ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసి ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
Instant Policy, No Medical Check-ups

ఇండియా నుంచి సౌదీ అరేబియా వీసాను ఎలా పొందాలి?

విజన్ 2030లో భాగంగా సౌదీ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు 100 మిలియన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ లను ఆహ్వానిస్తోంది. గతంలో పరిమితం చేయబడిన సరిహద్దులను ఇది పూర్తిగా ఓపెన్ చేసింది.

అందువల్ల ఇప్పుడు ఇండియన్లు సౌదీ అరేబియా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మరియు దానిని పొందడం చాలా సులభం. వ్యాలిడ్ పాస్ పోర్ట్ ఉన్న ఇండియన్స్ కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అధికారిక వీసా అప్లికేషన్ వెబ్సైట్ సందర్శించవచ్చు. అవసరం అయిన డిటెయిల్స్ మరియు పత్రాలు అందించి ఫామ్ ను ఫిలప్ చేయొచ్చు.

సౌదీ వీసా అప్లికేషన్ కోసం మీరు తెలుసుకోవాల్సిన మొత్తం సమాచారాన్ని మేము ఇక్కడ అందించాం.

భారతీయులు సౌదీ అరేబియా వీసాను పొందేందుకు ఆన్ లైన్ స్టెప్స్

ఇండియన్లకు ఆన్ లైన్ లో సౌదీ అరేబియా వీసాను అప్లై చేయడం చాలా సూటిగా ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకుంటున్న వీసా రకాన్ని బట్టి ప్రాసెసింగ్ మరియు అవసరం అయిన పత్రాలు అనేవి కొద్దిగా మారుతూ ఉంటాయి.

అనుసరించాల్సిన స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి -

స్టెప్ 1

కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా MOFA వెబ్సైట్ సందర్శించండి. వీసా అప్లికేషన్ కొరకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

స్టెప్ 2.

మీరు ఎందుకోసం సౌదీకి వెళ్తున్నారనే దాని ప్రకారం ఇండియన్స్ కోసం ఉన్న రకరకాల సౌదీ వీసాల నుంచి ఒకదానిని ఎంచుకోండి -

  • టూరిస్ట్

  • పర్సనల్ (వ్యక్తిగత) విజిట్

  • బిజినెస్

  • ఎంప్లాయిమెంట్

  • స్టూడెంట్

  • హజ్

  • కుటుంబాన్ని చూసేందుకు

  • దౌత్య మరియు అధికారిక

భారతీయుల కోసం మొత్తం 16 రకాల సౌదీ అరేబియా వీసా రకాలు అందుబాటులో ఉన్నాయి. అఫిషియల్ వెబ్సైట్ అయిన MOFA వెబ్సైట్లో మీరు దరఖాస్తు చేస్తున్నపుడు అన్ని రకాలు మరియు డిటెయిల్స్ పొందొచ్చు.

స్టెప్ 3.

మీ డిటెయిల్స్ తో కూడిన డేటాతో ఫామ్ పూరించండి. మరియు ఆన్లైన్ ఫీజు చెల్లించండి. వివరాలు పూరించిన ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దానిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

స్టెప్ 4.

అప్లికేషన్ ఫారంతో అన్ని సంబంధిత పత్రాల హార్డ్ కాపీలను జోడించి మీకు దగ్గర్లోని సౌదీ అరేబియా ఎంబసీ ఆఫీస్ లో సమర్పించండి.

ఇండియన్లు సౌదీ అరేబియా వీసా పొందేందుకు ఆఫ్ లైన్ స్టెప్స్

ఇండియా నుంచి సౌదీ అరేబియాకు ఆఫ్ లైన్ లో వీసా ఎలా పొందాలని మీరు చేసే సెర్చ్ కేవలం ఇండియాలో ఉన్న రెండు ఎంబసీ హౌస్ లతో ముగుస్తుంది.

ఇక్కడ ఉన్నాయి -

  • ముంబై నగరంలో సౌదీ అరేబియా కింగ్ డమ్ కాన్సులేట్ ఉంది.

  • ఢిల్లీలో ఉన్న సౌదీ అరేబియా రాజ్య ఎంబసీని సందర్శించాలి.

మీరు ఈ రెండు కేంద్రాల నుంచి అప్లికేషన్ ఫారం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవండి -

  • ఫారంతో పాటు మీకు అందజేసిన సూచనలను చదవండి. వీసా రకం, అర్హతలు, ఫీజు మరియు పత్రాలు మొదలయినవి.

