ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్

Digit

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

ఓపీడీ (OPD) బెనిఫిట్ అంటే ఏమిటి?

ప్రతి అనారోగ్యానికి లేదా గాయానికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరకుండానే కన్సల్టేషన్, రోగ నిర్ధారణ, చికిత్సను వేగంగా, సౌకర్యవంతంగా చేయవచ్చు. హెల్త్ కేర్ ప్రపంచంలో, దీనిని ఓపీడీ (OPD)- 'ఔట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్' అని పిలుస్తారు.

అయితే, అసలు ఓపీడీ (OPD) కవర్ అనేది ఏం చేస్తుందంటే, మీ హెల్త్ కండిషన్​ను బట్టి మీకు అవసరమైన ఓపీడీ (OPD) చికిత్సకు అయ్యే మెడికల్ బిల్లులను చూసుకుంటుంది.

ఏదైనా హెల్త్ కండిషన్ లేదా గాయం కోసం మీరు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు, లేదా మీ డెంటిస్ట్ సూచన ప్రకారం మీరు రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు! మీ పర్సనల్ హెల్త్ జర్నీలో జరిగే ఈ హెచ్చు తగ్గులు అన్నీ ఓపీడీ (OPD) కిందకు వస్తాయి.

ఓపీడీ (OPD) చికిత్స అంటే ఏమిటి?

ఓపీడీ (OPD) లేదా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ చికిత్స అనేది మెడికల్ ప్రాక్టీషనర్ లేదా డాక్టర్ సలహా మేరకు వారి క్లినిక్ లేదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా చేసిన చికిత్స, రోగ నిర్ధారణను (డయాగ్నోసిస్) సూచిస్తుంది.

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓపీడీ (OPD) చికిత్సలకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, ఇందులో ఫ్రాక్చర్‌లు, వివిధ డెంటల్ చికిత్సలు, మైనర్ సర్జరీలు కూడా ఉన్నాయి.

మరింత చదవండి: మీరు Coronavirus Health Insurance ను ఎందుకు తీసుకోవాలి?

Read More

నేను ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు తీసుకోవాలి?

ఇంకా ఎందుకు అని ఆలోచిస్తున్నారా? చదవండి...

OPD Expenses
భారతదేశంలో ఓపీడీ (OPD) ఖర్చులు మొత్తం హెల్త్ కేర్ కోసం చేసే ఖర్చులలో 62% వరకు ఉన్నాయి. (1)
Treatment
డాక్టర్ క్లినిక్‌లకు వెళ్లే వారి సంఖ్య 2017లో 2.7 రెట్లు ఉండగా, 2018లో సంవత్సరానికి 3.2 రెట్లు పెరిగింది. (2)
Health Guard
స్థానిక అధ్యయనం ప్రకారం, సాధారణ జిమ్, వర్క్ అవుట్‌ల కారణంగా మోకాలి గాయాలు అత్యధికంగా జరుగుతున్నాయి. (3)

ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

Health Insurance with OPD Cover
  • ఆన్‌లైన్ ప్రాసెస్​ చాలా సులభం - ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి క్లెయిమ్‌లు చేయడం వరకు అన్ని చాలా సులభంగా, పేపర్‌లెస్‌గా,  తొందరగా,  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి! క్లెయిమ్‌ల కోసం కూడా హార్డ్ కాపీలు కూడా అవసరం లేదు! 
  • పాండమిక్‌లలో కూడా కవర్ చేస్తుంది - 2020 మనకు నేర్పించినది ఏదైనా ఉందంటే, ఏది కూడా స్థిరంగా ఉండదని! అది COVID-19 అయినా లేదా మరేదైనా వైరస్ అయినా, పాండమిక్‌ సమయంలో కవర్ చేయబడుతుంది!

     

  • కోపేమెంట్ అనేది వయస్సుపై ఆధారపడి ఉండదు - మాహెల్త్ ఇన్సూరెన్స్‌లో Copayment అనేది వయస్సుపై ఆధారపడి ఉండదు. దీని అర్థం, మీ క్లెయిమ్‌ల సమయంలో- మీరు మీ జేబు నుంచి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూమ్ రెంట్‌పై ఎటువంటి పరిమితి లేదు - ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయనేది మేము అర్థం చేసుకున్నాము. అందుకే, మా వద్ద రూమ్ రెంట్‌పై ఎటువంటి పరిమితి లేదు. మీరు ఇష్టపడే ఏదైనా ఆసుపత్రి గదిని ఎంచుకోండి.

