డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి

నకిలీ పాస్ పోర్ట్‌ని ఎలా పొందాలి - ప్రక్రియ వివరించబడింది

పాస్ పోర్ట్ అనేది ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ కావున దాని గడువు ముగియక ముందే అప్డేట్ చేసుకోవాలి. మీరు కనుక పాస్ పోర్ట్‌ను కోల్పోతే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి మరియు ఇండియన్ మిషన్‌కు కూడా. పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్ పోర్ట్‌ల విషయంలో నకిలీ పాస్‌పోర్ట్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. దీని మీద ఓ లుక్కేద్దాం.

 

ఇండియాలో నకిలీ పాస్ పోర్ట్ కొరకు ఎలా దరఖాస్తు చేయాలి?

ఎవరైనా అనుకోని సందర్భాలలో పాస్ పోర్ట్ ను పోగొట్టుకుని మరలా నకిలీ పాస్ పోర్ట్‌ను తీసుకోవాలని అనుకుంటే వారు సులభంగా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కానీ ముందుగా దరఖాస్తు చేసేందుకు అవసరం అయిన పత్రాలను గురించి తెలుసుకోవాలి.

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాస్ పోర్ట్ కొరకు ఎలా దరఖాస్తు చేయాలి?

నకిలీ పాస్ పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ప్రక్రియ ఇక్కడ ఉంది. నకిలీ పాస్ పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న పాస్ పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించండి.

స్టెప్ 1: పాస్ పోర్ట్ సేవా పోర్టల్‌లో నమోదు చేసుకోండి.

స్టెప్ 2: అవసరమైన సమాచారాన్ని అందించి కొత్త ఖాతాను క్రియేట్ చేయండి. పాస్ పోర్ట్ సేవా అకౌంట్ యాక్టివేషన్ కొరకు మీకు ఒక లింక్ పంపించబడుతుంది.

స్టెప్ 3: నకిలీ పాస్ పోర్ట్ కొరకు ఆన్‌లైన్ ఫారాన్ని పూరించండి.

స్టెప్ 4: ఫారాన్ని సమర్పించే ముందు మరోసారి వివరాలు సరి చూసుకోండి.

స్టెప్ 5: మీరు ఒక రశీదును పొందుతారు. పాస్ పోర్ట్ సేవా వెబ్‌సైట్ ద్వారా మీ పాస్ పోర్ట్ స్థితిని ట్రాక్ చేసేందుకు దీనిని ఉపయోగించండి.

ఆఫ్‌లైన్‌లో నకిలీ పాస్ పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

నకిలీ పాస్ పోర్ట్ కోసం ఆఫ్‌లైన్‌లో పత్రాలు ఫైల్ చేసేందుకు ఈ విధానాన్ని అనుసరించండి.

స్టెప్ 1: ఫారాలు మరియు అఫిడవిట్‌ల విభాగంలో ఈ-ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: మీకు కొత్త పాస్ పోర్ట్ కావాలా లేక ఇండియన్ పాస్ పోర్ట్ పున: ప్రచురణ కావాలో ఎంపిక చేసుకోండి.

స్టెప్ 3: ఈ-ఫారంతో పాటు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీయండి.

స్టెప్ 4: పాత పాస్ పోర్ట్ బుక్‌లెట్ సంఖ్య, జన్మదినం, వయసు, చిరునామా, పేరు, ఇండియన్ పాస్ పోర్ట్ పున: ప్రచురణకు గల కారణం తెలపండి.

స్టెప్ 5: చిరునామా రుజువు, ఐడెంటిటీ రుజువు, మరియు పాత పాస్ పోర్ట్ బుక్‌లెట్ వంటి పత్రాలతో ఫారాన్ని పాస్ పోర్ట్ ఆఫీసులో సమర్పించండి.

ఇండియాలో నకిలీ పాస్ పోర్ట్ దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు

మీరు పాస్ పోర్ట్ పున: ప్రచురణ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు అది నార్మల్ ప్రాసెస్‌నే అనుకరించాలి. అవసరం అయిన పత్రాలు:

  • పాస్ పోర్ట్ ఎలా పోయింది లేదా ఎలా డ్యామేజ్ అయింది అనే వివరాలు (అనుబంధం ‘L’)

  • నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (అనుబంధం ‘M’) లేదా ముందస్తు సమాచార లేఖ (అనుబంధం ‘N’)

  • ప్రస్తుత చిరునామా రుజువు - యజమాని నుంచి సర్టిఫికేట్, టెలిఫోన్ బిల్, ఆదాయపు పన్ను, అసెస్‌మెంట్ ఆర్డర్, వాటర్ బిల్, గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, ఎలక్షన్ ఫొటో ID కార్డు, జీవిత భాగస్వామి పాస్ పోర్ట్ కాపీ, రిజిస్టర్డ్ అద్దె ఒప్పందం

  • FIR రిపోర్ట్

  • పుట్టిన తేదీ రుజువు - సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, మున్సిపల్ అథారిటీ ద్వారా జారీ చేయబడిన పుట్టిన తేదీ సర్టిఫికేట్.

  • పాత పాస్ పోర్ట్‌లోని ఇసిఆర్ మరియు నాన్-ఇసిఆర్ పేజీల ఫొటో కాపీలు (మొదటి మరియు చివరి పేజీలు).

  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు

మీ పాత పాస్ పోర్ట్‌లో పేర్కొన్న పాస్ పోర్ట్ సంఖ్య, అది జారీ చేసిన స్థలం, ఏ తేదీన జారీ చేశారు, గడువు తేదీ వంటి వివరాలను కూడా దరఖాస్తు ఫారంతో పాటు సమర్పించండి.

నకిలీ పాస్ పోర్ట్ దరఖాస్తుకు అవసరం అయిన ఫీజులు

పాస్ పోర్ట్ కోల్పోయినట్లయితే నకిలీ పాస్ పోర్ట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దిగువ పట్టిక దరఖాస్తుకు గల ఫీజులను గురించి వివరిస్తుంది.

 

వర్గము దరఖాస్తు ఫీజు అదనపు తత్కాల్ ఫీజు
10 సంవత్సరాల చెల్లుబాటుతో పున: ప్రచురణ లేదా ఫ్రెష్ పాస్ పోర్ట్ (36 పేజీలు) రూ. 1,500 రూ. 2,000
10 సంవత్సరాల చెల్లుబాటుతో పున: ప్రచురణ లేదా ఫ్రెష్ పాస్ పోర్ట్ (60 పేజీలు) రూ. 2,000 రూ. 2,000
5 సంవత్సరాల చెల్లుబాటుతో లేదా 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉండే పాస్ పోర్ట్ (36 పేజీలు) పున: ప్రచురణ లేదా కొత్తది రూ. 1,000 రూ. 2,000
పాస్ పోర్ట్ భర్తీ (36 పేజీలు) కోల్పోయినా, దొంగిలించబడినా లేదా డ్యామేజ్ అయినా రూ. 3,000 రూ. 2,000
పాస్ పోర్ట్ భర్తీ (60 పేజీలు) కోల్పోయినా, దొంగిలించబడినా లేదా దెబ్బతిన్నా రూ. 3,500 రూ. 2,000
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ రూ. 500 NA
వ్యక్తిగత వివరాలు మార్చేందుకు లేదా ఇసిఆర్ ను తొలగించేందుకు పాస్ పోర్ట్ భర్తీ (36 పేజీలు, 10 సంవత్సరాల చెల్లుబాటు) రూ. 1,500 రూ. 2,000
వ్యక్తిగత వివరాలు మార్చేందుకు లేదా ఇసిఆర్ ను తొలగించేందుకు పాస్ పోర్ట్ భర్తీ (60 పేజీలు, 10 సంవత్సరాల చెల్లుబాటు) రూ. 2,000 రూ. 2,000
మైనర్ల కోసం వ్యక్తిగత వివరాలు మార్చేందుకు లేదా ఇసిఆర్ ను తొలగించేందుకు పాస్ పోర్ట్ భర్తీ (36 పేజీలు, 5 సంవత్సరాల చెల్లుబాటు) రూ. 1,000 రూ. 2,000
దరఖాస్తు విధానం మరియు అవసరమైన ఫీజుల గురించి మాత్రమే తెలుసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకునే సందర్భాల గురించి కూడా తెలుసుకోవాలి. మరింత తెలుసుకునేందుకు ఇది చదవండి

నకిలీ పాస్ పోర్ట్ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు?

పాస్ పోర్ట్ పున: ప్రచురణ కోసం దరఖాస్తు ప్రక్రియ అనేది పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న పాస్ పోర్ట్‌లకు ఒకేలా ఉంటుంది. మీరు నకిలీ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే సందర్భాలు కొన్ని కింది విధంగా ఉన్నాయి:

  • దెబ్బతిన్న పాస్‌ పోర్ట్

దెబ్బతిన్న పాస్ పోర్ట్‌లు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి:

  • పాస్ పోర్ట్ హోల్డర్ పేరు, ఫొటో, పాస్ పోర్ట్ సంఖ్య గుర్తించే విధంగా పాస్ పోర్ట్ పాక్షికంగా దెబ్బతిన్నది.

  • పూర్తిగా డ్యామేజ్ అయిన పాస్ పోర్ట్. వివరాలను రికవర్ చేయలేం.

మీ పాస్ పోర్ట్ పాక్షికంగా దెబ్బతిన్నట్లయితే మీరు తత్కాల్ స్కీమ్ ద్వారా పున: ప్రచురణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వేళ మీ పాస్ పోర్ట్ పూర్తిగా పాడయిపోయినట్లయితే మీరు మరలా పాస్ పోర్ట్ పొందేందుకు పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తత్కాల్ స్కీమ్‌లో పొందలేరు.

  • పాస్ పోర్ట్ పోవడం

మీరు ఇండియాలో మీ పాస్ పోర్ట్‌ను పోగొట్టుకున్నట్లయితే పోలీసు స్టేషన్‌లో మరియు పాస్ పోర్ట్ కార్యాలయంలో కూడా రిపోర్ట్ చేయండి మీరు విదేశాల్లో నివసిస్తున్నట్లయితే వెంటనే ఇండియన్ మిషన్‌ను సంప్రదించండి. పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో పాస్ పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని నింపి పున: ప్రచురణ కోసం దరఖాస్తు చేసుకోండి. అవసరం అయిన పత్రాలు సమర్పించండి.

పోలీసు ధృవీకరణ అనేది తప్పనిసరి కానప్పుడు పున: ప్రచురణ పాస్ పోర్ట్ కు 7 పని దినాలు పట్టవచ్చు. పోలీసు ధృవీకరణ అవసరం అయితే దానికి 30 పని దినాలు పట్టవచ్చు.

మీరు మీ దరఖాస్తులను సాధారణ స్కీమ్ లేదా తత్కాల్ స్కీమ్ కింద సమర్పించవచ్చు. అయితే నకిలీ పాస్ పోర్ట్ ఫీజులు అధికంగా ఉంటాయి. అప్లికేషన్ పంపే ముందు దీనికి దాదాపు 30 రోజులు పడుతుంది. ఏవైనా సందేహాల కోసం మీరు 1800 258 1800 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. లేదా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ని సందర్శించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

కోల్పోయిన పాస్ పోర్ట్‌ను తిరిగి జారీ చేసేందుకు ఇండియాలో ఎంత సమయం పడుతుంది?

నకిలీ పాస్ పోర్ట్‌ను పంపడంతో పాటు దరఖాస్తు ప్రక్రియకు 30 రోజులు పట్టవచ్చు. తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసినప్పుడు ప్రక్రియ సాధారణంగా 15 రోజుల్లో పూర్తవుతుంది.

పాస్ పోర్ట్ పున: ప్రచురణ మరియు రేన్యువల్ రెండూ ఒకటేనా?

రేన్యువల్ విషయంలో మీ ప్రస్తుత పాస్ పోర్ట్‌లో మార్పులు చేయబడతాయి. మీకు కొత్త పాస్ పోర్ట్ అవసరం అయినప్పుడు పాస్ పోర్ట్ పున: ప్రచురించబడుతుంది.

పాత పాస్ పోర్ట్ లేకుండా మీరు కొత్త పాస్ పోర్ట్‌ను పొందగలరా?

అవును. మీరు మీ పాస్ పోర్ట్ కార్డు మరియు చెల్లుబాటయ్యే పాస్ పోర్ట్‌ను రేన్యువల్ చేసేందుకు అన్ని పత్రాలను సమర్పించాలి.