వయసు మీద పడ్డ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. వారికి అనుకోని ఆరోగ్య ఖర్చులు వస్తాయి. ఈ భారం కుటుంబ పెద్దపై పడుతుంది.
దేశంలో ప్రభుత్వం 1.58 ట్రిలియన్లను హెల్త్ కేర్ కోసం కేటాయించినప్పటికీ, నాణ్యమైన వైద్యం అందడం కోసం అధిక ఖర్చులు భరించాల్సి వస్తుంది.
భారతదేశంలో తల్లిదండ్రుల (పేరెంట్స్) కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం అనేది అనుకోకుండా వచ్చిన వైద్య ఖర్చుల నుంచి మనల్ని కాపాడుతుంది. వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను మెడికల్ ఖర్చుల బారి నుంచి కాపాడటం కోసం ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లో అనేక బెనిఫిట్లు ఉన్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అనేది చాలా సాయపడుతుంది. ప్రత్యేకించి పెద్దవారైన మీ తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చులు ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయి.
హెల్త్ ఇన్సూరెన్స్‌ల విషయానికి వచ్చే సరికి భారతదేశంలో మూడు రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి వలన మీ కుటుంబ వైద్య చికిత్సల ఖర్చులు, మీ తల్లిదండ్రుల చికిత్సల ఖర్చులు కవర్ అవుతాయి. అవేంటంటే..
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కేవలం పాలసీ హోల్డర్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. ఈ ప్లాన్‌లో మీ కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులను కూడా చేర్చేందుకు వీలుంటుంది.
ఈ పాలసీని తీసుకున్న వ్యక్తి వైద్య ఖర్చుల నుంచి సంరక్షింపబడతాడు. మీ తల్లిదండ్రులకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
మరింతగా తెలుసుకోండి ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్
ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లా కాకుండా ఈ పాలసీ మీ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. ఈ ప్లాన్ కింద మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోవడం మంచిది కాదు. ఒకే సంవత్సరంలో పలు క్లెయిమ్‌లను చేయడం వలన తర్వాత మీరు చేసే క్లెయిమ్‌లు సెటిల్ కాకుండాపోయే ప్రమాదం ఉంటుంది.
భారతదేశంలో తల్లిదండ్రుల కోసం అనేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. కానీ వాటిలో మీరు ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే 50 సంవత్సరాల కంటే పైబడిన మీ తల్లిదండ్రులకు అనేక షరతులు ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యమే మీకు ముఖ్యం కాబట్టి వారికి ఎటువంటి షరతుల లేనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది.
మరింతగా తెలుసుకోండి ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్
ఒక్క నిమిషం ఆగండి. మీ తల్లిదండ్రుల వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే వారికి సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్ ఎలా పని చేస్తుందంటే?
ఈ ఇన్సూరెన్స్ పాలసీలో వయసు మీద పడిన వ్యక్తులకు అన్ని మెడికల్ ఖర్చులు కవర్ అవుతాయి. వ్యాధితో సంబంధం లేకుండా అన్ని వ్యాధులకు ఈ పాలసీ కవర్ అవుతుంది. ఈ పాలసీ పాలసీ హోల్డర్ల అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.
హోమ్ హాస్పిటలైజేషన్, ఆయుష్ కవరేజ్ వంటివి కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. 60 ఏళ్ల పైబడిన వారికి ఈ ఇన్సూరెన్స్ పాలసీ చాలా పర్ఫెక్ట్గా పని చేస్తుంది.
మరింతగా తెలుసుకోండి
మన దేశంలో ఉన్న వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు వివిధ రకాల బెనిఫిట్స్‌ను అందిస్తాయి. ఈ అంశాలు మిమ్మల్ని ఆర్థిక ఖర్చుల నుంచి కాపాడుతాయి. కాబట్టి మీ తల్లిదండ్రుల కోసం కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.
మీరు మీ హెల్త్ కేర్ ప్లాన్ నుంచి అధిక ప్రయోజనాలు పొందాలని భావించినపుడు మీరు తప్పకుండా కింది అంశాలను చెక్ చేయాలి.
ప్రమాదకరమైన గుండె జబ్బులు, క్యాన్సర్, కాలేయ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యల వంటివి క్రిటికల్ ఇల్నెస్ (తీవ్రమైన అనారోగ్య సమస్యలు) కిందకు వస్తాయి. ఇటువంటి వైద్యపరమైన పరిస్థితులకు చికిత్స అందించాలంటే రూ. 1 లక్ష నుంచి మొదలై రూ. 10 లక్షల వరకు కవర్ అవుతాయి.
మీరు క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను ఎంచుకుంటే ఇటువంటి వ్యాధుల చికిత్స కవర్ అవుతుంది. అదే మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంచుకుంటే ఎక్కువ ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు లభిస్తుంది. సర్జికల్ చార్జీలతో పాటు క్రిటికల్ ఇల్నెస్, పోస్ట్ రిలీజ్ చార్జీలు కూడా ఈ కవర్లో మీకు లభిస్తాయి.
మీరు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న 30 రోజులలోపు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేరు. ఎందుకంటే ఈ సమయం యాక్టివేషన్ పీరియడ్ కిందకు వస్తుంది.
మీరు మీ తల్లిదండ్రుల కోసం తీసుకున్న హెల్త్ పాలసీకి కట్టే ప్రీమియం చార్జీలు మీకు ఆర్థిక భారం కాకుండా ఉండాలి.
