Third-party premium has changed from 1st June. Renew now
ఇండియాలో కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు
మీరు కొనుగోలు చేసేందుకు మీకు నచ్చిన కార్ మోడల్‌ను ఎంపిక చేసిన వెంటనే మీరు దాని కోసం క్వాలిటీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెతకడం ప్రారంభించాలి. మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం.. కార్ల యజమానులందరూ తమ వెహికల్‌లకు చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి.
మీ వద్ద కనుక సరైన పాలసీ లేకపోతే మొదటి సారి రూ. 2000 ఫైన్ మరియు మీరు ఇదే నేరాన్ని రిపీట్ చేస్తే రూ. 4000 ఫైన్ పడుతుంది.
అదృష్టవశాత్తు ఇండియాలో అనేక కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అవి అనేక పాలసీలను అందిస్తున్నాయి. మీకు ఎంతో ఇష్టమైన వెహికల్‌కి ఆర్థిక రక్షణ కల్పించేందుకు మీకు అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. ప్రతి పాలసీ వేర్వేరు ప్రయోజనాలను అందిస్తుంది. వెరైటీ ఫీచర్లను కలిగి ఉండి, నిర్దిష్ట వినియోగదారుల విభాగానికి పరిమితం చేయబడింది.
ఇండియాలో ఉన్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితాను ఓ సారి పరిశీలించండి
ఇండియాలో ఉన్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా
కంపెనీ పేరు | స్థాపించిన సంవత్సరం | ప్రధాన కార్యాలయం ఉన్న నగరం |
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 1906 | కోల్‌కతా |
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ | 2016 | బెంగళూరు |
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2001 | పూనే |
చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2001 | చెన్నై |
భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2008 | ముంబై |
హెచ్డిఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2002 | ముంబై |
ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2007 | ముంబై |
ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 1919 | ముంబై |
ఇఫికో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2000 | గురుగ్రామ్ |
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2000 | ముంబై |
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2001 | చెన్నై |
ద ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 1947 | న్యూ ఢిల్లీ |
టాటా ఎఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2001 | ముంబై |
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2009 | ముంబై |
ఆకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ | 2016 | ముంబై |
నవీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ | 2016 | ముంబై |
జునో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పూర్వం ఎడెల్వెసిస్ జనరల్ ఇన్సూరెన్స్) | 2016 | ముంబై |
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2001 | ముంబై |
కొటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2015 | ముంబై |
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. | 2013 | ముంబై |
మాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2009 | కోల్‌కతా |
రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2007 | ముంబై |
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2006 | జైపూర్ |
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 1938 | చెన్నై |
యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ | 2007 | ముంబై |
ఇన్సూరెన్స్ కంపెనీ Vs ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్ Vs ఇన్సూరెన్స్ బ్రోకర్లు
ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు మరియు బ్రోకర్ల మధ్య తేడాలను అర్థం చేసుకోండి.
ఇన్సూరెన్స్ కంపెనీ | అగ్రిగేటర్స్ | బ్రోకర్స్ |
వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను వినియోగదారుల కోసం మార్కెటింగ్ చేసే సంస్థ | మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలను పోల్చగల థర్డ్ పార్టీ పోర్టల్. | ఇన్సూరెన్స్ కంపెనీ మరియు దాని వినియోగదారుల మధ్య థర్డ్ పార్టీగా వ్యవహరించే వ్యక్తులు. |
ఎవరి వద్దా ఉద్యోగం చేయరు | ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధం లేని థర్డ్ పార్టీ ద్వారా ఉద్యోగం | వ్యక్తిగత ఇన్సూరెన్స్ కంపెనీలు బ్రోకర్లను నియమించుకుంటాయి. |
పాత్ర- నాణ్యమైన ఇన్సూరెన్స్ పాలసీలు అందించేందుకు, ఇన్సూర్ చేయబడిన ఆస్తికి యాక్సిడెంట్ లేదా డ్యామేజ్ అయినపుడు పాలసీదారుడికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. | పాత్ర - జాబితాని సిద్దం చేసి, మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలను పోల్చిచూసేందుకు సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. | పాత్ర - బ్రోకర్లు తమను నియమించుకున్న కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయిస్తారు. |
అన్ని ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు లేదా కంపెనీల ద్వారా సెటిల్ చేయబడతాయి. | NA | NA |
కార్ ఇన్సూరెన్స్ కంపెనీలో చూడవలసిన అంశాలు
ఇన్సూరెన్స్ కంపెనీ మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అని అర్థం చేసుకునేందుకు కింది లక్షణాలను గమనించండి:
బ్రాండ్‌కు ఉన్న పేరు - ఇది కనుక్కోవడం నేడు సులభమయింది. ఇంటర్నెట్‌కు ధన్యవాదాలు. మీకు సందేహం ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఆన్‌లైన్‌లో వెతకొచ్చు. మరియు పబ్లిక్ రివ్యూ విభాగాన్ని చెక్ చేయొచ్చు. ఇప్పటికే పాలసీని తీసుకున్న పాలసీదారులు కంపెనీ అందిస్తున్న సేవల పట్ల సంతోషంగా ఉన్నారో లేదో ఇది మీకు తెలియజేస్తుంది.
ఐఆర్డిఏఐ ద్వారా ఆమోదించబడాలి - దేశంలో ఇన్సూరెన్స్ రంగం పర్యవేక్షణ మరియు అభివృద్ధి గురించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఐఆర్డిఏఐ బాధ్యత వహిస్తుంది. ఈ కేంద్ర సంస్థతో రిజిస్టర్ అయిన కంపెనీలు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో రూల్స్ పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిజిస్టర్ కంపెనీలో ఎటువంటి మోసపూరిత కార్యకలాపాలు ఉండవు కావున రిజిస్టర్ట్ కంపెనీని ఎంచుకోవాలి.
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు - ఒక వేళ మీ కారు యాక్సిడెంట్‌కు గురైనా కానీ దొంగతనం చేయబడినా కానీ ఆర్థిక భద్రత అనేది ముఖ్యమైనది, అందుకోసమే మీరు మీ కారు వార్షిక ప్రీమియంల మీద పెట్టుబడి పెట్టాలి. ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పోర్టల్‌లు వివిధ ఇన్సూరెన్స్ సంస్థల పాలసీల మధ్య ధరలను పోల్చేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. అలాంటి ఇన్సూరెన్స్ పాలసి సగటు ధర గురించి మీకు మంచి ఆలోచనను అందిస్తాయి.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో - జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది ఎమర్జెన్సీ సమయంలో మీకు కంపెనీ నుంచి ఎటువంటి సహాయం అందుతుందోనని తెలియజేస్తుంది. అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది పాలసీదారులు లేవనెత్తే క్లెయిమ్‌లలో ఎక్కువ భాగాన్ని కంపెనీ సెటిల్ చేస్తుందని సూచిస్తుంది. తక్కువ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మంచిదికాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నెట్‌వర్క్ గ్యారేజెస్ - ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపిక చేసిన గ్యారేజెస్ మరియు వర్క్ షాపుల్లో క్యాష్ లెస్ రిపేర్లకు అనుమతిస్తుంది. అటువంటి నెట్‌వర్క్ గ్యారేజెస్ అధిక సంఖ్యలో ఉంటే.. మీరు ఎల్లప్పుడూ దగ్గర్లోని దాన్ని ఉపయోగించుకోవచ్చునని నిర్దారిస్తుంది. క్యాష్ లెస్ రిపేర్ అవుట్‌లెట్స్ విషయానికి వస్తే ఎక్కువ ఆప్షన్స్ అందించే కంపెనీలను ఎంచుకోవాలని సిఫారసు చేయబడింది.
క్విక్‌గా పూర్తయ్యే మరియు ఎటువంటి ఇబ్బందులు లేని క్లెయిమ్ ప్రక్రియ - క్లెయిమ్ కోసం వెళ్లే ప్రతిసారి వస్తుందో? రాదోనని? ఊగిసలాటలో వెళ్లడం ఎవరికీ పెద్దగా ఇష్టం ఉండదు. అందువల్ల చూసినా లేదా చేసినా కానీ క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా ఉండే ఇన్సూరెన్స్ సంస్థను మీరు ఎంచుకోవాలి. డిజిటల్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఉన్న కంపెనీలు ప్రక్రియను సింపులైజ్ చేయడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి.
మీరు ఎంచుకున్న కార్ కంపెనీతో సంబంధం లేకుండా మరియు మీ కారు డీలర్ మీద ఆధారపడకుండా మీరు డైరెక్ట్‌గా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం.
ఎందుకు అడుగుతున్నావు?
డైరెక్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల నుంచి కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?
చాలా మంది వ్యక్తులు తమ కారు డీలర్ వద్దే కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తారు. అయితే అలా చేయడం వలన మీరు ఆర్థికంగా వెనకడుగు వేయవచ్చు. మీరు ఆ పాలసీ పూర్తి ప్రయోజనాలను అనుభవించలేకపోవచ్చు.
ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నేరుగా పాలసీని కొనుగోలు చేయడం ఎందుకు తెలివైందో ఇక్కడ ఉంది:
ఇన్సూరెన్స్ పాలసిలను కస్టమైజ్ చేసే సామర్థ్యం - కార్ డీలర్లు ప్రీ ప్యాకేజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయిస్తారు. ఇవి ఒక సెట్ ఆఫ్ లక్షణాలతో మాత్రమే వస్తాయి. దానివల్ల మీ అవసరాలకు అనుగుణంగా పాలసీని కస్టమైజ్ చేసే అవకాశం మీకు ఉండదు.
విభిన్న రకాల పాలసీల నుంచి ఎంపికలు - కార్ డీలర్లు కొన్ని రకాల కంపెనీలతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఉంటారు. వారికి సంబంధించిన పాలసీలు మాత్రమే విక్రయిస్తారు. మీరు ఒక వేళ డీలర్స్ వద్ద పాలసీలను కొనుగోలు చేసినపుడు మీకు కొన్ని కంపెనీల పాలసీలను కొనేందుకు మాత్రమే అనుమతించబడతారు. మార్కెట్లో ఉన్న అన్ని రకాల పాలసీలు చూసేందుకు మీరు అనుమతించబడరు.
ఎటువంటి అదనపు ప్రీమియం పేమెంట్స్ లేవు - కార్ డీలర్స్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కమిషన్ బేసెస్ మీద వర్క్ చేస్తారు. అటువంటి వారి నుంచి మీరు నిర్దిష్ట రేటుకు పాలసీని కొనుగోలు చేసినపుడు ఆ అమౌంట్‌లో కొంత భాగాన్ని డీలర్‌షిప్ తన జేబులో వేసుకుంటుంది. కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయడంతో మీరు ఎంచుకున్న పాలసీ వాస్తవ ధరను మాత్రమే చెల్లిస్తారు. అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
పోలిక మరియు పరిశోధన - వివిధ రకాల పాలసీలను పోల్చి చూడడం వలన మీకు ప్రయోజనం కలుగుతుంది. కానీ డీలర్స్ ఇలా పోల్చిచూడడాన్ని అనుమతించరు. పోలిక లేకుండా మీరు అత్యంత విలువైన ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పటికీ పొందలేరు.
అందువల్ల మీరు తీసుకోవాలని అనుకున్న ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను పోల్చి చూడాలి. మీరు ఒక పాలసీని ఎంచుకున్నపుడు కేవలం అందులోని సానుకూలాంశాలతో పాటు నెగటివ్స్ కూడా చూసేందుకు ఫైన్ ప్రింట్ అనేది సహాయపడుతుంది.
డిజిట్ కార్ ఇన్సూరెన్స్‌ను మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?
తరచూ అడిగే ప్రశ్నలు
ఇండియాలో ఏది బెస్ట్ కార్ ఇన్సూరెన్స్ కంపెనీ?
కార్ ఇన్సూరెన్స్ అవసరాలు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. అందువల్ల మీకు సరిపోయే పాలసీ ఇతరులకు సరిగ్గా సూటవుదు. బెస్ట్ ఇన్సూరర్ కోసం వెతికే బదులు మీరు గుడ్ హిస్టరీ, రెపుటేషన్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, క్యాష్‌లెస్ నెట్ వర్క్ ఉన్న కంపెనీల గురించి వెతకాలి.
కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా ప్రొవైడర్‌ను ఎంచుకున్నపుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ప్రాముఖ్యత ఏమిటి?
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది ఇన్సూరెన్స్ కంపెనీ స్వీకరించే మొత్తం క్లెయిమ్స్‌ను మరియు అందులో సెటిల్ చేసే క్లెయిమ్స్ సంఖ్యను సూచిస్తుంది. హయ్యర్ రేషియోస్ అనేవి ఇన్సూరర్ ఎక్కువ నిజమైన క్లెయిమ్స్‌ను సెటిల్ చేస్తాడని సూచిస్తాయి అదేవిధంగా తక్కువ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫిగర్ అనేది క్లెయిమ్స్ పాస్ కావడం చాలా కష్టమని సూచిస్తుంది. ఇది క్లెయిమ్ ప్రాసెస్ కఠినంగా ఉందని తెలుపుతుంది.
ఐఆర్డిఏఐ వద్ద రిజిస్టర్ కాని కంపెనీ నుంచి కార్ ఇన్సూరెన్స్ పొందడం వల్ల కలిగే నష్టం ఏమిటి?
ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే పాలసీలు మరియు రంగం అభివృద్ధిని చూసుకుంటుంది. ఈ ప్రభుత్వ సంస్థతో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా సేవలందించే ఏ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అయినా కానీ దాని సొంత మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాడు. అటువంటి కంపెనీ ప్రతిఫలంగా తగినంత ఆర్థిక కవరేజీ అందించకుండా మీ డబ్బుతో మోసం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు చేస్తుండవచ్చు. కావున ఐఆర్డిఏఐ ద్వారా రిజిస్టర్ అయిన అధీకృత కార్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద మాత్రమే పాలసీలు తీసుకోవాలి.
ఇన్సూరెన్స్‌ను డీలర్ వద్ద కొనుగోలు చేసినప్పుడు ఎందుకు ఖరీదైనదిగా ఉంటుంది?
డీలర్స్ ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ మీద కొంత కమీషన్ అమౌంట్ తీసుకుంటారు. కార్ డీలర్ వద్ద ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు అటువంటి పాలసీ కోసం మీరు చెల్లించే వార్షిక ప్రీమియంకు కమిషన్ అమౌంట్ జోడించబడుతుంది. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి నేరుగా పాలసీలని కొనుగోలు చేయడం మీకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఇది మరొక కారణం. అలా చేయడం వల్ల మీరు డబ్బులో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయొచ్చు.