  • వ్యక్తిగత డిటెయిల్స్ పేర్కొనే ఫామ్ పూరించండి. చెక్ లిస్ట్ ప్రకారం పత్రాలను అటాచ్ చేయండి.

  • ఫీజుతో పాటుగా సౌదీ అరేబియా ఎంబసీ హౌస్ లో ఫామ్ సమర్పించండి.

ఇండియన్లు సౌదీ అరేబియా వీసా పొందేందుకు కావాల్సిన పత్రాలు

ఇండియా నుంచి సౌదీ అరేబియాకు వీసా పొందడంలో సరైన పత్రాలు సమర్పించడం అనేది విజయానికి బాటలు వేస్తుంది. కొన్ని సాధారణ పత్రాలు:

  • పాస్ పోర్ట్ - మీరు సౌదీ అరేబియాలో ప్రవేశించాలని ప్లాన్ చేసుకుంటున్న తేదీ నుంచి కనీసం 6 నెలలు వ్యాలిడ్ అయ్యే ఇండియన్ పాస్ పోర్ట్ ఉండాలి.
  • ఫొటోగ్రాఫ్ – చివరి 3 నెలల్లో తీసుకున్న దరఖాస్తుదారుని 2 ఫొటోకాపీలు. వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఫొటోలు నీట్ గా ఉండాలి. కళ్లద్దాలు లేకుండా 85% ఫేస్ కవర్ అయ్యేలా ఉండాలి. 35mm X 45mm సైజ్ లో ఉండాలి.
  • వీసా అప్లికేషన్ ఫారం – పూర్తిగా పూరించి సంతకం చేసిన వీసా అప్లికేషన్ ఫారం.
  • హెల్త్ ఇన్సూరెన్స్ - సౌదీ అరేబియాలో చెల్లుబాటు అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ కాపీ.
  • మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ - ఎంబసీ డాక్టర్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తాడు.
  • వసతి - హోటల్ బుకింగ్ లేదా వసతి గురించిన రుజువు.

వీసా రకాల ఆధారంగా అవసరం అయిన పత్రాలు ఈ విధంగా ఉన్నాయి:

వీసా రకం లేదా సందర్శన ఉద్దేశం ప్రత్యేక పత్రాలు అవసరం ఎవరు సందర్శించవచ్చు
కుటుంబ సందర్శన వివాహం అయిన జంటకు వివాహ ధృవీకరణ పత్రం, పిల్లలకు జనన ధృవీకరణ పత్రం, మరియు ప్రతి ఒక్క సందర్శకుడికి పోలియో ధృవీకరణ పత్రం సభ్యులతో ఉన్న ఏదైనా కుటుంబం
బిజినెస్ (వ్యాపార) సందర్శన చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సిఫారసు లేఖ, బిజినెస్ కాంటాక్ట్స్ గురించి వివరిస్తూ కవరింగ్ లెటర్, దరఖాస్తుదారుని పేరు, బిజినెస్ లో అతడి పాత్ర, సౌదీ అరేబియా విజిట్ కు ఇన్విటేషన్ పంపిన స్పాన్సర్ పేరు, ఆహ్వానించిన కంపెనీలు రిజిస్ట్రేషన్ డిటేయిల్స్. మేనేజర్లు, డైరెక్టర్లు, అసిస్టెంట్స్, పర్చేస్/స్టోర్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్స్, పార్ట్‌నర్స్ మొదలయినవారు ఈ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు.
టెంపరరీ (తాత్కాలిక) వర్క్ వీసా చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆహ్వాన పత్రిక, బిజినెస్ కాంటాక్ట్స్ గురించి తెలియజేస్తూ కవరింగ్ లెటర్, దరఖాస్తుదారుని పేరు హోదా, బిజినెస్ లో పాత్ర, సౌదీ అరేబియా విజిట్ కోసం స్పాన్సర్ ఇన్విటేషన్, ఆహ్వానం పంపిన కంపెనీల డిటెయిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్, ఎడ్యుకేషనల్ పత్రాలు. టెక్నీషియన్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, అడ్వొకేట్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, మెకానిక్స్, వైద్యులు మొదలయినవారు.
ట్రాన్సిట్ (రవాణా) వీసా చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సిఫారసు లేఖ, బిజినెస్ కాంటాక్ట్స్ గురించి తెలిపే కవర్ లెటర్ వ్యాపారస్తుడు

భారతీయులు సౌదీ అరేబియా వీసా పొందడానికి అర్హత ఏమిటి?

భారతీయ పౌరులకు సౌదీ అరేబియా వీసా కోసం అర్హత ప్రమాణాలు -

  • మీరు సౌదీ అరేబియాకు వెళ్లాలని ప్లానింగ్ చేసుకుంటున్న తేదీ నుంచి కనీసం 6 నెలల పాటు వ్యాలిడ్ అయ్యే పాస్ పోర్ట్.

  • 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. లేకపోతే సంరక్షకునితో ఉండాలి.

  • సౌదీ అరేబియాలో వ్యాలిడ్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.

  • బిజినెస్ లేదా కమర్షియల్ టూర్ అయితే సరైన పత్రాలతో పాటు ఎందుకు అక్కడకు వెళ్తున్నామో క్లియర్ కట్ గా తెలిపే కవర్ లెటర్, ఇన్విటేషన్ లెటర్ మొదలయినవి.

ఇండియన్లు సౌదీ అరేబియా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు (రుసుము) ఎంత?

ఫీజు డిటెయిల్స్ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి:

నార్మల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా 201.76 USD
సింగిల్ ఎంట్రీ వర్క్ వీసా 220.09 USD
సింగిల్ ఎంట్రీ బిజినెస్ వీసా 195.63 USD
సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా 195.63 USD

డిస్ క్లెయిమర్: US డాలర్లలో ఇవ్వబడిన పైన పేర్కొన్న అమౌంట్స్ అనేవి మార్కెట్ ను బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇండియన్లకు సౌదీ అరేబియా వీసా వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది?

 

మల్టీపుల్ ఎంట్రీలతో ఉన్న సౌదీ వీసా సాధారణంగా సంవత్సరం వరకు వ్యాలిడ్ అవుతుంది. అయితే మీరు సందర్శనలో భాగంగా 90 రోజులు మాత్రమే ఉండగలరు.

వ్యాలిడిటీ డిటెయిల్స్ కింద ఉన్నాయి -

వీసా టైప్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉండొచ్చు
కుటుంబ సందర్శన 60 రోజులు 30 రోజులు
బిజినెస్ విజిట్ 90 రోజులు 30 రోజులు
టెంపరరీ వర్క్ విజిట్ 90 రోజులు 90 రోజులు
బిజినెస్ ట్రాన్సిట్ 60 రోజులు 72 గంటలు

దరఖాస్తు సమర్పించి చెల్లింపు చేసిన తర్వాత మీరు మీ సౌదీ అరేబియా వీసా స్థితిని ఆన్ లైన్ లో చూడొచ్చు.

సరైన పత్రాలు, వ్యక్తిగత డిటెయిల్స్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం ద్వారా భారతీయులు సౌదీ అరేబియా వీసాను పొందడం చాలా సులభం అవుతుంది. ఇక్కడ పేర్కొన్న డిటెయిల్స్ దరఖాస్తుదారునికి ఎంతో సపోర్ట్ అందిస్తాయి. అప్లికేషన్ స్టేటస్ మరియు దాని తిరస్కరణకు గల కారణాన్ని తెలుసుకునేందుకు మరియు ఇతర డిటెయిల్స్ తెలుసుకునేందుకు వ్యక్తులు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా MOFA వెబ్ సైట్ కూడా సందర్శించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

సౌదీ అరేబియా వీసా పొందేందుకు అవసరం అయిన వైద్య పరీక్షలు ఏమిటి?

పోలియో, HIV, హెపటైటిస్, సిఫిలిస్, RBC కౌంట్ మొదలైన వైద్య పరీక్షలు సౌదీ అరేబియా వీసా పొందేందుకు తప్పకుండా అవసరం.

సౌదీ అరేబియా వీసా ప్రాసెసింగ్ సమయం ఎంత?

సౌదీ అరేబియా వీసా ప్రాసెస్ చేసేందుకు సాధారణంగా 4-5 రోజులు పడుతుంది. గరిష్టంగా 3 వారాల వరకు పడుతుంది.

సౌదీ అరేబియా వీసా అప్లికేషన్ కోసం తీసుకున్న ఫొటోలో తలపాగ ఉంటే అనుమతించబడుతుందా?

కేవలం మతపరమైన అంశాలలో మాత్రం సౌదీ అరేబియా వీసా అప్లికేషన్ కు తీసుకున్న ఫొటో లో తలపాగ అనుమతించబడుతుంది.