ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారు విపరీతంగా పెరుగుతున్న ఈ గిగ్ ఆర్థిక యుగంలో చాలా మంది స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేసే సౌలభ్యం పొందుతున్నారు. కానీ ఈ స్వయం ప్రతిపత్తిగల ఉద్యోగం చేసినా కానీ మన మీద ఆధారపడిన వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంటుంది.
ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వారి జీవిత ప్రయాణంలో చాలా కీలక ఆంశంగా మారుతుంది. వైద్య పరమైన అనిశ్చితి సమయంలో ఇది వారికి మనశ్శాంతి మరియు భద్రతను అందిస్తుంది.
అసలు గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమూ ఇక్కడ తెలుసుకుందాం.
గిగ్ ఎకానమీలో పూర్తి జాబ్ లా కాకుండా పార్ట్ టైమ్, ఫ్రీలాన్సర్ వర్క్ ఉంటుంది. ఇది వేగంగా వృద్ధి చెందుతోంది. అంతే కాకుండా దేశ ఉపాధి రంగాన్నే పునర్నిర్మిస్తోంది. ఇది కొత్త ఆదాయ మార్గాలను అందించడం మాత్రమే కాకుండా ఇండియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుంది.
స్థిరత్వం లేని ఆదాయం మరియు సాంప్రదాయ బద్ధంగా లేని పనులను చేస్తున్నపుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది చాలా కీలకమైన ఆంశం. ఇటువంటి సందర్భంలో యజమాని (ఎంప్లాయర్) నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పొందడం అసాధ్యం. అందుకోసమే వ్యక్తిగత పాలసీ తీసుకుని జాగ్రత్త పడాలి.
అందుకోసమే గిగ్ ఎకానమీ వ్యక్తుల కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల వల్ల ప్రత్యేక అవసరాలు తీరుతాయి. సౌలభ్యంగా ఉంటూ కవరేజ్ మరియు ఆర్థిక భద్రతను అందిస్తాయి.
ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు యజమాని అందించే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను పొందలేరు. కావున ఆరోగ్య విషయంలో వచ్చే ఊహించని వైద్య ఖర్చులు వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ముంబైలో ఉండే ఇద్దరు ఫ్రీలాన్సర్స్ రాహుల్ మరియు ప్రియ గురించి తెలుసుకుందాం. రాహుల్ గ్రాఫిక్ డిజైనర్ మరియు ప్రియ కంటెంట్ రైటర్. స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛ మరియు సౌలభ్యాన్ని వీరు ఆస్వాదిస్తున్నారు. అయినా కానీ ఇటీవల వారు ఊహించని విధంగా వచ్చిన ఆరోగ్యం విషయంలో ఖర్చులను ఎదుర్కొన్నారు. ఫ్రీలాన్సర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత అవసరమో ఇది హైలెట్ చేస్తుంది.
రాహుల్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అతడి హాస్పిటల్ బిల్లు రూ. 1,50,000 అయింది. అతడు ఆ హాస్పిటల్ బిల్లులను చెల్లించేందుకు అతడి కుటుంబం నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఇది అతడి ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసింది. అతడు మళ్లీ ఆర్థికంగా కోలుకునేందుకు ఎంతో ఒత్తిడి చెందాల్సి వచ్చింది.
ప్రియ చాలా తెలివిగా హెల్త్ ఇన్సూరెన్స్ లో పెట్టుబడి పెట్టింది. (పాలసీ తీసుకుంది) ఆమె ఒకానొక సమయంలో హెల్త్ సమస్యను ఎదుర్కొన్నపుడు ఆమె ప్లాన్ మొత్తం 80 శాతం కవర్ చేసింది. రూ. 1,50,000. హెల్త్ పాలసీ వల్ల ప్రియకు ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. ఆమె ఆర్థిక సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఆరోగ్యంగా కోలుకోవడం మీద దృష్టి పెట్టింది.
రాహుల్ మరియు ప్రియ వంటి ఫ్రీలాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత అవసరమో ఈ సిట్యుయేషన్ క్లియర్‌గా వివరిస్తుంది. ఇది మీకు మరింత ఆర్థిక భద్రతను అందిస్తుంది. మనశ్శాంతితో పాటు నాణ్యమైన వైద్య సదుపాయాలను కూడా ఇది మీకు అందిస్తుంది. ఈ పాలసీని తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యం కోసం అధిక శ్రద్ధ వహిస్తూ మీ స్వతంత్ర జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వారికి ఎంతో మనశ్శాంతిని మరియు అవేంటో ఓ సారి తెలుసుకుందాం:
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కాంప్రహెన్సివ్ మెడికల్ కవరేజ్ ను అందిస్తుంది. ఆసుపత్రిలో చేరడం, డాక్టర్ కన్సల్టేషన్లు, శస్త్రచికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు మొదలైన వాటికి అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. ఈ కవరేజ్ ఫ్రీలాన్సర్లు, స్వయంఉపాధి పొందుతున్న వ్యక్తులు నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ వైద్య ఖర్చుల కోసం ఎటువంటి ఆర్థిక భారం మీ మీద పడకుండా పాలసీ మీకు కవరేజ్ అందిస్తుంది.
మార్కెట్లో లభిస్తున్న చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేక రకాల ప్రీమియం పాలసీలను అందిస్తాయి. తమ బడ్జెట్ మరియు అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవచ్చు. ఇవి మీ ఆర్థిక స్థోమతను విచ్ఛిన్నం చేయకుండా మీకు ఆర్థిక భద్రతను అందిస్తాయి.
ఎంప్లాయర్ అందించే హెల్త్ కవర్ లేకుండా ఉన్న ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు తరచూ వారి కుటుంబ సభ్యులతో హెల్త్ ఎమర్జెన్సీలను ఎదుర్కుంటారు. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ అందుబాటులో ఉన్నందున వారు దీనిని తీసుకుంటే వారి కుటుంబం మొత్తం కవర్ చేయబడుతుంది.
అనుకోని సందర్భాల్లో హెల్త్ ఎమర్జెన్సీలు తలెత్తినపుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అనుకోని ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఫ్రీలాన్సర్ లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ హెల్త్ పాలసీ వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు అనుకోని అనారోగ్యం వచ్చినపుడు అయ్యే ఖర్చుల నుంచి వైద్య బిల్లుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లభించే అడ్వాంటేజ్ క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ఫెసిలిటీ. ఈ ప్రయోజనం వల్ల పాలసీదారులు ముందస్తుగా ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందొచ్చు. మన ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా ఆసుపత్రులో బిల్లును సెటిల్ చేస్తాడు. పాలసీ చేసిన వ్యక్తికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా చేస్తుంది.
ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందే వారు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం చెల్లించే దానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపును పొందేందుకు అర్హత పొందుతారు. అది వారి సేవింగ్స్‌ను మరింత పెంచుతుంది.
ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం వలన మీరు మీకు ప్రియమైన వారిని అనుకోని ఆరోగ్య ఖర్చుల నుంచి కాపాడుకోవచ్చు.
ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం ఇక్కడ రెండు రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సింగిల్ పర్సన్ కోసం రూపొందించబడింది. ఫ్రీలానర్లు మరియు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్య ఖర్చుల ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. డిపెండెంట్లు (తమ మీద ఆధారపడే వారు) ఎవరూ లేని వారికి ఈ ప్లాన్ సరిగ్గా సూట్ అవుతుంది.
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ అనేది ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తితో పాటు జీవిత భాగస్వామి, పిల్లలు, ఒక్కోసారి తల్లిదండ్రులు మొత్తం అందరికీ కవరేజ్ అందించే కాంప్రహెన్సివ్ పాలసీ. ఇది ఒకే పాలసీ కింద కుటుంబం మొత్తాన్ని కవర్ చేస్తున్నందున తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్న ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఈ పాలసీ తీసుకునేందుకు ఇష్టపడతారు.
గిగ్ ఎకానమీలో జీవనం సాగిస్తున్న వారికి అసంబద్ధమైన ఆదాయం అనేది ఒక సవాల్. ఇలా ఆదాయం సరిగ్గా లేనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని డీల్ చేయడం అనేది ఒక సవాలుతో కూడుకున్న ప్రక్రియ. దీనిని తెలివిగా పూర్తి చేయాలి. ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు వారి ఆదాయాల్లో హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చు. వారి హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం.
ఈ పరిస్థితిని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మీ బడ్జెట్ కు అనుగుణంగా సరసమైన ప్రీమియంలతో ఉండే పాలసీలను ఎంచుకోండి. మీకు ఆర్థిక భారం లేకుండా ఉండే కవరేజీలను ఎంచుకోండి. వివిధ రకాల ప్లాన్స్‌ను సరిపోల్చండి. మీ డబ్బుకు కరెక్టుగా సరిపోయే ప్లాన్ ఎంచుకోండి.
సక్రమంగా లేని ఆదాయం వల్ల వార్షిక ప్రీమియంలు మీకు భారంగా అనిపిస్తే.. నెలలవారీ ప్రీమియంలు, త్రైమాసిక ప్రీమియంలను ఎంచుకోవచ్చు. ఇలా చిన్న వాయిదాల్లో చెల్లించడం వలన సులభం అవుతుంది.
ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఫండ్‌ను క్రియేట్ చేయండి. మీకు అధిక ఆదాయం ఉన్న నెలల్లో కొంత నిధిని దీనికి కేటాయించండి. మీకు ఆదాయం సరిగ్గా లేని నెలల్లో ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. మీరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రీమియంలను చెల్లించవచ్చు.
SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) లేదా చిన్న మొత్తాల రికవరింగ్ డిపాజిట్స్‌ను క్రియేట్ చేయండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. తద్వారా మీరు ప్రతి నెలా పొదుపు చేసుకోవచ్చు. మీకు వార్షిక ప్రీమియంకు సంబంధించి భారం ఉండదు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు, మీరు చెల్లిస్తున్న ప్రీమియాల గురించి తరచూ రివ్యూ చేయండి. మీ ఆదాయం మరియు జీవిత పరిస్థితులు మారుతున్నందున మీరు మీ ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సూటయ్యే ప్లాన్స్, ప్రీమియం ఆప్షన్స్ లను ఎంచుకోండి.
సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం అనేది ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎంతో ముఖ్యం. వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మన అవసరాలకు తగిన విధంగా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎన్నుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
ఇన్సూరెన్స్ ప్లాన్ అందించే కవరేజ్ ను అంచనా వేయండి. ఇందులో హాస్పిటలైజేషన్ ఖర్చులు, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కేర్, డే కేర్ ఖర్చులు, అంబులెన్స్ చార్జీలు, మరియు ఇతర మెడికల్ ఖర్చులు కూడా ఉంటాయి.
మీ ఆరోగ్య అవసరాలకు ఎంత వరకు ఖర్చవుతుందో లెక్కేసుకుని సమ్ ఇన్సూర్డ్ ను ఎంచుకోండి. మీ స్థోమత ద్వారా సరైన కవరేజ్ ను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం.
మీ బడ్జెట్ లో ఉన్న వివిధ రకాల ప్లాన్స్ చూస్తున్నపుడు ప్రీమియం ధరలను కంపేర్ చేయండి. మీకు తక్కువ ధరలో లభించేది మీకు అవసరం అయిన కవరేజ్ ను అందించకపోవచ్చు. కాబట్టి మీ ప్రాధాన్యతలకనుగుణంగా ఎంచుకోండి.
నెట్వర్క్ హాస్పిటల్స్ లో సకల సౌకర్యాలు ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను తనిఖీ చేయండి. వీటిల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యాష్ లెస్ చికిత్స విధానం ఉంటుంది.
డిజిట్ ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా 16400 కంటే ఎక్కువ ఆసుపత్రులలో నగదురహిత చికిత్సలను పొందండి.
మీకు ఉన్న ప్రత్యేకమైన అవసరాల కోసం యాడ్ ఆన్ కవర్స్ చెక్ చేయండి. మెటర్నిటీ బెనిఫిట్స్, క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్, ఆయుర్వేద, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలకు కూడా ఇవి కవరేజ్ అందిస్తాయి.
డిడక్టబుల్స్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించే ముందు మీరు చెల్లించే డబ్బులు. ఈ డిడక్టబుల్ అమౌంట్‌తో మీరు సౌకర్యంగా ఉన్నారో లేదో అంచనా వేయండి.
కో-పే మరియు సబ్ లిమిట్స్ అనేవి కొన్ని రకాల చికిత్సలయిన హాస్పిటల్ రూమ్ రెంట్ వంటి వాటి మీద వర్తిస్తాయి. ఈ నిబంధనల వల్ల మీ జేబుకు ఎంత భారం పడుతుందో అంచనా వేయండి.
ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను పరిశోధించండి. అలాగే కస్టమర్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో గురించి ఇచ్చిన రివ్యూలను కూడా పరిశోధించండి.
పాలసీ కొనుగోలు కోసం ఎటువంటి అవాంతరాలు లేని అలాగే క్లెయిమ్స్ సమర్పించేందుకు చిక్కులు లేని డిజిటల్ ప్రాసెస్ ఉన్న డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఎంతో సహాయం చేస్తుంది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఫ్లాట్‌ఫామ్ మీ సమయం మరియు ఎఫర్ట్‌ను ఆదా చేస్తుంది.
డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ లో పాలసీ కొనుగోలు అయినా, క్లెయిమ్ ప్రాసెస్ అయినా కానీ మొత్తం పేపర్‌లెస్‌గా ఉంటుంది. అది ఈజీ మరియు అవాంతరాలు లేకుండా ఉంటుంది.
ఫ్రీలాన్సర్స్ మరియు స్వయంఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఇది వారి ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాకుండా అనుకోని పరిణామాలు సంభవించే గిగ్ ఎకానమీలో మీకు ఆర్థిక స్థిరత్వం అందిస్తుంది. సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకోవడం మరియు తెలివిగా ప్రీమియంలను చెల్లించడం ద్వారా ఫ్రీలానర్స్ ఎటువంటి చింత లేకుండా ఉండొచ్చు. అంతే కాకుండా విజయవంతంగా వారి కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టొచ్చు.