Third-party premium has changed from 1st June. Renew now
పాత టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి వివరించబడింది
మనం ఎంత ఎదిగినప్పటికీ, గతం తాలూకు కొన్ని జాడలను మనతోనే ఉంచుకుంటాము. వాటి గుర్తులు మన మనస్సు, హృదయాంతరాల లోపల లోతుగా ముద్రించబడి ఉంటాయి. కొన్ని విలువైన వస్తువులు వాటి స్థానాన్ని ఎప్పటికీ కోల్పోవు. మీరు కొనుగోలు చేసిన మొదటి బైక్‌పై మీకు ఎల్లప్పుడూ ఇదే విధమైన భావన ఉంటుంది. మీ వయస్సు లేదా జీవనశైలి మార్పు కారణంగా, మీరు మీ పాత బైక్‌ను నడపకపోవచ్చు. కానీ, మీరు దానిని డబ్బులకు అమ్ముకోవాలని ఎన్నడూ కోరుకోరు కదా.
మీ బైక్ పాతదైనప్పటికీ, మీరు ఇంకా దానికి బైక్ ఇన్సూరెన్స్ ని పొందవచ్చు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు దానిని ఉపయోగించాలని అనుకోవచ్చు. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ సులభంగా అందుబాటులో ఉంది కాబట్టి దీని గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దు.
పాత బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
పాత బైక్‌కు పలుసార్లు సర్వీసింగ్ చేయిస్తేనే కానీ నడపడానికి వీలు ఉండదనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. మీ బైక్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుదైతే, దాన్ని నిజంగా పాతది అనుకోవచ్చు. టూ వీలర్లో డిప్రిషియేషన్ (తరుగుదల) మీరు కొనుగోలు చేసినప్పటి నుంచే ప్రారంభమవుతుంది.
పాతదైన, విలువ డిప్రిషియేట్ అయిన బైక్‌కు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడాన్ని పాత బైక్ ఇన్సూరెన్స్‌గా పేర్కొనవచ్చు. మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ లేదా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కావచ్చు.
పాత బైక్ ను ఇన్సూర్ చేయించడం ఎందుకు ముఖ్యం?
మీ పాత బైక్‌ను కింద తెలిపిన పలు రిస్కుల నుంచి రక్షించుకోవడం కోసం ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అవి:
- అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టం లేదా అదుపులో లేని ఏదైనా సంఘటన
- దొంగతనం
- మీ బైక్‌కు సంబంధించిన ప్రమాదం ఫలితంగా ఏదైనా థర్డ్–పార్టీ ప్రాపర్టీకి నష్టం వాటిల్లడం వల్ల తలెత్తే లయబిలిటీ
- మీ బైక్‌కు సంబంధించిన ప్రమాదం ఫలితంగా ఏదైనా థర్డ్–పార్టీకి శారీరక గాయం అవడం వల్ల తలెత్తే లయబిలిటీ
పాత బైక్ కి ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు ఏమి చూడాలి?
మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లారనుకోండి. మీరు అత్యాధునిక టెక్నాలజీ, స్టోరేజీ సామర్థ్యం, కెమెరా క్లారిటీతో సహా ఇతర ఫీచర్ల కోసం చూస్తారు. ఇప్పుడు మీ పాత ల్యాప్‌టాప్ కొత్తదానిలా పనిచేయాలని మీరు కోరుకుంటున్నారని భావించండి. కాబట్టి, మీరు ఏమి చేస్తారు? దాని సామర్థ్యాన్ని పెరిగేలా చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి, దానిలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్స్టాల్ చేస్తారు.
మేము ఇంతకు ముందే చెప్పిన విధంగా మీరు పాత బైక్ కొనడానికి ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఒక అభిప్రాయానికి రావడానికి సహాయపడే కొన్ని కారకాలలో ఇవి కూడా ఉండాలి:
పాత బైక్‌కు ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి
ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీరు చెక్ చేయాల్సిన లిస్ట్:
వాహనం వయసు | (డిప్రిషియేషన్) |
---|---|
1 సంవత్సరం < వయసు < 2 సంవత్సరాలు | 10% |
2 సంవత్సరాలు < వయసు < 3 సంవత్సరాలు | 15% |
3 సంవత్సరాలు < వయసు < 4 సంవత్సరాలు | 25% |
4 సంవత్సరాలు < వయసు < 5 సంవత్సరాలు | 35% |
5 సంవత్సరాలు < వయసు < 10 సంవత్సరాలు | 40% |
10 సంవత్సరాలు < వయసు | 50% |
యాడ్–ఆన్ల కోసం చూడండి: ఏదైనా టూ–వీలర్ యజమాని కొన్ని యాడ్–ఆన్ కవర్ లను పొందడానికి ఆప్షన్లను కలిగి ఉండవచ్చు. కానీ యాడ్–ఆన్ కవర్లను 15 సంవత్సరాల వయస్సు వరకు వాహనానికి జోడించవచ్చు. ప్యాసింజర్ కవర్, జీరో డిప్రిషియేషన్ కవర్, మెడికల్ కవర్, యాక్ససరీస్ కవర్ వంటి యాడ్–ఆన్‌లను మీరు ఎంచుకోవచ్చు.
ఈ కవర్స్ కోసం మీరు కాస్త అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
పాత బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో ఎలా కొనాలి/రిన్యు చేసుకోవాలి?
మీ మిత్రుడి దగ్గరి నుంచి మీరు ఒక 10 సంవత్సరాల పాత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నారని అనుకోండి. మీరు దానిని నడపాలని అనుకుంటున్నారు కానీ, అంతకంటే ముందు మీరు దానికి ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలని అనుకుంటారు.
మీరు మీ సంరక్షణ గురించి ఎంతో బాగా ఆలోచిస్తున్నారు. అయితే పాత బైక్‌కు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకోసం మీరు కింది రెండింటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు:
4 సింపుల్ స్టెప్స్‌లో పాత బైక్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు/ రిన్యూ చేయండి
- స్టెప్ 1- బైక్ ఇన్సూరెన్స్ పేజీకి వెళ్లండి. మీ వెహికల్ యొక్క మేక్, మోడల్, వేరియెంట్, రిజిస్ట్రేషన్ తేదీని నింపండి. ని ప్రెస్ చేసి మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోండి.
- స్టెప్ 2- థర్డ్–పార్టీ లయబిలిటీ ఓన్లీ లేదా స్టాండర్డ్ ప్యాకేజీ (కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్) మధ్య ఏదో ఒకటి ఎంచుకోండి.
- స్టెప్ 3 - మీ మునుపటి ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాకు వివరాలు ఇవ్వండి- గడువు ముగిసిన తేదీ, గత సంవత్సరంలో చేసిన క్లెయిమ్, సంపాదించిన నో క్లెయిమ్ బోనస్ మొదలైనవి.
- స్టెప్ 4 - మీ ప్రీమియం కొరకు మీరు కోట్ పొందుతారు. ఒకవేళ మీరు స్టాండర్డ్ ప్లాన్ ఎంచుకున్నట్లయితే, IDVని సెట్ చేయడం, యాడ్–ఆన్‌లను ఎంచుకోవడం ద్వారా దానిని మీరు మరింత కస్టమైజ్ చేయవచ్చు. మీరు ఆ తరువాతి పేజీలో తుది ప్రీమియంను చూస్తారు.
పాత బైక్ ఇన్సూరెన్స్‌కు ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?
ఏదైనా వాహనం యొక్క ప్రీమియం దాని IDV, గత క్లెయిమ్ అనుభవం, ఫిట్ చేయబడిన యాక్సెసరీలు, ఏవైనా ఇతర కారకాల ఆధారంగా లెక్కించబడుతుంది. పాత బైక్ ఇన్సూరెన్స్ కొరకు ప్రీమియం దిగువ అంశాలపై ఆధారపడి ఉంటుంది: