కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కోవిడ్-19 యొక్క ఆసుపత్రి, చికిత్స ఖర్చులను కవర్ చేయడానికి పనికి వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. భారతదేశంలో కోవిడ్-19 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆన్‌లైన్‌లో చాలానే అందుబాటులో ఉన్నాయి; కరోనా రక్షక్ కవర్, కరోనా కవచ్ పాలసీ లాంటివి. లేదంటే మీరు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కొన్ని పాలసీలు ఇతర అనారోగ్య సమస్యలు, వ్యాధులు, హెల్త్ కేర్ ప్రయోజనాలను కవర్ చేస్తాయి.
భారతదేశంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) హెల్త్ ఇన్సూరెన్స్
2020వ సంవత్సరం మనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంగా చరిత్రలో మిగిలిపోతుంది. మనం ఎన్నో విషయాల గురించి చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు వాటితో కలిసి ఎలా జీవించాలో నేర్చుకున్నాం. ఈ రోజు మనమంతా చెప్పినట్లుగానే ఇది కొత్తగా ఏర్పడిన పరిస్థితే. అవసరమైన జాగ్రత్తలను తీసుకోవడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఆర్థిక వ్యవస్థతో పాటుగా మన ఆరోగ్యాలు కూడా కోలుకుంటున్నాయి.
కరోనా వైరస్ అనేది ఒక అంటు వ్యాధి మాత్రమే కాదు. ఇది కేవలం మన ఆరోగ్యాలను పాడు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక అస్థిరత వంటి అనేక సమస్యలను తీసుకువచ్చింది. దీనర్థం ఏమిటంటే వైరస్ మరియు ఇతర అనారోగ్యాల నుంచి కేవలం మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మాత్రమే కాదు మీరు ఆర్థికంగా సెక్యూర్‌గా ఉన్నారని కూడా నిర్దారించుకోండి.
అందుకే నేటి రోజుల్లో మీరు మునుపెన్నడూ లేని విధంగా ప్రతి సారి చేతులు కడుక్కుంటున్నారు. ఇది ఎంత అవసరమో COVID-19కు హెల్త్ ఇన్సూరెన్స్ health insurance తీసుకోవడం కూడా అంత కంటే ఎక్కువ అవసరం. కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను మేనేజ్ చేయడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా కరోనా సోకినా సందర్భంలో మీరు ఎటువంటి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కోకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
COVID-19ను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు నేడు మార్కెట్లో మనకు అనేకం లభ్యం అవుతున్నాయి. కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు కరోనా వైరస్‌తో పాటుగా అన్ని రకాల అనారోగ్యాలను కవర్ చేసేందుకు కస్టమైజ్ (మనకు కావాల్సిన విధంగా రూపొందించుకోవడం) చేయబడ్డాయి. కరోనా కవచ్ కవర్ వంటి కొన్ని ప్లాన్లు మాత్రం కేవలం కరోనా వైరస్‌కు సంబంధించిన చికిత్సల కోసమే రూపొందించబడ్డాయి.
మీ ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక అవసరాలను బట్టి మీరు కింది వాటిలో ప్రతి దానిని గురించి మరింత తెలుసుకుని మీ అవసరాలకు ఏది సరిగ్గా సరిపోతుందో అంచనా వేసి తగిన విధంగా నిర్ణయం తీసుకోవచ్చు.
డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్న గొప్పతనం ఏమిటి?
సులభమైన ఆన్లైన్ ప్రక్రియలు - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్‌లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.
ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.
SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్‌గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.
మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్‌లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్మెంట్ ఎంచుకోండి.
వెల్నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్‌లో ప్రత్యేకమైన వెల్నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits
మా హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ అవుతుంది?
కవరేజెస్
డబుల్ వాలెట్ ప్లాన్
ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్
వరల్డ్‌వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్
ముఖ్యమైన ఫీచర్లు
అన్ని రకాల ఆసుపత్రి చికిత్సల కొరకు - యాక్సిడెంట్ల వలన లేదా అనారోగ్యం, లేదా తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ వలన ఆసుపత్రిలో చేరితే..
అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు
ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్
ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.
వెల్నెస్ ప్రోగ్రాం
హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్లు, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్‌లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.
సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్
మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్‌గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.
క్యుములేటివ్ బోనస్
Digit Special
పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్‌లో అదనపు మొత్తాన్ని బోనస్‌గా పొందుతారు.
రూం రెంట్ క్యాపింగ్
వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్‌లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.
డే కేర్ ప్రొసీజర్స్
24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.
వరల్డ్‌వైడ్ కవరేజ్
Digit Special
వరల్డ్‌వైడ్ కవరేజ్‌తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.
హెల్త్ చెకప్
మీ హెల్త్ చెకప్స్ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్‌ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలించండి.
అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు
మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.
ఏజ్ /జోన్ మీద ఆధారపడి కో పేమెంట్
Digit Special
కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్‌లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.
రోడ్ అంబులెన్స్ ఖర్చులు
మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.
ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్
ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం
ఇతర ప్రయోజనాలు
ముందే నిర్దారణ అయిన వ్యాధికి(PED) వెయిటింగ్ పీరియడ్
మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
నిర్దిష్ట అనారోగ్యం కొరకు వెయిటింగ్ పీరియడ్
నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్లోని స్టాండర్డ్ ఎక్స్‌క్లూజన్స్ (Excl02) చూడండి.
ఇన్‌బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్
పాలసీ పీరియడ్ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.
అవయవ దాత ఖర్చులు
Digit Special
మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్
ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.
బారియాట్రిక్ సర్జరీ
ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.
మానసిక అనారోగ్యం
గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్‌తో సమానంగా ఉంటుంది.
కన్స్యూమబుల్స్ కవర్
ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్‌ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.
ఏమేం కవర్ కావు?
ఆస్పత్రిలో చేరక ముందు అయ్యే ప్రీ–నేటల్, పోస్ట్–నేటల్ మెడికల్ ఖర్చులు కవర్ కావు.
ఒకవేళ మీకు ముందు నుంచే ఉన్న వ్యాధులు ఏవైనా ఉంటే వాటి వెయిటింగ్ పీరియడ్ ముగిసేవరకు మీరు క్లెయిమ్ చేయలేరు.
మీరు ఆస్పత్రిలో చేరిన కారణానికి డాక్టర్ సిఫారసుకు మ్యాచ్ కాకపోతే అది పాలసీ క్లెయిమ్‌లో కవర్ కాదు.
డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉండే ముఖ్య ప్రయోజనాలు
కో పేమెంట్ | లేదు |
---|---|
రూం రెంట్ క్యాపింగ్ | లేదు |
క్యాష్‌లెస్ హాస్పిటల్స్ | ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ |
ఇన్‌బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ | అవును |
వెల్నెస్ బెనిఫిట్స్ | 10 కంటే ఎక్కువ వెల్నెస్ పార్ట్నర్ల నుంచి లభ్యం |
సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్ | 10 శాతం వరకు డిస్కౌంట్ |
వరల్డ్‌వైడ్ కవరేజ్ | అవును* |
గుడ్ హెల్త్ డిస్కౌంట్ | 5% శాతం వరకు డిస్కౌంట్ |
కన్య్సూమబుల్ కవర్ | యాడ్ ఆన్‌గా అందుబాటులో ఉంది. |
*కేవలం వరల్డ్‌వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్‌లో మాత్రమే లభ్యమవుతాయి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
రీయింబర్స్మెంట్ క్లెయిములు – మీరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 నెంబర్‌పై మాకు ఫోన్ చేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్‌కు ఈమెయిల్ చేయండి. మేము మీకు సంబంధించిన ఆస్పత్రి బిల్లులను అప్లోడ్ చేసేందుకు ఒక లింకును పంపుతాం. ఈ డాక్యుమెంట్లతో మీ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది.
క్యాష్‌లెస్ క్లెయిములు – మీకు క్యాష్‌లెస్ క్లెయిమ్ కావాలంటే అందుకోసం మీరు మా నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మీ ఈ-హెల్త్ కార్డును ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో చూపిస్తే వారు మీకు క్యాష్‌లెస్ రిక్వెస్ట్ ఫామ్‌ను అందిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.
మీరు కనుక కరోనా వైరస్‌కు సంబంధించిన చికిత్స గురించి క్లెయిమ్ చేస్తే పాజిటివ్ టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును మీరు ఐసీఎంఆర్ (ICMR) ద్వారా గుర్తించబడిన అధీకృత సెంటర్ల ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది.
కోవిడ్-19 వల్ల ఆస్పత్రిపాలైతే క్లెయిములకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు
మీకు కరోనా వైరస్ కోవిడ్-19 ఉన్నట్లు గుర్తించబడితే ఎలా క్లెయిమ్ చేయాలి?
మీరు కరోనా వైరస్ పాజిటివ్ అని ఐసీఎంఆర్ (ICMR) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే వారి అధీకృత కేంద్రాల ద్వారా నిర్ధారించబడి, ఆస్పత్రిలో చేరితే మీరు వెంటనే డిజిట్‌కి 1800-258-4242కి కాల్ చేసి లేదంటే healthclaims@godigit.comకి మెయిల్ చేసి తెలియజేయండి. మీరు వయోవృద్ధులు అయితే seniors@godigit.comకి మెయిల్ చేయండి.
ప్రత్యేకంగా కరోనా వైరస్ క్లెయిమ్‌ల కోసం నేను ఎవరిని సంప్రదించాలి?
కరోనా వైరస్ సంబంధిత క్లెయిమ్‌ల కోసం మాకు ప్రత్యేక ఈమెయిల్ ఐడీ ఉంది: covidclaims@godigit.com.
అదనంగా మీరు మా ఎస్పీవోసీ (SPOC)ని సంప్రదించవచ్చు: డాక్టర్ ప్రకాష్. మీరు అతనికి A.Prakash@godigit.comకి మెయిల్ చేయవచ్చు లేదంటే 9986770084కు కాల్ చేయవచ్చు.
నేను కరోనా వైరస్ వ్యాధి కోవిడ్-19 కోసం క్యాష్ లెస్ క్లెయిమ్‌ల సౌకర్యాన్ని ఎలా పొందగలను?
క్యాష్ లెస్ సమాచారం కోసం డిజిట్ టోల్ ఫ్రీ నంబర్ (1800-258-4242)కి కాల్ చేయండి.
మేము అర్హతను వెరిఫై చేస్తాం (పాాజిటివ్ ఉంటే, ఆసుపత్రిలో చేరినట్లయితే), క్యాష్ లెస్ ప్రక్రియను సులభతరం చేస్తాము.
డిజిట్‌కు క్లెయిమ్‌ను తెలియజేసే సమయంలో అవసరమైన కొన్ని వివరాలు ఏమిటి?
- ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి పేరు
- పాలసీ నెంబర్
- రోగి పేరు
- ప్రపోజర్తో సంబంధం
- ఆస్పత్రి పేరు/ చిరునామా
- చేరిన & డిశ్చార్జ్ అయిన తేదీలు
- నిర్ధారణ, చికిత్స వివరాలు
- అంచనా/వాస్తవ ఖర్చు
- ఉద్యోగి ఐడీ నెంబర్ (వర్తిస్తే)
కరోనా వైరస్ (కోవిడ్-19) తో ఎవరైనా ఉన్నట్లు గుర్తిస్తే రీఎంబర్స్మెంట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?
- డిశ్చార్జ్ సమ్మరీ
- కన్సల్టేషన్ పేపర్లు
- కోవిడ్-19 పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ (ఐసీఎంఆర్ (ICMR) అధీకృత ల్యాబుల ద్వారా)
- ఇతర అన్ని రిపోర్టులు
- బ్యాంక్ వివరాలు: క్యాన్సిల్ చేసిన చెక్/ NEFT వివరాలు
- చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (పాన్ (PAN), ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ మొదలైనవి. ఇక్కడ ఆధార్ అంగీకరించరు)
- అన్ని ఒరిజినల్ బిల్లులు ( ఫైనల్ బిల్, బ్రేకప్, ఫార్మసీ, టెస్ట్ బిల్స్ మొదలైనవి)
మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, కరోనా వైరస్ చికిత్స కవర్ చేయబడుతుందా?
అవును, మీరు ఇప్పటికే డిజిట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, కరోనా వైరస్ చికిత్స అంటే ఆసుపత్రిలో చేరే ముందు, ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
నా స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కరోనా వైరస్ కవర్ చేయడానికి వెయిటింగ్ పీరియడ్ ఉందా?
లేదు, ప్రారంభంలో ఉండే 30-రోజుల వెయిటింగ్ పీరియడ్ తప్పితే ఏమీ ఉండదు (ప్రమాదవశాత్తూ ఆసుపత్రిలో చేరడం మినహా అన్నింటికీ ఇది ఉంది) కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేయడానికి అదనపు వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు.
కరోనా వైరస్ కవరేజీ కింద ప్రాణ నష్టం కవర్ అవుతుందా?
లేదు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కరోనా వైరస్‌ని కవర్ చేస్తుంది. కోవిడ్-19 చికిత్స కారణంగా అయ్యే ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే వర్తిస్తుంది.
గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు మీరు కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు పొందాలి?
మీకు తెలుసా? మీ అనిశ్చితి సమయంలో మీకు తోడుగా ఉండటానికి మేము ఉన్నాము! మీకు అనిశ్చితి తలెత్తితనప్పుడు మీరు ఒక విషయంలో మాత్రం నిశ్చింతగా ఉండవచ్చు. అదేంటంటే, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అండగా ఉంటుందనే విషయం.
ప్రస్తుత ఆర్థిక మందగమనంతో, మీరు మీ ఆర్థిక నిర్ణయాల విషయంలో గతంలో కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రస్తుత, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం మీరు చేయగలిగే ఉత్తమమైన పని కరోనా వైరస్, అన్ని ఇతర ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్!
తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఒక భాగం పన్ను ఆదా చేయడం! అదృష్టవశాత్తూ, తమకోసం, తమ తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేసే ఎవరైనా తాము చెల్లించిన వార్షిక ప్రీమియంపై పన్ను ఆదా కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెండు రకాలుగా కలిసి వచ్చే అంశం!
కరోనా వైరస్ కోసం కవర్ కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇతర వ్యాధులు, అనారోగ్యాల నుండి, వాటి వల్ల తలెత్తే ఆర్థిక సమస్యల్లో మీకు అండగా ఉంటుంది.
దురదృష్టకర పరిస్థితుల్లో ఎవరైనా మీ వెన్నుదన్నుగా ఉంటారని మీకు తెలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా అనిపిస్తుంది కదా? మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా- అవసరమైన సమయాల్లో మీకు వెన్నుదన్నుగా ఉండటానికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడవచ్చు.
మీరు మీ ఆరోగ్యం, సంపద గురించి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అయితే, మీరు దేనికీ క్లెయిమ్ చేయకపోయినా, క్యుములేటివ్ బోనస్ వంటి ప్రయోజనాల ద్వారా మీకు రివార్డ్ లభిస్తుందని మీకు తెలుసా? మీరు క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరం, మీ ఇన్సూరెన్స్ చేసిన మొత్తం డబ్బు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పెంచబడుతుంది!
కరోనా వైరస్ (కోవిడ్–19) కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు
కరోనా వైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్
నేడు చాలా స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కరోనా వైరస్ అనేది మహమ్మారి అయినా కూడా కవర్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు ఇదివరకే హెల్త్ ఇన్సూరెన్స్‌ని కలిగి ఉంటే అందులో కోవిడ్-19 కవర్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోండి.
ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోకపోతే మాత్రం ఇదే సరైన సమయం. కోవిడ్-19తో పాటు దీర్ఘకాలంలో మీ ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా మీరు పాలసీని ఎంచుకోవడానికి, నిర్ణయించడానికి తగిన సమయం.
కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్
కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి ప్రత్యేకమైన, అందుబాటులో ఉన్న పాకెట్ సైజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కరోనా కవచ్ పాలసీ. ఇది ప్రత్యేకంగా కరోనా చికిత్సకు సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది.
ఇది కేవలం ఒకసారి ప్రీమియంతో వస్తుంది. మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో ఏం కావాలనుకుంటాడో వాటిని అంటే ఆస్పత్రి ఖర్చులు, ఇంటి వద్ద చేసే చికిత్స, ఆయుష్ చికిత్సకు అయ్యే ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.
కరోనా రక్షక్ హెల్త్ ఇన్సూరెన్స్
కరోనా కవచ్ కూడా ప్రత్యేకంగా కరోనా వైరస్‌ను కవర్ చేయడానికి ఉద్దేశించిన పాకెట్ - సైజ్ హెల్త్ ఇన్సూరెన్స్. దీని కోసం కూడా ప్రీమియంను ఒకసారి మాత్రమే కడతారు.
అయితే క్యాష్ లెస్ చికిత్సను ఎంచుకోవడానికి లేదా ఖర్చులను రీయింబర్స్ చేయడానికి బదులుగా, కరోనా రక్షక్ అనేది ఒక ఏకమొత్తం అందించే కవర్. ఇందులో మీరు వైరస్ బారిన పడినట్లయితే ఇన్సూరెన్స్ చేసిన మొత్తాన్ని ఏకమొత్తంగా పొందుతారు.
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ – కరోనా వైరస్ కవర్
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని చిన్న, పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించాలని సలహా ఇవ్వబడుతోంది.
కానీ కొన్ని చిన్న బిజినెస్‌లు కాంప్రహెన్సివ్ హెల్త్ ప్లాన్లను కొనుగోలు చేయలేకపోవచ్చని మేము అర్థం చేసుకున్నాము. బదులుగా వారు తమ ఉద్యోగులను కరోనా వైరస్ నుండి కాపాడేలా, వారిని కవర్ చేయడానికి గ్రూప్ కరోనా వైరస్ కవర్‌ని ఎంచుకోవచ్చు.
కోవిడ్-19 కోసం డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, కరోనా చికిత్స కవర్ చేయబడుతుందా?
అవును, మీరు ఇప్పటికే డిజిట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, కరోనా వైరస్ చికిత్స అంటే ఆసుపత్రిలో చేరే ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాతి ఖర్చులు కవర్ చేయబడతాయి.
నా స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కరోనా వైరస్ కవర్ చేయడానికి వెయిటింగ్ పీరియడ్ ఉందా?
లేదు, ప్రారంభంలో 30-రోజుల వెయిటింగ్ పీరియడ్ (ప్రమాదవశాత్తూ ఆసుపత్రిలో చేరడం మినహా అన్నింటికీ ఇది ఉంది) కాకుండా, కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేయడానికి అదనపు వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు.
కరోనా వైరస్ కవరేజీ కింద ప్రాణ నష్టం కవర్ అవుతుందా?
లేదు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కరోనా వైరస్‌ని కవర్ చేస్తుంది. కోవిడ్-19 చికిత్స కారణంగా అయ్యే ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే వర్తిస్తుంది.
కరోనా వైరస్ వల్ల ఆస్పత్రిలో చేరినప్పుడు రూం రెంట్‌కు సంబంధించిన ఏమైనా పరిమితి ఉందా?
ఇది మీరు ఏ తరహా పాలసీని ఎంచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. డిజిట్ వారి కంఫర్ట్ ఆప్షన్లో రూం రెంట్ పై ఎలాంటి పరిమితి లేదు. అంటే మీరు మీకు నచ్చిన రూంని ఎంచుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో వచ్చే ఆదాయ నష్టం కరోనా వైరస్‌ను కవర్ చేస్తుందా?
లేదు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆదాయ నష్టాన్ని కవర్ చేయదు. అయినప్పటికీ, మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించబడే రోజువారీ డైలీ క్యాష్ బెనిఫిట్‌ను ఇది అందిస్తుంది.
కోవిడ్ ఇన్సూరెన్స్ పాలసీ, కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా?
కరోనా వైరస్ ఇన్సూరెన్స్ (కరోనా కవచ్, కరోనా రక్షక్ వంటి కోవిడ్ మాత్రమే పాలసీలు) | కరోనా వైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ (కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు) |
---|---|
సాధారణంగా కోవిడ్‌కు సంబంధించిన చికిత్స కోసం మాత్రమే ఖర్చులకై ఒక పాకెట్ సైజ్ ఇన్సూరెన్స్ పాలసీగా కరోనా వైరస్ కవర్ లేదా కరోనా వైరస్ ఇన్సూరెన్స్ అందించబడుతుంది. మీ ఇన్సూరెన్స్ కంపెనీపై ఆధారపడి, ఇది క్లెయిమ్‌ల సమయంలో చెల్లించిన మొత్తం కావచ్చు లేదా మీ హాస్పిటల్ బిల్లుల ఆధారంగా రీయింబర్స్‌మెంట్‌గా అందించబడుతుంది. | కరోనా వైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇతర అనారోగ్యాలు, వ్యాధులతో పాటు కరోనా వైరస్‌కు కూడా వర్తిస్తుంది. మీరు దాని కోసం ప్రత్యేక కవర్ లేదా పాలసీని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. |
కరోనా వైరస్ ఇన్సూరెన్స్ అనేది స్వల్పకాలిక పాలసీ. క్లెయిమ్ తర్వాత పాలసీ చెల్లుబాటు కాదు. | ఇన్సూరెన్స్ పాలసీ అనేది దీర్ఘకాలిక పాలసీ (మీరు 1 సంవత్సరం నుండి బహుళ-సంవత్సరాల ప్లాన్‌ల వరకు ఎంచుకోవచ్చు). మీ మొత్తం క్లెయిమ్‌లు మీ మొత్తం ఇన్సూరెన్స్ సొమ్ము కంటే ఎక్కువగా ఉండనంత వరకు, మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేయవచ్చు. |
కరోనా వైరస్ కోసం కవర్ కాకుండా, కరోనా వైరస్ ఇన్సూరెన్స్ యొక్క ఇతర అదనపు ప్రయోజనాలు లేవు. | కరోనా వైరస్ కోసం కవర్ కాకుండా, స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రసూతి, నవజాత శిశువుల కవర్, ఓపీడీ, డేకేర్ ప్రొసీజర్లు, ఇతరాలు కవర్ అవుతాయి. |
పన్ను ఆదా కోసం మీరు ఒకే కవర్‌ను ఉపయోగించలేరు. | సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 25,000 వరకు పన్ను ఆదా చేయడానికి అర్హత కలిగి ఉంటుంది. |
ఒక వ్యాధికి మాత్రమే నిర్దిష్టమైన కవరేజీ అయినందున కరోనా వైరస్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉండవచ్చు. | కరోనా వైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరకు సమానంగా ఉంటుంది. ప్రీమియం ఎక్కువగా మీ వయస్సు, ప్రాంతం, ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. |
కరోనా కవచ్, కరోనా రక్షక్ కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా?
కరోనా కవచ్ | కరోనా రక్షక్ | |
పాలసీ రకం | కరోనా కవచ్ అనేది కోవిడ్-ఇండెమ్నిటీ ప్లాన్. ఇది కోవిడ్-19 కోసం చికిత్స పొందుతున్నప్పుడు వారి ఆసుపత్రి బిల్లులను కవర్ చేయడానికి సహాయపడుతుంది. | కరోనా రక్షక్ అనేది కోవిడ్-బెనిఫిట్ పాలసీ. నిర్దిష్ట ఆసుపత్రి బిల్లులను కవర్ చేయడానికి బదులుగా ఒక ఏకమొత్త ప్రయోజనం అందించబడుతుంది. అంటే ఇన్సూరెన్స్ చేయబడినవారు వైరస్ కోసం చికిత్స చేయవలసి ఉన్నట్లయితే మొత్తం ఇన్సూరెన్స్ చేసిన మొత్తాన్ని అందుకుంటారు. |
ఇన్సూరెన్స్ చేసిన మొత్తం | కనిష్టంగా రూ. 50,000, గరిష్టంగా రూ. 5 లక్షల మధ్య ఎంచుకోవచ్చు. | కనిష్టంగా రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 2.5 లక్షల మధ్య ఎంచుకోవచ్చు. |
హాస్పిటలైజేషన్ నిబంధనలు | ఒకరు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నట్లయితే కరోనా కవచ్ కవర్ ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. | 72-గంటల కన్నా మించి ఆస్పత్రిలో చేరితే అలాంటి వారు కరోనా రక్షక్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. వారు మొత్తాన్ని ఒకేసారి పొందుతారు. |
అందుబాటులో ఉన్న ప్లాన్‌ల రకం | కరోనా కవచ్‌లో ఫ్యామిలీ ఫ్లోటర్, ఇండివిడ్యువల్ ప్లాన్ మధ్య ఎంచుకోవచ్చు. | కరోనా రక్షక్ కవర్‌లో మీరు ఇండివిడ్యువల్ ప్లాన్‌ను మాత్రమే ఎంచుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్‌కు అవకాశం లేదు. |
అదనపు ప్రయోజనాలు | కరోనా కవచ్ పాలసీలో, మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు ప్రతి రోజు కోసం మీ ఇన్సూరెన్స్ మొత్తంలో 0.5% పొందగలిగే రోజువారీ హాస్పిటల్ క్యాష్ కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు. | కరోనా రక్షక్ పాలసీలో అదనపు ప్రయోజనాలు లేదా కవర్లు ఏవీ అందుబాటులో లేవు. |
కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల గురించి తరచూ అడిగే ప్రశ్నలు
నాకు ఏ కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్తమం?
మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నారా లేదా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
నేను ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నప్పటికీ, మళ్లీ కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ కవర్‌ని పొందాలా?
మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, అది కోవిడ్-19ని కవర్ చేస్తుందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు మీ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్‌ని ఎంచుకోవచ్చు.
అయితే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికే కోవిడ్-19ని కవర్ చేసినప్పటికీ, మీకు ఇంకా అదనపు కవరేజ్ కావాలంటే, మీరు కరోనా రక్షక్ వంటి ఏకమొత్త ప్రయోజనాన్ని పొందవచ్చు.
కరోనా కవచ్ పాలసీ కోసం వెయిటింగ్ పీరియడ్ ఎంత?
కరోనా కవచ్ పాలసీ కోసం 15 రోజుల ప్రారంభ వెయిటింగ్ పీరియడ్ ఉంది.
కరోనా రక్షక్ పాలసీ కోసం వెయిటింగ్ పీరియడ్ ఎంత?
కరోనా రక్షక్ పాలసీ కోసం వెయిటింగ్ పీరియడ్ మీరు మీ పాలసీని కొనుగోలు చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు ఉంటుంది.
నిర్దిష్ట జబ్బు కోసం తీసుకునే కవర్‌కు వెయిటింగ్ పీరియడ్ ఎంత?
పాలసీదారులు ఇల్నెస్ స్పెసిఫిక్ కవర్ (నిర్దిష్ట జబ్బు కోసం తీసుకునే కవర్) నుంచి ప్రయోజనం పొందేందుకు కేవలం 15 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
కరోనా కవచ్, కరోనా రక్షక్ భారతదేశం వెలుపల ఆసుపత్రిలో చేరడాన్ని కూడా కవర్ చేస్తాయా?
లేదు, ప్రస్తుతం ఈ పాలసీలు భారతదేశంలోని ఆసుపత్రి, చికిత్స ఖర్చులను మాత్రమే కవర్ చేస్తాయి.
క్వారంటైన్ ఖర్చులు కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ కవర్‌లో కవర్ చేయబడతాయా?
లేదు, కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్‌లో క్వారంటైన్ ఖర్చులు కవర్ చేయబడవు. కోవిడ్-19 చికిత్స కోసం అయ్యే ఆసుపత్రి ఖర్చులు మాత్రమే కవర్ చేయబడతాయి.
ఆదాయ నష్టం కరోనా రక్షక్ లేదా కరోనా కవచ్‌లో కవర్ చేయబడుతుందా?
లేదు, కరోనా రక్షక్ లేదా కరోనా కవచ్ రెండింటిలోనూ ఆదాయ నష్టం కవర్ చేయబడదు. అయితే కరోనా రక్షక్ పాలసీ ఏకమొత్త-బెనిఫిట్ పాలసీ అయినందున (మీరు 72 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉంటే, మీరు పూర్తి ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందుకుంటారు), ఇది ఆసుపత్రిలో చేరడానికి ముందు, తర్వాత కూడా ఖర్చులను కవర్ చేసే అవకాశం ఉంది.
ఓపీడీ (OPD) కరోనా రక్షక్ లేదా కరోనా కవచ్‌లో కవర్ చేయబడిందా?
లేదు, ఓపీడీ ఈ కవర్‌ల కింద కవర్ చేయబడదు. కరోనా రక్షక్, కరోనా కవచ్ ఆసుపత్రి ఖర్చుల కోసం మాత్రమే కవర్ చేస్తాయి. అయితే, ఓపీడీ మీ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడి, కరోనా వైరస్‌ను కవర్ చేస్తుంది.
ఓపీడీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి
హోమ్‌కేర్ చికిత్స కరోనా రక్షక్ లేదా కరోనా కవచ్ కింద కవర్ చేయబడిందా?
హోమ్‌కేర్ చికిత్స కరోనా కవచ్‌లో కవర్ చేయబడింది. అయితే మీ వైద్యుడు హోమ్‌కేర్ చికిత్సను సిఫారసు చేసినట్లయితే, ప్రభుత్వం ఆమోదించిన పద్ధతులు అమలులో ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
రోడ్ అంబులెన్స్ ఛార్జీలు కరోనా కవచ్‌లో కవర్ చేయబడతాయా?
అవును, రోడ్ అంబులెన్స్ ఛార్జీలు కరోనా కవచ్ పాలసీ కింద కవర్ చేయబడతాయి.
కరోనా కవచ్‌లో ఏవైనా యాడ్-ఆన్ కవర్లు అందుబాటులో ఉన్నాయా?
అవును, కరోనా కవచ్ పాలసీలో ఒక యాడ్-ఆన్ అందుబాటులో ఉంది. అది డైలీ హాస్పిటల్ క్యాష్.
కరోనా రక్షక్‌లో ఏవైనా యాడ్-ఆన్ కవర్లు అందుబాటులో ఉన్నాయా?
లేదు, కరోనా రక్షక్ పాలసీలో యాడ్-ఆన్‌లు ఏవీ చేర్చబడలేదు.
కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
కరోనా వైరస్ అంటే ఏమిటి?
2020లో సంచలన పదం.. కరోనా వైరస్! కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) అనేది కొత్తగా కనుగొనబడిన కరోనా వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ముక్కు నుండి లేదా లాలాజలం లేదా ఇతర స్రావాల ద్వారా వ్యాపిస్తుంది.
కోవిడ్-19 సోకిన చాలా మంది వ్యక్తులు తేలికపాటి నుండి పరిమితమైన లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులను మాత్రమే అనుభవిస్తారు. ప్రత్యేక చికిత్స లేకుండానే కోలుకుంటారు.
అయినప్పటికీ, వృద్ధులు లేదా ఇతర ఇబ్బందికర స్థితిలో ఉన్నవారు తీవ్రమైన అనారోగ్యాలను ఎదుర్కొంటున్న వారు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
కోవిడ్-19 లక్షణాలు
- అత్యంత సాధారణ లక్షణాలు - జ్వరం, పొడి దగ్గు, అలసట/ఆయాసం
- తక్కువ సాధారణ లక్షణాలు - గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, కండ్లకలక, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కాళ్లు లేదా వేళ్ల రంగు మారడం
- తీవ్రమైన లక్షణాలు - శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం, ఛాతి నొప్పి/ఒత్తిడి, మాట్లాడటం లేదా కదలిక కోల్పోవడం
గమనిక:
- మీకు తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉండండి. మీ వైద్యుడిని లేదా ఆరోగ్య సౌకర్యాన్ని సందర్శించే ముందు ఎల్లప్పుడూ కాల్ చేయండి.
- ఆరోగ్యంగా ఉండి తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లో వారు చికిత్స చేసుకోవచ్చు.
- వైరస్ సోకినప్పటి నుండి లక్షణాలు కనిపించడానికి ఎవరికైనా సగటున 5-6 రోజులు పడుతుంది. అయితే, కొంతమందికి 14 రోజులు కూడా పట్టవచ్చు.
(మూలం: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO))
నివారణ, చికిత్స
ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు ప్రత్యేకమైన నివారణ లేదా చికిత్స అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ, చాలా లక్షణాలకు చికిత్స చేయవచ్చు. రోగి యొక్క క్లినికల్ పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించబడుతుంది.
శుభవార్త ఏమిటంటే, చాలా మంది ప్రజలు కరోనా వైరస్ నుండి కోలుకుంటారు. కొన్నిసార్లు యువకులు, ఆరోగ్యకరమైన వ్యక్తులు తేలికపాటి లక్షణాలను మాత్రమే ఎదుర్కొంటారు. వైరస్ దాని కోర్సును అమలు చేసి వారి శరీరం నుండి తొలగించబడిన తర్వాత వారు స్వంతంగా కోలుకుంటారు.
మరణాల రేటు, రికవరీ రేటు
కోవిడ్-19 వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ఎలా ఉన్నా, మరణాల రేటు అతి తక్కువగా ఉండటం, కొన్ని దేశాల్లో తగ్గుదల కనిపించడం ఆశాజనకంగా ఉంది.
ప్రపంచంలోని సగటు మరణాల రేటు ప్రస్తుతం 5.96% గా ఉంది. అయితే, భారత్ యొక్క ప్రస్తుత మరణాల రేటు 2.8%, రికవరీ రేటు 48% (జూన్ 5, 2020 నాటికి).
జాగ్రత్తలు
- మీ చేతులను తరచుగా సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోండి.
- మీరు దగ్గుతున్నప్పుడు లేదా తుమ్మినప్పుడు టిష్యూతో కప్పుకోండి. ఆపై దానిని చెత్తబుట్టలో వేయండి. మీ వద్ద టిష్యూ లేకుంటే, మీ చేయి లేదా లోపలి మోచేయిని వంచి ఉపయోగించండి.
- మీరు బయట ఉన్నప్పుడు లేదా మీ పని ప్రదేశంలో ఉన్నప్పుడు సామాజిక దూరాన్ని పాటించండి. జనాల మధ్య ఉన్నప్పుడు మాస్కును ధరించేలా చూసుకోండి.
- మీ కళ్ళు, ముక్కు, నోటిని తాకడం మానుకోండి.
- బయటి నుండి వచ్చే ప్రతీ దానిని శానిటైజ్ చేయండి. లేదంటే శానిటైజింగ్ వైపర్స్ వాడండి. లేకపోతే బట్ట, శానిటైజర్‌ను ఉపయోగించి శానిటైజింగ్ చేయండి.
- ఇప్పుడు లాక్‌డౌన్ సడలించినప్పటికీ, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి, నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లడం ఉత్తమం. మీరు ఇంట్లో ఉండి క్వారెంటైన్ గైడ్ లేదా విషయాల కోసం చూస్తున్నారా, మా గైడ్‌ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మా ఇన్-హౌజ్ ఔచ్ పొటాటోతో కాస్త వినోదాత్మక, విషయాత్మక కంటెంట్‌ని ఫాలో అవ్వండి.
క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్, సామాజిక దూరం మధ్య తేడా ఏమిటి?
మీరు బహుశా ఈ పదాలన్నింటినీ కొంచెం వింటూ ఉంటారు. వీటన్నింటి మధ్య తేడా ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, వాటిని బాగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ క్విక్ ఓవర్వ్యూ ఉంది.
క్వారెంటైన్ | సెల్ఫ్-ఐసోలేషన్ | సామాజిక దూరం |
క్వారంటైన్ అనేది మీరు ఏకాంతంగా ఉండాల్సిన, పరిశీలనలో ఉంచాల్సిన సమయాన్ని సూచిస్తుంది - ఇది ఇంట్లో లేదా మీ ప్రభుత్వ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ అందించిన కోవిడ్ సౌకర్యం వద్ద చేయవచ్చు. ఇటీవల ప్రయాణించిన, కోవిడ్ పాజిటివ్ రోగితో ఏదో ఒక రూపంలో సంప్రదింపులు జరిపిన లేదా వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తులు సాధారణంగా కనీసం 14 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉంచబడతారు. | సెల్ఫ్-ఐసోలేషన్ అనేది మీరు ఇటీవల ప్రయాణించినట్లయితే లేదా ఏ సమయంలోనైనా వైరస్ బారిన పడినట్లు అనుమానం ఉన్నట్లయితే మీరు తీసుకోవలసిన స్వచ్ఛంద రక్షణ చర్య. దీని అర్థం మీరు ఇంట్లో, బయట ఇతరుల నుండి మిమ్మల్ని మీరు వేరుచేసుకోవడం. తద్వారా మీరు వైరస్ వ్యాప్తికర్తగా ఉండటానికి కనీసం అవకాశం కూడా ఉండదు. | సామాజిక దూరం అనేది మనం మన ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పుడల్లా మనమందరం తప్పనిసరిగా తీసుకోవలసిన నివారణ చర్య. దీని అర్థం వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్ భౌతిక దూరం ఉంచడం, మీరు ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండే సంఖ్యను తగ్గించడం |
కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి తరచూ అడిగే ప్రశ్నలు
బయట ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరా?
అవును, చాలా దేశాల్లో ఇది కొత్త కట్టుబాటు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే మాస్క్ బిందువుల (సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మొదలైనవి) వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఎంత సమయం పడుతుంది?
నిజం చెప్పాలంటే, దీనికి నిర్దిష్టంగా ఎంత కాలం అనేది తెలియదు. టీకాలు సాధారణంగా పూర్తిగా అభివృద్ధి చెందడానికి చాలా సమయం పడుతుంది. చాలా మంది పరిశోధకులు పరీక్షలపై పని చేస్తుండగా, టీకాలు వేయడానికి కనీసం 12 నుండి 18 నెలల వరకు సమయం పట్టవచ్చని నిపుణులు చెప్పారు.
అత్యవసర వ్యాపారాలు అంటే ఏమిటి?
మీరు లాక్‌డౌన్‌లో అత్యవసర వ్యాపారాలు, సేవల గురించి చాలా విన్నారు. మందులు, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవలు, మెయిల్, డెలివరీ సేవలు, నిత్యావసర దుకాణాలు, పౌల్ట్రీ దుకాణాలు, మొదలైనవి రోజు కార్యకలాపాలకు ప్రాథమికంగా అవసరమయ్యేవి. వీటిని ప్రపంచవ్యాప్తంగా అత్యవసర వ్యాపారాలుగా వ్యవహరిస్తున్నారు.
అత్యవసర వ్యాపారాల కిందకు రాని వాటిలో ప్రధానంగా మాల్స్, జిమ్‌లు, సినిమా హాల్స్, రిటైల్ దుకాణాలు ఉంటాయి. పరిస్థితి చక్కబడే వరకు ఇవి మూసి ఉంటాయి. ( ప్రతి రాష్ట్రం నిబంధనలు, పరిమితులపై ఆధారపడి ఉంటుంది)
భారతదేశంలో కరోనా వైరస్ కోసం ఎలా పరీక్షలు చేయించుకోవాలి?
ఇటీవల కోవిడ్-19 సోకిన వారితో కలిపి ప్రయాణించిన/ వారితో కాంటాక్ట్ అయిన వారు/ అత్యవసర విభాగాల్లో పనిచేసే వారు లేదా ఆరోగ్య కార్యకర్తలు కూడా/లేదా కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారు పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హెల్త్ ప్రొవైడర్లు కూడా పరీక్షలు చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న కొన్ని టెస్టింగ్ ల్యాబుల జాబితా ఇక్కడ ఉంది. రిస్క్ స్కేల్లో మీరు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా తెలియకపోతే, మీరు మా కరోనా వైరస్ సింప్టమ్ చెకర్ తో చెక్ చేసుకోవచ్చు.
కరోనా వైరస్ కు సంబంధించి హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి?
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక జనాభా ఒక అంటు వ్యాధికి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నప్పుడు, అది రోగ నిరోధక శక్తి లేని వారికి పరోక్ష రక్షణను అందిస్తుంది.
ఇది సాధారణంగా వ్యాక్సిన్‌ని కలిగి ఉన్నప్పుడు చాలా మంది జనాభాలో రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి, వ్యాప్తిని ఆపడానికి సహాయపడుతుంది.
నేను గర్భవతిని, ఆసుపత్రి/క్లినిక్‌కి నా రెగ్యులర్ చెక్-అప్‌ల కోసం బయటకు వెళ్లడం సురక్షితమేనా?
ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి ఇది మీకు ఒత్తిడితో కూడుకున్న సమయం అని మేము అర్థం చేసుకున్నాము. ఒకవేళ మీ OBGYN ఆఫర్ చేస్తే వర్చువల్ విజిట్స్‌కు వెళ్లడం ఉత్తమం.
అయినప్పటికీ, కొన్ని చెక్-అప్‌లకు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్‌లు వంటి వాటికి వ్యక్తిగత సంరక్షణ అవసరం. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు వాటి కోసం వెళ్లవచ్చు.
మా నగరంలో చాలా వరకు చాలా సంస్థలు తెరుచుకున్నాయి. నేను బయటకు వెళ్లడం సరైనదేనా?
ఆర్థిక మందగమనం కారణంగా చాలా నగరాలు ఇప్పుడు తెరుచుకున్నప్పటికీ, ఇప్పటికీ బయటికి వెళ్లడానికి సిఫారసు చేయబడలేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లోనే ఉండి, అవసరమైన వాటి కోసం మాత్రమే బయటకు వెళ్లడం ఉత్తమం.
నేను వైద్యుడిని సందర్శించవలసి వస్తే ఏమి చేయాలి?
టెలిమెడిసిన్ ఇప్పుడు భారతదేశంలో చట్టబద్ధమైనది. చాలా మంది వైద్యులు తమ సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ముందుగా వర్చువల్ కన్సల్టేషన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అవసరమైతే, మీ వైద్యుడు సూచించినట్లయితే, మీరు ఫిజికల్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు.
క్లాత్ ఫేస్ మాస్క్‌లు ఉపయోగించడం సురక్షితమేనా?
చాలా బ్రాండ్‌లు ఇప్పుడు తమ సొంత క్లాత్ ఆధారిత ఫేస్ మాస్క్‌లతో వస్తున్నాయి. అవును, దీనిని ఉపయోగించడం పూర్తిగా సురక్షితమైనదే. అయితే, దయచేసి ఉపయోగించే ముందు, తర్వాత మీ చేతులను కడుక్కోండి. మీరు బయటి నుండి తిరిగి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
కరోనా వైరస్‌లో అసింప్టమేటిక్ అంటే ఏమిటి?
మీరు అసింప్టమేటిక్ పదాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వినే ఉంటారు. అసింప్టమేటిక్ అనేది ఎటువంటి లక్షణాలు లేకుండా, ఆరోగ్యంగా కనిపించే, వైరస్ వ్యాప్తి కారకుడిగా ఉండే వ్యక్తిని సూచిస్తుంది.