంది. 18 శాతం జీఎస్టీ చార్జీలు అదనం.
రొమానియా అనేది ఎన్నో ఆకట్టుకునే ప్రదేశాలను కలిగి ఉంది. ఐరోపాలోనే రెండో అతిపెద్ద నది అయిన డానుబే ప్రవాహంలో నల్లసముద్రం అంచు వరకు వెళ్లొచ్చు.
రొమేనియాలో ఉన్న నిర్మాణ అద్భుతాలతో అగ్రస్థానంలో ఉంది. రొమేనియా అనేది బడ్జెట్ లో ట్రావెల్ చేయగలిగే యురోపియన్ దేశాలలో ఒకటి.
ఆహారం మరియు వసతి కాస్ట్స్– రొమేనియాలో పర్యటిస్తున్నపుడు బడ్జెట్ గురించి చింతించాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది.
ఫ్లైట్ చార్జెస్–సుమారు రూ. 16,899 నుంచి రూ. 30,000 వరకు. రొమేనియాకు వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసుకునేందుకు ఉత్తమ సమయం మార్చి.
ప్రధాన ఆకర్షణలు– ట్రాన్సల్వేనియా, రొమేనియా చుట్టూ అల్లుకుని ఉన్న కల్పిత కథల వలే కాకుండా ఇక్కడ సుందరంగా ఉంటుంది! ఇక్కడ మధ్యయుగ కాలం నాటి కోటలు, అద్భుతమైన ఆల్ఫైన్ పర్వతాలు, చిత్ర విచిత్రమైన గ్రామాలు ఉంటాయి. ఈ క్రింది వాటిని అనుభవం చెయ్యచ్చు-
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి– ఇక్కడ ఉండే అందమైన ప్రదేశాల వైవిద్యం ఐరోపా పర్యటనకు వెళ్లే జంటలలో ఈ దేశాన్ని సందర్శించాలనే కోరిక పుట్టేలా చేసింది.
ట్రావెల్ ఇన్సూరెన్స్– డిజిట్ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ని తీసుకోండి. ఇది $50,000 సమ్ ఇన్సూర్డ్ కు వయోజనులకు రోజుకు కేవలం రూ. 177 ప్రీమియం మాత్రమే పడుతుంది. (18% జీఎస్టీ అదనం).
ఒక వేళ మీరు కనుక మెడిటేరియన్ ఫాంటసీలతో నిండిన బీచ్ ల కొరకు చూస్తున్నట్లయితే క్రొయేషియా అనేది మీ మొదటి ఎంపిక అవుతుంది! సముద్రపు నీరు, అద్భుతమైన ద్వీపపు సముదాయాలు లాంటి అన్ని ఫీచర్లను క్రొయేషియా కలిగి ఉంది.
అంతే కాకుండా మీరు డైవింగ్, సెయిలింగ్, స్నార్కెల్లింగ్, కాకేయింగ్, మరియు సెయిలింగ్ వంటి సాహసక్రీడలను కూడా చూసేందుకు వీలుంటుంది!
ఆహారం మరియు వసతి కాస్ట్– ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించాలని అనుకుంటారు. కాబట్టి ఆహారం మరియు వసతి ఖర్చుల అంచనాలను గురించి తెలుసుకోండి -
ఫ్లైట్ చార్జెస్– దాదాపుగా రూ. 32,000 నుంచి రూ. 38,000 వరకు అవుతాయి. (వన్ వేకు). ఫిబ్రవరి నెలలో ఫ్లైట్ టికెట్ చార్జెస్ చాలా తక్కువగా (అత్యంత చవకగా) ఉంటాయి.
ప్రధాన ఆకర్షణలు– ఇక్కడి అందమైన గ్రామీణ ప్రాంతాలు మరియు అద్భుతమైన తీరప్రాంతాలు. ఈ ఆకర్షణీయమైన ప్రదర్శనకు దోహదపడే స్థానాలు -
ఎవరిలో ఎక్కువ ప్రసిద్ధి– బ్యాక్ ప్యాకర్లకు చాలా అనువైనది. క్రొయేషియా అనేది స్వర్గంలా ఉంటుంది! మీరు బీచ్ ల వెంబడి కూర్చుండి చవకగా ఉండే రోజూ వారీ ఖర్చులతో పాటు ప్రశాంతంగా ఉండే ప్రకృతిని ఆస్వాదించండి!
ట్రావెల్ ఇన్సూరెన్స్– డిజిట్ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి. $50,000 సమ్ ఇన్సూర్డ్ మొత్తానికి వయోజనులకు ప్రీమియం రోజుకు కేవలం రూ. 177 మాత్రమే (18% జీఎస్టీ మినహాయించబడింది)!
డిస్ క్లైమర్: పైన పేర్కొన్న ఫ్లైట్ టికెట్స్, ఫోరెక్స్ బేస్డ్ ఫుడ్, వసతి మరియు రవాణా అనేవి మార్పులకు లోనవుతూ ఉంటాయి.
కాసేపు ఓపిక పట్టండి! మీరు మీ ప్రయాణానికి అవసరం అయిన ప్రాధాన్యత గురించి తనిఖీ చేశారా? ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నారా?
మీరు ఊహించని సంఘటనల నుంచి మీ ట్రిప్ ఎంత తరచుగా రక్షించబడింది? ఫ్లైట్ ఆలస్యాలు, లగేజీ మిస్సవడం, సాహస క్రీడల్లో జరిగే ప్రమాదాలు, ఈ జాబితా అనేది అంతులేకుండా ఉంది!
మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఈ జాబితాలో ఒక భాగం అందుకోసమే ప్రతిదాని కోసం మీరు మీ బ్యాంక్ ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఫైనాన్షియల్ కవరేజ్ అందిస్తుంది.
అయితే మీరు అందుబాటులో ఉన్న ప్లాన్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందేందుకు డిజిట్ వంటి ఇండియా వైడ్ గా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల మీద మీ దృష్టిని కేంద్రీకృతం చేయండి.
మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ నుంచి మీరు పొందగలిగే కొన్ని ప్రయోజనాలు -
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఫైనాన్షియల్ కవరేజ్ అందిస్తుంది.
వ్యక్తిగత లయబిలిటీ విషయంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీని అందిస్తుంది.
సామగ్రి పోగొట్టుకోవడం, లేదా ప్రయాణంలో ఆలస్యం, ఎమర్జెన్సీ క్యాష్ రిక్వైర్మెంట్స్, ట్రిప్ రద్దు మొదలయిన పరిస్థితుల్లో మీకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తుంది.
వీటితో పాటు డిజిట్ ఇన్సూరెన్స్ కూడా మీకు మంచి ఎంపిక కావొచ్చు -
కొంగొత్త ప్లాన్స్ మరియు
నామినల్ ప్రీమియంలు రూ. 177 నుంచి మొదలవుతాయి (18శాతం GST కాక)
సుమారుగా 179 దేశాలను కవర్ చేస్తుంది.
మీరు ఇండియా నుంచి యూరోప్ లోని అత్యంత తక్కువ ఖర్చు అయ్యే దేశాలను విజిట్ చేయాలని ఆతృతగా ఉన్నపుడు ఇటువంటి పాలసీలు ఉపయోగపడతాయి. మీరు సరళమైన క్లయిమ్ పద్ధతి ద్వారా ఎటువంటి కాగితాలు అవసరం లేకుండా మీరు కవర్ అవుతారని ఈ ప్లాన్ నిర్దారిస్తుంది!
అటువంటి ఆర్థిక ప్రతిపత్తి మరియు ఇండియా నుంచి అత్యంత తక్కువ ఖరీదులో యూరప్ కి వెళ్లగలిగే గమ్యస్థానాల జాబితా ఉన్నప్పుడు మీ ట్రావెల్ ప్లాన్స్ కోసం మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు?