కాంప్రహెన్సివ్, జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ మధ్య తేడా
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ + జీరో డిప్రిషియేషన్ = 100 శాతం సంతృప్తి
జీరో డిప్రిషియేషన్ అనేది ఒక యాడ్–ఆన్ కవర్. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌తో పాటుగా కొనుగోలు చేసే అదనపు ప్రయోజనం. జీరో డిప్రిషియేషన్ అనేది మోటార్ ఇన్సూరెన్స్‌లో భాగం 😊! మీకు అర్థం కావడం కోసం మరోసారి మొత్తం వివరిస్తాం. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ గురించి మొదట చెప్పుకుందాం 😊!
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మోటార్ వాహనాలకు ప్రీమియం ఇన్సూరెన్స్ పాలసీ. ఇది కార్లు, బైక్‌లకు వర్తిస్తుంది. ఇదో సంపూర్ణమైన ప్యాకేజ్. ఇందులో థర్డ్ పార్టీ వాహన డ్యామేజీలు, మీ సొంత వాహన డ్యామేజీలు కూడా కవర్ అవుతాయి. స్థూలంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఏమేం కవర్ చేస్తాయంటే..
ప్రమాదం వలన మీ వాహనానికి డ్యామేజ్ అయితే
ప్రమాదంలో మీరు గాయాలపాలైతే
ఒకవేళ మీ వాహనం దొంగిలించబడితే
అగ్ని ప్రమాదం వలన మీ వాహనానికి డ్యామేజ్ జరిగినా
ప్రకృతి విపత్తుల వలన మీ వాహనానికి డ్యామేజ్ కలిగినా
ప్రమాదంలో థర్డ్ పార్టీ వాహనానికి లేదా ప్రాపర్టీకి డ్యామేజ్ అయినా
థర్డ్ పార్టీ వ్యక్తి గాయాలపాలైనా
ఇప్పుడే, ఇక్కడే జీరో డిప్రిషియేషన్ అవసరం అవుతుంది!
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీకు వివిధ రకాల యాడ్-ఆన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకునే యాడ్-ఆన్స్ లేదా కవర్స్‌ను బట్టి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం విలువ కొంత పెరుగుతుంది. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రీమియం విలువలా ఉండదు.
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎన్నో రకాల యాడ్–ఆన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, కంజూమబుల్ కవర్ మొదలగునవి. వీటిలాగే, జీరో డిప్రిషియేషన్ అనేది ఒక విధమైన యాడ్–ఆన్ మాత్రమే. దీనిని ఎంచుకోవడం వలన మీకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.
కాంప్రహెన్సివ్ పాలసీ vs జీరో డెప్ ఇన్సూరెన్స్ పాలసీ మధ్య తేడాలు
జీరో డెప్ కవర్‌తో కాంప్రహెన్సివ్ పాలసీ | జీరో డెప్ కవర్ లేకుండా కాంప్రహెన్సివ్ పాలసీ | |
ప్రీమియం అమౌంట్ | సాధారణ కాంప్రహెన్సివ్ పాలసీ కన్నా కొంచెం ఎక్కువ | జీరో డెప్ యాడ్–ఆన్ కలిగిన పాలసీ కంటే తక్కువగా ఉంటుంది. |
క్లెయిమ్ సెటిల్మెంట్ అమౌంట్ | ఎక్కువ డిప్రిసియేషన్ కవర్ కాదు. | రిపేర్ చేయాల్సిన అన్ని బాడీ పార్ట్స్‌కు డిప్రిషియేషన్ తక్కువగా పరిగణించబడుతుంది. |
ప్లాస్టిక్ భాగాల రిపేరింగ్ | జీరో డెప్ యాడ్–ఆన్ వలన కొన్ని భాగాలకు ఎటువంటి డిప్రిషియేషన్ ఉండదు. | మీరు క్లెయిమ్ చెల్లించే ముందు అటువంటి భాగాలపై 50 శాతం డిప్రిషియేషన్ పరిగణించబడుతుంది. |
కవర్ అయ్యే కారు వయసు | జీరో డెప్ యాడ్–ఆన్ వలన డిప్రిషియేషన్ రేట్లు సున్నాగా పరిగణించబడతాయి. | వయసుతో పాటు మీ కారు డిప్రిషియేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఇది క్లెయిమ్‌లో కవర్ చేయబడదు. |
జీరో డిప్రిషియేషన్ కవర్ తీసుకోవడం వలన ప్రయోజనం
వయసు పెరిగే కొద్దీ మనకు అనేక రకాల లోపాలు కనిపిస్తాయి. ఇదే నియమం మీ వాహనానికి కూడా వర్తిస్తుంది. మీ వాహనం (కారు లేదా బైక్) పాతబడే కొద్దీ దాని విలువ తగ్గుతూ పోతుంది. కానీ మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ తీసుకోవడం వలన వాహనం విలువ తగ్గిపోతుందని మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కవర్ మీరు కొనుగోలు చేసిన రోజు మీ వాహనానికి ఎంతైతే ధర ఉందో అంతే ధరను నేటికీ పరిగణిస్తుంది.
జీరో డిప్రిషియేషన్ అనేది నిల్ డిప్రిషియేషన్ లేదా బంపర్ టు బంపర్ కవర్ అని పిలవబడుతుంది. ఇది కవరేజ్ నుంచి డిప్రిషియేషన్‌ను తీసేస్తుంది.
ఇతర వాహనాలను ఢీకొని మీ వాహనం (కారు లేదా బైక్) డ్యామేజ్ అయినపుడు.. ఈ కవరేజ్‌ను మీరు తీసుకుని ఉంటే మీరు క్లెయిమ్ చేసేటపుడు ఎటువంటి డిప్రిషియేషన్ చేయరు (మీ వాహనం విలువకు ఎటువంటి తరుగుదల ఉండదు).
మీ వాహనంలోని ఏదైనా భాగాన్ని మీరు రిపేర్ చేయించి.. దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినపుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు 100 శాతం మొత్తాన్ని అందజేస్తుంది (డిడక్టబుల్స్ తొలగించబడతాయి).
జీరో డిప్రిషియేషన్ అనేది కేవలం యాడ్–ఆన్ మాత్రమే కాబట్టి దానిని కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌తో పోల్చలేం. జీరో డిప్రిషియేషన్‌ను కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌తో పాటు యాడ్–ఆన్‌గా తీసుకుంటారు. మీ వాహనాన్ని కాపాడేందుకు ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ తీసుకోవడం వలన మీకు అత్యంత ఇష్టమైన మీ వాహనం 100 శాతం సంరక్షించబడుతుంది. కొత్తదాని వలే పరిగణించబడుతుంది.