24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అంటే ఏమిటి?
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ లేదా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో మీరు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లేదా బ్రేక్ డౌన్ కవర్ అనే యాడ్-ఆన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇది మీరు రోడ్డు మీద ఇరుక్కుపోయినప్పుడు, మీకు ఎప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కావాలన్నా అప్పుడు మీకు సహాయపడుతుంది.
ఇది చిన్న ప్రమాదం జరిగినా లేదా టైర్ ఫ్లాట్ అయినా, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ మీకు సాయం చేస్తుంది. ఇలాంటి ఇబ్బందికర సమయంలో మీరు క్లెయిమ్ చేయడానికి వీలుకాకపోయినా మీకు సహాయం మాత్రం అందుతుంది.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ధర ఎంత?
కాంప్రహెన్సివ్ కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో స్టాండర్డ్ మినిమమ్ అడిషన్ని మీ ప్రీమియంకు జోడించడం ద్వారా మీరు రోడ్‌సైడ్ లేదా బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ కవర్‌ని తీసుకోవచ్చు. డిజిట్‌తో కార్కు మీరు రూ. 102 అదనంగా, టూ-వీలర్‌కి రూ. 40 అదనంగా చెల్లించడం ద్వారా దీనిని పొందవచ్చు.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ఎలా పని చేస్తుంది?
మీరు ఇప్పటికే మీ డిజిట్ కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో రోడ్‌సైడ్/బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్‌ని ఎంచుకున్న తర్వాత, అవసరమైన సమయాల్లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను ఉపయోగించడం సులభం!
ఇబ్బందికర సమయాల్లో (మీకు సేవ అవసరమైనప్పుడు) మీరు చేయాల్సిందల్లా 1800-103-4448 నంబర్‌పై మాకు రింగ్ ఇడమే. అయితే, అప్పుడు మీ పాలసీ వివరాలను అందుబాటులో ఉంచుకోవడం మర్చిపోకండి. ఏ సమయంలోనైనా మేము మీకు అండగా ఉంటాము.
డిజిట్‌తో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ 24x7 సపోర్ట్‌తో వస్తుంది. సౌలభ్యం (కన్వీనియెన్స్), లేబర్ ఖర్చులను కూడా ఇది చూసుకుంటుంది. మేము మీ నగరం నుంచి 500 కిలోమీటర్ల వరకు మీకు సేవలను అందిస్తాము (ఇతర కంపెనీలు కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే)
కవర్‌లో ఏమేం కవర్ అవుతాయి - RSA వివరాల్లోకి వెళదాం పదండి
RSA కింద మీ కార్ ఇన్సూరెన్స్ లేదా బైక్ ఇన్సూరెన్స్‌కి అదనంగా ఏమేం కవర్ అవుతాయనే విషయాలను మేము కింద మీకు అందించాం. మొత్తానికి మీరు మీ కవరేజీలలోని వివరాలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కాబట్టి మీరు రోడ్‌సైడ్ లేదా బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్ యొక్క ప్రయోజనాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు.
మీ బ్యాటరీలో సమస్యల కారణంగా మీ కారు లేదా టూ-వీలర్ ఆగిపోయిన సమయాల్లో ఇది పని చేస్తుంది. ఈ సందర్భంలో అన్ని లేబర్, రవాణా ఖర్చులను చెల్లించడంలో మీ RSA కవర్ మీకు సాయం చేస్తుంది.
చాలామంది తరుచూ ‘కీ’లను (తాళం చెవులు) మర్చిపోతుంటారు! మీరు రోడ్డు మీద ఇరుక్కుపోయినప్పుడు రోడ్ అసిస్టెన్స్ కవర్ ద్వారా మీరు మీ స్పేర్ ‘కీ’లను తెప్పించుకోగలరు. ఇందుకు పికప్, డెలివరీ సర్వీస్ దీని కింద కవర్ అవుతుంది. లేదంటే టెక్నీషియన్ల సాయంతో మీరు మీ కార్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
మనం ఎప్పుడోసారి ఫ్లాట్ టైర్‌ని చూసే ఉంటాం! ఒకవేళ మీరు మీ ఫ్లాట్ టైర్ వల్ల వాహనంలో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు మీకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో మీకు సరైన టెక్నీషియన్ల సాయం అందించడం, లేదంటే స్పేర్ టైర్‌ను రీప్లేస్ చేయడానికి సాయం అందుతుంది.
