Third-party premium has changed from 1st June. Renew now
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కమర్షియల్ వాహనం, యజమాని-డ్రైవర్‌కు లేదా వాటి వల్ల కలిగే డ్యామేజీ, నష్టాలను కవర్ చేయడానికి కస్టమైజ్ చేయబడిన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో ప్రమాదాలు, ఢీ కొట్టడాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మొదలైన సందర్భాల్లో జరిగే డ్యామేజీలు, నష్టాలు కవర్ అవుతాయి. అన్ని బిజినెస్ ఆటో-రిక్షాలు, క్యాబ్‌లు, స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు, కమర్షియల్ వ్యాన్లు, ట్రక్కుల వంటి వాహనాల కోసం కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కొనడం తప్పనిసరి.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?
- మీ వ్యాపారంలో ఒకటి లేదా చాలా వాహనాలు ఉన్నట్లయితే మీ వాహనాన్ని ఉపయోగించే వ్యక్తుల వల్ల కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి మీ వ్యాపారాన్ని ఆర్థికంగా కాపాడే, కవర్ చేసే కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పొందడం చాలా అవసరం.
- మీ ప్రాథమిక వ్యాపారంలో సాధారణ క్యాబ్ సర్వీస్ లేదా ప్రైవేట్ స్కూల్ బస్సు వంటి వాహనాన్ని వినియోగిస్తే.. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది వాటాదారులకు, ప్రయాణికులకు ఎప్పుడూ రక్షణ అందిస్తుంది.
- చట్టం ప్రకారం మీ కమర్షియల్ వాహనం వల్ల జరిగే డ్యామేజీలు, నష్టాల నుంచి థర్డ్ పార్టీలను రక్షించేలా కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీని అయినా కలిగి ఉండటం తప్పనిసరి.
డిజిట్ అందించే కమర్షియల్ ట్రక్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలి?
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్తో వచ్చే యాడ్–ఆన్స్
కంజూమబుల్ కవర్ మీ కమర్షియల్ వాహనానికి రక్షణను అనుకున్న దాని కన్నా మించి అందిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు నట్లు, బోల్ట్‌లు, స్క్రూలు, ఇంజన్ ఆయిల్, గ్రీజు వంటి మీ వాహన విడిభాగాలను కూడా ఇది కవర్ చేస్తుంది.
మీ వాహనం, దాని విడి భాగాలు అరిగిపోవడంతో కాలక్రమేణా విలువ తగ్గిపోతుంది. ఈ మొత్తం సాధారణంగా ఏదైనా క్లెయిమ్ నుంచి తీసేస్తారు. అయితే ఈ యాడ్-ఆన్ మాత్రం ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా రీప్లేస్ చేసిన విడిభాగాలపై (రబ్బరు లేదా ఫైబర్‌గ్లాస్ వంటివి) ఈ కవర్ అవుతుంది.
వాటర్ రిగ్రెషన్ లేదా లూబ్రికేటింగ్ ఆయిల్ లీకేజీ వంటి కారణాల వల్ల ప్రమాదంలో మీ వాహనం ఇంజన్ లేదా గేర్‌బాక్స్ పాడైపోతాయి. ప్రమాదం తర్వాత సంభవించే ఏవైనా పర్యవసాన నష్టాలను ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది. (కానీ ప్రమాదం కారణంగా జరిగి ఉండాలి), ఉదాహరణకు హైడ్రోస్టాటిక్ నష్టం కారణంగా ఇంజన్‌కు నష్టం జరిగిందనుకోండి. ఇది ప్రామాణిక పాలసీలో కవర్ అవ్వదు.
మనందరికీ కొన్నిసార్లు కొంత సహాయం కావాలి! రోడ్డుపై మీ వాహనం బ్రేక్‌డౌన్ అయినప్పుడు, ప్రమాదం కారణంగా, టైర్లు ఫ్లాట్ అవడం, బ్యాటరీ పనిచేయకపోవడం లేదా మరికొన్నింటి కారణంగా, మా బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ యాడ్-ఆన్‌తో, మీరు 24x7 సహాయం పొంది ప్రయోజనం పొందొచ్చు.
పని చేసేందుకు వాహనాలు చాలా అవసరం. ఈ యాడ్-ఆన్ మీ కమర్షియల్ వాహనం డ్యామేజీ అయి అందుబాటులో లేనప్పుడు వచ్చే ఏదైనా ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడంలో మీకు తోడ్పడుతుంది.
మీ వాహనం ప్రమాదానికి గురైనప్పుడు, దాన్ని రిపేర్ చేయించేందుకు గ్యారేజీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ యాడ్-ఆన్ కింద మీ వాహనాన్ని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సమీపంలోని గ్యారేజీకి లేదా సురక్షిత ప్రాంతానికి తరలించేటప్పుడు అయ్యే అదనపు ఖర్చులను మేం కవర్ చేస్తాం.
మీ వాహనాన్ని లోన్‌పై తీసుకుని, ప్రమాదంలో పాడైపోయి, రిపేర్ కోసం గ్యారేజీలోనే ఉంటే అది మీ వ్యాపారానికి నష్టం కలిగించవచ్చు. ఈ యాడ్-ఆన్ ద్వారా మా రికార్డుల్లో ఉన్న వాహనం యొక్క ఫైనాన్షియర్‌కు చెల్లించాల్సిన ఈఎంఐలు మేం చెల్లిస్తాం.
అదనపు కవరేజీలు లేదా ఎండార్స్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయి
కొన్నిసార్లు అన్ని స్థితిగతులను కవర్ చేయడానికి కేవలం స్టాండర్డ్ కవరేజీ సరిపోదు. అందుకే మేము మీ కమర్షియల్ వాహనాల కవరేజీని పొడిగించుకోవడానికి మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు ఎంపిక చేసుకోగలిగే ఆప్షనల్ కవర్లను అందిస్తున్నాం.
మీకు ఇప్పటికే పీఏ (PA) కవర్ లేకుంటే చట్టాల ప్రకారం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తప్పనిసరి. కాబట్టి మీరు దాన్ని మీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్‌లో చేర్చవచ్చు. ఇది దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు యజమాని-డ్రైవర్‌కు గాయాలు లేదా మరణం సంభవిస్తే కవరేజీ అందిస్తుంది.
ఇది ఎప్పటికీ జరగకూడదని ఆశిస్తున్నాం. అయితే, వాహనంలో మీతో పాటు కూర్చున్న వ్యక్తికి అనుకోని ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇది వర్తిస్తుంది.
మీ ఉద్యోగులు లేదా మీ కోసం పని చేసే వ్యక్తులకు ఏదైనా గాయం తగిలినా, ఏమైనా జరిగినా మీ మీద తలెత్తే లీగల్ లయబిలిటీల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
వాహనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, లైట్లు, టైర్లు, ట్యూబులు, మడ్‌గార్డ్, బానెట్, సైడ్ పార్ట్ బంపర్లు, హెడ్‌లైట్లు, పెయింట్‌వర్క్‌లు డ్యామేజీ లేదా నష్టాలను కవర్ చేయడానికి ఇది సహాయపడుతుంది.
వాహనం తయారైనప్పుడు రాని ఎలక్ట్రికల్ ఉపకరణాలు అమర్చిన వారి కోసం ఈ యాడ్–ఆన్ ఉంటుంది. ఆ ఉపకరణాలను ఇది కవర్ చేస్తుంది.
మీరు మీ వాహనం తయారైనప్పుడు లేని ఏదైనా నాన్-ఎలక్ట్రికల్ ఉపకరణాన్ని అమర్చినట్లయితే, డ్యామేజీ, నష్టాల సమయంలో ఆ ఉపకరణాలను కవర్ చేయడానికి ఇది సహాయపడుతుంది.
ప్రతి నష్టంపై తప్పనిసరి మినహాయింపు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ప్రీమియంను తగ్గించుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ వాహనం పూర్తిగా పాడైపోయినట్లయితే, ల్యాంపులు, టైర్లు, ట్యూబులు, మడ్‌గార్డ్‌లు, బానెట్, సైడ్ పార్ట్ బంపర్లు, హెడ్‌లైట్లు, పెయింట్ వర్క్‌లకు డ్యామేజీ లేదా నష్టాన్ని కవర్ చేస్తుంది.
ఏది కవర్ కాదు?
మీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటివి కొన్ని తెలుసుకుందాం:
థర్డ్-పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీలో సొంత వాహనానికి జరిగే నష్టాలు కవర్ కావు.
క్లెయిమ్ చేసిన వాహన యజమాని లేదా డ్రైవర్ మద్యం తాగి ఉన్నా లేదంటే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కవర్ కాదు.
యజమాని-డ్రైవర్ వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా సంభవించే ఏదైనా డ్యామేజీ (ఉదాహరణకు, అప్పటికే వరదలు ఉన్నా కూడా డ్రైవింగ్ చేయడం వంటివి..)
ప్రమాదంతో సంబంధం లేకుండా జరిగిన ఏదైనా డ్యామేజీకి కవర్ కాదు. ఉదాహరణకు రాబడిలో నష్టం, మార్కెట్ నష్టాలు వంటి తదనంతర నష్టాలు.
డిజిట్ అందించే కమర్షియల్ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ముఖ్య ఫీచర్లు
ముఖ్యమైన ఫీచర్లు | డిజిట్ ప్రయోజనం |
---|---|
క్లెయిమ్ ప్రాసెస్ | పేపర్ లెస్ క్లెయిమ్స్ |
కస్టమర్ సపోర్టు | 24x7 సపోర్టు |
కవర్ అయ్యే కమర్షియల్ వాహనాల రకాలు | క్యాబులు, ట్యాక్సీలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ఆటో రిక్షాలు, స్కూల్ వ్యాన్లు మొదలైనవి |
ప్రీమియం | కమర్షియల్ వాహన రకం & ఇన్సూరెన్స్ చేయాల్సిన వాహనాల సంఖ్య ప్రకారం కస్టమైజ్ చేయబడుతుంది. |
అదనపు కవరేజీలు | పీఏ (PA) కవర్లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి తగ్గింపులు మొదలైనవి. |
థర్డ్ పార్టీ డ్యామేజీలు | వ్యక్తిగత నష్టాలకు అపరిమిత లయబిలిటీ, ఆస్తి/ వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవర్ అవుతుంది. |
కవర్ అయ్యే కమర్షియల్ వాహనాల రకాలు
ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్
- టాక్సీలు, క్యాబులు, ఆటో రిక్షా, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్.
- ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలు.. ప్రత్యేకించి స్కూల్ బస్సులు, సాధారణ క్యాబులకు చాలా మంది ప్రయాణికులను తీసుకువెళ్లే భారీ బాధ్యత కలిగి ఉంటుంది.
- భారతదేశంలోని చాలా మంది జీవితాలు, ఆదాయం ఈ వాహనాలను నడపడంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా దురదృష్టకర పరిస్థితుల్లో వారు ఎప్పటికీ నష్టాల నుంచి రక్షణ పొందేందుకు కమర్షియల్ వెహికిల్ ఇన్పూరెన్స్ దోహదపడుతుంది.
గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్
- సాధారణంగా వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లే వాహనాలు. వీటిలో ప్రధానంగా ట్రక్కులు, టెంపోలు, లారీలు ఉన్నాయి.
- వస్తువులను మోసుకెళ్లే వాహనాలు సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి. దీంతో అవి తరచుగా ప్రమాదానికి గురవుతుంటాయి. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీలకు జరిగే డ్యామేజీలు, నష్టాల నుంచి రక్షించడమే కాకుండా, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర దురదృష్టకర పరిస్థితుల నుంచి వచ్చే నష్టాల నుంచి కూడా యజమాని-డ్రైవర్ అలాగే వాహనానికి కూడా రక్షణ కల్పిస్తుంది.
- మీ వ్యాపారంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడానికి ట్రక్కులను తరచుగా ఉపయోగిస్తుంటే.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు మొదలైన పరిస్థితుల కారణంగా సంభవించే ఏదైనా డ్యామేజీ లేదా వస్తువుల నష్టం నుంచి కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ రక్షిస్తుంది.
ఇతర, ప్రత్యేక వాహనాల ఇన్సూరెన్స్
- క్యాబులు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు కాకుండా, వ్యాపారాల కోసం తరచుగా ఉపయోగించేందుకు అనేక వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వ్యవసాయం, మైనింగ్, నిర్మాణ రంగాల్లో వినియోగించే ప్రత్యేక వాహనాలు ఉండొచ్చు.
- కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ చేసిన వాహానానికి జరిగే డ్యామేజీలు, నష్టాల నుంచి రక్షిస్తుంది.
- పెట్టుబడి, వాహనాల పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ చేయడం అనేది ఎల్లప్పుడూ మంచి ఎంపిక. దీంతో అనుకోని సంఘటనల వల్ల కలిగే ఆర్థిక పరమైన నష్టాల నుంచి వ్యాపారం లేదా యజమానిని గట్టెక్కిస్తుంది.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీల రకాలు11
మీ కమర్షియల్ వాహనం యొక్క అవసరాలకు తగ్గట్టు, మేము ప్రధానంగా రెండు పాలసీలను అందిస్తాం. అయితే కమర్షియల్ వాహనం ప్రమాదం, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, మీ సొంత కమర్షియల్ వాహనంతో పాటు దాన్ని వినియోగించే యజమాని లేదా డ్రైవర్కు కూడా ఆర్థికంగా రక్షణ కల్పించే ప్రామాణిక ప్యాకేజీ పాలసీని తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నాం.
