Third-party premium has changed from 1st June. Renew now
ఆన్లైన్లో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/రిన్యూ చేయండి
కొత్త హీరో బైక్‌ను కొనుగోలు చేస్తున్నారా? అలాగే వాహనంతో పాటు హీరో బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తే, ఏం చేయాలో, ఎటువంటి అంశాలను పరిశీలించాలో ముందుగా తెలుసుకుందాం.
హీరో మోటో కార్ప్ విడుదల చేసిన సేల్స్ రిపోర్ట్ ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు 7.8 మిలియన్ల టూ వీలర్లను అమ్మింది. (1)
2018 అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య కాలంలో కంపెనీ దాదాపు రూ. 7,800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. (2)
ఈ బైకులు అంతలా పాపులర్ కావడానికి గల కారణం ఏమిటి? ప్రపంచంలోని అత్యుత్తమ ఫోర్బ్స్ కంపెనీ ప్రకటించిన శక్తివంతమైన 200 కంపెనీల జాబితాలో హీరో మోటార్ కార్ప్ కంపెనీకి చోటు లభించింది. ఇంతలా కంపెనీ ఎదిగేందుకు గల కారణం ఏమిటి? హీరో బైక్ కొన్న వినియోగదారులకు బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎందుకు ముఖ్యం అనే విషయాలను తెలుసుకుందాం.
మోటార్ వాహన చట్టం–1988 ప్రకారం మీ బండికి కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ అయినా కలిగి ఉండాలి. లేకపోతే మీరు ట్రాఫిక్ జరిమానాలకు గురవుతారు.
కేవలం జరిమానాలనే కాకుండా మీ టూ వీలర్ ఎప్పుడైనా అనుకోని సందర్భంలో ప్రమాదానికి గురైనా లేదా ప్రకృతి విపత్తుల వలన, అగ్ని ప్రమాదాల వలన, దొంగతనాల వలన డ్యామేజ్ లేదా నష్టపోయినా ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది.
కావున మీ ప్రియమైన హీరో బైక్‌కు ఇన్సూరెన్స్ పాలసీ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. హీరో బైక్ ఇన్సూరెన్స్ తీసుకునేముందు ఆ కంపెనీ చరిత్రను కొంచెం తెలుసుకుందాం.
హీరో బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి
ఏమేం కవర్ కావంటే..
మీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ చేయబడదనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైనా మీరు క్లెయిమ్ చేయాలని అనుకున్నపుడు కవర్ చేయబడని విషయాల గురించి మీకు ఆశ్చర్యంగా అనిపించొద్దు కదా.
థర్డ్ పార్టీ లేదా లబయబులిటీ ఓన్లీ బైక్ పాలసీ తీసుకున్నపుడు సొంత డ్యామేజీలు కవర్ చేయబడవు.
మీరు మద్యం సేవించి వాహనం నడిపినా లేదా సరైన టూ వీలర్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా మీ ఇన్సూరెన్స్ కవర్ చేయబడదు.
ఒక వేళ మీరు లెర్నర్ లైసెన్స్‌ను కలిగి ఉంటే.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే మీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.
ప్రమాదం జరిగిన తర్వాత మీ టూ వీలర్‌ను తప్పుగా వాడి దాని వలన ఏదైనా డ్యామేజ్ జరిగితే అది కవర్ చేయబడదు.
స్వీయ నిర్లక్ష్యం చేసిన సందర్భంలో మీ ఇన్సూరెన్స్ వర్తించదు. ఉదా.. మీ నగరంలో వరదలు వచ్చినపుడు మీరు ఆ వరదల్లో డ్రైవ్ చేయకూడదని డ్రైవర్స్ మ్యాన్యువల్‌లో క్లియర్‌గా ఉంటుంది. ఒక వేళ మీరు వాహనం వేసుకుని వెళ్తే.. జరిగే నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు.
కొన్ని డ్యామేజీను యాడ్–ఆన్స్ మాత్రమే కవర్ చేస్తాయి. అటువంటి డ్యామేజీలు జరిగినపుడు మీకు సంబంధిత యాడ్–ఆన్ లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ కాదు.
డిజిట్ జావా బైక్ ఇన్సూరెన్స్నే ఎందుకు కొనుగోలు చేయాలి
మీ అవసరాలకు సరిపోయే బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఒక సాధారణ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలు, ఆస్తులకు జరిగిన నష్టాలు మాత్రమే కవర్ చేయబడతాయి.
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత విలువైన బైక్ ఇన్సూరెన్స్ రకాల్లో ఒకటి. ఇది థర్డ్ పార్టీ డ్యామేజీలతో పాటుగా సొంత డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది.
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం కారణంగా సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు |
|
అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు |
|
ప్రక-తి వైపరీత్యాలు జరిగినప్పుడు సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు |
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజీలు |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీకి జరిగే డ్యామేజీలు |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు లేదా మరణం సంభవిస్తే |
|
స్కూటర్ లేదా బైక్ దొంగతనానికి గురైతే |
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోగలగడం |
|
కస్టమైజ్డ్ యాడ్–ఆన్ లతో మరింత సురక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా కానీ రెన్యూవల్ చేసినా కానీ చింత లేకుండా ఉండండి. 3 సులభమైన స్టెప్స్‌లో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.
స్టెప్ 1
1800-258-5956 నంబర్ మీద కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన అవసరం లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీయండి. ఎలా చేయాలో మేము దశలవారీ ప్రక్రియను మీకు తెలియజేస్తాం.
స్టెప్ 3
ఏ పద్ధతిలో మీకు రిపేర్ కావాలో ఎంచుకోండి. రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత ప్రక్రియను ఎంచుకుంటే మా నెట్వర్క్ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.
హీరో మోటాకార్ప్ – కంపెనీ గురించి మీరు ఏం తెలుసుకోవాలంటే..
హీరో కంపెనీని 1984లో డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించారు. హీరో మోటో కార్ప్ లిమిటెడ్ అంతకు ముందు హీరో హోండాగా ఉండేది. ద్విచక్ర వాహనాలను తయారు చేయడంలో హీరో కంపెనీ పేరు గాంచింది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ కంపెనీ.
మన భారతదేశంలో ఈ కంపెనీకి 46 శాతం టూ వీలర్ మార్కెట్ షేర్ ఉంది. 1980 వ సంవత్సరంలో ఈ కంపెనీ చాలా పాపులర్ అయింది. కంపెనీ ఫేమస్ కావడానికి ప్రధాన కారణం కంపెనీ అది అందజేసే బండ్ల మైలేజ్. అంతేకాకుండా సరసమైన ధరలు కూడా ఈ కంపెనీ వాహనాలు భారతీయులకు నచ్చేందుకు ప్రధాన కారణం.
2010వ సంవత్సరంలో హీరో హోండా నుంచి హోండా వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం హోండా కంపెనీకి ఉన్న షేర్లను కూడా హీరో కంపెనీ కొనుగోలు చేసి పూర్తి కంపెనీకి కొత్త హెడ్‌గా అవతరించింది. పేరును హీరో మోటోకార్ప్‌గా మార్చేసింది.
హీరో బైకుల్లో కొన్ని ప్రముఖ మోడళ్లు:
హీరో స్ప్లెండర్ ప్లస్
హీరో హెచ్ఎఫ్ డీలక్స్
హీరో ప్యాషన్ ప్రో
హీరో సూపర్ స్ప్లెండర్
హీరో ఎక్స్–పల్స్ 200
హీరో గ్లామర్
ఇంకా మరెన్నో..
అనేక సంవత్సరాల నుంచి భారతీయుల నమ్మకాన్ని దక్కించుకోవడంలో హీరో విజయవంతం అయింది. అంతేకాకుండా సరసమైన ధరలు, మంచి ఆఫర్లు హీరో స్కూటర్లను భారతీయులకు దగ్గర చేశాయి.
హీరో బైక్స్ పాపులర్ కావడానికి కారణాలేంటి?
కస్టమర్లు హీరో కంపెనీని ఎప్పటికీ విశ్వసించేందుకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి ఒక్కసారి చర్చిస్తే..
మంచి కస్టమర్ సర్వీస్ ఉంటే ఏ కంపెనీ అయినా వినియోగదారుల మనసులను దోచుకుంటుంది. హీరో కంపెనీ ఈ విషయంలో దేశంలో ఉన్న మిగతా టూ వీలర్ కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాబట్టే కస్టమర్లు ఈ కంపెనీని ఎక్కువగా విశ్వసిస్తున్నారు.
వివిధ వర్గాల నుంచి వచ్చిన వినియోగదారుల కొరకు హీరో అనేక శ్రేణుల్లో అందుబాటులో ఉండే బైక్‌లను తయారు చేస్తుంది. ఈ కారణం చేత కూడా హీరో కంపెనీ తన పేరును నిలుపుకొంటూ వస్తోంది.
చివరగా చెప్పుకోవాల్సింది హీరో బైక్‌ల నాణ్యత గురించి. ఎన్నేళ్లయినా సరే హీరో బైక్‌ల నాణ్యత దెబ్బతినకుండా అలాగే ఉంటుంది. ఈ అంశం కూడా కస్టమర్లు ఎక్కువగా హీరోను ఇష్టపడేలా చేసింది.
దేశ ప్రజలు హీరోను విశ్వసించడానికి పైన పేర్కొన్నవి కొన్ని కారణాలు మాత్రమే. ఈ కంపెనీ అందజేసే ప్రొడక్టులు, వాటి ఫీచర్లు ఇంత ప్రజాదరణను పొందేలా చేశాయి.
హీరో టూ వీలర్స్ నుంచి మీరు ఊహించదగ్గ ఫీచర్లు
మీ బడ్జెట్ ఎంత అనే విషయం పక్కన పెడితే హీరోలోని అన్ని బైకులలో అందించే ఫీచర్లు అధునాతనంగా ఉంటాయి. తమ బైక్‌ల ఫీచర్ల విషయంలో ఈ కంపెనీ ఎప్పటికీ రాజీ పడదు.
హీరోలో హై–ఎండ్ బైక్‌లు మాత్రమే లభిస్తాయని మీరు ఆలోచిస్తున్నారా? అదేం లేదు. అన్ని వర్గాల వారికోసం ఈ కంపెనీ బైకులను తయారుచేస్తోంది.
హీరో టూ వీలర్స్‌లో ఉన్న కొన్ని సాధారణ ఫీచర్లు..
విశ్వసనీయత – భారతీయ బైక్ మార్కెట్ విషయంలో మైలేజ్ ముఖ్యం. హీరో కంపెనీ బండ్లు అన్నీ అత్యుత్తమ మైలేజీని అందిస్తాయి. ఇంజన్ క్వాలిటీ, మైలేజీనే భారతీయులు ఎక్కువగా చూస్తారు. హీరో స్ప్లెండర్, ప్యాషన్ మోడల్స్ మైలేజ్‌కు చాలా ఫేమస్. ఇవనే కాకుండా హీరోలో లభించే అన్ని వాహనాలు ఎక్కువ మైలేజీనే ఇస్తాయి. దీని వలన వినియోగదారునికి ఆర్థిక భారం తగ్గుతుంది.
డ్యూరబిలిటీ – సాధారణ వ్యక్తులు బైక్ కొనుగోలు చేయడం కోసం చాలా పొదుపు చేస్తారు. కానీ, వాహనం కొన్న తర్వాత దానికి ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు మీకు అనేక విధాలుగా ఆర్థిక నష్టం సంభవిస్తుంది. హీరో బైక్ కంపెనీ తమ బండి నాణ్యతలో ఎటువంటి రాజీపడదు. తమ బండి విడి భాగాలు చాలా అందుబాటు ధరలో, నాణ్యమైనవి ఉండేలా హీరో చూసుకుంటుంది. కావున రోడ్ల మీద ఎటువంటి గుంతలు ఉన్న కానీ బైక్స్ తొందరగా పాడు కావు.
ప్రొడక్ట్ వెరైటీ- హీరో తన బైక్‌ల కోసం లగ్జరీ, ప్రీమియం వేరియంట్లను అందిస్తుంది. నిర్దిష్ట ఎకనమిక్ క్లాస్ ప్రొడక్టులను హీరో అందించదు. ఎక్కువ రేంజ్ ఉన్న బైక్‌లు, స్కూటర్లను అందించేందుకు కంపెనీ యోచిస్తుంది. ధరల విషయంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా హీరో తన ప్రొడక్టులను రూపొందిస్తుంది.
సాంకేతిక అద్భుతాలు – టెక్నాలజీ విషయంలో హీరో కంపెనీ ఎప్పుడూ వెనుకంజ వేయదు. తమ ఉత్పత్తుల్లో అధునాతన సాంకేతికను ఎప్పుడూ జోడిస్తుంటుంది. ఉదాహరణకు చూసుకుంటే హీరో ఇటీవలే ప్రదర్శించిన స్పోర్ట్స్ బైక్ ఎక్స్ట్రీమ్ 200 ఎస్ ను చూస్తే ఇది అర్థమవుతుంది. అంతే కాకుండా హీరోలో వచ్చిన ఎక్స్ఎఫ్3ఆర్ బైక్ డిజైన్‌ను చూస్తే మీకు స్ట్రీట్ ఫైటర్ వీడియో గేమ్‌లో ఉన్న డిజైన్ మాదిరే అనిపిస్తుంది.
భారతదేశంలో ప్రమాదాలు సర్వసాధారణం. సాధారణంగా భారతీయ రోడ్ల మీద ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఒకవేళ మీకు అత్యంత ఇష్టమైన హీరో బైక్‌కు ప్రమాదం జరిగితే పైన పేర్కొన్న ఫీచర్లు ఏవీ మిమ్మల్ని రక్షించవు.
అటువంటి అనుకోని సందర్భాల నుంచి మీరు మీ హీరో బైక్‌ను కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం తప్పనిసరి.
హీరో బైక్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా ఎందుకు కొనుగోలు చేయాలి?
ఇన్సూరెన్స్ లేకుండా బండిని నడపడం చట్టబద్ధంగా సాధ్యం కాదు. మీరు ఇన్సూరెన్స్ లేకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ ఫైన్స్ పడే అవకాశం కూడా ఉంది.
న్యాయపరమైన చిక్కులు- మోటార్ వాహన చట్టం–1988 ప్రకారం ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి. భారతీయ రోడ్ల మీద బండిని నడపాలంటే కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. మోటార్ వాహన చట్టానికి 2019లో సవరణ చేసి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను చేర్చారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మీకు మొదటి సారికి రూ. 2,000, రెండో సారి దొరికితే రూ. 4,000 జరిమానా పడే అవకాశం ఉంది.
చట్టబద్ధమైన అంశాలు మాత్రమే కాకుండా మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలో కొన్ని అంశాలు కింద ఉన్నాయి.
థర్డ్ పార్టీ ప్రాపర్టీకి డ్యామేజ్ అయినపుడు రీయింబర్సమెంట్ క్లెయిమ్ చేయడానికి – థర్డ్ పార్టీ హీరో మోటోకార్ప్ ఇన్సూరెన్స్ మీ వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీ వలన నష్టపోయిన థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ఆస్తులకు ఇది ఆర్థికపరమైన చేయూతను ఇస్తుంది. థర్డ్ పార్టీ వ్యక్తులు గాయాల పాలైనా లేదా మరణించినా కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.
మీ సొంత వాహనాల రిపేర్ ఖర్చుల కోసం క్లెయిమ్ చేయడానికి – మీరు హీరో కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే మీ సొంత డ్యామేజీలకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాలసీ థర్డ్ పార్టీ వ్యక్తులు, ఆస్తులకు జరిగిన డ్యామేజీలకు మాత్రమే కాకుండా మీ సొంత వాహనానికి జరిగిన డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది. కేవలం ప్రమాదాల వలన జరిగిన డ్యామేజీలను మాత్రమే కాకుండా ప్రకృతి విపత్తులు, దొంగతనాలు, పేలుళ్ల వలన జరిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.
మీ వాహనం పూర్తిగా డ్యామేజ్ అయినపుడు లేదా దొంగిలించబడినపుడు బండి పూర్తి విలువను పొందడానికి- కొన్ని పరిస్థితుల్లో మీ హీరో వాహనం పూర్తిగా పాడైపోయి ఉండొచ్చు. లేదా ఎవరైనా మీ వాహనాన్ని దొంగిలించి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు మీ వాహన ఐడీవీని బట్టి డబ్బులు చెల్లిస్తుంది. మీ వాహనం ప్రస్తుత విలువ నుంచి డిప్రిషియేషన్ విలువను తీసేయడం వలన వాహన ఐడీవీ విలువను లెక్కిస్తారు. కేవలం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌లో మాత్రమే మీకు ఈ సౌలభ్యం ఉంటుంది. మీ వాహనం దొంగిలించబడినా లేదా పూర్తిగా పాడైపోయినా మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పూర్తి సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ – పాలసీదారుడు మరణించినపుడు అతడి/ఆమె ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుంది. ఈ ప్రయోజనం పర్సనల్ యాక్సిడెంట్ యాడ్–ఆన్‌ను తీసుకోవడం వలన మీకు లభిస్తుంది.
వాహన యజమాని బతికే ఉండి అతడికి శాశ్వత అంగవైకల్యం వచ్చినా కూడా అతడికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్టపరిహారం అందేలా కొన్ని కంపెనీల పాలసీలు ఉంటాయి.
మీకు ఈ రక్షణ అందాలంటే మీరు పర్సనల్ యాక్సిడెంట్ యాడ్-ఆన్ కవర్ తీసుకోవాలి. మీ హీరో బైక్ ఇన్సూరెన్స్ గడువును ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవాలి.
ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సర్వీసుతో మీరు అసంతృప్తిగా ఉంటే మీరు మీ పాలసీని వెంటనే మార్చుకోవచ్చు. ఈ విషయం మీకు తెలుసా?
ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీలో మీకు అందే ప్రయోజనాలను సరిపోల్చుకోండి. అందులో ఏది తక్కువైందని అనిపించినా వెంటనే డిజిట్ హీరో టూ వీలర్ ఇన్సూరెన్స్‌కు మారిపోండి.
మీరు డిజిట్ హీరో బైక్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?
హీరో బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే వ్యక్తులకు డిజిట్ కంపెనీ గురించి కంపెనీ అందిస్తున్న యూజర్ ఫ్రెండ్లీ పాలసీల గురించి తెలిసే ఉంటుంది. ఇన్సూరెన్స్ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో డిజిట్ ముందు వరుసలో ఉంటుంది. డిజిట్ మీ టూ వీలర్లను సంరక్షించేందుకు వివిధ ఆఫర్లతో కూడిన పాలసీలను అందజేస్తుంది. మీరు డిజిట్లో ఎందుకు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలో కింద వివరంగా ఉంది.
ఎక్కువ ప్రొడక్టులు – హీరో టూ వీలర్ యజమానుల కోసం అనేక రకాల ప్రయోజనాలు ఉన్న పాలసీలను డిజిట్ అందజేస్తుంది. అవేంటంటే..
1. a) థర్డ్ పార్టీ లయబిలిటీ బైక్ ఇన్సూరెన్స్ – మీ టూ వీలర్ వలన థర్డ్ పార్టీ వ్యక్తులకు కానీ, ఆస్తులకు కానీ అయ్యే డ్యామేజీల నుంచి మిమ్మల్ని థర్డ్ పార్టీ లయబిలిటీ బైక్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. థర్డ్ పార్టీ వ్యక్తులకు అయిన గాయాలు, మరణాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.
2.b) కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్– మీ టూ వీలర్‌కు ఇది సమగ్ర సంరక్షణను అందిస్తుంది. ఈ పాలసీలో మీరు మీ సొంత డ్యామేజీలకు, థర్డ్ పార్టీ వ్యక్తుల డ్యామేజీలకు కూడా కవరేజీని పొందొచ్చు. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు, అల్లరు వంటి కారణాల వలన మీ బండి డ్యామేజ్ అయినపుడు మిమ్మల్ని ఈ ప్లాన్ ఆర్థికంగా కాపాడుతుంది.
ఇవి మాత్రమే కాకుండా డిజిట్ కంపెనీ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందజేస్తుంది. ఎవరికైతే ఇప్పటికే థర్డ్ పార్టీ పాలసీ ఉండి ఉంటుందో వారికి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. థర్డ్ పార్టీ పాలసీ ఉండి ఆర్థిక నష్టాలను కవర్ చేసే ప్లాన్ కోసం చూస్తున్న వారికి మాత్రమే ఈ ప్లాన్. 2018 సెప్టెంబర్ తర్వాత బండిని కొన్న వారికి మాత్రమే ఈ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
ఎక్కువ సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు – డిజిట్లో ఉన్న నెట్వర్క్ గ్యారేజీలను మీరు మీ టూ వీలర్ల రిపేర్ల కోసం వాడుకునే సౌలభ్యం ఉంటుంది. డిజిట్ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా అనేక సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. మీరు అటువంటి గ్యారేజ్‌కు వెళ్తే మీ పని సులభం అవుతుంది. అంతేకాకుండా అవి ఎక్కడ ఉన్నాయో కనుగొనడం కూడా చాలా ఈజీనే. ఈ నెట్వర్క్ గ్యారేజీలను మీరు ఉపయోగించుకుంటే మీరు మీ జేబు నుంచి రిపేర్ ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు.
సులభమైన కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియ – డిజిట్ ఆన్లైన్ ప్లాన్లను అందజేస్తుంది. వీటి వలన మీ పని చాలా సులభం అవుతుంది. ఆన్లైన్ పాలసీని మీరు తీసుకునేందుకు చేయాల్సిందల్లా మీ బండికి సంబంధించిన కొన్ని వివరాలను సమర్పించడం మాత్రమే. వారు అడిగిన వివరాలను సమర్పించి పేమెంట్ చేస్తే మీ మెయిల్‌కు పాలసీ వివరాలు పంపబడతాయి. ఈ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు ఎటువంటి ఇన్సూరెన్స్ బ్రోకర్‌ను కలవాల్సిన అవసరం ఉండదు.
మీ అవసరాలకు తగినట్లు ఐడీవీ (IDV) ని మార్చుకునే వెసులుబాటు - ఐడీవీ అనేది మీ టూ వీలర్‌కు ఎప్పుడైనా పూర్తి డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు లభించే మొత్తం. తయారీదారుడి ధర నుంచి మీ బైక్ డిప్రిషియేషన్ ఖర్చును తీసేస్తే ఐడీవీ వస్తుంది. డిప్రిషియేషన్‌ను లెక్కించే విధానంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి తేడాలుంటాయి. డిజిట్ మీకు ఎక్కువ ఐడీవీని అందిస్తుంది. అంతేకాకుండా మీకు నచ్చిన విధంగా ఐడీవీని మార్చుకునే వెసులుబాటును కూడా డిజిట్ అందిస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ సాయంతో మీ ప్రీమియం తగ్గించుకోండి – మీరు జాగ్రత్తగా వాహనాన్ని నడిపి ఎటువంటి ప్రమాదాలు చేయకుండా, ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే డిజిట్ మీకు నో క్లెయిమ్ బోనస్‌ను అందిస్తుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ వలన మీరు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ మీకు 50 శాతం వరకు అందుతుంది. (క్లెయిమ్ చేయని సంవత్సరాల ఆధారంగా) ఈ నో క్లెయిమ్ బోనస్ వలన మీరు అధిక ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రీమియంను కూడా తగ్గించుకోవచ్చు.
సులభమైన క్లెయిమ్ ప్రక్రియ, ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి – డిజిట్ ఇన్సూరెన్స్‌లో మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే జరగడం వలన మీరు ఇక్కడ క్లెయిమ్ చేయడం చాలా సులభం. డిజిట్లో స్మార్ట్ ఫోన్ ఆధారిత తనిఖీ ప్రక్రియ కూడా ఉంది. క్లెయిమ్ ఫైల్ చేస్తే కంపెనీ నుంచి ఏజెంట్ వచ్చి వాహనాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇక మరో విషయం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి. మీరు ఏదైనా పాలసీని తీసుకునేటపుడు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని తనిఖీ చేయాలి. ఇది చాలా అవసరం. డిజిట్‌కు అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంది. కాబట్టి, మీరు క్లెయిమ్ చేసిన పాలసీలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఎక్కువ సంఖ్యలో యాడ్–ఆన్స్ లభ్యం - స్టాండర్డ్ పాలసీలు వాహనంలోని కొన్ని భాగాల రిపేర్లకు ఎటువంటి ఆర్థిక కవరేజీని అందించవు. కావున మీరు వాటి కోసం యాడ్–ఆన్స్ తీసుకోవడం చాలా అవసరం. డిజిట్ మీకు అందించే యాడ్-ఆన్స్ వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఖర్చుల నుంచి కవర్ అవుతారు. డిజిట్ అందించే కొన్ని ముఖ్యమైన యాడ్–ఆన్స్
- a) ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ కవర్
- b) జీరో డిప్రిషియేషన్ కవర్
- c) బ్రేక్ డౌన్ అసిస్టెన్స్
- d) రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- e) కంజూమబుల్ కవర్
అన్ని సందర్భాల్లో మీరు ఆర్థిక పరమైన నష్టాలకు గురికాకుండా ఉండేందుకు యాడ్–ఆన్స్ సంరక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆధారపడగల కస్టమర్ సర్వీస్ - ప్రమాదాలు ఎప్పుడైనా జరగొచ్చు. ఇవి పొద్దున జరుగుతాయా? లేదా రాత్రి జరుగుతాయా? అని మనం చెప్పలేం. కావున ఎల్లవేళలా కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉండే కంపెనీ నుంచి మీరు పాలసీని తీసుకోవడం మంచిది. డిజిట్లో 24x7 కస్టమర్ కేర్ సపోర్ట్ మీకు అందుబాటులో ఉంటుంది.
మీరు ప్రమాదం గురించి చెప్పాలనుకున్నా, లేదా మీ పాలసీకి సంబంధించి ప్రశ్నలు అడగాలనుకున్నా కూడా మా కస్టమర్ టీమ్ సిద్ధంగా ఉంటుంది. వారు మీ సందేహాలను నివృత్తి చేస్తారు.
ఎవరూ పనిచేయని విధంగా డిజిట్ కస్టమర్ సపోర్ట్ టీమ్ సభ్యులు జాతీయ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటారు. దాంతో మీకు ఎలాంటి చింత ఉండదు.
ఎక్కడ హీరో బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలా? అనే సందేహాలకు పుల్‌స్టాప్ పెట్టండి.
మీరు మీ హీరో టూ వీలర్లకు అధిక ప్రీమియం ఉందని చింతిస్తున్నారా? ప్రీమియం తగ్గించుకోవడం కోసం కూడా మా వద్ద కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ ప్రీమియం తగ్గుతుంది.
హీరో టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడం
మీరు ప్రీమియంలు ఎక్కువగా కట్టాల్సి వస్తుందని పాలసీ తీసుకునేందుకు వెనుకడుగు వేస్తుంటే కింది పద్ధతుల ద్వారా మీరు మీ పాలసీ ప్రీమియంను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది.
నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను ఎంజాయ్ చేయండి – మీ కంపెనీ మీకు నో క్లెయిమ్ బోనస్‌ను అందిస్తుందా లేదా చూసుకోండి. ఎందుకంటే మీరు క్లెయిములు చేయకుండా ఉండటం వలన మీకు నో క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. దానిని ఉపయోగించి మీరు మీ ప్రీమియంను తగ్గించుకోవచ్చు.
వాలంటరీ డిడక్టబుల్స్ను ఎంచుకోండి - వాలంటరీ డిడక్టబుల్స్ ఉండే పాలసీని ఎంచుకోండి. క్లెయిమ్స్ సెటిల్ అయ్యే సమయంలో పాలసీదారులు కూడా కొంత మొత్తం కట్టేలా ఈ పాలసీలు ఉంటాయి. దీని వలన మీరు కట్టే ప్రీమియం విలువ తగ్గుతుంది.
మీ పాలసీని నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే కొనుగోలు చేయండి – పాలసీలను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నేరుగా కొనుగోలు చేయండి. మధ్యవర్తులు కమిషన్ తీసుకుంటారు. దాంతో పాలసీల విషయంలో మీరు ఖర్చు చేసే మొత్తం పెరుగుతుంది. దీని వలన మీ హీరో టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది.
మీకు అవసరమైన యాడ్–ఆన్స్ మాత్రమే కొనుగోలు చేయండి – మీకు అవసరమైన యాడ్-ఆన్లను మాత్రమే ఎంచుకోండి. అదనపు రక్షణ అవసరమే. కానీ, ప్రతి యాడ్–ఆన్‌ను గుడ్డిగా కొనుగోలు చేయడం మాత్రం మంచిది కాదు. మీకు అవసరమైన యాడ్–ఆన్లను మాత్రమే కొనుగోలు చేయండి. ఉదాహరణకు, మీరు వరదల వలన ప్రభావితం అయ్యే ప్రాంతంలో నివసిస్తుంటే ఇంజన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ను ఎంచుకోవాలి.
ప్రీమియంను బట్టి ప్లాన్‌ను ఎంచుకోవద్దు. అలా చేస్తే మీ బండి డ్యామేజ్ అయినపుడు మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. మీ హీరో బైక్ ఒకవేళ డ్యామేజ్ అయితే మీకు సంపూర్ణ రక్షణ అందించే పాలసీని ఎంచుకోండి.
హీరో స్కూటర్లు, బైకులు చాలా విలువైనవి. మీరు హీరో బండ్లను జాగ్రత్తగా చూసుకుంటే అవి ఎటువంటి సమస్యలను తేకుండా దాదాపు దశాబ్దం వరకు నడుస్తాయి. అందుకోసం మీకు హీరో ఇన్సూరెన్స్ పాలసీ బాగా ఉపయోగపడుతుంది.
భారతదేశంలో హీరో బైక్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
నేను హీరో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటే, నాకు ప్రమాదం జరిగిన ఎంతసేపట్లోగా నా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి?
చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారుడికి ప్రమాదం గురించి క్లెయిమ్ చేసుకునేందుకు ఏడు రోజుల సమయాన్ని ఇస్తాయి. కొన్నిఇన్సూరెన్స్ కంపెనీలు ప్రమాదం గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి రిపోర్ట్ చేసేందుకు 24 నుంచి 48 గంటల సమయాన్ని ఇస్తాయి.
నో క్లెయిమ్ బోనస్‌ను పొందేందుకు నేను ఎంత త్వరగా హీరో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసుకోవాలి?
మీ పాలసీ గడువు తేదీ కంటే 90 రోజుల ముందుగానే మీ పాలసీని రెన్యువల్ చేసుకోవాలి. అలా అయితే మీ పాలసీ క్లోజ్ కాకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు రెన్యువల్ చేసుకోకపోతే నో క్లెయిమ్ బోనస్‌ని పొందే అవకాశాన్ని కోల్పోతారు.
నా హీరో బైక్ లేదా స్కూటర్ ఇన్సూరెన్స్‌ను ఏ అంశాలలు నిర్ణయిస్తాయి?
మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను కింది అంశాలు నిర్ధారిస్తాయి.
వాహనం వయసు
మోడల్ రకం
భౌగోళిక ప్రాంతం
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ)
మీ టూ వీలర్ ఇంజన్ సామర్థ్యం.