డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

మోటార్​ ఇన్సూరెన్స్​లో రకాలు

అసలు మోటార్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

మోటార్​ ఇన్సూరెన్స్​ కూడా ఇతర ఇన్సూరెన్స్​ పాలసీల వంటిదే. కానీ, మోటార్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం తప్పనిసరి. పేరులో ఉన్నట్లుగానే అన్ని రకాల మోటార్​ వాహనాల​కు ఈ ఇన్సూరెన్స్​ వర్తిస్తుంది. కార్లు, జీపులు, కమర్షియల్​ వాహనాలు మొదలగునవి.

మీ భద్రత, ఇతరుల రక్షణ కొరకు ప్రభుత్వం మోటార్​ ఇన్సూరెన్స్​ను తప్పనిసరి చేసింది. ఏదైనా సంఘటన జరిగినపుడు మీకు అందించే ఇన్సూరెన్స్​ మొత్తం మీరు చెల్లించే ప్రీమియానికి చాలా ఎక్కువగా ఉంటుంది.

చాలా మంది మోటార్​ ఇన్సూరెన్స్​​ కేవలం మోటార్​ వాహనానికి మాత్రమే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు.

భారతదేశంలో ఉన్న వివిధ రకాల మోటార్​ ఇన్సూరెన్స్​ పాలసీలను గురించి, అవి ఏ ఏ రకాల కవరేజీల​ను అందజేస్తాయో తెలుసుకుందాం. మోటార్​ ఇన్సూరెన్స్​ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

  • మీరు ఏ రకమైన వాహనానికి ఇన్సూరెన్స్​ తీసుకుంటున్నారని

  • మీరు మీ వాహనానికి ఎంత కవరేజ్ ఎంచుకుంటున్నారని

భారతదేశంలో వాహనం రకాన్ని బట్టి ఏ ఏ ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయో చూస్తే..

భారతదేశంలో ఉన్న మోటార్​ ఇన్సూరెన్స్ రకా​లు

ప్రైవేట్​ కార్ ఇన్సూరెన్స్​ పాలసీ​

ఈ మోటార్​ ఇన్సూరెన్స్ ప్రైవేట్​ కార్​కు చక్కగా ఉపయోగపడుతుంది. ఏ ప్రైవేట్​ కార్​కైనా ఇది వర్తిస్తుంది. ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాల వంటి వాటి నుంచి ఇది మీ వాహనాన్ని కవర్​ చేస్తుంది. ఓనర్ ప్రమాదానికి గురైనా కూడా సంరక్షిస్తుంది. థర్డ్​ పార్టీ వ్యక్తులకు గాయాలైనా కూడా ఈ పాలసీ కింద కవర్​ అవుతారు. కారు ఇన్సూరెన్స్​ పొందండి

టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీ

ఈ ఇన్సూరెన్స్​ పాలసీ స్కూటర్​, బైక్​ వంటి టూ వీలర్లను కవర్​ చేస్తుంది. భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. ప్రమాదాలు, విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి ఇది మీ ద్విచక్ర వాహనాన్ని కాపాడుతుంది. థర్డ్​ పార్టీ వ్యక్తులకు డ్యామేజీలు​ జరిగితే సంరక్షిస్తుంది. ఒకవేళ మీరు పర్సనల్​ యాక్సిడెంట్ కవర్​ను తీసుకొని ఉన్నట్లయితే ద్విచక్ర వాహన యజమాని లేదా డ్రైవర్​, ప్రయాణికులకు జరిగిన ప్రమాదాలు కూడా కవర్​ అవుతాయి. బైక్​ ఇన్సూరెన్స్​ పొందండి

కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​

వ్యక్తిగత అవసరాలకు వాడుకోని అన్ని రకాల వాహనాలు ఈ ఇన్సూరెన్స్​ కింద కవర్​ అవుతాయి. వ్యక్తిగతం కాని అన్ని రకాల వాహనాలకు ఈ ఇన్సూరెన్స్​ చేయించొచ్చు. ట్రక్కులు, బస్సులు, భారీ కమర్షియల్​ వాహనాలు, తేలికపాటి కమర్షియల్​ వాహనాలు, బహుళ ప్రయోజనకారి వాహనాలు​, వ్యవసాయ సంబంధిత వాహనాలు​, ట్యాక్సీ/క్యాబ్, అంబులెన్సులు, ఆటో రిక్షాలు మొదలైనవి. కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ పొందండి

భారతదేశంలోని మోటార్​ ఇన్సూరెన్స్​ పాలసీ రకాలు

థర్డ్​ పార్టీ కాంప్రహెన్సివ్

యాక్సిడెంట్​ వలన సొంత​ టూ వీలర్​ డ్యామేజ్‌/నష్టం​ అయితే

×

అగ్ని ప్రమాదం వలన సొంత టూ వీలర్​ డ్యామేజ్‌/నష్టం​ అయితే

×

ప్రకృతి వైపరీత్యాల వలన సొంత​ టూ వీలర్​ డ్యామేజ్‌/నష్టం​ అయితే

×

థర్డ్​ పార్టీ వాహనం డ్యామేజ్​ అయితే

×

థర్డ్​ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్​ అయితే

×

పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​

×

థర్డ్​ పార్టీ పర్సన్‌కు గాయాలు/మరణం సంభవించినపుడు

×

మీ బైక్​ చోరీకి గురయినపుడు

×

మీ ఐడీవీ (IDV) కస్టమైజేషన్‌

×

కస్టమైజ్డ్​ యాడ్​-ఆన్స్​తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్​ మోటార్​ ఇన్సూరెన్స్​ పాలసీతో యాడ్–ఆన్స్​

కింద కొన్ని రకాలైన యాడ్​-ఆన్స్​ పేర్కొనబడ్డాయి. ఈ యాడ్​–ఆన్స్​ తీసుకుంటే మీ వాహనం సంరక్షించబడుతుంది. సాధారణ మోటార్ ఇన్సూరెన్స్​తో పోల్చుకుంటే వీటిని తీసుకుంటే కొంత ఎక్కువ ఖర్చవుతుంది.

జీరో డిప్రిషియేషన్

వయస్సు​ పెరిగే కొద్ది మనకు అనేక రకాల లోపాలు కనిపిస్తాయి. ఇదే మీ వాహనానికి కూడా వర్తిస్తుంది. మీ వాహనం (టూ వీలర్​ లేదా కార్​) పాతబడే కొద్ది వాటి విలువ తగ్గుతుంది. కానీ జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కవర్​ ద్వారా దీనిని కవర్​ చేయొచ్చు. మీ వాహనం విలువను ఏ మాత్రం తగ్గకుండా జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ ఉంచుతుంది. మీరు కొనుగోలు చేసినపుడు ఎంత విలువైతే ఉంటుందో అంతే ఉంటుంది. మీరు దేని కోసమైనా క్లెయిమ్​ చేసినపుడు మీకు ఎక్కువ అమౌంట్​ కూడా అందుతుంది.

ఇంజన్​ ప్రొటెక్షన్​ కవర్

మీ వాహనం యొక్క ఇంజన్ లేదా గేర్​ బాక్స్​కు ఏదైనా డ్యామేజ్​ అయితే ఇంజన్,​ గేర్​ బాక్స్​ ప్రొటెక్షన్​ కవర్​ సంరక్షిస్తుంది. మీ వాహనం ఇంజన్​లోకి నీరు చేరినా, లేదా ఆయిల్​ లీకవుతూ మీ ఇంజన్​ పాడయిపోయినా ఈ యాడ్​-ఆన్​​ కింద కవర్​ అవుతాయి.

రోడ్​ సైడ్​ అసిస్టెన్స్

అర్ధరాత్రి పూట మీరు ఒంటరిగా వెళ్తున్న సమయంలో మీ వాహనం బ్రేక్​ డౌన్​ అయితే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకోసమే రోడ్​ సైడ్​ అసిస్టెన్స్​ కవర్​ తీసుకోవాలి. ఈ కవర్​ ఉంటే మీ వాహనానికి బ్రేక్​ డౌన్​ అయితే మీ ఇన్సూరెన్స్​ కంపెనీ వారికి కాల్​ చేస్తే వారు వెంటనే ఘటనాస్థలికి వచ్చి మీ వాహనాన్ని రిపేర్​ చేస్తారు. అక్కడ రిపేర్​ చేయడం కుదరకపోతే మీ వాహనాన్ని దగ్గర్లో ఉన్న సర్వీస్​ స్టేషన్​కు తరలిస్తారు. తద్వారా మీరు దోపిడీలు, బందిపోట్ల బారి నుంచి కాపాడబడతారు.

కంజూమబుల్​ కవర్

ప్రస్తుత రోజుల్లో చాలా మోటార్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు కంజూమబుల్​ కవర్​ యాడ్​–ఆన్​ను అందజేస్తున్నాయి. ఇది మీ వాహనానికి అయిన సర్వీస్​ ఖర్చుల​ను కవర్​ చేస్తుంది. అంతేకాకుండా మీ బండిలో ఏదైనా నట్​ (బోల్ట్​) మిస్​ అయినా కూడా ఇది కవర్​ చేస్తుంది.

రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్

మీ కారు లేదా బైక్​ దొంగతనానికి గురవడమో లేదా పూర్తిగా డ్యామేజ్ కావడమో జరిగితే రిటర్న్​ టు ఇన్​వాయిస్​ యాడ్​–ఆన్​ మీకు మీ వాహన ఇన్​వాయిస్​కు సమానంగా ఖర్చును అందజేస్తుంది. కొత్త వాహనానికి అయ్యే రోడ్​ ట్యాక్స్​ ఖర్చును కూడా అందజేస్తుంది.

టైర్​ ప్రొటెక్ట్​ కవర్

సాధారణంగా టైర్​కు డ్యామేజ్​ అయితే స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​ పాలసీలో కవర్​ కాదు. ఆ డ్యామేజ్​ వలన మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రమే కవర్​ అవుతుంది. కానీ, మీరు టైర్ ప్రొటెక్ట్​​ యాడ్​–ఆన్​ను తీసుకుంటే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. మీ కార్​ టైర్​కు ఏ విధమైన డ్యామేజ్​ అయినా కానీ ఇది కవర్​ చేస్తుంది. ఉదా. టైర్​ పగిలినా, కోతలు పడ్డా..

ఎవరైనా కానీ ఇన్సూరెన్స్​ వల్ల వ్యక్తిగతంగా ప్రయోజనం పొందనపుడు దానిని తీసుకునేందుకు ఇష్టపడరు. అంతే కదా.

మీరు మీ వాహనాన్ని ప్రతి రోజు కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తే థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తీసుకోవడం అత్యుత్తమం. ఎందుకంటే అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

మీరు మీ కారు​ను త్వరలోనే అమ్మాలని చూస్తున్నపుడు.. సంవత్సరం మొత్తానికి ఎక్కువ ప్రీమియం కడుతూ కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం అనవసరం.

ఎక్కువ మంది థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తీసుకోవడానికి గల ప్రధాన కారణం.. కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​లో అధిక ప్రీమియం ఉంటుందని. ఇది మధ్య తరగతి వ్యక్తులకు భారంగా మారుతుంది. అందుకోసమే వారు థర్డ్​పార్టీ ఇన్సూరెన్స్​ పాలసీ మాత్రమే తీసుకుంటారు.

కానీ, థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తీసుకోవడం కంటే కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడమే మంచిదని మేము సిఫారసు చేస్తాం. ఈ పాలసీలో మీరు ఎక్కువ ప్రీమియం కట్టినా కూడా దానికి తగిన ప్రయోజనాలు ఉంటాయి.

తక్కువ ప్రీమియం ఉన్న ఇన్సూరెన్స్​ తీసుకోవడం ఎప్పటికీ అంత మంచిది కాదు. ఎందుకంటే చిల్లర డబ్బులకు కక్కుర్తి పడటం మంచిది కాదు. 😊!”