కొన్నిసార్లు మీ బైక్ లేదంటే కార్ ఎందుకు స్టార్ట్ అవడం లేదో అర్థమే కాదు! అనుకోకుండా తలెత్తే ఇలాంటి సమస్యల వేళ మీ రిపేర్లకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సహాయం చేస్తుంది.
మీ కారు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న చోటే రిపేర్ కావడం లేదు. వర్క్ షాప్‌కి లేదంటే గ్యారేజ్‌కు తీసుకెళ్లి సర్వీసింగ్ చేయాల్సి వస్తే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ మీకు టోయింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
అనుకోని పరిస్థితిలో మీరు ఉంటే, మీకు సంబంధించిన సమాచారాన్ని అత్యవసరంగా మీ బంధువులకు చేరవేయడానికి ఆలోచిస్తారు. మీకోసం మేము ఆ పనిని చేస్తాము!
అనుకోని పరిస్థితుల్లో మీ వాహనానికి మాత్రమే కాదు, మీరు కూడా ప్రమాదానికి గురై ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు రోడ్సైగ్ అసిస్టెన్స్ కవర్ మీకు దగ్గరలోని మెడికల్ సెంటర్‌ను సంప్రదించడానికి, మీకు అవసరమైన చికిత్స అందేలా చూసుకోవడానికి సాయపడుతుంది.
మనకు చాలాసార్లు ఇలా జరుగుతుంది! మీ వాహనంలో ఇంధనం ఉందో లేదో చూసుకోకుండా బయల్దేరినప్పుడు అకస్మాత్తుగా ఇంధనం అయిపోతే మీకు సాయంగా మీరు ఉండే ప్రాంతానికి 5 లీటర్ల ఇంధనం చేరవేయబడుతుంది!
రోడ్‌సైడ్ అసిస్టెన్స్కు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన మినహాయింపులు, ఇతర విషయాలు
మేము మా నిబంధనలు, షరతుల విషయంలో చాలా ముందంజలో ఉన్నాము. తద్వారా క్లెయిమ్‌ల విషయానికి వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. డిజిట్ అందించే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌కు సంబంధించి, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
- మా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ క్లెయిమ్‌గా పరిగణించబడనప్పటికీ, మీరు ఒక పాలసీ సంవత్సరంలో గరిష్టంగా 4 సార్లు ఈ కవర్‌ను ఉపయోగించవచ్చు.
- మీరు మీ పాలసీ కాలంలో 2 సార్ల వరకు ఫ్యూయల్ అసిస్టెన్స్ పొందవచ్చు.
- మీకు వేరే ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ఉపయోగించాలి. ఉదాహరణకు; మీ వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్ లేదా డీలర్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బదిలీ చేయగలిగితే, అటువంటి సందర్భంలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వర్తించదు.
- మీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ రిపేర్, లేబర్ ఖర్చులకు కూడా వర్తిస్తుంది. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశంలో కేవలం 45 నిమిషాల వరకు మాత్రమే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వర్తిస్తుంది.
- అన్ని కార్, బైక్ క్లెయిమ్‌ల మాదిరిగానే, మీరు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా సరైన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే మీరు కవర్ చేయబడలేరు.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ని ఎవరు తీసుకోవాలి?
మీకు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కారు లేదా బైక్ ఉంటే, మీరు ఖచ్చితంగా మీ కాంప్రహెన్సివ్ కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ని ఎంచుకోవాలి. తద్వారా మీ వాహనం ఎల్లప్పుడూ చక్కగా నిర్వహించబడుతుంది. సాధ్యమయ్యే అన్ని సందర్భాల్లోనూ రక్షించబడుతుంది.
మీరు తరచుగా ప్రయాణించే వారైతే, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ని ఎంచుకోవడం మంచిది. మీ ప్రయాణంలో మీకు ఎప్పుడు సహాయం అవసరమో మీకు ఎప్పటికీ తెలియదు!
కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులను చూసుకోగలరు కానీ మరికొందరు అలా కాదు! కాబట్టి, మీ టూ-వీలర్ లేదా కార్ బ్రేక్ డౌన్ లేదా ఏవైనా చిన్న రిపేర్ల గురించి కూడా ఊహించలేని వ్యక్తి మీరైతే, మీ పాలసీలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ పొందడం మీ సంరక్షణకు భరోసా ఇస్తుంది!
మోటార్ ఇన్సూరెన్స్‌లో 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ విలువైనదేనా?
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ యొక్క వివిధ ప్రయోజనాలను బట్టి, మీకు సర్వీస్ ఎప్పుడు అవసరమో ఎప్పటికీ తెలియదు కాబట్టి ఇది ఖచ్చితంగా విలువైనదే!
నా కారుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పొందడానికి నాకు ఎంత ఖర్చవుతుంది?
రోడ్‌సైడ్ లేదా బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్‌కు మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలో అదనంగా రూ. 102 ఖర్చు అవుతుంది.
నా టూ-వీలర్ కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పొందడానికి నాకు ఎంత ఖర్చవుతుంది?
డిజిట్‌తో, మీరు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ని ఎంచుకుంటే మేము మీ ప్రీమియంకు స్టాండర్డ్ మినిమమ్ ఫీజు కింద రూ. 40 వసూలు చేస్తాము.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం క్లెయిమ్ చేయడం నా నో క్లెయిమ్ బోనస్‌పై ప్రభావం చూపుతుందా?
లేదు! అదృష్టవశాత్తూ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌లో మీరు క్లెయిమ్ చేసుకున్నా కూడా అది క్లెయిమ్ కిందకు రాదు. దీని వల్ల మీ నో క్లెయిమ్ బోనస్ ఎప్పటికీ అలానే ఉంటుంది.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కార్లను అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుందా?
అవును, మీరు మీ కీ (తాళం చెవి)ని పోగొట్టుకున్నట్లయితే లేదా మీ కారులో లాక్ చేయబడితే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ మీకు స్పేర్ కీని అందించడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో టెక్నీషియన్ సాయంతో మీ కారును అన్‌లాక్ చేయడంలో కూడా సహాయపడుతుంది. కాకపోతే సెక్యూరిటీ విషయంలో మీరు మీ ఐడీ (ID) ప్రూఫ్‌ను చూపించాల్సి ఉంటుంది.
నేను రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను. RSA కవర్‌లో నేను ఏమి చూడాలి?
- సులభంగా కాంటాక్ట్ అవడం: మీరు మీ కారుతో ఇబ్బందిలో ఉన్నప్పుడు, మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీని సులభంగా సంప్రదించగలరని నిర్ధారించుకోవాలి. అందుకే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌లో చూడవలసిన వాటిలో ఒకటి మీరు మీ ఇన్సూరెన్స్ సంస్థను ఎంత సులభంగా చేరుకోగలరు అనేది.
- టైమింగ్స్: సమస్యలు అనేవి చెప్పకుండానే వస్తాయి! అందుకే మీ ఇన్సూరెన్స్ కంపెనీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 24x7 సపోర్ట్‌తో అందించబడుతుందా లేదా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి!
- కవరేజ్మొ: త్తానికి, మీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ మీకు ప్రయోజనాలు, కవరేజీలను అందించాలి. అందువల్ల అందించే కవరేజ్ ప్రయోజనాలు ఏమిటో, అవి మీకు ఉపయోగపడుతాయో లేదో చెక్ చేసుకోవాలి.
- సర్వీస్ ప్రయోజనాలు: బేసిక్ కవరేజ్ కన్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో చూడండి. దీని సాయంతో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోండి.