డిజిట్ హెల్త్ ఇన్సురంచె ఆన్లైన్

డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి. 3 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు నమ్ముతున్నారు

ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా

మీ వద్ద ఉన్న అత్యంత విలువైన ఆస్తుల్లో మీ ఆరోగ్యం ఒకటి. అందుకోసమే దానికి ఎటువంటి హాని కలగకుండా మీరు తగు చర్యలను తీసుకోవాలి. అయినప్పటికీ అనారోగ్యాలు లేదా ప్రమాదాలు అనేవి చాలా సాధారణం. ఇవి మిమ్మల్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీ రూమ్‌కు పంపొచ్చు.

ఇండియాలో హెల్త్ కేర్ కి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు మరియు వైద్య ఖర్చులు వల్ల, అలాంటిది అనుకోకుండా ఆస్పత్రికి గనుక వెళితే మీ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది.

అదృష్టవశాత్తూ, మెడికల్ ఇన్సూరెన్స్ తో తమ హెల్త్ ని సురక్షితం చేసుకున్న వ్యక్తులు అలాంటి అనుకొని ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆస్పత్రి ఖర్చులతో పాటు ట్రీట్మెంట్ చేసుకునేందుకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. కొన్ని పరిస్థితులలో, మెడికల్ కేర్ కోసం పాలసీదారులు నెట్‌వర్క్ హాస్పిటల్స్ మరియు క్లినిక్స్‌కు వెళ్లినపుడు వారి జేబు నుంచి డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల వలన ఆస్పత్రిలో చేరే ముందు మరియు డిశ్చార్జి తర్వాత అయిన ఖర్చులు కవర్ అవ్వడం, డే కేర్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ మరియు ఆకర్షణీయమైన వార్షిక పన్ను లాభాలు వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా

కంపెనీ పేరు స్థాపించిన సంవత్సరం ప్రధాన కార్యాలయం ఉన్న నగరం
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 1906 కోల్‌కతా
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. 2016 బెంగళూరు
బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2001 పూనే
చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2001 చెన్నై
భారతీ అక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2008 ముంబై
హెచ్డిఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ 2002 ముంబై
ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2007 ముంబై
ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ 1919 ముంబై
ఇఫికో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2000 గురుగ్రామ్
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2000 ముంబై
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2001 చెన్నై
ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 1947 న్యూ ఢిల్లీ
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2001 ముంబై
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ 2009 ముంబై
ఆకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. 2016 ముంబై
నవీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. 2016 ముంబై
జునో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. (పాతరోజుల్లో ఎడెల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ అని పిలిచేవారు) 2016 ముంబై
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2001 ముంబై
కొటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2015 ముంబై
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. 2013 ముంబై
మాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2009 కోల్‌కతా
రహేజా క్యుబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2007 ముంబై
రహేజా క్యుబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. 2007 ముంబై
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2006 జైపూర్
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. 1938 చెన్నై
మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. 2014 ముంబై
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2015 ముంబై
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2006 చెన్నై
మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. 2008 న్యూ ఢిల్లీ
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. 2012 గురుగ్రామ్
యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్. 2007 ముంబై

ఇప్పుడు మీరు ఇండియాలోని ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా చూశారు. ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్, ఇన్సూరెన్స్ బ్రోకర్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఇన్సూరెన్స్ కంపెనీ Vs ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్ Vs ఇన్సూరెన్స్ బ్రోకర్స్

ఇన్సూరెన్స్ కంపెనీలు, అగ్రిగేటర్లు మరియు బ్రోకర్ల మధ్య తేడాలు

ఇన్సూరెన్స్ కంపెనీ అగ్రిగేటర్స్ బ్రోకర్స్
ఇన్సూరెన్స్ కంపెనీలనేవి ఇన్సూరెన్స్ ప్రొడక్టులను క్రియేట్ చేసి వాటిని కస్టమర్లకు విక్రయించే బాధ్యతను కలిగి ఉంటాయి. అగ్రిగేటర్స్ థర్డ్ పార్టీకి చెందినవి. తమకు సరిగ్గా సరిపోయే ప్లాన్ ఏదో కస్టమర్స్ కంపేర్ చేసుకునేందుకు ఇవి అవసరమైన డేటాను మరియు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ ఆప్షన్లను అందిస్తాయి. బ్రోకర్లు ఇన్సూరెన్స్ సంస్థలకు మరియు కొనుగోలు చేసే కస్టమర్లకు మధ్యవర్తిత్వం వహిస్తారు.
పాత్ర - కస్టమర్ల కోసం వివిధ రకాల ఇన్సూరెన్స్ ఉత్పత్తులను క్రియేట్ చేస్తాయి. మరియు వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అవసరం అయినపుడు ఆర్థిక సాయాన్ని అందిస్తాయి. పాత్ర-వివిధ రకాల ప్లాన్లను పోల్చెందుకు సంభావ్యత ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు ఓ ప్లాట్ ఫాంను అందిస్తుంది. దీని వలన కస్టమర్లు తమకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పాత్ర- కమీషన్ సంపాదించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ తరపున కస్టమర్లకు ఇన్సూరెన్స్ ప్రొడక్టులను అమ్మడం లేదా మార్కెట్ చేయడం.
ఎవరి వద్దా ఉద్యోగం లేదు మార్కెట్లో ఉన్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిగేటర్‌లకు సంబంధం ఉండదు. బ్రోకర్లను ఎక్కువగా ఇన్సూరెన్స్ సంస్థలు నియమించుకుంటాయి. అలా కాకపోతే కమీషన్ ప్రోగ్రాం ద్వారా వారు కొన్ని కంపెనీల తరఫున పని చేయొచ్చు.
పాలసీదారులు క్లెయిమ్ చేసే సరైన క్లెయిమ్స్ ను సెటిల్ చేసే బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఉంటుంది. NA NA
పరిగణించేందుకు అనేక ఆప్షన్లు ఉండడం వలన మనకు సరిగ్గా సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్న దాని వలే అనిపిస్తుంది. మీరు కనుక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నట్లయితే మీరు కొన్ని నిర్దిష్ట విషయాలను గుర్తుంచుకోవాలి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు చెక్ చేయాల్సిన అంశాలు

మీరు కింది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీరు కొనుగోలు చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు తగినంత ఫైనాన్షియల్ కవరేజ్ అందిస్తుంది.

  • బ్రాండ్ యొక్క కీర్తి - మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కావున మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎన్నుకునే ముందు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో రేటింగ్స్ తనిఖీ చేయడం చాలా ముఖ్యం. కంపెనీలో ఇప్పటికే పాలసీలు తీసుకున్న వినియోగదారులు తమ అనుభవం గురించి, వారు ఎదుర్కొన్న సమస్యల గురించి చేసే నెగటివ్ కామెంట్స్ అస్సలే మిస్సవకండి.
  • ఐఆర్డిఏఐ ఆమోదం తప్పనిసరి - ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఇది ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల మీద నియంత్రణను కలిగి ఉంటుంది. దీనికింద నమోదైన కంపెనీలు తమ కార్యకలాపాల్లో పారదర్శకతను పాటిస్తూ దాని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. కాబట్టి మీకు లేదా మీ కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నపుడు ఐఆర్డిఏఐ ద్వారా ఆమోదం పొందిన కంపెనీల నుంచి పాలసీలు తీసుకోవడం మంచిది.
  • క్లెయిమ్ సెటిల్‌మెంట్ రికార్డును ట్రాక్ చేయండి - మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవసరం అయ్యే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసేందుకు మీకు చాలా తక్కువ సమయం ఉంటుంది. అటువంటి సమయంలో క్లెయిమ్ రిక్వెస్ట్‌ను త్వరగా ఆమోదించి, ఆర్థిక పరిహారాన్ని అందించే ఇన్సూరెన్స్ సంస్థలు అవసరం. ఇందువల్ల మీకు సంరక్షణ ఆలస్యం కాకుండా ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునే ముందు దాని క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను తనిఖీ చేయండి. కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ స్వీకరిస్తే ఎన్నింటిని సెటిల్ చేస్తుందనే విషయాల గురించి మీకు సరైన అవగాహన వస్తుంది. ఎక్కువ రేషియో ఉండాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
  • నెట్‌వర్క్ హాస్పిటల్స్ - పాలసీదారులు తాము పాలసీ తీసుకున్న కంపెనీ యొక్క నెట్‌వర్క్ ఆస్పత్రులలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఆర్థిక పరిహారాన్ని పొందేందుకు ఎటువంటి క్లెయిమ్‌ను ఫైల్ చేయాల్సిన అవసరం గానీ.. రీయింబర్స్‌మెంట్ ప్రొసీజర్ కానీ అవసరం ఉండదు. మెడికల్ బిల్స్ అనేవి డైరెక్ట్‌గా ఇన్సూరెన్స్ సంస్థ ఆస్పత్రి మధ్యే పరిష్కరించబడతాయి. ఎక్కువ సంఖ్యలో నెట్‌వర్క్ ఆస్పత్రులను కలిగి ఉన్న కంపెనీల కోసం చూడండి. అలా అయితే మీరు ఎల్లప్పుడూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
  • ఎటువంటి అడ్డంకులు లేని క్లెయిమ్ ప్రాసెస్ - క్లెయిమ్ ఫైలింగ్ (నమోదు చేయడం) అనేది సంక్లిష్టంగా ఉంటే అది ఎమర్జెన్సీ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వైద్యపరంగా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు ఆర్థిక సాయం చేసేందుకని మీరు పేజీల కొద్దీ రాత పనిని చేయలేరు. కాబట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు ప్రొవైడర్ ఎటువంటి అవాంతరాలు లేని క్లెయిమ్ విధానాన్ని అనుసరిస్తున్నారా? లేదా? అని చెక్ చేయండి. క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఎక్కువ సమయం తీసుకుంటూ గందరగోళానికి గురి చేసే విధంగా ఉండకూడదు.
  • హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు పరిగణించాల్సిన మరో విషయం ఆ ప్లాన్ కోసం మీరు ఎంత డబ్బు చెల్లిస్తున్నారని. కేవలం పాలసీ ధర తక్కువ ఉందని మాత్రం తీసుకోవద్దు. మీరు పెట్టిన డబ్బుకు ప్రయోజనం చేకూర్చే పాలసీ కోసం చూడండి. పాలసీలో చేర్చే మరియు తీసేసే యాడ్ ఆన్స్ ను దృష్టిలో పెట్టుకుని తేడాలు చూడండి. అలా చేయడం వలన మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు ఆర్థికంగా భరోసానిచ్చే ప్లాన్‌ను ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు ఎంచుకోవచ్చు.

పొటెన్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసే వ్యక్తికి ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే.. మీరు అటువంటి పాలసీను కొనుగోలు చేసేటప్పుడు నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే కొనుగోలు చేయండి.

మెడికల్ కేర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఏజెంట్ల ద్వారా వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయినప్పటికీ కంపెనీతో డైరెక్ట్‌గా పాలసీని తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం!

ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ను నేరుగా కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

బ్రోకర్లు మరియు ఇతర మార్గాల నుంచి కాకుండా డైరెక్ట్‌ గా కంపెనీ నుంచే హెల్త్ పాలసీని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • వివిధ ఆప్షన్ల నుంచి ఎంచుకోండి - బ్రోకర్లు లేదా ఏజెంట్లు ఎల్లప్పుడూ అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి మనకు చెప్పరు. వారు మీ ఆలోచనలను ఖరీదైన పాలసీల మీదే కేంద్రీకృతం చేస్తారు. ఎందుకంటే ఖరీదైన పాలసీల ద్వారా వారు ఎక్కువ కమీషన్ పొందుతారు. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేయడం వలన అటువంటి పరిమితులను తొలగించుకోవచ్చు.
  • మీ అవసరాలకు తగిన విధంగా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కస్టమైజ్ చేయడం - ఇన్సూరెన్స్ సంస్థలు తమ పాలసీదారులకు అనేక రకాల కస్టమైజేషన్ ఎంపికలను అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుని మీరు మీ అవసరాలకు తగిన విధంగా ఇన్సూరెన్స్ పాలసీని మార్చుకోవచ్చు. ఒక బ్రోకర్ మీకు పాలసీని విక్రయిస్తే.. మీరు బేసిక్ పాలసీకి స్టిక్ అయి పోతారు కాబట్టి కస్టమైజేషన్స్ గురించి ఆలోచించరు.
  • ఎటువంటి కమీషన్ ఉండదు - ఏజెంట్లు లేదా బ్రోకర్లు మీకు మరియు మీకు మెడికల్ కవరేజ్‌ను అందించే కంపెనీ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంటారు. మీరు అటువంటి బ్రోకర్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నపుడు మీరు మీ పాలసీ ప్రీమియం కింద అదనపు ఫీజును చెల్లించాల్సి వస్తుంది. ఆ ఫీజును ఏజెంట్ కమీషన్‌గా తీసుకుంటాడు. ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు నేరుగా డీల్ చేసుకునేటప్పుడు అటువంటి ఫీజులు అవసరం ఉండదు.
  • వివిధ రకాల ఉత్పత్తులను సరిపోల్చండి - మీరు మార్కెట్లో ఉన్న అన్ని పాలసీలను చూసే అవకాశం బ్రోకర్లు అరుదుగా ఇస్తారు. వారు అందించే ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయమని వారు మిమ్మల్ని తొందరపెడతారు. మీరు కనుక నేరుగా కంపెనీలను సంప్రదిస్తే అందుబాటులో ఉన్న ప్లాన్లను గురించి సరిపోల్చేందుకు మీకు సమయం లభిస్తుంది. పూర్తి అవగాహనతో తెలుసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పాలసీ డాక్యుమెంట్లపై సంతకం చేయాలి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జీవితం మరియు మరణం మధ్య వ్యత్యాసం. అందుకోసమే పాలసీకి సంబంధించిన నిర్ణయాలను తేలికగా తీసుకోకండి.

మీరు తీసుకునే పాలసీ ఏం కవర్ చేస్తుంది? మరియు ఏం కవర్ చేయదనే అన్ని షరతులు మరియు నిబంధనలను చదవండి. (పాలసీ డాక్యుమెంట్స్‌లో అన్ని నిబంధనలు ఉంటాయి) అలా చేయడం వల్ల దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలను పెంచుకోవడంలో సహాయపడుతుంది

తరచూ అడిగే ప్రశ్నలు

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసేందుకు సరైన సమయం ఏది?

హెల్త్ఇన్సూరెన్స్ పాలసీలు యువతకు చాలా చౌకగా ఉంటాయి. అదే విధంగా వయస్సు పెరిగే కొద్దీ ఇవి కాస్ట్లీ అవుతాయి. అందుకోసమే 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలలోపే ఒక పాలసీని తీసుకోవడం మంచిది. సరసమైన కవరేజీ ద్వారా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినపుడు కూడా మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందొచ్చు.

మెడికల్ కవరేజీని కొనుగోలు చేసేటపుడు పరిగణించాల్సిన కొన్ని విషయాలు ఏమిటి?

పేరు పొందిన ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్లప్పుడూ త్వరితగత క్లెయిమ్స్‌ను అందిస్తుంది. నాణ్యమైన వైద్య సంరక్షణను పొందేందుకు ఇది పాలసీదారులను అనుమతిస్తుంది. అదనంగా మీరు క్లెయిమ్ ఫిల్లింగ్ ప్రాసెస్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను మొబైల్ అప్లికేషన్స్ ద్వారా రెయిజ్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. మనం క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి డిజిటల్ ప్రక్రియలు ప్రక్రియను మరింత సులభం చేస్తాయి.

ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంచుకునే ముందు ఐఆర్డిఏఐ ఆమోదం ఎందుకు ముఖ్యం?

ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్ అభివృద్ధికి ఐఆర్డిఏఐ బాధ్యత వహిస్తుంది. ఐఆర్డిఏఐ ద్వారా రిజిస్టర్ అయిన కంపెనీలు ఐఆర్డిఏఐ మార్గదర్శకాల ప్రకారం పాలసీదారులకు ప్రయోజనాలు అందించాలి. ఇతర కంపెనీలు ఈ నిబంధనలకు కట్టుబడి ఉండవు. కావున కస్టమర్లు తర్వాత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని డైరెక్టుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకోవడం వల్ల ఎందుకు చౌకగా ఉంటుంది?

మీరు ఏజెంట్ నుంచి కొనుగోలు చేసినపుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అదే డైరెక్టుగా కంపెనీ నుంచి కొనుగోలు చేసినప్పుడు పాలసీ రేటు తగ్గుతుంది. ఎందుకంటే ఏజెంట్లు వినియోగదారులకు అమ్మే ప్రతి పాలసీపై కొంత కమీషన్‌ను వసూలు చేస్తారు.

ఈ అదనపు చార్జీ అనేది పాలసీదారులకు పెంచిన ప్రీమియం నుంచి వసూలు చేయబడుతుంది. మీరు కనుక నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్లయితే ఈ కమీషన్ అమౌంట్‌ను భరించాల్సిన అవసరం లేదు. తద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది.