ఇండియన్ సిటిజన్ల కోసం ఇటలీ వీసా
రొమాంటిక్ నగరంగా పేరు గాంచిన వెనిస్ నుంచి, టుస్కానీ యొక్క విభిన్న ప్రకృతి దృశ్యాల వరకు ప్రతిదీ సుందరంగా ఉంటాయి. ఇటలీ ప్రపంచంలోని అనేక అద్భుత కళాఖండాలకు పుట్టినిల్లు. ఇక్కడ టేస్టీగా ఉండే ఫుడ్ మరియు ఆర్ట్స్ కూడా ఉంటాయి. స్కెంజెన్ ప్రాంతంలో ఉన్నందువల్ల మీరు సాధారణ స్కెంజెన్ వీసాతో ఇక్కడికి ప్రయాణం చేయొచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటే ఒకే సింగిల్ వీసా కింద మీరు సుదీర్ఘ యురోపియన్ సెలవుకు వెళ్లొచ్చు. దాని గురించి మీరు ఎలా అడుగుతారు? మేము మీకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాం.
ఇండియన్లు ఇటలీకి వెళ్లేందుకు వీసా కావాలా?
అవును, ఇటలీకి ట్రావెల్ చేసేందుకు ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లందరికీ వీసా కావాలి. వీసా అనేది 6 నెలల కాలానికి జారీ చేయబడుతుంది. స్కెంజెన్ ప్రాంతంలో విజిటర్లు 90 రోజుల వ్యవధి పాటు ఉండేందుకు ఇది అనుమతిస్తుంది.
ఇండియన్ సిటిజన్లు ఇటలీకి వచ్చినపుడు వీసా ఆన్ అరైవల్ లభిస్తుందా?
అన్ని యురోపియన్ దేశాల వలే ఇటలీలో కూడా ఇండియన్ సిటిజన్లకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం లేదు.
ఇటలీ టూరిస్ట్ వీసాకు కావాల్సిన పత్రాలు
మీరు ఇటలీ స్కెంజెన్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ కింది పత్రాలు అవసరం:
పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం.
గడిచిన 3 నెలల్లో తీసిన ఒకే లాంటి రెండు ఫొటోలు. ఫొటో కొలతలు 35X45mm ఉండాలి. ఫొటో అనేది సింపుల్ గా మరియు కలర్ తో ఉండాలి. ఇది ముఖాన్ని 70-80 శాతం చూపెట్టేదిగా ఉండాలి.
10 సంవత్సరాల కంటే పాతది కాని వ్యాలిడ్ పాస్ పోర్ట్. మీరు ఇటలీ లేదా ఇతర ఏదైనా స్కెంజెన్ దేశం నుంచి బయలుదేరిన తర్వాత వీసా అనేది 3 నెలల వ్యాలిడిటీతో ఉండాలి.
పాత వీసా కాపీ (వర్తిస్తే)
వెళ్లేందుకు మరియు వచ్చేందుకు ప్రయాణ టికెట్లు.
మీరు అక్కడ ఉండేందుకు బుక్ చేసిన హోటల్ బుకింగ్స్.
€30,000కి హెల్త్ ఇన్సూరెన్స్/మెడికల్ ఎమర్జెన్సీ కవరేజ్ కలిగి ఉండే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ.
మీకు మద్దతు ఇచ్చేందుకు తగినంత ఆర్థిక స్థోమత అంటే గడిచిన 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు.
మీ ప్రయాణం ఉద్దేశం గురించి వివరిస్తూ కవర్ లెటర్.
స్కూల్ ఐడీ/కాలేజ్ ఐడీ/ కంపెనీ రిజిస్ట్రేషన్/రిటైర్మెంట్ ప్రూఫ్.
ఇంతే కాకుండా మీరు ఇటలీలో నివసిస్తున్న మీ కుటుంబం/స్నేహితుడి చిరునామా, సంప్రదింపు వివరాలతో కూడిన ఆహ్వాన లేఖను సమర్పించాల్సి ఉంటుంది (ఒక వేళ వర్తిస్తే).
ఇండియా నుంచి ఇటలీ వీసా ఫీజు
వయసు | టూరిస్ట్ వీసా ఫీజు (INR) |
---|---|
వీసా ఫీజు కేటగిరీ సీ-షార్ట్ టర్మ్ | USD 81.43 (EUR 74.75) |
6-12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న దరఖాస్తుదారులు | USD 40.72 (EUR 37.38) |
6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న దరఖాస్తుదారులు | ₹0 |
ఈ చార్జీలు మాత్రమే కాకుండా దరఖాస్తుదారు USD 8.84 (EUR 8.11) వీఎఫ్ఎస్ సేవల చార్జీలు మరియు USD 1.97 (EUR 1.81) కన్వీనియన్స్ ఫీజు చెల్లింపు చేయాలి.
ఇండియా నుంచి ఇటలీ టూరిస్ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీరు మీ ఇటలీ స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నపుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని స్టెప్ లు:
- ఇటలీ కోసం వీసా అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
- దాన్ని పూరించండి. మరియు ఫామ్ తో పాటు ఏ పత్రాలు అవసరమో చూడండి.
- అన్ని పత్రాలను ఏర్పాటు చేసుకోండి.
- అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్ చేసుకుని దాని ప్రకారం ఎంబసీని సందర్శించండి.
- వీసా అప్లికేషన్ సెంటర్ ను సందర్శించండి.
- ఇంటర్వ్యూ తర్వాత అన్ని పత్రాలను సమర్పించండి.
- మీ పాస్ పోర్ట్ ను కలెక్ట్ చేసుకోండి.
ఇటలీ టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ టైమ్
నేను ఇటలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?
వీసా పొందేందుకు మీరు కనీసం €30,000 హెల్త్ ఇన్సూరెన్స్ లేదా మెడికల్ కవరేజ్ కలిగి ఉండాలి. కాబట్టి స్కెంజెన్ వీసాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఇండియా దాటిన తర్వాత మీకు కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు అవసరం అయిన కవరేజ్ అందిస్తుంది. అదనంగా ఇది అనేక ఇతర సందర్భాల్లో కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది:
ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్ల కోసం ఇటలీ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లు ఇటలీకి వెళ్లినపుడు వీసా ఆన్ అరైవల్ పొందేందుకు అర్హులా?
లేదు, అనేక ఇతర యురోపియన్ దేశాల వలే ఇటలీ కూడా ఇండియన్లకు వీసా ఆన్ అరైవల్ ను అందించదు. ఏదేమైనా స్కెంజెన్ వీసాతో ప్రయాణం చేసేందుకు ఇండియన్ సిటిజన్లు అర్హులవుతారు.
అప్లికేషన్ ప్రాసెస్ టైమ్ లో మనం ఎందుకు విజిట్ చేస్తున్నామో తెలిపే కవర్ లెటర్ అవసరమా?
ఇది మ్యాండేటరి కానప్పటికీ మీరు అప్లికేషన్ తో పాటు అటువంటి లేఖను జోడించడం మంచిది.
మైనర్లకు ఇటలీ కోసం స్టాండర్డ్ వీసా అందుబాటులో ఉంటుందా?
మైనర్లు వారి తల్లిదండ్రుల నుంచి కానీ వారి సంరక్షుల నుంచి కానీ అవసరం అయిన రాతపూర్వక సమ్మతి ఫామ్ లను తీసుకొస్తే వారికి వీసా మంజూరు చేయబడుతుంది. పెద్దవారి సంతకాలు కూడా అవసరం అవుతాయి.
ఇటలీకి ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా?
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మ్యాండేటరి. ముందుగా ఎటువంటి కవరేజ్ లిమిట్ అనేది నిర్వచించబడలేదు.
ఇండియాలోని ఇటాలియన్ ఎంబసీకి వీసాలు మంజూరు చేసే అధికారం ఉంటుందా?
అవును వారు మంజూరు చేస్తారు కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. 1 నెలరోజుల ముందుగానే ఆన్ లైన్ లో వీసాను పొందడం చాలా మంచిది.