సెక్షన్ 194C ప్రకారం కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నపుడు టీడీఎస్ కోసం కొన్ని మినహాయింపులు ఇక్కడ ఉన్నాయి:
- కాంపోజిట్ కాంట్రాక్టర్ కోసం టీడీఎస్ తగ్గింపు
ప్రభుత్వం మెటీరియల్ ను సరఫరా చేస్తే, కాంట్రాక్టర్ కు చెల్లింపులు చేసేటపుడు టీడీఎస్ తీసివేయాలనే నిర్ణయం అనేది కాంట్రాక్టర్ మరియు అందులో పాల్గొన్న పార్టీల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
ఒక బిల్డర్ ఆనకట్ట లేదా భవనాన్ని డెవలప్ చేసేందుకు అంగీకరించినపుడు పేర్కొన్న వ్యక్తి లేదా ప్రభుత్వం ఆ పని కోసం అంగీకరించిన ధరలకు మెటీరియల్ ను సరఫరా చేసినపుడు ఆ పేయర్ ఎటువంటి అడ్జెస్ట్ మెంట్ లేకుండా స్థూల చెల్లింపులపై టీడీఎస్ ను మినహాయిస్తారు.
కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్టులో పని చేసేందుకు అంగీకరించినపుడు ప్రభుత్వం లేదా ఆ వ్యక్తి ఆ పని కోసం సామగ్రిని సరఫరా చేసినపుడు కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన మొత్తం అనేది అందించిన సేవలు మరియు లేబర్ మీద ఆధారపడి ఉంటుంది. మెటీరియల్ కాస్ట్ ను కవర్ చేయదు.
అందువల్ల ఒక చెల్లింపుదారు కాంట్రాక్టర్ కు చేసిన చెల్లింపులో 2 శాతం లేదా 1 శాతం గ్రాస్ పేమెంట్స్ ను బట్టి కట్ చేస్తారు. టీడీఎస్ రేటు 0.75 శాతం అంతే కాకుండా 4 మే 2020 నుంచి 31 మార్చి 2021 వరకు చేసిన చెల్లింపులకు 1.5 శాతం.
- ఒక పార్టీ కాంట్రాక్టర్ కు మెటీరియల్స్ అందించిన సందర్భంలో టీడీఎస్ డిడక్షన్
ఇందులో సోర్స్ వద్ద పన్ను మినహాయింపు వర్తించదు. ఏదేమైనప్పటికీ చెల్లింపుదారు అతను/ఆమె సబ్ కాంట్రాక్టర్ లేదా కాంట్రాక్టర్ కు నగదు రూపంలో చెల్లిస్తే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
ఇన్కమ్ టాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 194Cకి అనుగుణంగా లేకుంటే చేసిన చెల్లింపుకు భారీగా వడ్డీ పడే అవకాశం ఉంది. మరియు అటువంటి చెల్లింపులకు చేసిన ఖర్చులపై క్లయిమ్ చేసేందుకు కూడా అనుమతించబడరు. అందువల్ల పెరుగుతున్న పన్ను లయబిలిటీలను తెలుసుకునేందుకు ఈ సెక్షన్ గురించి తెలుసుకోవాలి.