ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ లేదా OD ఇన్సూరెన్స్‌కు సంబంధించిన వివరణాత్మక గైడ్
పేరులో సూచించినట్లుగా, ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని, మీ ఇన్సూరెన్స్ చేయబడిన వాహనాన్ని నష్టాల నుంచి రక్షించడానికి రూపొందించబడిన కస్టమైజ్‌డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ.
ఇది కాస్త సరదాగా అనిపించినా తరచూ జరిగే ఉదాహరణలను తీసుకుందాం; మీ కారు రెగ్యులర్‌గా పార్క్ చేసే స్థలంలో పార్క్ చేయబడిందని అనుకుందాం. అకస్మాత్తుగా పక్కన ఉన్న చెట్టు కొమ్మలు కానీ, క్రికెట్ బాల్ కానీ, కొబ్బరికాయ లేదంటే కొబ్బరి మట్టలు మీ కారు అద్దాల మీద లేదంటే పూర్తి కారు మీద పడవచ్చు!
కథలా చెప్పుకొంటే సరదాగానే ఉన్నప్పటికీ, నిజ జీవితంలో ఎంతో నష్టం జరుగుతుంది. అలాంటి అనుకోకుండా దురదృష్టవశాత్తుగా జరిగే భారీ నష్టాల పరిస్థితుల నుంచి బయటపడటానికి మీకు సహాయపడేదే OD ఇన్సూరెన్స్.
దీని గురించి మరింత తెలుసుకోండి:
ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి ఎవరు అర్హులు?
ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు సెప్టెంబర్ 2019 నుంచి వర్తించే కార్లు, టూవీలర్ల కోసం స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించగలవు. అవి థర్డ్-పార్టీ కారు లేదా బైక్ ఇన్సూరెన్స్‌ను మాత్రమే కలిగి ఉంటాయి.
ఉదాహరణకు; తమ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు లాంగ్ టర్మ్ థర్డ్ పార్టీ పాలసీలను కొనుక్కున్న చాలామంది కార్ లేదా బైక్ యజమానులు (ముఖ్యంగా మార్చి 2019లో వీటిని పొందిన వారు) ఇప్పుడు ఓన్ డ్యామేజ్‌లు, నష్టాలను కూడా కవర్ చేయడానికి స్టాండలోన్ OD ఇన్సూరెన్స్‌ను కూడా ఎంచుకోవచ్చు.
నోట్: మీరు OD ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ పాలసీని (భారత మోటారు చట్టాలచే చట్టబద్ధం చేయబడినట్లు) కలిగి ఉన్నారని పరోక్షంగా నిర్ధారిస్తారు. ఇది Digit ఇన్సూరెన్స్‌కు చెందిన వాటిలో ఒకటి కావచ్చు లేదా మరో ఇన్సూరెన్స్ సంస్థ కూడా కావచ్చు.
స్టాండలోన్ OD ఇన్సూరెన్స్ ఎవరు పొందాలి?
మీరు ఈ మధ్య కాలంలో Digit నుంచి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను మాత్రమే కొనుగోలు చేసి ఉంటే, మీ స్వంత వాహనాన్ని నష్టాల నుంచి కూడా కాపాడుకోవడానికి మీరు ఇప్పుడు స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కూడా పొందవచ్చు.
మీరు ఈ మధ్య కాలంలో ఒక వాహనాన్ని కొనుగోలు చేసి, అందుకుగాను మరొక ఇన్సూరెన్స్ సంస్థ నుంచి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను పొందినట్లయితే, మీరు Digit నుంచి కూడా మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనాలు మొదలైన వాటి నుంచి మీ వాహనానికి కవరేజీని ఇస్తుంది. అయితే మీరు మీ కవరేజీ పరిధి మేరకు యాడ్-ఆన్ కవర్‌లను కూడా ఎంచుకోవచ్చు.
OD ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ఏమేమి కవర్ కావు?
మీ వాహనం రక్షణ కోసం ఓన్ డ్యామేజ్ కవర్ మంచిది. అయితే, ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి
ఇది స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి, మీ థర్డ్-పార్టీ లయబిలిటీలు ఇందులో చేర్చబడవు. మీ థర్డ్-పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ బదులుగా అదే జాగ్రత్త తీసుకుంటుంది.
ఇది చట్ట విరుద్ధం, కాబట్టి మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుంటే క్లెయిమ్‌లు కవర్ చేయబడవు.
పేర్కొన్న వ్యక్తి చట్టవిరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఆమోదించబడవు అనేది ఒక స్టాండర్డ్ రూల్. కాబట్టి, మీరు సరైన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినట్లయితే మాత్రమే క్లెయిమ్‌లు చేయవచ్చు.
ఇది చాలా స్పష్టంగా ఉంది, కాదా? మీరు నిర్దిష్ట యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయకుంటే, మీరు వాటి నుంచి బెనిఫిట్ పొందలేరు. ఉదాహరణకు, టైర్ ప్రొటెక్ట్ కవర్‌ని ఎంచుకుంటే మీ టైర్ ప్రమాదాల సమయంలో మాత్రమే ప్రొటెక్ట్ చేయబడుతుంది. అంతకు మించి కాదు.
కాన్సీక్వెన్షియల్ డ్యామేజ్స్ ప్రమాదం తర్వాత జరిగే డ్యామేజ్లను సూచిస్తాయి. దురదృష్టవశాత్తూ, ప్రమాదం సమయంలోనే డ్యామేజ్ జరిగితే తప్ప అవి కవర్ చేయబడవు
సరళంగా చెప్పాలంటే, చేయకూడని పనిని మీరు చేసినట్లయితే మీ వాహనం కవర్ చేయబడదని దీని అర్థం. ఉదాహరణకు; మీ నగరం వరదలకు గురైన సమయంలో మీ కారు లేదా బైక్‌ను వరదల్లోకి తీసుకెళ్లడం లాంటి పనులు చేసినప్పుడు.
చట్టం ప్రకారం, మీరు లెర్నర్ లైసెన్స్ మాత్రమే కలిగి ఉంటే, మీ వద్ద శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎవరైనా ఉండాలి. అలా లేకపోతే, మీ వాహనం కవర్ చేయబడదు.
ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ తో పాటు అందుబాటులో ఉన్న యాడ్-ఆన్స్
- జీరో డిప్రిషియేషన్ కవర్
- ఇంజన్, గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్
- బ్రేక్ డౌన్ అసిస్టెన్స్
- కన్జూమబుల్ కవర్
- రిటర్న్ టు ఇన్ వాయిస్ కవర్
- టైర్ ప్రొటెక్ట్ కవర్ (కార్ కోసం మాత్రమే)
ఓన్ డ్యామేజ్ ప్రీమియం అంటే ఏమిటి?
OD ఇన్సూరెన్ప్ కోసం మీరు చెల్లించే ధరనే ఓన్ డ్యామేజ్ ప్రీమియం. ఈ ప్రీమియం ధర మీరు ఏ రకమైన వాహనం కలిగి ఉన్నారు; అది ఎంత పాతది, ఏ సిటీలో దానిని వాడుతున్నారు వంటి వాటిపై ఆధారపడి నిర్ధారించబడుతుంది.
మీ OD ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉన్నా కానీ మీకు కింద పేర్కొన్న ప్రొటెక్షన్ అందిస్తుంది. అవి:
- ఎక్స్టర్నల్ కారణాల వల్ల జరిగే యాక్సిడెంటల్ డ్యామేజ్‌లు
- దొంగతనం, దోపిడీ, ఇంట్లో ఎవరైనా చొరబడినప్పుడు
- అగ్ని ప్రమాదం, పేలుడు, విస్పోటాలు, మెరుపులు, వస్తువు దానంతట అదే కాలిపోయినప్పుడు
- వరద, తుఫాన్, టైఫూన్, వడగండ్ల వాన తదితర ప్రకృతి వైపరీత్యాలు
- భూకంపం, కొండచరియలు విరిగిపడటం, పెద్ద బండ రాళ్లు జారిపడటం
- రైలు, రోడ్డు, ఎయిర్ లేదా దేశీయ నీటి మార్గాల ద్వారా రవాణా అయ్యే వాహనాలు
- ఉగ్రవాద దాడులు, ఆందోళనలు, నిరసనలు లేదా హానికరమైన డ్యామేజ్
ఓన్ డ్యామేజ్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?
టూ వీలర్ లేదా ఫోర్ వీలర్‌కు సంబంధించిన ఓన్ డ్యామేజ్ ప్రీమియం (Own Damage Premium )ని కింది వాటి ఆధారంగా లెక్కిస్తారు:
- మేక్, టైప్, వెహికిల్ ఏజ్
- వాహనం యొక్క డిక్లేర్డ్ వ్యాల్యూ
- ఇంజన్ యొక్క క్యూబిక్ కెపాసిటీ
- జియోగ్రాఫికల్ జోన్
ఓన్ డ్యామేజ్ ప్రీమియం ను ఎలా లెక్కిస్తారో ఇక్కడ తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి.
OD ప్రీమియం- IDV X [ప్రీమియం రేట్ (ఇన్సూరర్ ద్వారా నిర్ణయించబడుతుంది)] + [యాడ్-ఆన్స్ (ఉదా. బోనస్ కవరేజ్)] – [డిస్కౌంట్ & బెనిఫిట్లు (నో క్లెయిమ్ బోనస్, థెఫ్ట్ డిస్కౌంట్ మొదలైనవి)]
IDV - వాహనం షోరూం ధర + యాక్సెసరీస్ ధర (ఏమైనా ఉంటే) - డిప్రిషియేషన్ (IRDA ప్రకారం)
OD ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలి?
వాలంటరీ మినహాయింపులను పెంచండి - ఒక OD ఇన్సూరెన్స్ లో ‘వాలంటరీ మినహాయింపులు' అని పిలువబడేది ఉంటుంది. ఇది క్లెయిమ్‌ల సమయంలో మీరు చెల్లించడానికి ఎంచుకున్న డబ్బు మొత్తాన్ని సూచిస్తుంది. అందువల్ల మీ ఫీజిబిలిటీ ఆధారంగా మీరు మీ వాలంటరీ మినహాయింపు శాతాన్ని పెంచవచ్చు, ఇది నేరుగా మీ OD ప్రీమియంను తగ్గిస్తుంది.
సరైన IDVని డిక్లేర్ చేయండి - Digitతో మీకు మీరుగా మీ వాహనానికి సంబంధించిన IDVని కస్టమైజ్ చేయవచ్చు. క్లైయిమ్ సెటిల్మెంట్ సమయంలో మీ క్లైయిమ్ అమౌంట్‌ను, OD ప్రీమియంను IDV ప్రభావితం చేస్తుంది కాబట్టి IDV ముందు నుంచే సరిగ్గా ఉండేలా చూసుకోండి.
మీ NCBని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోకండి -మీరు ఇప్పటికే ఓన్ డ్యామేజ్ లేదా కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ని కలిగి ఉంటే, మీరు మీ NCB ని ప్రస్తుత పాలసీకి తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోకండి. దీని వల్ల అక్యుములేటెడ్ డిస్కౌంట్ లభిస్తుంది.
థర్డ్ పార్టీ ప్రీమియం, ఓన్ డ్యామేజ్ ప్రీమియం కు మధ్య తేడాలు
మోటార్ వెహికిల్ చట్టం, 1988 ప్రకారం ఇండియాలో రెండు రకాల పాలసీలు ఉన్నాయని మనకు తెలుసు. అందులో ఒకటి ఓన్ డ్యామేజ్, లయబిలిటీ కవర్‌తో కూడిన కాంప్రహెన్సివ్ పాలసీ. మరొకటి స్టాండర్డ్ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ. గతకొద్ది సంవత్సరాలుగా లయబిలిటీ క్లెయిమ్‌లు పెరగడంతో థర్డ్ పార్టీ ప్రీమియం పెరిగింది.
థర్డ్ పార్టీ ప్రీమియం | ఓన్ డ్యామేజ్ ప్రీమియం | |
లెక్కించే పద్ధతి | వాహనం క్యుబిక్ కెపాసిటీ ఆధారంగా దీనిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరి ఫిక్స్ చేస్తుంది. | ఓన్ డ్యామేజ్ ప్రీమియం అనేది IDV, వాహనం కొనుగోలు చేసిన సంవత్సరం, లొకేషన్, వాహనం రకాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. |
స్టెబిలిటీ | రెగ్యులేటర్ అయిన IRDA థర్డ్ పార్టీ ప్రీమియంను తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. | సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాహనం డిప్రిషియేషన్ అవుతుంది కాబట్టి ఓన్ డ్యామేజ్ ప్రీమియం తగ్గుతుంది. |
మోటార్ ప్రీమియంలో షేర్ | మోటార్ పాలసీలో ఫిక్స్ చేయబడినట్లు షేర్ ఎల్లప్పుడూ కాంప్రహెన్సివ్ లేదా స్టాండలోన్‌గా ఉంటుంది. | ఇది మోటార్ పాలసీ ప్రీమియంలో షేర్‌గా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. |
నేను ఎక్కడి నుంచి పొందాలి?
ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ లలో ఏది?
మీ వాహనానికి, మీ పాకెట్‌కు ఎంత భద్రత, కవరేజ్ అవసరం అనేదాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. థర్డ్ పార్టీ నష్టాలు, డ్యామేజ్‌లు, మీ స్వంత డ్యామేజ్లను కూడా కవర్ చేసేలా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి.
మీ వాహనానికి సంబంధించి ఇప్పటికే మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే, దానికి అదనంగా OD ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం ద్వారా పూర్తి కవరేజ్‌ను పొందవచ్చు.
క్లెయిమ్ సమయంలో అందించే మొత్తం కవరేజీ, పాలసీలో పేర్కొనబడ్డ షరతులు, మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం కవరేజీ పరిధి, ఓన్ డ్యామేజ్ ప్రీమియం మారుతుంది. ఎందుకంటే వాహనం విలువ తగ్గుతుంది కాబట్టి.
ఇండియాలో ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఇన్సూరెన్స్‌లో OD అంటే అర్థం ఏమిటి?
ఇన్సూరెన్స్‌లో OD అంటే ఓన్ డ్యామేజ్ అని అర్థం. అంటే మీ సొంత వాహనానికి సంబంధించిన నష్టం/డ్యామేజ్‌ను కవర్ చేసేది.
OD ఇన్సూరెన్స్‌ను కొనడానికి ఎవరు అర్హులు?
వ్యాలిడ్ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ కలిగిన వారెవరైనా, డ్యామేజ్, నష్టాలను కవర్ చేయడానికి OD ఇన్సూరెన్స్‌ను కొనుక్కోవచ్చు.
ఏ ఏ రకాల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి?
మీరు సాధారణంగా మూడు రకాల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయవచ్చు; అవి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, కాంప్రహెన్సివ్/స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, మరియు ఓన్ డ్యామేజ్స్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ.
చట్ట ప్రకారం OD ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరా?
లేదు, మీ బైక్ లేదా కారుకు OD ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని లేదు. కానీ, మీ సొంత వాహనం రక్షణ కోసమే ఇది సిఫార్సు చేయబడుతుంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, అన్ని వాహనాలకు బేసిక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దానికి అదనంగా మీరు థర్డ్ పార్టీ లయబిలిటీలు, ఓన్ డ్యామేజ్లను కూడా కవర్ చేసేలా ఆ రెండూ ఒకేదానిలో ఉండే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఎంచుకోవచ్చు.
OD ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
(చట్ట ప్రకారం) మార్చి 2019లో లాంగ్ టర్మ్ థర్డ్ పార్టీ పాలసీలను కొనుగోలు చేసిన కారు, బైక్ యజమానులకు ప్రత్యేకంగా సహాయపడటానికి IRDA సెప్టెంబర్ 2019లో ఒక స్టాండలోన్ OD ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనితో వాహన యజమానులు ఓన్ డ్యామేజీలను కూడా కవర్ చేసే ఆప్షన్‌ను కలిగి ఉంటారు. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఉన్న ఎవరికైనా ఈ కవర్ వర్తిస్తుంది.
నా థర్డ్–పార్టీ పాలసీ జూన్‌లో గడువు ముగియడానికి ఉంది. అయినా నేను OD పాలసీని కొనుగోలు చేయవచ్చా?
అవును, రాబోయే నాలుగు నెలల్లో మీ థర్డ్ పార్టీ పాలసీ గడువు ముగియనంత వరకు మీరు OD పాలసీని ఎంచుకోవచ్చు.