Third-party premium has changed from 1st June. Renew now
బైక్ ఇన్సూరెన్స్‌లో IDV
ఇన్సూరెన్స్‌తో మీ ఎక్స్‌పీరియెన్స్‌ను సులభతరం చేసేందుకు ఇన్సూరెన్స్ పదజాలాన్ని సింప్లిఫై చేయడం. అందుకే మేము ఇక్కడ ఉన్నాం. ఇన్సూరెన్స్‌లో తరచూ తప్పుగా అర్థం చేసుకునే పదం IDV. బైక్ ఇన్సూరెన్స్‌లో IDV అంటే ఏంటి? మీ బైక్ కవరేజ్‌లో అది ఎందుకు కీలకం? టూ-వీలర్ ఇన్సూరెన్స్‌లో IDV అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చేసేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం.
మీరు మీకు నచ్చిన బైక్ కొనుగోలు చేసి ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఆ బైక్ ఇన్సూరెన్స్ రెన్యూ చేయాల్సిన సమయం వచ్చేసింది. మనలో చాలా మంది ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తారు, ఇక దాన్ని పక్కన పడేస్తారు. కానీ మీకు తెలుసా, మీ వాహనం మొత్తం విలువ ఎంతో? మీ టూ వీలర్ దొంగతానికి గురైనా లేదా రిపేర్‌కు వీలు కానంతగా పాడైనా మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?
దీనినే IDV అంటారు, అంటే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ
IDV - IDV అంటే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ. ఇది మీ వాహన మార్కెట్ విలువ అంతే.
Note: (కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ)’లోనే IDV చెల్లుబాటవుతుంది.
బైక్ ఇన్సూరెన్స్‌లో IDV అంటే ఏంటి?
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అనేది మార్కెట్‌పరంగా మీ బైక్‌కున్న విలువ. డిప్రిషియేషన్ విలువను తగ్గించి దీన్ని లెక్కిస్తారు. చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. మీరు రూ. 1 లక్ష విలువైన (రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, యాక్సెసరీస్ వంటివి కాకుండా) సరికొత్త బైక్ కొనుగోలు చేశారని అనుకుందాం. అది కొత్త బైక్ కాబట్టి కొనుగోలు సమయంలో దాని IDV రూ. 1 లక్షగా ఉంటుంది. కానీ, మీ బైక్ పాతదవుతున్న కొద్దీ దాని విలువ క్షీణిస్తూ ఉంటుంది. అలాగే IDV కూడా తగ్గుతుంది. రెండేళ్ల తర్వాత మీ బైక్ విలువ రూ. 65 వేలు అయితే, దాని IDV కూడా రూ. 65,000 గా ఉంటుంది.
ఇప్పుడు ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. ఈ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్లను బట్టి డిప్రిషియేషన్ ఆధారంగా IDV లెక్కిస్తారు, లేదా తయారీదారుడు మీ బైకుకు కట్టే విలువను బట్టి లెక్కిస్తారు. అంతేకానీ, మీరు వ్యక్తిగతంగా ఇతరులకు అమ్మే ధర ఆధారంగా ఇది ఉండదు. మీరు ఎవరికైనా మీ బైకును రూ. 85,000 లకు విక్రయించవచ్చు, కానీ IDV మాత్రం రూ. 65,000 గానే ఉంటుంది. మరి మీ బైక్ డిప్రిషియేషన్ రేట్లు ఏంటి?
మీ బైక్ డిప్రిషియేషన్ రేట్లు
బైక్ వయస్సు | డిప్రిషియేషన్ % |
---|---|
6 నెలలు అంత కంటే తక్కువ | 5% |
6 నెలల నుంచి 1 సంవత్సరం | 15% |
1-2 సంవత్సరాలు | 20% |
2-3 సంవత్సరాలు | 30% |
3-4 సంవత్సరాలు | 40% |
4-5 సంవత్సరాలు | 50% |
5+ సంవత్సరాలు | ఇన్సూరెన్స్ అందించే సంస్థ, పాలసీదారుడు పరస్పరం IDVని నిర్ణయిస్తారు. |
బైక్ కోసం IDV క్యాలిక్యులేటర్
IDVని లెక్కించడం చాలా సులభం: వెహికిల్ ఎక్స్‌షోరూమ్ ధర/ప్రస్తుత మార్కెట్ విలువ మైనస్ విడిభాగాల డిప్రిషియేషన్. రిజిస్ట్రేషన్ ఖర్చు, రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్ ధర వంటివి IDVలో ఉండవు. అంతేకాదు తర్వాత ఏవైనా యాక్సెసరీలు ఫిట్ చేసినట్లైతే వాటిని విడిగా లెక్కిస్తారు.
బైక్ IDV లెక్కించేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?
IDV అన్నది మీ బైక్ మార్కెట్ విలువను తెలియజేస్తుంది కాబట్టి దిగువ తెలిపిన అంశాలను పరిగణనలోకి తీసుకొని IDV లెక్కించాలి:
- మీ బైక్ మేక్ & మోడల్
- మీ బైక్ రిజిస్ట్రేషన్ తేదీ
- బైక్ రిజిస్ట్రేషన్ చేసిన సిటీ
- మీ బైక్‌లో వాడే ఇంధనం రకం
- మీ బైక్ వయస్సు
- మీ బైక్ పాలసీ రకం
- మీ బైక్ పాలసీ వ్యవధి
ఐదేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న టూ–వీలర్ IDV ఎలా లెక్కిస్తారు?
మీ బైక్ తయారీదారుడు అమ్మే ధర నుంచి మీరు ఉపయోగించిన కాలానికి డిప్రిషియేషన్ తీసివేయడం ద్వారా మీ బైక్ ఇన్సూరెన్స్ IDV లెక్కించడం జరుగుతుంది. 5 సంవత్సరాల వరకు డిప్రిషియేషన్ అన్నది కొత్త బైక్‌కు 5% చొప్పున తగ్గుతుంది, అదే 4 నుంచి 5 సంవత్సరాల పాత బైక్‌కు 50% వరకు డిప్రిషియేషన్ ఉంటుంది.
ఒకవేళ మీ బైక్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది అయితే, దాని IDVని ఇన్సూరెన్స్ కంపెనీ లెక్కిస్తుంది. అప్పుడు మీ టూ–వీలర్, దానిలోని భాగాల కండిషన్‌ను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ విలువను నిర్ధారిస్తుంది.
(చెక్): మీ వాహన IDV, ప్రీమియం తెలుసుకునేందుకు (బైక్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్) ని ఉపయోగించండి.
IDV Vs ప్రీమియం
మీ టూ–వీలర్‌కు సరైన IDV కలిగి ఉండటం చాలా ముఖ్యం. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మీ వాహన IDV ని తగ్గించి తక్కువ ప్రీమియం చెప్తాయి. అది చాలా దారుణం. ఎందుకంటే మీ బైక్ దొంగతనానికి గురైందనుకోండి లేదా రిపేర్ చేయలేనంత నష్టం ఏర్పడిందనుకోండి, అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయదలిస్తే మీ వాహన IDV తక్కువగా ఉంటుంది కాబట్టి మీ వాహనానికి చాలా తక్కువ విలువ వస్తుంది. మీ IDV అన్నది నేరుగా ప్రీమియంతో ముడిపడి ఉంటుంది. తక్కువ ప్రీమియం అంటే తక్కువ IDV, అలాగే, ఎక్కువ IDV అంటే ఎక్కువ ప్రీమియం. కానీ, Digitలో మేము మీ IDVని మీరే ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తాం. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది మీరు ఎంత ఆశించవచ్చో.
మీ IDV గురించి మీరు ఎందుకు అంత జాగ్రత్త తీసుకోవాలి?
అలా జరగకూడదు కానీ, మీ బైక్ దొంగతనానికి గురై అది దొరకకపోయినా లేదా ఏదైనా యాక్సిడెంట్‌లో అది పూర్తిగా పాడైనా అంటే రిపేర్ చేయడానికి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిన సందర్భాల్లో మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న IDV మొత్తాన్నే మీకు తిరిగి చెల్లిస్తుంది!
బైక్ ఇన్సూరెన్స్‌లో IDV ప్రాధాన్యత ఏంటి?
మీ బైక్ ఇన్సూరెన్స్‌లోని అతి ముఖ్యమైన అంశాల్లో IDV ఒకటి. ఇది కేవలం మీ బైక్ వాస్తవ విలువను నిర్ధారించడమే కాదు, మీరు బైక్ ఇన్సూరెన్స్‌కు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా నిర్ధారిస్తుంది.
అది మీ బైక్ యొక్క వాస్తవ విలువ - బైక్ ఇన్సూరెన్స్‌లో మీ బైక్ IDV అన్నది మీ బైక్ వాస్తవ విలువను తెలియజేస్తుంది. మీ బైక్ మోడల్, ఎన్నాళ్లుగా ఉపయోగిస్తున్నారు, దాని క్యూబిక్ కెపాసిటీ, ఏ సిటీలో దాన్ని ఉపయోగిస్తున్నారనే ఎన్నో అంశాలను అది పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి, IDVని సరిగ్గా ప్రకటించడం చాలా ముఖ్యం. దాని విలువ ఎంతో దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ అందిస్తాయి.
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం దీనిపైనే ఆధారపడి ఉంటుంది - పాలసీ రకం, మీరు వాహనం నడిపే ప్రదేశం, మీ బైక్ సీసీ కెపాసిటీ, తయారీ, బైక్ మోడల్, మరీ ముఖ్యంగా IDV వంటి అనేక అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.
మీ క్లెయిమ్ అమౌంట్ కూడా దీనిమీదే ఆధారపడి ఉంటుంది - డ్యామేజీ లేదా నష్టాలు ఏర్పడినప్పుడు మీరు అందుకునే గరిష్ట మొత్తమే మీ IDV. కొంత మంది ప్రీమియం భారాన్ని తగ్గించుకునేందుకు తమ IDVని తక్కువ చేసి చెప్తారు. అలా చేసినట్లైతే క్లెయిమ్ సమయంలో నష్టపోతారు. మీరు తక్కువ మొత్తాన్ని అందుకుంటారు. అది మీ బైక్‌కు చాలా తక్కువ మొత్తం కూడా కావచ్చు.
బైక్ ఇన్సూరెన్స్ IDVకి సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు
సరైన IDVని ప్రకటించడం ఎందుకు ముఖ్యం?
సరైన IDVని ప్రకటించడం చాలా ముఖ్యం ఎందుకంటే, మీ టూ–వీలర్‌కు డ్యామేజ్ లేదా నష్టం జరిగినప్పుడు దాని ఆధారంగానే మీకు వచ్చే గరిష్ఠ అమౌంట్‌ను నిర్ధారిస్తారు.
నా IDVని తప్పుగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది?
మీ IDVని మీరు తప్పుగా ప్రకటించినట్లైతే, మీరు పరోక్షంగా మీ బైక్ విలువను తగ్గిస్తున్నారు/పెంచుతున్నట్లు అవుతుంది. ఒకవేళ మీరు తక్కువగా ప్రకటించినట్లైతే క్లెయిమ్ సమయంలో మీకు తక్కువ అమౌంట్ లభిస్తుంది. అది మీ బైక్‌కు సరిపోకపోవచ్చు. అలాగే మీరు ఒకవేళ బైక్ విలువను ఎక్కువగా ప్రకటించినట్లైతే క్లెయిమ్ సమయంలో మీరు పొందే అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది.
టూ–వీలర్ IDV లెక్కించడం ఎలా?
మీ బైక్ మార్కెట్ విలువ చెక్ చేసి, దానిలో నుంచి డిప్రిషియేషన్ (అది ఎంత పాతది అనేదాన్ని బట్టి) మైనస్ చేయడం ద్వారా మీరు మీ బైక్ IDVని సుమారుగా లెక్కించుకోవచ్చు. అది ఎలా లెక్కించాలో మీకు సరిగ్గా అర్థం కాకపోతే, ఇలాంటి తరహాలో ఆన్‌లైన్‌లో ఉండే IDV క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
నేను నా టూ-వీలర్ IDV విలువను పెంచుకోవచ్చా?
Digitలో మేము మీ IDVని మీకు నచ్చినట్టుగా ఉంచేందుకు అనుమతిస్తాం. కానీ, మేము ఎప్పుడూ సరైన ధరనే సిఫార్సు చేస్తాం, దాని వలన మీకు సరైన ప్రీమియం మొత్తం తెలుస్తుంది. అంతే కాదు మీ క్లెయిమ్స్ సందర్భంగా మేము అంతే మొత్తాన్ని చెల్లిస్తాం. IDV ఎంత ఎక్కువుంటే మీ ప్రీమియం అంత ఎక్కువుంటుంది. ఎక్కువ క్లెయిమ్ అమౌంట్ కూడా ఉంటుంది.
నా టూ–వీలర్ IDVని తగ్గించి ప్రీమియంను తక్కువ చేసుకోవడం మంచి ఆలోచనేనా?
ఎంత మాత్రమూ కాదు. ఇది అసలు మంచి ఆలోచన కూడా కాదు. ఎందుకంటే అలా చేస్తే, తర్వాత మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు తక్కువ విలువ వస్తుంది. గుర్తుంచుకోండి, IDV అనేది డ్యామేజీ, నష్టాలు జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు చెల్లించే గరిష్ఠ మొత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి, మీ IDV, ప్రీమియం తగ్గితే మీరు పొందే క్లెయిమ్ అమౌంట్ కూడా తగ్గుతుంది.