భారతదేశంలో పాస్ పోర్ట్అప్లికేషన్ ఫీజు ఎంత
పాస్ పోర్ట్ ఫీజు అనేది వివిధ పాస్ పోర్ట్ సేవల అప్లికేషన్ కోసం వసూలు చేయబడే మొత్తం. మనం తీసుకునే పాస్ పోర్ట్ సేవల రకాన్ని బట్టి ఫీజులు భిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా, ఆ సేవలు రెగ్యులర్ సేవలా, లేదా తత్కాల్ కేటగిరీ కిందకు వస్తాయా అనే దానిపై కూడా పాస్ పోర్ట్ ఫీజు ఎంతనేది ఆధారపడి ఉంటుంది.
భారతదేశంలో పాస్ పోర్ట్ ఫీజులకు సంబంధించిన మీ అన్ని సందేహాలకు ఈ కథనం సమాధానం ఇస్తుంది. కాబట్టి, ఇక ఆలస్యం చేయకుండా, మొదలుపెడదాం.
రెగ్యులర్ పాస్ పోర్ట్ ఫీజు ఎంత? తత్కాల్ పాస్ పోర్ట్ ఫీజు ఎంత?
ఈ క్రింద వివరించిన ఈ పట్టిక కొత్త పాస్ పోర్ట్ ఫీజు ప్రదర్శిస్తుంది. ఒకసారి చూడండి -
పాస్‌పోర్ట్ సేవలు | సాధారణ పాస్ పోర్ట్ ఫీజులు | తత్కాల్ పథకం కింద అదనపు ఫీజులు |
కొత్త పాస్‌పోర్ట్ లేదా మళ్లీ పాస్‌పోర్ట్ జారీ చేయడం కోసం అప్లికేషన్ ఫీజు (10 సంవత్సరాల చెల్లుబాటు, 36 పేజీలు) | రూ. 1,500 | రూ. 2,000 |
కొత్త పాస్‌పోర్ట్ లేదా మళ్లీ పాస్‌పోర్ట్ జారీ చేయడం కోసం అప్లికేషన్ ఫీజు (10 సంవత్సరాల చెల్లుబాటు, 60 పేజీలు) | రూ. 2,000 | రూ. 2,000 |
మైనర్‌ల కోసం (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు), (5 సంవత్సరాల చెల్లుబాటు, 36 పేజీలు) | రూ. 1,000 | రూ. 2,000 |
పాస్‌పోర్ట్ పాడైపోయినా, దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ కోసం అప్లికేషన్ ఫీజు (36 పేజీలు) | రూ. 3,000 | రూ. 2,000 |
పాస్‌పోర్ట్ పాడైపోయినా, దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా రీప్లేస్‌మెంట్ కోసం అప్లికేషన్ ఫీజు (60 పేజీలు) | రూ. 3,500 | రూ. 2,000 |
ECRని తీసివేయడానికి లేదా వ్యక్తిగత వివరాలను మార్చడానికి పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ కోసం అప్లికేషన్ ఫీజు (10 సంవత్సరాల చెల్లుబాటు, 36 పేజీలు) | రూ. 1,500 | రూ. 2,000 |
ECRని రద్దు చేయడానికి లేదా వ్యక్తిగత వివరాలను మార్చడానికి పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ కోసం అప్లికేషన్ ఫీజు (10 సంవత్సరాల చెల్లుబాటు, 60 పేజీలు) | రూ. 2,000 | రూ. 2,000 |
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ ఫీజు | రూ. 500 | వర్తించదు |
ECRని రద్దు చేయడానికి పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్ కోసం లేదా వ్యక్తిగత వివరాలను మార్చడానికి అప్లికేషన్ ఫీజు | రూ. 1,000 | రూ. 2,000 |
కాబట్టి భారతదేశంలో పాస్ పోర్ట్ ఫీజు విధానం ఇది.
దయచేసి గమనించండి: మీరు తత్కాల్ పథకం కింద కొత్త పాస్ పోర్ట్ కోసం అప్లై చేస్తే, మీరు సాధారణ అప్లికేషన్ ఫీజులతో పాటు అదనపు తత్కాల్ పాస్ పోర్ట్ ఫీజును చెల్లించాలి.
పాస్ పోర్ట్ ఫీజు ఎలా చెల్లించాలి?
మీరు పాస్ పోర్ట్ ఫీజు ఎలా చెల్లించాలి? అని మీరు ఆలోచిస్తుంటే, దానికి సమాధానం ఇక్కడ ఉంది.
మీరు ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్, రెండింటిలోనూ చెల్లించవచ్చు. కొత్త రూల్ ప్రకారం, అన్ని పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి పాస్ పోర్ట్ ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించడం తప్పనిసరి.
ఆన్‌లైన్
మీరు ఆన్‌లైన్‌లో పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు ఈ క్రింది మార్గాలు ఉన్నాయి:
ఇంటర్నెట్ బ్యాంకింగ్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర అనుబంధ బ్యాంకులు)
క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాలెట్ పేమెంట్
ఒక అప్లికెంట్ గా, ఆన్‌లైన్‌లో చెల్లించేటప్పుడు సాధారణ పాస్ పోర్ట్ ఫీజును మాత్రమే చెల్లించాలి. అయితే, తత్కాల్ పాస్ పోర్ట్ కోసం మీ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత, మీరు పాస్ పోర్ట్ సేవా కేంద్రం లేదా పాస్ పోర్ట్ ఆఫీసులో నగదు రూపంలో తత్కాల్ ఫీజును చెల్లించాలి.
ఆఫ్‌లైన్
మీరు అపాయింట్‌మెంట్ లేకుండా మీ సమీప పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి, మీరు పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫీజును నగదు రూపంలో చెల్లించవచ్చు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ చలాన్ ద్వారా కూడా చెల్లించవచ్చు.
పాస్ పోర్ట్ ఫీజును ఎలా లెక్కించాలి?
ముందుగా చెప్పినట్లుగా, పాస్ పోర్ట్ ఫీజులు ప్రతి పాస్ పోర్ట్ రకానికి, సేవకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, మీరు పాస్ పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫీజు కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు.
పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫీజులను లెక్కించడానికి మీరు వివిధ పాస్ పోర్ట్ సేవల కోసం కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించవచ్చో పరిశీలించండి -
పాస్‌పోర్ట్
అనుసరించండి:
1. “అప్లికేషన్ రకం” అంటే “పాస్‌పోర్ట్” ఎంచుకోండి
2. "సేవ రకాన్ని" ఎంచుకోండి. మీరు ఈ క్రింది ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు:
కొత్త పాస్‌పోర్ట్
తిరిగి జారీ చేయవలసిన పాస్‌పోర్ట్
3. మీ వయస్సు, పేజీల సంఖ్య, పథకం (సాధారణ పాస్ పోర్ట్ లేదా తత్కాల్ పాస్‌పోర్ట్) ఎంచుకోండి. "ఫీజును లెక్కించు"పై క్లిక్ చేయండి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది మరియు భారతదేశంలో వర్తించే పాస్ పోర్ట్ పునరుద్ధరణ ఫీజు లేదా కొత్త పాస్ పోర్ట్ జారీకి సంబంధించిన ఛార్జీలపై మీకు ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి.
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫీజు
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, GEP కోసం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఆ ఆప్షన్ ఎంచుకుని, "ఫీజును లెక్కించు" పై క్లిక్ చేయండి.
ఐడెంటిటీ సర్టిఫికెట్
గుర్తింపు సర్టిఫికెట్‌లో, మీరు ఈ క్రింది సేవా రకాన్ని ఎంచుకోవాలి - కొత్త పాస్‌పోర్ట్ లేదా మళ్లీ పాస్‌పోర్ట్ జారీ.
సరెండర్ సర్టిఫికెట్
మీరు సరెండర్ సర్టిఫికెట్‌ని ఎంచుకుంటే, పాస్ పోర్ట్ ఫీజులను లెక్కించడానికి క్రింది వాటిలో ఎంచుకోండి:
1 జూన్ 2010కి ముందు విదేశీ జాతీయతను పొందిన వారికి
1 జూన్ 2010న లేదా తర్వాత విదేశీ జాతీయతను పొందిన వారికి
గమనిక: మైనర్‌లకైతే కొత్త పాస్ పోర్ట్ అప్లికేషన్‌పై 10% రాయితీని పొందుతారు. వయోపరిమితి 8 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ. సీనియర్ సిటిజన్లు కూడా ఈ రాయితీని పొందవచ్చు. ప్రయోజనం పొందాలంటే వారి వయస్సు 60 ఏళ్లు పైబడి ఉండాలి.
భారతదేశంలో పాస్ పోర్ట్ ఫీజు చెల్లించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు
భారతదేశంలో పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫీజు చెల్లించేటప్పుడు ఈ క్రింది సూచనలను గుర్తుంచుకోండి -
మీరు అపాయింట్‌మెంట్ కోసం పాస్ పోర్ట్ ఫీజును చెల్లించి, అపాయింట్‌మెంట్ స్లాట్‌ను బుక్ చేసుకోకుంటే, మీకు రీఫండ్ లభించదు.
ఒకేలాంటి పాస్ పోర్ట్ ఫీజుల అదనపు చెల్లింపుల విషయంలో ప్రాంతీయ పాస్ పోర్ట్కార్యాలయం అదనపు మొత్తాన్ని వాపసు చేస్తుంది.
మీరు పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లిస్తే, అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ని, రసీదుని పొందడానికి “అప్లికేషన్ రసీదుని ముద్రించు” ని ఎంచుకోండి.
మీరు పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించినప్పుడు మీరు ఈ క్రింది పత్రాలు తప్పక తీసుకురావాలి:
1. ARN లేదా అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్
2. మీరు అందుకున్న రసీదు లేదా SMS ప్రింటవుట్
3. ఆధార్, పాన్ కార్డ్‌ల వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటు అప్లికేషన్ ఫారమ్
మీరు బ్యాంక్ చలాన్ ద్వారా పాస్ పోర్ట్ ఫీజు చెల్లిస్తే ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు.
ఈ ఫీజు అపాయింట్‌మెంట్ తేదీ లేదా చెల్లింపు తేదీ నుండి 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.
పాస్ పోర్ట్ అనేది పౌరులకు అవసరమైన ప్రయాణ పత్రం మరియు గుర్తింపు రుజువు. మీరు కొత్తదాని కోసం అప్లై చేసుకోవాలనుకుంటే లేదా ఇప్పటికే ఉన్న దానిని పునరుద్ధరించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా పైన పేర్కొన్న పాస్ పోర్ట్ ఫీజులను చెల్లించాలి. పాస్ పోర్ట్ కోసం ఏదైనా కొత్త ఫీజు స్ట్రక్చర్‌తో అప్‌డేట్ అవ్వాలని గుర్తుంచుకోండి. అదనంగా, మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించే ముందు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి.
తరచుగా అడుగు ప్రశ్నలు
పాస్ పోర్ట్ ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ఏవైనా ఛార్జీలు వర్తిస్తాయా?
వర్తిస్తాయి. మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల ద్వారా పాస్ పోర్ట్ ఫీజులను చెల్లిస్తే, బ్యాంక్ సేవా పన్నుతో పాటు 1.5% ఫీజును వసూలు చేస్తుంది. అయితే, మీరు SBI లేదా ఇతర అనుబంధ బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించినట్లయితే ఎలాంటి చార్జీలు వర్తించవు.
GEP కోసం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫీజు ఎంత?
GEP లేదా పాస్ పోర్ట్పోలీస్ వెరిఫికేషన్ కోసం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫీజు రూ. 500.
పాస్ పోర్ట్ ఫీజు కోసం SBI చలాన్‌ను సమర్పించడానికి ఏదైనా నిర్దిష్ట సమయం ఉంటుందా?
ఉంటుంది. మీరు SBI చలాన్‌ను రూపొందించిన 85 రోజులలోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమర్పించాలి.