     

  • క్యుములేటివ్ బోనస్ - ఆరోగ్యంగా ఉన్నందుకు ఒక రివార్డ్! Yearly Cumulative Bonus పొందండి.
  • ఏ హాస్పిటల్‌లోనైనా చికిత్స తీసుకోండి - నగదు రహిత క్లెయిమ్‌ల కోసం భారతదేశంలోని మా నెట్‌వర్క్ ఉన్న 10500+ ఆస్పత్రుల నుంచి ఎంచుకోండి లేదా రీయింబర్స్‌మెంట్‌ను ఎంచుకోండి.

ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడుతుంది?

స్మార్ట్ + ఓపీడీ (OPD)

ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి 10% CB (50% వరకు)

ఏవి కవర్ చేయబడవు?

క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

  • రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు - ఆసుపత్రిలో చేరిన రెండు రోజులలోపు 1800-258-4242 కు కాల్ చేసి మాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.com కి ఈమెయిల్ చేయండి. రీయింబర్స్‌మెంట్‌ను ప్రాసెస్ చేయడానికి మీరు మీ హాస్పిటల్ బిల్లులు, సంబంధిత డాక్యుమెంట్లన్నిటిని అప్‌లోడ్ చేయగల లింక్‌ను మేము మీకు పంపుతాము.
  • క్యాష్​లెస్​ క్లెయిమ్‌లు - నెట్‌వర్క్ హాస్పిటల్ ఎంచుకోండి. మీరు list of network hospitals here ఇక్కడ చూడవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌డెస్క్‌లో ఈ-హెల్త్ కార్డ్‌ని చూపించి, క్యాష్​లెస్ రిక్వెస్ట్ ఫారమ్‌ను అడగండి. అన్నీ బాగుంటే, మీ క్లెయిమ్ అప్పటికప్పుడే ప్రాసెస్ చేయబడుతుంది.
  • మీరు కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే యొక్క ఆథరైజ్డ్ సెంటర్ నుంచి మీకు పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉందని నిర్ధారించుకోండి.

ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?

ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు

ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు

మేము ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం ‘ఫిట్ ఆప్షన్’ అని పిలువబడే ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్​ను కస్టమైజ్ చేశాము. మీలాంటి వ్యక్తులు చాలా ఫిట్‌గా, అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, మీరు ఇప్పటికీ జిమ్, వర్కవుట్ సంబంధిత గాయాలకు గురవుతారు. అందువలన మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు. అదనంగా, మీ యాన్యువల్ ట్యాక్స్‌ను ఆదా చేయడంలో హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సహాయపడుతుంది.

25-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు

25-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు

ఈ రోజుల్లో చాలా మంది యువకులు వెయిటింగ్ పీరియడ్‌లను ముందుగానే పూర్తి చేయడానికి, ట్యాక్స్ ఆదా చేయడానికి చౌకైన ప్రీమియంలతో వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటున్నారు. మీరు కూడా వారిలో ఒకరు అయితే- మీరు ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ విధంగా, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ నుంచి ఇతర బెనిఫిట్లను ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉందని మీరు భావించినప్పటికీ, మీకు ఖచ్చితంగా దేనికోసమైనా ఓపీడీ (OPD) బెనిఫిట్లలో ఏదైనా అవసరం అవుతుంది.

సీనియర్ సిటిజన్లు

సీనియర్ సిటిజన్లు

హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువగా అవసరమయ్యే వ్యక్తులలో సీనియర్ సిటిజన్లు ఒకరు. ఏదేమైనప్పటికీ, సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే వాటితో పాటు వృద్ధులకు సాధారణంగా డెంటల్ చికిత్స, సాధారణ సర్జరీ వంటి ఓపీడీ (OPD) చికిత్సలు ఎక్కువగా అవసరమవుతాయి. కాబట్టి ఓపీడీ (OPD) కవర్‌తో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల, ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లు, ఓపీడీ (OPD) చికిత్సలు రెండింటికీ కూడా కవర్ చేయడంలో సహాయపడుతుంది.

లిమిటెడ్​ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీతో పనిచేసే నిపుణులు

లిమిటెడ్​ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీతో పనిచేసే నిపుణులు

మీరు ఇప్పటికే మీ యజమాని నుంచి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండి, మెరుగైన రక్షణ కోసం అదనపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకుంటే, మీరు టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఓపీడీ (OPD) బెనిఫిట్లను కలిగి ఉండవు. అందువల్ల, అదనపు హెల్త్ ఇన్సూరెన్స్‌ అనేది అదనపు బెనిఫిట్లను అందిస్తుంది. మీ యాన్యువల్ ట్యాక్స్‌ను ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది!

ఓపీడీ (OPD) కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు