Third-party premium has changed from 1st June. Renew now
ఆన్ లైన్లో సుజుకీ యాక్సిస్ ఇన్సూరెన్స్ కొనుగోలు/రెన్యువల్ చేయడం
స్కూటర్ కొనుగోలు చేయడానికి ముందు దాని ఫీచర్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే దాని సంరక్షణ కోసం మీరు పొందే టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మీరు ఆస్వాదించగల ప్రయోజనాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మీరు పొందగల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మీరు తరచూ తిప్పే వాహనంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? సుజుకీ యాక్సిస్ మీకు సరిగ్గా సరిపోయే వాహనం కావచ్చు. సుజుకీ యాక్సిస్ అనేది భారతదేశంలోని టూ వీలర్ మార్కెట్లోని అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఒకటి. దాదాపు 13 సంవత్సరాల క్రితం 2007లో మార్కెట్లోకి వచ్చిన సుజుకీ యాక్సిస్ తదనంతర కాలంలో మంచి పేరు తెచ్చుకుంది.
దానిలాంటి వాహనాన్ని సొంతం చేసుకోవడం గర్వకారణం. అందువల్ల, ప్రమాదాలు లేదా స్కూటర్‌కు ఏదైనా ఇతర నష్టం సంభవిస్తే అది మీకు మానసిక, ఆర్థిక నష్టానికి దారి తీయవచ్చు.
సుజుకీ యాక్సిస్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అటువంటి దురదృష్టకరమైన సందర్భాల్లో మీకు అవసరమైన రక్షణను అందిస్తుంది. అటువంటి ప్రమాదాలను ఈ పాలసీ నిరోధించలేనప్పటికీ, ప్రమాదం తర్వాత మీ స్కూటర్ రిపేర్ చేయించడంలో మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను మాత్రం తగ్గిస్తుంది. అంతేగాక మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు బీమా పాలసీలు తప్పనిసరి కాబట్టి, ఈ పాలసీని కలిగి ఉండటం వల్ల మీరు జరిమానాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండకపోతే మీ టూ వీలర్ పై రూ. 2000 జరిమానా వరకు విధించవచ్చు. ఒకవేళ మరోసారి అదే తప్పు పునరావృతమైతే జరిమానా రూ. 4000 వరకు చేరుకుంటుంది.
అయితే, దాని గురించి తర్వాత చూద్దాం! ముందు భారతదేశ వ్యాప్తంగా సుజుకీ యాక్సిస్ ఎందుకు ప్రతిష్టాత్మకమైన స్కూటర్లలో ఒకటిగా మారిందో తెలుసుకుందాం.
సుజుకీ యాక్సిస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేస్తుంది
డిజిట్ అందించే సుజుకీ యాక్సిస్ ఇన్సూరెన్స్నే ఎందుకు కొనాలి?
సుజుకీ యాక్సిస్ కోసం టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదంలో సొంత టూ-వీలర్ వాహనానికి కలిగే డ్యామేజీలు/నష్టాలు |
|
సొంత టూ వీలర్‌కు అగ్నిప్రమాదాల వల్ల కలిగే డ్యామేజీలు/నష్టాలు |
|
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే స్వంత టూ వీలర్‌కు డ్యామేజీలు/నష్టాలు |
|
థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలు |
|
థర్డ్ పార్టీ ఆస్తికి కలిగే డ్యామేజీలు |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగే గాయాలు/మరణం |
|
స్కూటర్ లేదా బైక్ దొంగతనం అయితే |
|
మీ ఐడీవీ (IDV) కస్టమైజ్ చేయడం |
|
కస్టమైజ్ చేయబడిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
ఎలా క్లెయిమ్ చేయాలి?
మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసినా లేదా రెన్యువల్ చేసిన తరువాత, మాకు 3-దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిముల ప్రక్రియ ఉన్నందున మీరు ఎలాంటి చింత లేకుండా ఉండవచ్చు.
స్టెప్ 1
1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై స్వీయతనిఖీ కోసం ఒక లింకును పొందండి. మీకు వివరించే దశలవారీ ప్రక్రియ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనం యొక్క డ్యామేజీలను ఫొటోలు తీయండి.
స్టెప్ 3
మీరు కావాలనుకున్న రిపేర్ విధానాన్ని ఎంచుకోండి, అంటే మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీఎంబర్స్మెంట్ పొందడం లేదా నగదు రహిత విధానం.
సుజుకీ యాక్సిస్: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఒకటిగా నిలవడానికి కారణమేంటి?
సుజుకీ యాక్సిస్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ స్కూటర్లతో పోటీపడి అన్ని పరీక్షల్లో తట్టుకొని నిలబడింది.
- 125cc ఇంజిన్ కెపాసిటీ, లీటరుకు 64 కిలోమీటర్ల మైలేజీతో, సుజుకీ యాక్సిస్ తరచూ ఉపయోగించేందుకు నిర్మించబడింది.
- ఇది ఎయిర్-కూల్డ్ ఇంజిన్, సింగిల్ ఫ్యూయల్ సిలిండర్‌ను కూడా కలిగి ఉంది.
- ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, టార్క్ 8.7 PS @ 7000 rpm ప్రతీసారి స్మూత్‌గా, చిరాకు లేని రైడ్‌ను అందిస్తుంది.
- భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సుజుకీ ఇటీవల సుజుకీ యాక్సిస్ యొక్క బిఎస్-6 వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ కాలుష్య ఉద్గార రేట్లను గణనీయంగా తగ్గిస్తుంది.
ఇటువంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో సుజుకీ యాక్సిస్ తన రైడర్లకు మృదువైన ఆన్-రోడ్ పర్ఫామెన్స్‌ను అందిస్తుంది. అయితే, దొంగతనం వంటి నేరాలతో పాటు, ప్రమాదం, సహజ, మానవ తప్పిదాల వల్ల కలిగే విపత్తుల వల్ల జరిగే నష్టాలు దీనికి హాని కలిగిస్తాయి.
అందువల్ల మీరు మీ వాహనానికి తగినంత సంరక్షణ లభిస్తుందో లేదో చూసుకోవాలి. తద్వారా రాబోయే అనేక సంవత్సరాలపాటు మీరు దానిని ఉపయోగించవచ్చు. ఈ విషయంలో సుజుకీ యాక్సిస్ బైక్ ఇన్సూరెన్స్ మీ అవసరాన్ని తీరుస్తుంది.
డిజిట్ యొక్క సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను పరిశీలించండి. ఇది వేరే ఎవరూ అందించలేని విధంగా మీ డబ్బుకు తగిన విలువను అందిస్తుంది.
జుకీ యాక్సిస్ టూ వీలర్ పాలసీ కోసం డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి?
టూ వీలర్ల కోసం బీమాను అందించే అనేక ఇతర బ్రాండ్లు ఉన్నప్పుడు డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి అని మీకు సందేహం కలగడం సహజం. డిజిట్ ప్లాన్ల కింద అందించబడే కొన్ని ఫీచర్లను పరిశీలించండి:
రెన్యువల్, కొనుగోలు సులభం
భారతదేశంలో చిరాకు లేకుండా ఆన్లైన్లో బీమా కొనుగోలు చేయడానికి, రెన్యువల్ చేయడానికి ప్రాధాన్యమిచ్చే కంపెనీల్లో డిజిట్ ఒకటి. ఏజెంట్లు లేదా బ్రోకర్లతో మీటింగులు పెట్టి, మీ డబ్బును వృథా చేయడానికి బదులుగా, డిజిట్ వెబ్సైట్ నుంచి సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోవడాన్ని, కొనుగోలు చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు.
పేపర్‌లెస్ క్లెయిమ్ ప్రక్రియ
ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎక్కడ పెట్టారో తరచూ మర్చిపోతూ ఉంటారా? ఒకవేళ మీరు అలా చేసినట్లయితే, డిజిట్ యొక్క యాక్సిస్ 125 ఇన్సూరెన్స్ పాలసీ మీకు సరైనది. క్లెయిములను ఫైల్ చేయడం, సెటిల్మెంట్ ప్రక్రియను దాదాపు పూర్తిగా ఆన్లైన్ సిస్టంగా మార్చడం ద్వారా డిజిట్ దీనిని గణనీయంగా సులభతరం చేసింది.
తర్వాత డిజిట్ స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియను కూడా అందిస్తుంది. ఇది క్లెయిమ్ ఫైల్ చేసే ప్రక్రియను చిరాకు లేకుండా చేస్తుంది.
ఎంచుకోవడానికి అనేక రకాల బీమా పాలసీలు
అందరి అవసరాలకు తగిన విధంగా డిజిట్ సుజుకీ యాక్సిస్ టూ వీలర్ పాలసీల శ్రేణిని అందిస్తుంది. దిగువ పేర్కొన్న పాలసీల్లో దేనినైనా మీరు ఎంచుకోవచ్చు:
- థర్డ్ పార్టీ లయబిలిటీ టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - ఒకవేళ మీరు ప్రమాదానికి గురై థర్డ్ పార్టీ వాహనం, ఆస్తి లేదా వ్యక్తికి నష్టం కలిగించినట్లయితే, పేర్కొనబడ్డ డ్యామేజీకి మీరు ఆర్థికంగా బాధ్యత వహిస్తారు. ఈ కవర్‌తో, ప్రమాదం వల్ల కలిగే అన్ని థర్డ్ పార్టీ లయబిలిటీలకు మీరు కవరేజీని పొందవచ్చు.
- కాంప్రహెన్సివ్ టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - థర్డ్ పార్టీ లయబిలిటీలను చెల్లించడంతో పాటుగా ప్రమాదాలు, అగ్నిప్రమాదం, సహజ, మానవ కారక విపత్తులు మొదలైనవి సంభవించిన సమయంలో మీ సొంత స్కూటర్‌కు కలిగే డ్యామేజీల కొరకు పాలసీని మీరు క్లెయిమ్ చేసుకునే విధంగా కాంప్రహెన్సివ్ కవరేజీ ధృవీకరిస్తుంది. అదనంగా స్కూటర్ రిపేర్ చేయలేని విధంగా డ్యామేజీ అయితే లేదా దొంగతనానికి గురైతే కూడా మీరు సాయం పొందవచ్చు.
ఒకవేళ మీరు 2018 సెప్టెంబర్ తరువాత మీ సుజుకీ యాక్సిస్‌ను కొన్నట్లయితే డిజిట్ నుంచి ఓన్ డ్యామేజీ కవర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. అటువంటి ప్లాన్ థర్డ్ పార్టీ లయబిలిటీ భాగం లేకుండా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ పాలసీ కొత్త స్కూటర్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది, సెకండ్ హ్యాండ్ యాక్సిస్ యజమానులకు వర్తించదు.
సంరక్షణను పెంచే యాడ్-ఆన్లు
సాధారణంగా బేస్ పాలసీ మీ స్కూటర్‌కు తగినంత ఆర్థిక సంరక్షణను అందించదు. అటువంటి సందర్భాల్లో మీకు అదనంగా మరికొన్ని అవసరం అవుతాయి. డిజిట్ అనేక యాడ్-ఆన్ కవర్లను అందిస్తోంది. ఇది మీ బీమా పాలసీని మరింత మెరుగ్గా చేస్తుంది. వాటిలో కొన్ని:
- జీరో డిప్రిషియేషన్ కవర్
- రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- కంజూమబుల్ కవర్
- బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
- ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ కవర
మీ నిధులను రికవర్ చేసుకోవడం కోసం ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూని కస్టమైజ్ చేసుకోండి
ఒకవేళ పెద్ద ప్రమాదాలు జరిగినట్లయితే, మీ స్కూటర్‌కు కలిగే డ్యామేజీలు రిపేర్ల పరిధిని దాటి ఉండవచ్చు. ఈ స్థితిని సాధారణంగా బీయింగ్ టోటల్డ్ అని పేర్కొంటారు. అటువంటి సందర్భాల్లో, దొంగతనం జరిగిన సందర్భాల్లో మీరు మీ బీమా సంస్థ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. ఈ సందర్భాల్లో మీకు ఎంత అవసరమో పేర్కొనడానికి, బీమా పాలసీ నుంచి మీ ప్రయోజనాలను గరిష్టం చేయడానికి ఐడీవీ (IDV) మొత్తాన్ని కస్టమైజ్ చేయడానికి డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
అందువల్ల సమగ్ర సంరక్షణ విషయానికి వస్తే డిజిట్ యొక్క సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ విలువైన ఆస్తి కోసం అత్యుత్తమ ఎంపికల్లో ఒకటిగా నిలుస్తుంది.
సుజుకీ యాక్సిస్ - వేరియెంట్లు & ఎక్స్-షోరూం ధర
వేరియెంట్లు | ఎక్స్-షో రూం ధర (ఒక్కో నగరానికి ఒక్కోలా ఉండవచ్చు) |
---|---|
యాక్సిస్ 125cc 53kmpl, 124cc (నిలిపివేయబడింది) | ₹ 51,932 |
యాక్సిస్ 125 SE53kmpl, 124cc (నిలిపివేయబడింది) | ₹ 53,887 |
యాక్సిస్ 125 డ్రమ్ 64kmpl, 124cc | ₹ 56,528 |
యాక్సిస్ 125 CBS 64kmpl, 124cc | ₹ 57,218 |
యాక్సిస్ 125 డిస్క్ 124cc | ₹ 58,350 |
భారతదేశంలో సుజుకీ యాక్సిస్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)
సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీకి ఏవైనా డిడక్టబుల్స్ (మినహాయింపులు) వర్తిస్తాయా?
అవును, ఐఆర్డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం, సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీపై తప్పనిసరి డిడక్టబుల్ (మినహాయింపు) వర్తించబడుతుంది.
ఒకవేళ నేను నా బీమా సంస్థను మార్చినట్లయితే నా నో క్లెయిం బోనస్ లభిస్తుందా?
లభిస్తుంది, ఇప్పటికే ఉన్న మీ బీమా పాలసీ కింద లభ్యమయ్యే నో క్లెయిం బోనస్, మీరు మీ బీమా సంస్థను మార్చినప్పటికీ క్యారీ ఫార్వర్డ్ చేయబడుతుంది.
నా సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయడానికి సరైన సమయం ఏది?
మీ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగియడానికి ఒక నెల ముందు దానిని మీరు రెన్యువల్ చేసుకోవాలి. మీరు రెన్యువల్ చేయడానికి ముందు మీ పాలసీ గడువు ముగిసిపోయినట్లయితే, దాని కింద ఉండే ప్రయోజనాలను మీరు కోల్పోవచ్చు.