హెల్త్ ఇన్సురంచె ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి మారండి

కోపే, కోఇన్సూరెన్స్ & డిడక్టబుల్ మధ్య వ్యత్యాసం

కోపే, కోఇన్సూరెన్స్ & డిడక్టబుల్ అంటే ఏమిటి

హెల్త్ ఇన్సూరెన్స్‌ ను పొందే విషయానికి వస్తే, కొన్ని పాదాల గురించి మీకు స్పష్టత ఉండాలి, ఎందుకంటే ఇవి తరచుగా గందరగోళం సృష్టించవచ్చు.

ప్రత్యేకించి, కోపే, డిడక్టబుల్ మరియు కోఇన్సూరెన్స్ వంటి నిబంధనల విషయానికి వస్తే, సరైన సమాచారం లేకుంటే ఎవరైనా చాలా త్వరగా గందరగోళానికి గురవుతారు.

చింతించకండి, మీకోసం మేము ఉన్నాము!

ఇక్కడ, మేము కోఇన్సూరెన్స్, డిడక్టబుల్ మరియు కోపే లకు అర్థం మరియు హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ విషయంలో వాటి ప్రభావం గురించి వివరిస్తాము.

ఒకసారి చూద్దాము!

హెల్త్ ఇన్సూరెన్స్‌ లో కోపే అంటే ఏమిటి?

పాలసీ హోల్డర్లు వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చులలో కొంత భాగాన్ని వారు భరించడం మరియు మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్‌ సంస్థ భరించడాన్ని కోపే అంటారు. ఇది నిర్ణీత మొత్తం కావచ్చు లేదా చికిత్స ఖర్చులలో నిర్ణీత శాతం కూడా కావచ్చు.

ఉదాహరణకు, మీ ఇన్సూరెన్స్‌ పాలసీ మీ చికిత్స ఖర్చులలో రూ.2000 కోపే నిబంధనతో వచ్చిందనుకోండి మరియు చికిత్సకు మీకు రూ. 10,000 ఖర్చు అయినప్పుడు, మీరు మీ చికిత్స కోసం రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 8000 ఇన్సూరెన్స్‌ సంస్థ ద్వారా కవర్ చేయబడుతుంది.

అలాగే, ఒకవేళ కోపే నిబంధన ప్రకారం మీరు మొత్తం ఖర్చులో 10% కవర్ చేయాల్సి ఉంటే, మీరు దానికి రూ.1000, మిగిలిన 90% (రూ. 9000) ఇన్సూరెన్స్‌ సంస్థ చెల్లించాలి.

ఇన్సూరెన్స్‌ పాలసీల కింద కోపేమెంట్ యొక్క ఫీచర్లు క్రింది విధంగా జాబితా చేయబడతాయి:

  • కోపే చెల్లింపు నిబంధనతో, ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్లు క్లయిమ్ లో ఎక్కువ భాగాన్ని భరిస్తారు, అయితే పాలసీ హోల్డర్ నిర్దిష్ట ఫిక్సడ్ భాగాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది.
  • వైద్య సేవను అనుసరించి కోపే చెల్లింపు మొత్తం నిర్ణయించబడుతుంది.
  • తక్కువ కోపేమెంట్ మొత్తం అంటే అధిక ప్రీమియం చెల్లింపు.
  • ఈ నిబంధనలు ఎక్కువగా సీనియర్ సిటిజన్‌ల హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీలపై విధించబడతాయి.
  • చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండే మెట్రోపాలిటన్ నగరాల్లో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.

ఎటువంటి కోపేమెంట్ లేదు అంటే చికిత్స ఖర్చు మొత్తం ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్ భరిస్తుంది.

డిజిట్ ఇన్సూరెన్స్ 0% కోపేమెంట్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీలను అందిస్తుంది మరియు ఒక వ్యక్తికి అయ్యే మొత్తం చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది.

దీని గురించి మరింత తెలుసుకోండి:

డిడక్టబుల్ లు అంటే ఏమిటి?

డిడక్టబుల్ అనేది వారి ఇన్సూరెన్స్‌ పాలసీ వారి వైద్య చికిత్సకు సహకరించడం ప్రారంభించే ముందు పాలసీ హోల్డర్ లు చెల్లించాల్సిన నిర్ణీత మొత్తం. డిడక్టబుల్ లను చెల్లించే నిబంధనలు ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్ చే నిర్ణయించబడుతుంది - సంవత్సరానికా లేదా ప్రతి చికిత్సకా అనేది.

ఉదాహరణకు, మీ పాలసీ ప్రకారం రూ. 5000 డిడక్టబుల్ తప్పనిసరి అయితే , మీరు రూ. 5000 వరకు మీ చికిత్స ఖర్చులకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇన్సూరెన్స్‌ పాలసీ చెల్లించడం ప్రారంభమవుతుంది.

డిడక్టబుల్ ల యొక్క కొన్ని ఫీచర్లు క్రింది ఇవ్వబడ్డాయి:

  • ఇది క్రమం తప్పకుండా వచ్చే మరియు అనవసరమైన క్లయిమ్ ల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సహాయం చేయడానికి విధించబడుతుంది.
  • ఇది ఇన్సూరెన్స్‌ పాలసీలకు ప్రీమియం చెల్లింపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ఇది ఒక వ్యక్తి వారి వైద్య చికిత్స కోసం చేసే మొత్తం ఖర్చును పెంచవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్‌ లో డిడక్టబుల్ ల గురించి మరింత తెలుసుకోండి.

కోఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

కోఇన్సూరెన్స్ అనేది డిడక్టబుల్ లను చెల్లించిన తర్వాత మీరు భరించాల్సిన చికిత్స ఖర్చుల శాతాన్ని సూచిస్తుంది. ఈ మొత్తం సాధారణంగా నిర్ణీత శాతంగా అందించబడుతుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్‌ కింద కోపేమెంట్ నిబంధనను పోలి ఉంటుంది.

ఉదాహరణకు, మీ కోఇన్సూరెన్స్ 20% అయితే, మీ చికిత్స ఖర్చులో మీరు 20% భరించవలసి ఉంటుంది, మిగిలిన 80% మీ ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్ ద్వారా భరించబడుతుంది.

అంటే, ఒక నిర్దిష్ట వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు రూ. 10,000 అయితే, మీరు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. కాగా రూ. 8000 మీ ఇన్సూరెన్స్‌ పాలసీ ద్వారా కవర్ చేయబడుతుంది. మీరు మీ డిడక్టబుల్ లను చెల్లించిన తర్వాత ఈ మొత్తం సాధారణంగా లెక్కించబడుతుంది.

కోఇన్సూరెన్స్ ప్లాన్‌ల యొక్క కొన్ని ఫీచర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ఇది పెద్ద క్లయిమ్ ల నుండి ఇన్సూరెన్స్‌ సంస్థలను రక్షించడంలో సహాయపడుతుంది.
  • పాలసీ హోల్డర్ లు వారి కోఇన్సూరెన్స్ ప్లాన్ అమలులోకి రాకముందే తమ డిడక్టబుల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
  • కోఇన్సూరెన్స్ శాతం స్థిరంగా ఉంటుంది.
  • ఈ శాతం మీ ఇన్సూరెన్స్‌ పాలసీ మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి ముందు ఒక సంవత్సరం పాటు మీరు గరిష్టంగా చెల్లించాల్సిన అవుట్ అఫ్ పాకెట్ మొత్తాన్ని కలిగి ఉంటుంది.

మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీకి సంబందించిన ఈ పదాలలో ప్రతి ఒక్కదానికి అర్థం ఏమిటో ఇప్పుడు మేము వివరించాము, ఇప్పుడు వీటిలో ప్రతి దాని మధ్య తేడాలను చూద్దాం.

ఒక ఉదాహరణతో కోపే, కోఇన్సూరెన్స్ & డిడక్టబుల్ ను అర్థం చేసుకోండి

ఖర్చులను పంచుకోవాల్సిన ఈ మూడు ఆప్షన్ లను దిగువ అందించిన పట్టికలో సంగ్రహించవచ్చు:

ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ రూ. రూ. 5 లక్షలు. దానిపై 10% కోపే మరియు రూ. 5000 డిడక్టబుల్ లు అనుకోండి.

డిడక్టబుల్ కాకుండా, అతను 10% కోఇన్స్యూరెన్స్ నిబంధనను కలిగి ఉన్నాడు అనుకుందాం. ఒక నిర్దిష్ట వ్యాధి చికిత్సకు రూ. 10,000 అయిందనుకోండి, ఈ నిబంధనల నుండి అతని లయబిలిటీ ఈ విధంగా ఉంటుంది:

కోపే డిడక్టబుల్ కో-ఇన్సూరెన్స్
చికిత్స ఖర్చులో 10%. చికిత్స ఖర్చు రూ. రూ. 10,000 అనుకోండి . అందువలన, చికిత్స జరిగేటప్పుడు పాలసీ హోల్డర్ రూ. 1000 చికిత్స ఖర్చులు కోసం చెల్లించాలి మరియు మిగిలిన రూ. 9000 ఇన్సూరెన్స్‌ పాలసీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ డిడక్టబుల్ మొత్తం అయిన రూ. 5000, పాలసీ హోల్డర్ ముందుగా తన చికిత్స కోసం చెల్లించాలి. పాలసీ హోల్డర్ అతని/ఆమె వాటా రూ. 5000 చెల్లించిన తర్వాత మాత్రమే పాలసీ చెల్లించడం ప్రారంభమవుతుంది. డిడక్టబుల్ చెల్లించిన తర్వాత పాలసీలపై కో-ఇన్సూరెన్స్ తరచుగా విధించబడుతుంది. చికిత్సకు అయ్యే ఖర్చు రూ. 10,000 మరియు డిడక్టబుల్ రూ. 5000 చెల్లించబడింది అనుకోండి, పాలసీ మిగిలిన రూ. 5000 ని కవర్ చేస్తుంది.ఈ రూ. 5000 లో, పాలసీ హోల్డర్ రూ.5000 లో 10% అంటే రూ. 500 కో-ఇన్సూరెన్స్ నిబంధన కింద చెల్లించాలి. మిగిలిన రూ. 4500 ఇన్సూరెన్స్‌ పాలసీ పరిధిలోకి వస్తుంది.

కోపే మరియు డిడక్టబుల్ మధ్య తేడా ఏమిటి?

కోపే చెల్లింపు మరియు డిడక్టబుల్ పాదాల మధ్య వ్యత్యాసాన్ని దిగువ పట్టికలో వివరించవచ్చు:

పారామీటర్ కోపే డిడక్టబుల్
వర్తింపు కోపే అనేది పాలసీ హోల్డర్ లు వారి చికిత్స ఖర్చులకు చెల్లించాల్సిన ఫిక్సడ్ భాగం, మిగిలినది ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్లు భరిస్తారు. ఇది నిర్ణీత మొత్తం లేదా చికిత్స ఖర్చులో నిర్ణీత శాతంగా ఇవ్వబడుతుంది. డిడక్టబుల్ అనేది పాలసీ హోల్డర్ లు తమ ఇన్సూరెన్స్‌ పాలసీలు చెల్లించడం ప్రారంభించే ముందు భరించాల్సిన ఫిక్సడ్ మొత్తం. ఇది మీ మెడికల్ బిల్లులో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది.
ప్రీమియంపై ప్రభావం ఎక్కువ కోపే మొత్తంతో, పాలసీ హోల్డర్ లు తక్కువ ప్రీమియంలను చెల్లించవలసి ఉంటుంది. డిడక్టబుల్ లు పాలసీ హోల్డర్ లను తక్కువ ప్రీమియం మొత్తాలను చెల్లించడానికి కూడా అనుమతిస్తాయి.
కో-ఇన్సూరెన్స్ నిబంధన కోపే అనే పదాన్ని తరచుగా కో-ఇన్సూరెన్స్ తో పరస్పరం మార్చి వాడుతారు. పాలసీ హోల్డర్ లు తమ పాలసీలో డిడక్టబుల్ భాగాన్ని చెల్లించిన తర్వాత తరచుగా కోఇన్సూరెన్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
అమలు కోపే నిబంధన నిర్దిష్ట ఆరోగ్య సంరక్షణ సేవలపై మాత్రమే విధించబడుతుంది. ఒక వ్యక్తి యొక్క చికిత్స ఖర్చులకు ఇన్సూరెన్స్‌ పాలసీ చెల్లించడం ప్రారంభించే ముందు డిడక్టబుల్ అమలు చేయబడుతుంది.

కోపే మరియు కో-ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి?

ఇవి కొన్నిసార్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, కోపే మరియు కోఇన్సూరెన్స్‌కు మధ్య కొన్ని చిన్న తేడాలు ఉంటాయి. కో-ఇన్సూరెన్స్ vs కోపే అంటే ఏమిటో తెలుసుకోవడానికి, దిగువ పట్టికను చూద్దాం:

పారామీటర్ కోపే కో-ఇన్సూరెన్స్
వర్తింపు ఇది ముందుగా నిర్ణయించిన ఫిక్సడ్ భాగం, వైద్య చికిత్స సమయంలో అయ్యే ఖర్చులకు మీరు చెల్లించాలి. ఇది నిర్ణీత మొత్తం లేదా చికిత్స ఖర్చులలో నిర్ణీత శాతంగా ఉండవచ్చు. కోఇన్సూరెన్స్ కోసం అసలు మొత్తం మారుతూ ఉంటుంది. కానీ, మీ చికిత్స కోసం మీరు భరించాల్సిన ఖర్చుల శాతం కోఇన్సూరెన్స్ నిబంధన ప్రకారం స్థిరంగా ఉంటుంది.
చెల్లింపు ప్రక్రియ కోపే నిబంధనతో, మీరు ఏదైనా వైద్య సేవను కోరిన ప్రతిసారీ చెల్లింపులలో కొంత భాగాన్ని చెల్లించాలి. మీరు మీ డిడక్టబుల్ ను కవర్ చేసిన తర్వాత వైద్య సేవలకు కోఇన్సూరెన్స్ చెల్లించాలి.
చెల్లింపు సమయం కోపే చెల్లింపు నిబంధన ప్రకారం, మీరు సేవను కోరుకునే సమయంలో ఖర్చును భరించాలి. మీ చికిత్స కోసం మీరు చెల్లించే మొత్తం మీ ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్ ద్వారా బిల్ చేయబడుతుంది మరియు మీరు నేరుగా వారికి చెల్లించాల్సి ఉంటుంది.
డిడక్టబుల్ లపై ప్రభావం నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే డిడక్టబుల్ లను కోపే లెక్కిస్తుంది. డిడక్టబుల్ లను చెల్లించిన తర్వాత మాత్రమే కోఇన్సూరెన్స్ చెల్లించబడుతుంది.

కోఇన్సూరెన్స్ మరియు డిడక్టబుల్ మధ్య తేడాలు

ఇప్పుడు మీరు కోపే మరియు డిడక్టబుల్ మధ్య మరియు కోపే మరియు కోఇన్సూరెన్స్ మధ్య తేడాలను తెలుసుకున్నారు కాబట్టి, కోఇన్సూరెన్స్ మరియు డిడక్టబుల్ మధ్య తేడాను గుర్తించడం చాలా సులభం అవుతుంది. వాటిలో కొన్ని క్రింది విధంగా ఉన్నాయి:

పారామీటర్ కోఇన్సూరెన్స్ డిడక్టబుల్
వర్తింపు ఇది ఒక వ్యాధికి చికిత్స చేయడానికి అయ్యే ఖర్చులలో నిర్ణీత శాతం, పాలసీ హోల్డర్ లు భరించవలసి ఉంటుంది, మిగిలినది వారి ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్ ద్వారా కవర్ చేయబడుతుంది. డిడక్టబుల్ అనేది వారి ఇన్సూరెన్స్‌ పాలసీ చెల్లించడం ప్రారంభించే ముందు ఇన్సూరెన్స్‌ హోల్డర్లు వైద్య చికిత్స ఖర్చులను కవర్ చేయడానికి చెల్లించాల్సిన ఫిక్సడ్ మొత్తాన్ని సూచిస్తుంది.
చెల్లింపు పరిమితి మీరు మీ ఇన్సూరెన్స్‌ పాలసీకి వ్యతిరేకంగా క్లయిమ్ ను చేసిన ప్రతిసారీ కోఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఒక సంవత్సరానికి డిడక్టబుల్ ల చెల్లింపు ముగుస్తుంది. మీరు మళ్లీ వచ్చే ఏడాది డిడక్టబుల్ చెల్లించవలసి ఉంటుంది.
చెల్లింపు మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చులను బట్టి కోఇన్సూరెన్స్ కోసం చెల్లించే మొత్తం మారుతుంది. డిడక్టబుల్ మొత్తం ఫిక్సడ్ గా ఉంటుంది.
రిస్క్ ఫ్యాక్టర్ లయబిలిటీస్ విషయానికి వస్తే , కోఇన్సూరెన్స్ ఎక్కువ రిస్క్‌ను కలిగి ఉంటుంది ఎందుకంటే మీరు చికిత్స ఖర్చులలో నిర్దిష్ట శాతాన్ని భరించవలసి ఉంటుంది. చికిత్స ఖర్చు ఎక్కువగా ఉంటే ఇది గణనీయమైన మొత్తం కూడా కావచ్చు. చికిత్స ఖర్చులు గణనీయంగా ఉన్నప్పటికీ, చెల్లించాల్సిన మొత్తం స్థిరంగా ఉన్నందున డిడక్టబుల్ లు బాధ్యతగా మారవు.

దీనితో, ఇప్పుడు మనం కోపే, కోఇన్సూరెన్స్ మరియు డిడక్టబుల్ ల గురించి మరియు వాటి మధ్య ఉండే తేడాల గురించి సుదీర్ఘంగా తెలుసుకున్నాము, అందువలన గరిష్ట ప్రయోజనాలతో హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీలను వెతకడం సులభం అవుతుంది.

 

వీటి గురించి మరింత తెలుసుకోండి:

డిడక్టబుల్ తో కోపే అంటే ఏమిటి?

కోపే, డిడక్టబుల్ మరియు కోఇన్సూరెన్స్ అనేవి ఖర్చును పంచుకోవడాన్ని సూచించే పదాలు అయినా, అవి ఎలా వర్తింపబడతాయి అనేది మీ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.

డిడక్టబుల్ లు మరియు కోఇన్సూరెన్స్ అనేవి ఒకే ఇన్సూరెన్స్‌ స్కీం కింద ఎక్కువగా అమలు చేయబడిన నిబంధనలు. కానీ, కొన్ని ఇన్సూరెన్స్‌ స్కీం లు ఏకకాలంలో కోపేమెంట్ మరియు డిడక్టబుల్ నిబంధనలను కూడా అమలు చేస్తాయి.

మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ పథకం కూడా అలా చేస్తుంటే, మీ పై అది ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ ఇవ్వబడి ఉంది -

  • మీరు మీ చికిత్స ప్రణాళికలకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి. మీరు చెల్లించిన డిడక్టబుల్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే మీ ఇన్సూరెన్స్‌ పథకం మీ చికిత్సకు చెల్లించడం ప్రారంభమవుతుంది.
  • ఇన్సూరెన్స్‌ ప్లాన్ చెల్లించడం ప్రారంభించిన తర్వాత, మీరు పాలసీకి వ్యతిరేకంగా క్లయిమ్ లను నమోదు చేసిన ప్రతిసారీ మీరు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ కోపేమెంట్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్‌ ప్లాన్ కవర్ చేస్తుంది.
  • మీరు పాలసీకి తక్కువ ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది, దీని వలన పాలసీ ని పొందటం చౌకగా అవుతుంది.

మీరు కోపేమెంట్, కోఇన్సూరెన్స్ మరియు డిడక్టబుల్ క్లాజులతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవాలా?

సరే, కాగితంపై మీ ప్రీమియం చెల్లింపు తగ్గుతుంది అని ఉన్నప్పటికీ, మీరు అటువంటి వ్యయ-భాగస్వామ్య నిబంధనలతో కూడిన పాలసీని ఎంచుకుంటే మీ ప్రీమియం చెల్లింపు తగ్గుతుంది కానీ పాలసీ పట్ల మీ లయబిలిటీ పెరుగుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తిన ప్రతిసారీ ఖర్చులలో కొంత భాగాన్ని మీరు చెల్లించాలి. మీ చేతిలో నగదు అందుబాటులో లేకుంటే ఇది ఇబ్బందులకు దారి తీస్తుంది.

అందువల్ల, అటువంటి వ్యయ-భాగస్వామ్య నిబంధనలను విధించని హెల్త్ ఇన్సూరెన్స్‌ స్కీం ను పొందడం మరింత ప్రయోజనకరం. భారతదేశంలోని ఇన్సూరెన్స్‌ కంపెనీలు అందించే అనేక హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీల మధ్యలో, మీరు మీ అవసరాలకు సమర్థవంతంగా సరిపోయే పాలసీని సులభంగా కనుగొనవచ్చు.

మీ అవసరాలకు ఉత్తమంగా సరిపోయేదాన్ని పొందడానికి ప్రతి పాలసీ కింద పేర్కొన్న అన్ని నిబంధనలు మరియు షరతులను తనిఖీ చేయండి!

కోపే, కోఇన్సూరెన్స్ & డిడక్టబుల్ మధ్య వ్యత్యాసం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

మార్కెట్‌లో ఎలాంటి కోపేమెంట్ నిబంధనలు లేని హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉన్నాయా?

అవును, డిజిట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్‌ 0% కోపేమెంట్ తో వస్తుంది. అలాగే, మీరు పాలసీతో జోన్ అప్‌గ్రేడ్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు.

కోఇన్సూరెన్స్ మరియు డిడక్టబుల్ లను ఒకే సమయంలో విధించవచ్చా?

అవును, కోఇన్సూరెన్స్ నిబంధనలు ఎక్కువగా డిడక్టబుల్ లతో ఇన్సూరెన్స్‌ పాలసీలకు జోడించబడతాయి.

వివిధ ఆరోగ్య సంరక్షణ సేవలకు కోపే చెల్లింపు మొత్తం మారుతుందా?

అవును, వివిధ సేవలకు కోపే చెల్లింపు మొత్తం మారుతూ ఉంటుంది, అయితే డబ్బు మొత్తం సేవలో ఫిక్సడ్ గా ఉంటుంది.

కోపే నిబంధన ప్రీమియం చెల్లింపులను తగ్గిస్తుందా?

అవును, కోపే నిబంధనలతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీలు లేని వాటి కంటే చౌకగా ఉంటాయి.