ఇతర కంపెనీల పాలసీలతో ఇన్సూరెన్స్ మొత్తం, కవరేజీ అంశాలు, ప్రీమియం మొదలగు వాటిని పోల్చుకుని పాలసీని ఎంచుకోవాలి.
మరింతగా తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోల్చి చూడండి
క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ముఖ్యమైన విషయం.
ఈ విధానంలో మీ ఇన్సూరెన్స్ కంపెనీలు వైద్య ఖర్చులను నేరుగా మీ తల్లిదండ్రులు చికిత్స చేయించుకున్న నెట్వర్క్ ఆస్పత్రికే చెల్లిస్తారు. మీరు పాలసీని ఎంచుకునే ముందు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎన్ని నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించుకోవాలి.
మరింత తెలుసుకోండి:
మీరు పాలసీని ఎంచుకునే ముందు కో–పేమెంట్ అవకాశం లేని పాలసీని ఎంచుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు మీకు అయిన చికిత్స ఖర్చులను కొంత శాతం మాత్రమే చెల్లిస్తాయి. కాబట్టి మీరు పాలసీ తీసుకునే ముందే కో–పేమెంట్ అవకాశం లేని పాలసీని ఎంచుకోవడం ఉత్తమం.
తల్లిదండ్రుల కోసం 0% కో–పేమెంట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం చూస్తున్నారా?
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది పాలసీ తీసుకునే ముందు చూడాల్సిన మరో విషయం. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత మంది క్లెయిమ్ చేశారు, ఎంత మందికి క్లెయిమ్ సెటిల్ అయిందనే విషయాలను బట్టి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను లెక్కిస్తారు.
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకోవడం మంచిది. ఇటువంటి కంపెనీలో మీరు పాలసీ తీసుకుంటే ఏదైనా అత్యవసర సమయంలో మీరు చేసే క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ క్లెయిమ్ చేసినపుడు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. మినిమల్ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీల కోసమే ఎవరైనా వెతుకుతారు. అటువంటి పాలసీని తీసుకోవడమే ఉత్తమం.
మీ పాలసీలో కవర్ అయిన అనారోగ్యాల సంఖ్యను కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. అప్పుడే మీ పాలసీ మీకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది.
పైన పేర్కొన్న ఫీచర్ల గురించి మాత్రమే కాకుండా మీరు యాడ్–ఆన్లు కూడా ఎంచుకుంటే అవి మరింతగా మీకు ఆదా చేస్తాయి. కొన్ని రకాల యాడ్–ఆన్స్ చూస్తే..
డిస్‌క్లెయిమర్ : డిజిట్ అందించే ఆరోగ్య పాలసీలతో ప్రస్తుతం ఆయుష్ ప్రయోజనాలను అందించట్లేదనే విషయాన్ని గమనించగలరు.
సాధారణంగా క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు రెండు పద్ధతులను అవలంభిస్తాయి. అవి..
మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఏ ఆప్షన్ ఎంచుకుంటారో దాని మీద అవగాహన కలిగి ఉండాలి. కానీ, ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వారి క్లెయిమ్ ప్రాసెస్‌ను ఆన్‌లైన్‌కు షిఫ్ట్ చేశాయి. ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా ఈజీగా మారింది.
చివరగా మీరు పాలసీ తీసుకుందామని భావించే ఇన్సూరెన్స్ కంపెనీ గురించి దాని కస్టమర్లు ఏమనుకుంటున్నారో ఒకసారి సోషల్ మీడియా సైట్లలో చూడటం మంచిది. గూగుల్ రివ్యూలు కూడా తనిఖీ చేయాలి. అటు తర్వాత ఏది బాగా ఉంటే ఆ కంపెనీలో మంచి హెల్త్‌కేర్ ప్లాన్‌ను ఎంచుకోవాలి.
మీరు మీ తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నపుడు అందులో ఏమేం కవర్ కావనే విషయాలను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీ పేరెంట్స్‌కు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కింది అంశాలు కవర్ కావు..
మీరు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే కింది ప్రయోజనాలు పొందుతారు.
మీకు ఏ సందర్భంలోనైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినపుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఖర్చుల నుంచి కాపాడుతుంది. కాబట్టి మీ పేరెంట్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పాలసీని తీసుకుంటే మీరు ప్రేమించే వ్యక్తులు తొందరగా కోలుకోవాలని మాత్రమే చూస్తారు. ఖర్చులను కాదు.
అంతేకాకుండా మీరు పాలసీ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. మీ పేరెంట్స్ 60 సంవత్సరాల పైబడినవారైతే రూ. 50,000, 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారైతే రూ. 25,000 ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో అనేక సార్లు కాపాడుతుంది. ఎటువంటి మెడికల్ ఖర్చులయినా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాయి. వెరిఫికేషన్, ప్రీమియం పేమెంట్లు మొత్తం ఆన్లైన్లోనే పూర్తవుతున్నాయి.
కింద పేర్కొన్న విధంగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. మొదట మీరు ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందేందుకు కింది స్టెప్స్‌ను ఫాలో కావాలి.
మీరు పైన ఉన్న స్టెప్స్‌ను పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మీ ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివేట్ చేయబడుతుంది. దానికన్నా ముందు మీరు సమర్పించిన అన్ని వివరాలను తనిఖీ చేస్తారు.
దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న మెడికల్ చార్జీలు, మందుల ఖర్చులతో సతమతం కాకుండా ఉండేందుకు మీరు మీ పేరెంట్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. మీరు ఇతర యాడ్–ఆన్‌లను ఎంచుకొని మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని సురక్షితంగా చూసుకోవచ్చు. వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం పొందొచ్చు.