హీరో గ్లామర్ ఇన్సూరెన్స్

హీరో గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్ కేవలం రూ. 714 నుంచే మొదలవుతుంది.

Third-party premium has changed from 1st June. Renew now

హీరో గ్లామర్ బైక్​ను మీరు కొనుగోలు చేయాలని భావిస్తే.. హీరో గ్లామర్ మోడల్స్ గురించి, అత్యుతత్మ హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ గురించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ వివరాలను ఓసారి పరిశీలించండి.

హీరో గ్లామర్ బండి ట్యాగ్​లైన్ సింప్లీ మ్యాగ్నెటిక్. ఈ ట్యాగ్​లైన్​కు బండి పూర్తిగా న్యాయం చేసింది. దీని స్టైల్, పవర్ పర్ఫెక్ట్​గా ఉంటుంది. ఫ్యూయల్ ఇంజిన్ టెక్నిక్​తో భారతదేశంలో విడుదల చేయబడిన మొదటి వాహనం ఇది. 100cc కమ్యుటర్ బైక్​లకు కూడా ఇదే సూత్రాన్ని వాడారు.

ఈ ఫీచర్లు మాత్రమే కాకుండా అనేక హై–ఎండ్ ఫీచర్లు కూడా హీరో గ్లామర్​ బైక్​లో ఉన్నాయి. కాబట్టి ఇది రిపేర్ అయితే చాలా ఖర్చవుతుంది. కావున మీరు ఇటువంటి సందర్భాలను కవర్ చేసేందుకు గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అనుకోని సందర్భాల్లో తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

ప్రమాదం వల్ల జరిగే ఆర్థిక నష్టాల విషయంలో మాత్రమే కాకుండా చట్టం నుంచి రక్షించుకునేందుకు కూడా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి. మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అయినా ఉండటం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు దొరికితే మీకు భారీ జరిమానాలు పడే ఆస్కారం ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ. 2000, రెండోసారి ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 4000 మేర జరిమానా విధించబడుతుంది.

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

హీరో గ్లామర్​కు వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్స్

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదంలో సొంత టూ వీలర్​కు డ్యామేజ్ అయితే

×

అగ్ని ప్రమాదంలో సొంత టూ వీలర్​కు డ్యామేజ్ అయితే

×

సహజ ప్రకృతి విపత్తుల వలన సొంత టూ వీలర్​కు డ్యామేజ్ అయితే

×

థర్డ్ పార్టీ వాహనానికి డ్యామేజ్ అయితే

×

థర్డ్ పార్టీ ఆస్తికి డ్యామేజ్ అయితే

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినప్పుడు

×

మీ స్కూటర్ దొంగిలించబడితే

×

మీ ఐడీవీ ని నచ్చినట్లుగా మార్చుకోండి

×

నచ్చిన యాడ్–ఆన్లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య గల వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను కొనుగోలు కానీ, రెన్యువల్ కానీ చేసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసేందుకు కేవలం 3 స్టెప్స్ ఉంటాయి. ఈ డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియతో మీరు నిశ్చింతగా ఉండొచ్చు.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు.

స్టెప్ 2

మీ మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ స్మార్ట్​ఫోన్ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపించండి. మేము దశలవారీ ప్రక్రియను మీకు తెలియజేస్తాం.

స్టెప్ 3

మీకు నచ్చిన విధానం​లో రిపేర్ చేయించుకోండి. అంటే రీయింబర్స్​మెంట్ అయినా ఎంచుకోండి లేదా మా నెట్​వర్క్ గ్యారేజీల్లోకి వెళ్లి నగదు రహిత రిపేర్లు చేయించుకోవచ్చు.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఎంత త్వరగా సెటిల్ అవుతాయి? మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చినపుడు మీ మెదడులోకి మొదటగా వచ్చే ప్రశ్న ఇది. అంటే మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారు. డిజిట్ క్లెయిముల రిపోర్ట్ కార్డు చదవండి

హీరో గ్లామర్ గురించి క్లుప్తంగా

హీరో గ్లామర్ మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ మార్కెట్లో అర్జెంటీనాలో ప్రవేశపెట్టబడింది. 2017లో హీరో మోటో కార్ప్ జైపూర్​లోని తన ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్​లో హీరో గ్లామర్ బండిని అభివృద్ధి చేసింది. ఈ బండి రూపం ఆకట్టుకునేలా గ్రాఫిక్స్​తో కూడి ఉంటుంది.

  • దీని ఇంధన ట్యాంక్ చెక్కబడినట్లుగా ఉంటుంది. దీంతో మోటార్ సైకిల్ చాలా ఆకర్షణీయ రూపంలో కనిపిస్తుంది. ఈ బైక్ థొరోటల్ రెస్పాన్స్ సిటీలో రైడ్ చేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది హై–మిడ్ రేంజ్ యాక్సిలరేషన్​ను కలిగి ఉంటుంది.
  • ఈ బండి ఎల్​ఈడీ (LED) యూనిట్ టెయిల్ ల్యాంప్​తో పాటుగా సెమీ డిజిటల్ కన్సోల్​ను కూడా కలిగి ఉంటుంది.
  • కొత్త 125cc మోటార్ బైక్​ వరల్డ్​లో టాక్ ఆఫ్ ది టౌన్​గా నిలిచింది. ఇది 11.5 PS పవర్​ను అందజేస్తుంది. పాత మోటార్లతో పోల్చుకుంటే ఇది 27 శాతం ఎక్కువ.
  • హీరో గ్లామర్ టార్క్ ఆన్​ డిమాండ్ (TOD) ఇంజిన్​ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బీఎస్​–4 (BS-IV) సిరీస్, ఫ్యూయల్ ఇంజెక్షన్, కార్య్బురేటర్ ఆప్షన్లు ఇందులో ఉంటాయి.

హీరో గ్లామర్, హీరో గ్లామర్ న్యూ, హీరో గ్లామర్ ప్రోగ్రామ్డ్ FI వంటి బైక్స్​లో ఇటువంటి ఆప్షన్లు ఉంటాయి.

ఎన్నో అదునాతన ఫీచర్లు ఉన్నప్పటికీ మీ హీరో బైక్​ ప్రమాదాల బారిన పడుతుంది. వేరే బైక్ మాదిరిగానే దీనికి కూడా ప్రమాదాలు జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేసేందుకు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం మంచిది.

మీ ఇన్సూరెన్స్ సరిగ్గానే కవర్ చేయబడి ఉందని తెలుసుకునేందుకు మీరు డిజిట్​ను సంప్రదించి మీ హీరో గ్లామర్ బైక్​ కోసం అత్యుత్తమ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి.

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ అందించేందుకు డిజిట్​ను ఏది ఆదర్శనీయంగా చేసింది?

ఆన్​లైన్​లో హీరో బైక్ ఇన్సూరెన్స్ కోసం వెతకడం ఇక మీదట ఆప్షన్​ కాదు. మీకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించే ఇన్సూరెన్స్ ప్రొవైడర్​ను ఎంచుకోవడం చాలా అవసరం. ఇటువంటి తరుణంలో డిజిట్ ఇన్సూరెన్స్ అనేది ఒకే ఒక పరిష్కారం.

ఎందుకంటే..

  • ఆన్​లైన్​ కొనుగోలు, రెన్యువల్​ - డిజిట్ హీరో గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలును ఆన్​లైన్ లేదా వెబ్​సైట్ ద్వారా అందిస్తోంది. ఈ ప్రక్రియ సులభమైన దశల్లో పూర్తవుతుంది. ప్రీమియం చెల్లించండి, ఇక ఇంకో వైపు హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఎటువంటి సమయంలోనైనా మీరు హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ పాలసీని చాలా సులభంగా పునరుద్ధరించుకోవచ్చు. కావున డిజిట్ ఇన్సూరెన్స్ అనేది హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ కోసం ఒక మంచి ఎంపిక.

  • నో క్లెయిమ్ బోనస్ బెనిఫిట్స్ - మీరు రోడ్డు మీద వాహనాన్ని జాగ్రత్తగా నడిపితే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. అప్పుడు మీరు ఎక్కువగా క్లెయిమ్స్ చేయరు. అటువంటి సందర్భాలలో మీకు డిజిట్ నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. మీరు పాలసీని రెన్యువల్ చేసేటపుడు నో క్లెయిమ్ బోనస్ ద్వారా 20 నుంచి 50 శాతం వరకు పాలసీ ధరలో తగ్గింపు పొందవచ్చు. తద్వారా మీ ప్రీమియం ధర కూడా తగ్గుతుంది.

  • దేశవ్యాప్తంగా 4400+ పైగా నెట్​వర్క్​ గ్యారేజీలు - డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా మొత్తం 4400 కంటే ఎక్కువ నగదు రహిత నెట్​వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. ఈ గ్యారేజీల్లో మీరు నగదు రహిత మరమ్మతులను పొందేందుకు వీలుంటుంది.

  • అత్యంత వేగవంతమైన డిజిటల్ క్లెయిమ్ సెటిల్​మెంట్ ప్రక్రియ – డిజిట్ ఇన్సూరెన్స్ సులభమైన ఇన్సూరెన్స్ పాలసీ ప్రొసీజర్లను అందించేందుకు కృషి చేస్తోంది. క్లెయిమ్ సెటిల్​మెంట్ ప్రక్రియను డిజిట్ స్మార్ట్​ఫోన్ ఆధారిత సౌలభ్యంతో మీకు అందిస్తుంది. ఆన్​లైన్ క్లెయిమ్ ఫైలింగ్ ద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కంపెనీ అధిక క్లెయిమ్ సెటిల్​మెంట్ రేషియోను కూడా కలిగి ఉంటుంది. కావున మీరు చేసిన క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ పాలసీలోని రకాలు-
డిజిట్ అందించే డిజిట్ అందించే హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ పాలసీలు:

  • థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పాలసీ మీరు ప్రమాదం చేయడం వలన థర్డ్ పార్టీకి కలిగిన ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది. థర్డ్ పార్టీ వాహనానికి నష్టం, వాహన యజమాని లేదా డ్రైవర్​కు గాయాలు, ఆస్తి డ్యామేజీ అయినా ఇది పరిహారాన్ని అందజేస్తుంది.

  • కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - మీ కలల హీరో గ్లామర్ బైక్ రక్షణ మీ బాధ్యత కాదా? అందుకోసమే మీరు కాంప్రెహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలి. ఇది మీకు ఆర్థిక పరమైన కవరేజీ​ని అందజేస్తుంది. థర్డ్ పార్టీతో పాటుగా సొంత డ్యామేజీల​ను కూడా ఇది కవర్ చేస్తుంది. కేవలం థర్డ్ పార్టీ లయబులిటీలు మాత్రమే కాకుండా కింది నష్టాలకు ఆర్థిక కవరేజీని కూడా అందిస్తుంది.  

  • సహజ ప్రకృతి విపత్తుల వలన మీ సొంత వాహనానికి కలిగే డ్యామేజీలు,

  • ప్రమాదాల వలన కలిగే డ్యామేజీలు,

  • దొంగతనాల వలన,

  • మానవ కారక విపత్తుల వలన మీ సొంత వాహనానికి జరిగే డ్యామేజీలు, మొదలైనవి.

పైన పేర్కొన్న ఇన్సూరెన్స్ కవర్లు మాత్రమే కాకుండా ఎవరైతే 2018 సెప్టెంబర్ తర్వాత హీరో గ్లామర్ బైక్​ను కొనుగోలు చేస్తారో వారికి స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్​ పాలసీలో పాలసీదారులు కాంప్రహెన్సివ్ టూ వీలర్ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు. థర్డ్ పార్టీ లయబులిటీస్ కాకుండా.

  1. విభిన్నమైన యాడ్​–ఆన్లు – పైన పేర్కొన్న ఇన్సూరెన్స్ కవర్లు సమగ్ర ఆర్థిక కవరేజీని అందిస్తాయి. కానీ యాడ్–ఆన్స్ మరింత సంరక్షణను ఇస్తాయి. డిజిట్​లో మీరు మీ టూ వీలర్​ కోసం కింది యాడ్–ఆన్స్​ను పొందవచ్చు.

  • a) ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ కవర్

  • b) కంజూమబుల్ కవర్

  • c) రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్

  • d) బ్రేక్​డౌన్ అసిస్టెన్స్‌

  • e) జీరో డిప్రిషియేషన్ కవర్

  • అద్భుతమైన కస్టమర్ సర్వీస్​ - ఇన్సూరెన్స్ కంపెనీల కస్టమర్ సర్వీస్​తో అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఈ విషయంలో డిజిట్ చాలా మెరుగ్గా ఉంటుంది. డిజిట్ కస్టమర్ సర్వీస్ 24 X 7 అందుబాటులో ఉంటుంది. ఇది మీకు ఆన్​లైన్​ ద్వారా కూడా లభ్యమవుతుంది. కాబట్టి మీరు రోజులో ఏ సమయంలోనైనా డిజిట్ కస్టమర్ సర్వీస్​ను సంప్రదించవచ్చు.

  • కస్టమైజ్​ చేయగల ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ - ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అనేది మీ వాహనం ప్రస్తుత మార్కెట్ రేటును సూచిస్తుంది. మీ హీరో గ్లామర్ వాహనానికి ఏదైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగితే మీకు ఇది సహాయపడుతుంది. తయారీదారుడు ఏర్పర్చిన బైక్ అమ్మకపు విలువ నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ఇది వస్తుంది. డిజిట్ ఇన్సూరెన్స్ మీ ఐడీవీ (IDV)ని మార్చుకునే సౌలభ్యాన్ని మీకు అందిస్తుంది. ఇలా మీరు అత్యధిక ఐడీవీ (IDV)ని ఎంచుకోవడం వలన ఒకవేళ మీ బైక్ పూర్తిగా పాడైపోతే మీరు అత్యధిక బీమా మొత్తాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.

హీరో గ్లామర్​లో ఏ మోడల్​ను ఎంచుకోవాలనే విషయంలో మీకు చాయిస్ ఉన్నప్పటికీ.. మీ వాహనానికి ఆర్థిక భద్రతను అందించేందుకు డిజిట్ ఇన్సూరెన్స్​నే ఎంచుకోండి. ఈ తరుణంలో మీరు తీసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్​కు ఎంత ధర పడుతుంది, యాడ్–ఆన్స్ ఏవి ఎంచుకోవాలని నిర్ణయించుకోండి. అందుకు తగ్గట్లు కోట్ పొందండి.

భారతదేశంలో హీరో గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్​ గురించిన తరచూ అడిగే ప్రశ్నలు

న్యూ హీరో మోటోకార్ప్ డిస్క్ బ్రేక్ గ్లామర్ BSVI పెట్రోల్​ 125 ఇన్సూరెన్స్ ధర ఎంత?

హీరో గ్లామర్ కొత్త డిస్క్ బ్రేక్ BSVI పెట్రోల్ 125 ​తో మీరు రూ. 60,478 కనిష్ట ఐడీవీ (IDV)ని పొందొచ్చు. ఇందుకోసం మీ ప్రీమియం రూ. 3,400 నుంచి మొదలవుతుంది. (18 శాతం జీఎస్టీ(GST) కాక).

డిజిట్ అందించే ఇన్సూరెన్స్ పాలసీల్లో ఏ హీరో గ్లామర్ బైక్స్ కవర్ అవుతాయి?

హీరో గ్లామర్ బైక్ రైడర్లకు ప్రయోజనం కలిగించేందుకు డిజిట్ కంపెనీ అనేక మోడళ్లకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. వాటిలో..

  • డిస్క్ బ్రేక్ BSVI పెట్రోల్ 125
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ డిస్క్ బ్రేక్ పెట్రోల్ 125
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ డిస్క్ బ్రేక్ పెట్రోల్ 135
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ డిస్క్ బ్రేక్ క్యాస్ట్ వీల్ పెట్రోల్ 125
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ డిస్క్ బ్రేక్ క్యాస్ట్ వీల్ పెట్రోల్ 125
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ పెట్రోల్ 125
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ క్యాస్ట్ వీల్ పెట్రోల్ 125
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ స్పోక్ వీల్స్ పెట్రోల్ 125
  • కిక్ స్టార్ట్ డిస్క్ బ్రేక్ పెట్రోల్ 125
  • కిక్ స్టార్ట్ డిస్క్ బ్రేక్ క్యాస్ట్ వీల్ పెట్రోల్125
  • కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ పెట్రోల్ 125
  • STD పెట్రోల్ 125
  • డ్రమ్ బ్రేక్ BSIV పెట్రోల్ 125
  • డిస్క్ బ్రేక్ BSIV పెట్రోల్ 125
  • IBS డ్రమ్ క్యాస్ట్ పెట్రోల్ 125

నేను నా హీరో గ్లామర్ బండిని డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీతో పునరిద్ధరించాలని అనుకుంటున్నాను.. అందుకు నేను అందించాల్సిన డాక్యుమెంట్లు ఏంటి?

మా ఇన్సూరెన్స్ పాలసీలను మరింత సులభతరం చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మీరు మీ హీరో గ్లామర్ ఇన్సూరెన్స్​ను రెన్యువల్ చేసుకునేందుకు తక్కువ వివరాలు సమర్పిస్తే సరిపోతుంది.

  • మీ పేరు
  • మీ చిరునామా
  • సంప్రదింపు వివరాలు
  • మీ హీరో గ్లామర్ మోడల్ నెంబర్
  • మీ టూ వీలర్ తయారీ తేదీ
  • బండిని కొనుగోలు చేసిన స్థలం, తేదీ
  • టూ వీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్