లయబిలిటీ | స్టాండర్డ్ ప్యాకేజీ |
ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి మీ కమర్షియల్ వాహనం వల్ల కలిగే డ్యామేజీలు |
|
మీ ఇన్సూరెన్స్ చేయబడిన గూడ్స్ క్యారీయింగ్ వాహనంతో టోయింగ్ చేసినప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి కలిగే నష్టాలు |
|
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదం, దొంగతనం లేదా ప్రమాదాల కారణంగా సొంత సరుకు రవాణా వాహనానికి డ్యామేజీ లేదా నష్టం జరిగితే |
|
యజమాని–డ్రైవర్కు గాయం/మరణంయజమాని–డ్రైవర్కు అంతకుముందు వ్యక్తిగత ప్రమాద బీమా లేకపోతే.. |
|
Get Quote | Get Quote |
క్లెయిమ్ ఫైల్ చేయడం ఎలా?
మా నంబర్ 1800-258-5956కు కాల్ చేయండి లేదా hello@godigit.comకు ఈ-మెయిల్ పంపండి.
మా పనిని సులభతరం చేసేందుకు పాలసీ నంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ & సమయం అలాగే ఇన్సూరెన్స్ చేయబడిన/ కాల్ చేసిన వ్యక్తి కాంటాక్టు నంబర్ తదితర వివరాలను దగ్గర ఉంచుకొని మాకు తెలియజేయండి.
మా గురించి మా కస్టమర్లు ఏమి చెబుతున్నారంటే..
చాలా సులభమైన క్లెయిమ్ ప్రక్రియ. మీ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి నంబర్‌ను డయల్ చేస్తే డిజిట్ ఇన్సూరెన్స్ టీమ్‌కు కలిసింది. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే క్లెయిమ్‌ను నమోదు జరిగింది. వెంటనే రిపేర్ కోసం వాహనాన్ని వర్క్‌షాప్‌కు తీసుకెళ్లాను. అదే రోజు సర్వే చేశారు. అభిషేక్ సర్ నాకు అన్ని ప్రాసెస్లను వివరించారు. క్లెయిమ్ పొందడంలో చాలా సహాయపడ్డారు.
శ్రీ సిద్ధేశ్ మఖ్దూం అందించిన సేవలకు నేను చాలా ముగ్ధుడిని అయ్యాను. చాలా సంతృప్తి చెందాను. ఆయనతో డీల్ చేయడం చాాలా గొప్ప అనుభవం. ఆయనకు ఆటో రంగంపై అపారమైన పరిజ్ఞానం ఉంది. అతను మర్యాదగా ప్రవర్తించారు. ఆయన పని కూడా చక్కగా ఉంది. నా సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన చాలా సహాయం చేశారు. నా సమస్యను పరిష్కరించడానికి అలాంటి పరిజ్ఞానం, అనుభవం కలిగి ఉన్న వ్యక్తిని అందించినందుకు డిజిట్‌కు ధన్యవాదాలు. సిద్ధేశ్ సార్ మీరు గొప్ప పని చేస్తున్నారు. దాన్ని అలాగే కొనసాగించండి. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు.
నా సమస్యను డిజిట్ ఇన్సూరెన్స్ హ్యాండిల్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. గో డిజిట్‌కు చెందిన రత్నకుమార్ గారు నా కేసును హ్యాండిల్ చేసిన విధానాన్ని పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. గ్యారేజ్ వ్యక్తులతో నా వాహన పరిస్థితిపై ఎప్పటికప్పుడూ ఫాలో-అప్ అయ్యేవారు. రత్నకుమార్ వంటి వారి చేతుల్లో డిజిట్ సురక్షితంగా ఉందని నేను భావిస్తున్నాను. కచ్చితంగా నా ఇన్సూరెన్స్ను రెన్యువల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా మరో వాహనం క్రెటా కోసం కూడా డిజిట్ వద్దే ఇన్సూరెన్స్ తీసుకుంటాను. అందరికీ డిజిట్‌ను సిఫారసు చేస్తాను. డిజిట్‌కు ఆల్ ది వెరీ బెస్ట్.
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి
నా వ్యాపారం కోసం కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ను ఎందుకు కొనుగోలు చేయాలి?
మీరు మీ వ్యాపారం కోసం వాహనాన్ని ఉపయోగిస్తున్నా, లేకపోయినా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలను సంరక్షించుకునేందుకు వాహన బీమా తప్పనిసరి. చట్టప్రకారం థర్డ్ పార్టీ (లయబులిటీ) పాలసీ తీసుకోవడం తప్పనిసరి. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వలన మీ వాహన యజమాని–డ్రైవర్ సంరక్షించబడతారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాలు తలెత్తినపుడు ఇది మిమ్మల్ని కాపాడుతుంది.
మీ వ్యాపారం ఎక్కువగా వాహనాల మీద ఆధారపడి ఉంటే.. మీరు తప్పనిసరిగా స్టాండర్డ్ ప్యాకేజీని కలిగి ఉండాలి. ఇది వాహన యజమాని–డ్రైవర్‌ను సంరక్షించడమే గాక, మీ వ్యాపారాన్ని ఆర్థిక నష్టాల నుంచి కూడా కాపాడుతుంది. ఎంత చెప్పుకున్నా వ్యాపారం అనేది రిస్కుతో కూడుకునే ఉంటుంది. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కనీసం నష్టాల నుంచి అయినా సంరక్షిస్తుంది.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ముఖ్యమా?
అవును, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ముఖ్యమే. చట్టప్రకారం లయబులిటీ పాలసీని తీసుకోవడం తప్పనిసరి. మీ సొంత వాహనాన్ని సంరక్షించుకునేందుకు స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీని తీసుకోవడం చాలా అవసరం. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దొంగతనం, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు వంటి అనుకోని సందర్భాల్లో మీ వ్యాపారాన్ని రక్షిస్తుంది.
ఆన్లైన్లో సరైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ను ఎలా ఎంచుకోవాలి?
ఈరోజు మార్కెట్లో ఉన్న ఆప్షన్ల నుంచి మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండే పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంచుకునే పాలసీ సులువుగా, విలువైనదిగా, అన్ని విపత్కర పరిస్థితుల నుంచి మీ వ్యాపారాన్ని కాపాడేదిగా ఉండాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ తొందగా పూర్తయ్యేలా ఉండాలి. ఇన్సూరెన్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం అనేది చాలా ముఖ్యం.
మీ వాహనానికి సరైన పాలసీని ఎంచుకోవడంలో మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు:
సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV): ఐడీవీ (IDV) అంటే మీ వాహనం మార్కెట్ విలువ. మీరు బీమా చేయాలని అనుకుంటున్న వాహనం ప్రస్తుత అమ్మకపు ధర (తరుగుదలతో సహా). మీ ప్రీమియం అనేది ఈ విలువ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు సరైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ను ఎంచుకునేందుకు ఐడీవీ (IDV)ని సరిగ్గా చూసుకోవాలి.
సర్వీస్ ప్రయోజనాలు : 24x7 కస్టమర్ సపోర్ట్, నగదు రహిత గ్యారేజీలు ఎన్ని ఉన్నాయనేది చూసుకోండి. ఈ సేవలు మీకు చాలా ఉపయోగపడుతాయి.
యాడ్–ఆన్స్‌ను సమీక్షించండి : మీ వాహనానికి సరైన కమర్షియల్ పాలసీని ఎంచుకున్నపుడు.. గరిష్ట ప్రయోజనాల కోసం అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్ ఏంటనేది సమీక్షించండి.
క్లెయిమ్ వేగం : పాలసీ ఏదైనా కానీ ఇది చాలా ముఖ్యం. క్లెయిములను తొందరగా సెటిల్ చేస్తుందని మీకు నమ్మకమున్న కంపెనీలోనే పాలసీ చేయండి.
ఉత్తమ విలువ : ప్రీమియం విలువ, సేవలు, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం, యాడ్–ఆన్స్ తర్వాత ఉత్తమ విలువ ఉందని అనిపించే బీమా పాలసీనే ఎంచుకోండి.
ఆన్లైన్లో కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కోట్స్ను ఎలా పోల్చిచూడాలి?
తక్కువ ఖర్చుతో అయిపోయే కమర్షియల్ వెహికిల్ పాలసీని తీసుకోవడం మంచిగానే అనిపిస్తుంది. కానీ పలు రకాల కంపెనీల కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కోట్స్ను పోల్చి చూసిన తర్వాత మాత్రమే పాలసీ తీసుకోవాలి. పోల్చి చూసేటపుడు సర్వీస్ ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం వంటివి తనిఖీ చేయాలి.
మీ వాహనం రకాన్ని బట్టి వాణిజ్య వాహనాలు చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కావున అన్ని సందర్భాల్లో మీ వాహనాన్ని సంరక్షించే పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన అంశాలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.
సర్వీస్ ప్రయోజనాలు : మనం ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో సర్వీస్ ప్రయోజనాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందు వివిధ బీమా కంపెనీలు అందిస్తున్న సర్వీస్ ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొని మంచి పాలసీని తీసుకోవడం చాలా అవసరం.
డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ 24*7 కస్టమర్ కేర్ మద్దతును అందిస్తుంది. పైగా ఈ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా 1,400 కు పైచిలుకు నగదు రహిత గ్యారేజీలు ఉన్నాయి.
త్వరితమైన క్లెయిమ్ సెటిల్మెంట్ : క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది బీమాలో చాలా ముఖ్యం. కాబట్టి త్వరితగతిన క్లెయిములను సెటిల్ చేసే బీమా కంపెనీనే ఎంచుకోండి.
డిజిట్లో ‘జీరో హార్డ్ కాపీ’ విధానం అమలులో ఉంది. అంటే మేము ప్రతీ దానికి కేవలం సాఫ్ట్ కాపీలను మాత్రమే అడుగుతాం. ప్రతీది కాగిత రహితంగా, చాలా వేగంగా ఉంటుంది.
మీ ఐడీవీ (IDV)ని తనిఖీ చేయండి : మనకు ఆన్లైన్లో లభించే అనేక రకాల బీమా కంపెనీల కోట్స్ తక్కువ ఐడీవీ (IDV–ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)తో ఉంటాయి. ఈ విలువ మార్కెట్లో మీ వెహికిల్ ధరను చూపిస్తుంది. ఐడీవీ (IDV) అనేది మీ ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసినపుడు మీకు సరైన మొత్తం వచ్చేలా ఇది చూస్తుంది.
దొంగతనం జరిగినప్పుడు, లేదా మరమ్మతు చేయలేని విధంగా ధ్వంసం జరిగినప్పుడు మీ ఐడీవీ (IDV) విలువ చాలా తక్కువగా ఉందని మీరు తెలుసుకుంటారు. కానీ మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. డిజిట్లో మీకు నచ్చిన విధంగా ఐడీవీ (IDV)ని సెట్ చేసుకునే సౌలభ్యం ఉంది. కావున దీని వలన మీకు సరైన క్లెయిమ్ వస్తుంది.
ఉత్తమ విలువ : చివరగా.. మీకు సరైనదిగా అనిపించే ఉత్తమ పాలసీని ఎంచుకోండి. సరైన ధరలు, సర్వీస్ ప్రయోజనాలు, త్వరితంగా క్లెయిములు వచ్చేవి.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
మీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కింది అంశాలు ప్రభావితం చేస్తాయి.
మోడల్, ఇంజిన్, వాహన తయారీదారు : మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ప్రమాద స్థాయి అనేది మొదట ఉన్న వాహనం మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణ క్యాబ్ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది గూడ్స్ తీసుకెళ్లే ట్రక్కుతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సులభమైన మాటల్లో చెప్పాలంటే ఇది పరిమాణాన్ని, వాహన రకాన్ని బట్టి ఉంటుంది. అదనంగా ఏ సంవత్సరంలో వాహనం తయారు చేయబడింది, వాహన కండీషన్ వంటివి కూడా ప్రీమియం మీద ప్రభావం చూపుతాయి.
ప్రాంతం : మీ వాణిజ్య వాహనం ఎక్కడ నమోదు చేయబడింది, ఎక్కడ ఉపయోగించబడుతుందనేది కూడా ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది.
ఎందుకంటే ఒక్కో నగరంలో సంభవించే రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు.. మెట్రో నగరాలైన ముంబై, బెంగుళూర్, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో మీ వాహనానికి నాన్–మెట్రో నగరాల కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆ మేరకు ప్రీమియం విలువ కూడా పెరుగుతుంది.
నో క్లెయిమ్ బోనస్ : మీకు ఇంతకుముందు కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఉండి.. ప్రస్తుతం దానిని పునరుద్ధరించడానికి లేదా బీమా కంపెనీని మార్చేందుకు చూస్తుంటే.. అటువంటి సందర్భంలో మీ ఎన్సీబీ (NCB–నో క్లెయిమ్ బోనస్) కూడా పరిగణించబడుతుంది. అప్పుడు మీ ప్రీమియం కూడా తగ్గింపు రేటులో వస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ అనేది మీ వాణిజ్య వాహనం మీద క్రితం ఏడాది ఎటువంటి క్లెయిములు చేయకపోతే వర్తిస్తుంది.
బీమా ప్లాన్ రకం: కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద ప్రధానంగా రెండు రకాల పాలసీలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంచుకున్న పాలసీ వలన కూడా మీ ప్రీమియం ప్రభావితమవుతుంది.
లయబులిటీ ప్లాన్ తక్కువ ప్రీమియం కలిగి ఉంటుంది. ఇది కేవలం థర్డ్ పార్టీ డ్యామేజీలను మాత్రమే కవర్ చేస్తుంది. అదే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ విషయానికి వస్తే.. దీనికి కాస్త ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ వ్యక్తులతో పాటుగా సొంత వాహన నష్టాలను కూడా కవర్ చేస్తుంది. వాహన యజమాని లేదా డ్రైవర్కు జరిగే నష్టాలకు ఆర్థిక కవర్‌ను అందిస్తుంది.
వాణిజ్య వాహనం ఉద్దేశం: ప్రతీ వాణిజ్య వాహనం వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. కొన్ని ప్రయాణికులను చేరవేయడానికి, మరికొన్ని సరుకులను రవాణా చేసేందుకు, అలాగే భవన నిర్మాణ పనుల్లో కూడా ఉపయోగించబడతాయి. కాబట్టి.. మీ బీమా ప్రీమియం విలువ అనేది ఈ విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. సాధారణ ఆటో రిక్షా ఇన్సూరెన్స్ అనేది సరుకుల రవాణాకు వాడే ట్రక్ ఇన్సూరెన్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కేవలం వాటి పరిమాణం వల్లే ఇలా జరుగుతుందని అనుకోవడం సరికాదు. ట్రక్ ఇన్సూరెన్స్లో ట్రక్‌తో పాటు అందులో రవాణా చేసే సరుకులకు కూడా బీమా వర్తిస్తుంది.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
ఐడీవీ(IDV) అంటే ఏమిటి?
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అనేది ఏదైనా సందర్భంలో మీ వాహనం దొంగతనానికి గురయినప్పుడు, లేదా మరమ్మతు చేయలేని విధంగా పాడైపోయినప్పుడు బీమా కంపెనీ మీకు చెల్లించే గరిష్ట విలువ. తయారీదారుడి అమ్మకపు ధర నుంచి వాహన తరుగుదలను తీసేస్తే ఈ విలువ వస్తుంది.
NCB (నో క్లెయిమ్ బోనస్) అంటే ఏమిటి?
నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ప్రీమియంలో అందించే తగ్గింపు. మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఏడాదిలో ఎటువంటి క్లెయిములు చేయకుంటే ఇది మీకు లభిస్తుంది. నో క్లెయిమ్ బోనస్ 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందజేస్తుంది. మీ వాణిజ్య వాహనానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా బండి నడపడం ద్వారా ఇది మీకు వర్తిస్తుంది.
డిడక్టబుల్స్ అంటే ఏమిటి?
డిడక్టబుల్స్ (మినహాయింపులు) అనేవి పాలసీదారుడు క్లెయిమ్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం. సాధారణంగా రెండు రకాల డిడక్టబుల్స్ ఉన్నాయి. ఒకటి.. తప్పనిసరిది, రెండోది స్వచ్చందమైనది. మీ వ్యాపార విలువను బట్టి, ఈ రెండింటిలో నుంచి ఏదైనా ఒకటి ఎంచుకోండి.
మీ స్వచ్చంద క్లెయిమ్ ఎంత ఎక్కువగా ఉంటే మీ బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. స్వచ్చంద డిడక్టబుల్స్ అనేది మీరు క్లెయిమ్ చేసిన సమయంలో మీకు రాని అమౌంట్. ఈ మొత్తం విలువను మీరే భరించాల్సి ఉంటుంది.
క్యాష్‌లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?
మీరు మీ వాణిజ్య వాహనాన్ని డిజిట్ ఆధీకృత రిపేర్ సెంటర్లో మరమ్మతు చేయించుకుంటే ఆమోదించబడిన క్లెయిమ్ అమౌంట్ మొత్తాన్ని మేము రిపేర్ సెంటర్‌కే నేరుగా చెల్లిస్తాం. దీనినే క్యాష్‌లెస్ క్లెయిమ్ (నగదు రహిత క్లెయిమ్) అని అంటారు.
దయచేసి ఇది గమనించండి. మీకు ఏవైనా డిడక్టబుల్స్ ఉంటే, మీ బీమా కవర్ చేయని మరమ్మతు చార్జీలు ఉంటే ఆ ఖర్చులను మీ జేబు నుంచి మీరే భరించాల్సి ఉంటుంది.
థర్డ్ పార్టీ లయబులిటీ అంటే ఏమిటి?
మీ వాణిజ్య వాహనం ఏదైనా థర్డ్ పార్టీ ఆస్తులకు గానీ, వ్యక్తులకు గానీ డ్యామేజీ కలిగిస్తే దానినే థర్డ్ పార్టీ లయబులిటీ అంటారు. ఇటువంటి తరుణంలో మీ బీమా పాలసీ (లయబులిటీ ఓన్లీ పాలసీ /స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీ) జరిగే నష్టాలను ఆర్థికంగా కవర్ చేస్తుంది.
సాధారణ కార్ ఇన్సూరెన్స్తో పోల్చుకుంటే కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఎలా భిన్నమైనది?
సాధారణ వాహనం కంటే వాణిజ్య వాహనానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. కావున సాధారణ కార్ ఇన్సూరెన్స్ కంటే కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం. ఉదాహరణకు చూసుకుంటే.. మీ సరుకు రవాణా వాహనాన్ని తీసుకున్నట్లయితే ఏదైనా సందర్భంలో ప్రకృతి విపత్తు, ప్రమాదం వలన దానికి నష్టం కలిగితే దానిలో ఉన్న సరుకు కారణంగా మీకు అధిక మొత్తంలో నష్టం కలుగుతుంది.
ట్యాక్సీలు, బస్సులకు ఎక్కువ ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంటుంది. ప్రతీరోజు ఇవి ఎంతో మంది ప్రయాణికులను తీసుకెళ్తుంటాయి. కావున వీటికి ఎక్కువ లయబులిటీ ఉంటుంది.
సులభంగా చెప్పాలంటే.. సాధారణ కార్ ఇన్సూరెన్స్ అనేది మీ సొంత వాహనాల కోసం రూపొందించబడింది. వ్యాపారంలో భాగంగా ఉన్న వాహనాల కోసం ప్రత్యేకంగా కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది.
ఈ రెండు రకాల వాహనాలు ఎదుర్కొనే రిస్క్, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకు తగిన విధంగానే పాలసీలు కూడా రూపొందించబడ్డాయి.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు/రెన్యూ చేయడం ఎందుకు ముఖ్యం?
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు/రెన్యూ చేయడం ఎందుకోసం ముఖ్యమంటే..
- మోటారు వాహన చట్టం ప్రకారం, ప్రతీ వాహనదారుడు బీమా కలిగి ఉండాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా అయినా ఉండాలి. నష్టాలు, డ్యామేజీల నుంచి కవర్ చేయడానికి బీమా తప్పనిసరి.
- మీ వాణిజ్య వాహనాన్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఘర్షణల నుంచి కాపాడుకునేందుకు సమగ్ర బీమా పాలసీని తీసుకోవడం అవసరం.
- అనుకోని సందర్భాల్లో తలెత్తే వ్యాపార నష్టాల నుంచి మిమ్మల్ని కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.
భారతదేశంలో కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ పాలసీల మధ్య తేడా ఏమిటి?
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ పాలసీ థర్డ్ పార్టీ వాహనాలకు జరిగినన డ్యామేజీల నుంచి మాత్రమే కవర్ చేస్తుంది. అదే సయమంలో కాంప్రహెన్సివ్ పాలసీ మాత్రం థర్డ్ పార్టీతో పాటుగా సొంత నష్టాలను కూడా కవర్ చేస్తుంది. సొంత వస్తువులు పోయినా కూడా ఇది కవర్ చేస్తుంది.
పాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ అంటే ఏమిటి?
ప్రజలను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లే వాణిజ్య వాహనాలను పాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ అంటారు. ఉదాహరణకు పబ్లిక్, స్కూల్ బస్సులు, క్యాబ్‌లు, ట్యాక్సీలు.
గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ అంటే ఏమిటి?
పేరులోనే గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ అని ఉన్న ఈ వాణిజ్య వాహనం ఒక చోటు నుంచి మరో చోటుకు సరుకులను తరలించేందుకు ఉపయోగపడుతుంది. ట్రక్కులు, లారీలు మొదలయినవి ఈ రకం కిందకు వస్తాయి.
ప్రత్యేక వాహనాల కేటగిరీ కింద ఏవి పరిగణించబడతాయి?
ఏదైనా ప్రత్యేక వాహనం పాసింజర్ క్యారీయింగ్, గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్‌గా పరిగణించబడదు. అది స్పెషల్ కేటగిరీ వెహికిల్ లాగానే పరిగణించబడుతుంది. పికప్ ట్రక్కులు, నిర్మాణ సమయంలో వాడే వాహనాలు ఈ కేటగిరీలో ఉంటాయి.
నా వాణిజ్య వాహనానికి ప్రమాదం జరిగితే నేనేం చేయాలి?
ఒకవేళ మీ వాణిజ్య వాహనం ప్రమాదానికి గురైతే వెంటనే 1800-103-4448 నంబర్‌పై కాల్ చేయండి. ఆ సమస్య నుంచి మీరు బయటపడేలా మేము సాయం చేస్తాం.
నా వాణిజ్య వాహనానికి ఏవైనా డ్యామేజీలు జరిగితే నేను ఎక్కడ రిపేర్ చేయించుకోవాలి?
డిజిట్ ఇన్సూరెన్స్లో మేము భారతదేశ వ్యాప్తంగా గ్యారేజీలను కలిగి ఉన్నాం. మీరు మీ వాణిజ్య వాహనాన్ని వాటిల్లో ఏదైనా గ్యారేజ్‌కు తీసుకెళ్లవచ్చు. లేదా వేరే రిపేర్ సెంటర్లో అయినా రిపేర్ చేయించుకోవచ్చు. రిపేర్‌కు అయిన ఖర్చును మీరు క్లెయిమ్ చేస్తే తిరిగి పొందుతారు.