ఇండియన్ పాస్ పోర్ట్ కోసం అవసరం అయిన పత్రాల జాబితా
మీ వద్ద సరైన పత్రాలు ఉంటే ఇండియన్ పాస్ పోర్ట్ పొందడం అనేది సులభమైన ప్రక్రియ. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పత్రాలను అప్‌లోడ్ చేయొచ్చు, మరియు పాస్ పోర్ట్ పొందేందుకు తదుపరి ప్రాసెస్‌ను అనుసరించవచ్చు.
వివిధ రకాల అప్లికేషన్ల కింద ఇండియన్ పాస్ పోర్ట్ కోసం అవసరం అయిన పత్రాల జాబితాను మేము అందించాం. మైనర్లు లేదా పెద్దల కోసం కొత్త లేదా రీ-ఇష్యూ పాస్ పోర్ట్‌లు.
కొత్త పాస్ పోర్ట్ కోసం పెద్దలు మరియు మైనర్ల దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
అవసరం అయిన పత్రాలు | పెద్దలు | మైనర్స్ |
ఐడెంటిటీ రుజువు | పేర్కొన్న పత్రాలలో ఏదైనా- ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, PAN కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ | ఆధార్ కార్డు, తల్లిదండ్రుల పాస్ పోర్ట్ కాపీ వారు ధృవీకరించి లేదా సొంతంగా చేసుకున్నది |
చిరునామా రుజువు | పేర్కొన్న పత్రాలలో ఏదైనా- ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్, యుటిలిటీ బిల్, అద్దె ఒప్పందం, ల్యాండ్‌లైన్ బిల్, మొబైల్ బిల్, గ్యాస్ కనెక్షన్ రుజువు, ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్, కంపెనీ లెటర్ హెడ్ మీద యజమాని సంతకంతో కూడిన సర్టిఫికేట్ (ప్రఖ్యాత కంపెనీ అయి ఉండాలి) | తల్లిదండ్రులు ప్రస్తుతం ఉంటున్న చిరునామాతో పాటుగా ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న బ్యాంక్ ఖాతా, కరెంట్ బిల్, యుటిలిటీ బిల్, రెంట్ అగ్రిమెంట్, యుటిలిటీ బిల్, ల్యాండ్‌లైన్ బిల్, మొబైల్ బిల్, గ్యాస్ కనెక్షన్ రుజువు |
వయసు రుజువు | పేర్కొన్న పత్రాలలో ఏదైనా- మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారుడి పుట్టిన తేదీని నిర్దారిస్తూ ఏదైనా అనాథాశ్రమం లెటర్ హెడ్ మీద ఇచ్చిన డిక్లరేషన్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, పాలసీదారు జన్మదినాన్ని రాసిన పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జారీ చేసిన పాలసీ బాండ్. | మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారుడి పుట్టిన తేదీని నిర్థారిస్తూ ఏదైనా అనాథాశ్రమం లెటర్ హెడ్ మీద ఇచ్చిన డిక్లరేషన్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, సెకండరీ గ్రేడ్ లేదా హయ్యర్ సెకండరీ గ్రేడ్ మార్కుల జాబితా, పాలసీదారు జన్మదినాన్ని రాసిన పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జారీ చేసిన పాలసీ బాండ్ |
ఇతర పత్రాలు | ఆదాయపు పన్ను అసెస్‌మెంట్ ఆర్డర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, జీవిత భాగస్వామి పాస్ పోర్ట్ కాపీ (పాస్ పోర్ట్ కాపీ యొక్క మొదటి మరియు చివరి పేజీలు దరఖాస్తుదారు పేరు జీవిత భాగస్వామిగా ఎక్కడైతే రాసిందో అది) | NA |
పాస్ పోర్ట్ రీ-ఇష్యూయెన్స్ కొరకు అవసరం అయిన పత్రాలు
కింద పేర్కొన్న పత్రాలు పాస్ పోర్ట్ రీ-ఇష్యూ కొరకు తప్పకుండా అవసరం-
పాత పాస్ పోర్ట్ మొదటి మరియు చివరి పేజీలలో ఉన్న స్వీయ-ధృవీకరణ ఫొటో కాపీ
ఇసిఆర్ & నాన్-ఇసిఆర్ పేజీలు
చెల్లుబాటు పొడగింపు పేజీ
పరిశీలన పేజీ
NOC లేదా ముందస్తు సమాచార లేఖ
ఒరిజినల్ పాత పాస్ పోర్ట్.
మైనర్ల విషయంలో పాస్ పోర్ట్ రీ-ఇష్యూ కోసం అవసరం అయిన పత్రాలు పెద్దవాళ్ల పాస్ పోర్ట్ తో సమానంగా ఉంటాయి. ఈ పత్రాలను తల్లిదండ్రులు కూడా ధృవీకరించవచ్చు.
తప్పనిసరి పాస్ పోర్ట్ రీ-ఇష్యూ కోసం రీ-ఇష్యూ పత్రాలతో పాటు ఇతర కొన్నిపత్రాలు కూడా అవసరం అవుతాయి. అవి ఈ కింది విధంగా ఉన్నాయి -
రీ-ఇష్యూకి గల కారణం | అవసరం అయిన పత్రాలు |
---|---|
తక్కువ వ్యాలిడిటీ పాస్ పోర్ట్‌ను పెంచుకోండి. | కొద్దిరోజులే చెల్లుబాటయ్యే పాస్ పోర్ట్ యొక్క కారణాన్ని తొలగించే పత్రాలు |
పాస్ పోర్ట్ దొంగిలించబడిన లేదా పోయిన | జన్మదిన రుజువు, చిరునామా రుజువు, పాస్ పోర్ట్ పోయిందని తెలిపే ఒరిజినల్ పోలీస్ రిపోర్ట్, పాస్ పోర్ట్ ఎక్కడ ఎలా పోయిందని తెలిపే అఫిడవిట్, NOC లేదా ముందస్తు సమాచార లేఖ |
చదవగలిగే పేరు, పాస్ పోర్ట్ సంఖ్య, ఫొటోగ్రాఫ్‌లతో ఉన్న దెబ్బతిన్న పాస్ పోర్ట్ | జన్మదిన రుజువు, పాస్ పోర్ట్ ఎక్కడ మరియు ఎలా పోయిందో తెలిపే అఫిడవిట్ |
ప్రదర్శనలో మార్పు | ప్రస్తుత రూపాన్ని చూపుతున్న దరఖాస్తుదారు ఇటీవలి ఫొటో |
పేరులో మార్పు | కొత్త గుర్తింపు రుజువు మరియు పేరు మార్పు సర్టిఫికేట్, పేరు మార్పు గురించి గ్యాడ్జెట్ నోటిఫికేషన్ |
పుట్టిన తేదీలో మార్పు | కొత్త పుట్టిన తేదీ రుజువు |
చిరునామాలో మార్పు | ప్రస్తుతం ఉంటున్న చిరునామా రుజువు |
ఇసిఆర్ డిలీట్ అవ్వడం | ఏదైనా నాన్-ఇసిఆర్ కేటగిరీల రుజువు |
జన్మస్థలం మార్పు (రాష్ట్రం లేదా దేశంతో సంబంధం ఉంది) | జన్మస్థల రుజువు, జన్మస్థలం మారేందుకు గల కారణాన్ని తెలుపుతూ అఫిడవిట్, జన్మస్థలాన్ని విడిచి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వేరే స్థానంలో ఉన్నట్లయితే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేదా సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ నుంచి ఆర్డర్, ఒక వేళ దేశం లేదా రాష్ట్రం మారినట్లయితే ఎంహేచ్ఏ ధృవీకరించిన పౌరసత్వ సర్టిఫికేట్. |
జన్మస్థలం మార్పు (రాష్ట్రం లేదా దేశం తో సంబంధం లేదు) | జన్మస్థలం యొక్క రుజువు, జన్మస్థలం మారేందుకు గల కారణాన్ని తెలిపే అఫిడవిట్ |
లింగంలో (సెక్స్) మార్పు | లింగ మార్పు కోసం అఫిడవిట్, దరఖాస్తుదారు ఎక్కడైతే ఆస్పత్రిలో లింగ మార్పును చేయించుకున్నాడో ఆ ఆస్పత్రి నుంచి లింగ మార్పిడి విజయవంతమయిందనే సర్టిఫికేట్ |
తల్లిదండ్రుల పేరులో మార్పు | పేరెంట్ పేరు మార్చాల్సిన పాస్ పోర్ట్, సర్వీస్ రికార్డు లేదా తల్లిదండ్రులు పేరు మార్చుకున్నట్లు రుజువు చేసే ఆస్తిపత్రాలు, వారు చనిపోయినట్లయితే వారు జీవించి ఉన్నపుడు పేరు మార్చారని రుజువు అవసరం |
కొత్త పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు లేదా నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం రీ-ఇష్యూ కొరకు అవసరమైన పత్రాల జాబితా పాస్ పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో ఉంది. పైన పేర్కొన్న వివరాలే కాకుండా దరఖాస్తుదారులు అప్‌లోడ్ చేసే ముందు పోర్టల్‌ను చెక్ చేయాలి.
పాస్ పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం ఏ ఏ పత్రాలు అవసరం?
పాస్పోర్ట్ సేవా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించినపుడు దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం అవసరమయిన స్వీయ ధృవీకరణ పత్రాల హార్డ్ కాపీలను కలిగి ఉండాలి. దానితో పాటు కింది పత్రాలు అవసరం-
అప్లికేషన్ ఏఆర్ఎన్ సంఖ్య.
పాస్ పోర్ట్ కొరకు దరఖాస్తు మరియు అపాయింట్‌మెంట్ కోసం రసీదు చెల్లింపు
అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్‌ను ప్రింట్ అవుట్ తీసుకెళ్లండి.
పాస్ పోర్ట్ కార్యాలయంలో మనకు అవసరం అయిన పత్రాలు అందుబాటులో లేకుంటే ఏం చేయాలి?
కొత్త పాస్ పోర్ట్ లేదా రీ-ఇష్యూ కోసం అవసరం అయిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి. అవసరం అయిన పత్రాల కొరకు ప్రతి వర్గం కింద బహుళ ఎంపికలు ఉన్నాయి. దరఖాస్తుదారు ప్రతి వర్గం కింద కనీసం ఒక పత్రాన్ని అందించాలి.
దరఖాస్తు సమయంలో ఇండియన్ పాస్ పోర్ట్‌కు అవసరమైన పత్రాలు సమర్పించడం వల్ల మొత్తం ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది. దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకునే ముందు పాస్ పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
పాస్ పోర్ట్ అప్లికేషన్ కొరకు విద్యార్హత సర్టిఫికేట్ తప్పనిసరా?
లేదు. కొత్త పాస్ పోర్ట్ దరఖాస్తు చేసినపుడు విద్యార్హత సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఇది కేవలం వయసు రుజువుకు మాత్రమే అవసరం. అయినప్పటికీ వయసు రుజువుకు జన్మదిన పత్రం, పాలసీదారుల జన్మదిన తేదీని రాసిన పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ జారీ చేసిన పాలసీ బాండ్ మొదలైనవి సమర్పించవచ్చు.
పాస్ పోర్ట్ దరఖాస్తు కోసం అన్ని ఒరిజినల్ పత్రాలు సమర్పించడం అవసరమా?
పీఎస్కే వద్దకు అన్ని పత్రాలు ఒరిజినల్స్ తీసుకెళ్లడం తప్పనిసరే. ఒరిజినల్ పత్రాలు దరఖాస్తుదారుకు తిరిగి ఇవ్వబడతాయి. పాస్ పోర్ట్ కు అవసరమైన పత్రాల జాబితా ప్రకారం అప్లికేషన్‌తో పాటు అప్‌లోడ్ చేయడానికి సాఫ్ట్‌కాపీలు అవసరం.
దరఖాస్తుదారు తరఫున వేరే ఎవరైనా పీఎస్కే వద్ద పాస్ పోర్ట్ అప్లికేషన్ కోసం పత్రాలను సమర్పించవచ్చా?
లేదు. దరఖాస్తుదారు అపాయింట్‌మెంట్ కొరకు భౌతికంగా హాజరుకావాలి. మరియు పత్రాలను సమర్పించాలి. దరఖాస్తుదారు తరఫున మరెవరూ దానిని సమర్పించలేరు.