ఇండియా నుంచి జర్మనీ వీసా
ఇండియా నుంచి జర్మనీ టూరిస్ట్ వీసా గురించి పూర్తి సమాచారం
జర్మనీకి ట్రావెల్ చేసేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండొచ్చు. శక్తివంతం అయిన కళాత్మక నగరాల నుంచి విచిత్రంగా ఉన్న గ్రామాల వరకు మీ తదుపరి బ్యూటిఫుల్ ట్రిప్ కొరకు జర్మనీ అనువైన ప్రదేశం. హోమ్ లో జరుపుకునే పండుగుల వంటి అక్టోబర్ ఫెస్ట్ మరియు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వాటికి ఇది నిలయం. అంతే కాకుండా ఇది అన్ని కళలకు ప్రసిద్ధి. కానీ మీరు మీ ట్రావెల్ కోసం ముందుకు సాగే ముందు మీరు మీ వీసా కోసం అప్లై చేసుకోండి. వీసా పొందిన తర్వాత ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేయండి.
ఇండియన్లు జర్మనీ వెళ్లేందుకు వీసా కావాలా?
అవును. ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లు జర్మనీకి వెళ్లేందుకు స్కెంజెన్ వీసా కావాలి. దీనితో మీరు స్కెంజెన్ ప్రాంతంలో ఉన్న ఇతర 25 దేశాలను కూడా సందర్శించవచ్చు. వీసా పొందిన తర్వాత ఇండియన్ సిటిజన్స్ 90 రోజుల వరకు మాత్రమే ఉండేలా అనుమతిస్తారు. అయితే మీరు జర్మనీకి వెళ్లిన తర్వాత మీ పాస్ పోర్ట్ 3 నెలలు వ్యాలిడ్ అయ్యేలా చూసుకోండి.
ఇండియన్ సిటిజన్ల కోసం జర్మనీ వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోందా?
లేదు. జర్మనీతో పాటు ఇతర యురోపియన్ కంట్రీలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అందించడం లేదు. జర్మనీకి ట్రావెల్ చేయాలని అనుకునే ఇండియన్లు ముందుగా ఆమోదం పొందిన వీసాను కలిగి ఉండాలి.
జర్మనీ టూరిస్ట్ వీసా కోసం అవసరమైన పత్రాలు
మీరు స్కెంజెన్ వీసా కొరకు అప్లై చేసినపుడు మీకు కావాల్సిన పత్రాలు:
ఇండియన్ సిటిజన్ల కోసం జర్మనీ వీసా ఫీజు
వీసా రకంతో సంబంధం లేకుండా ఇండియన్ సిటిజన్లకు జర్మనీ వీసా ఫీ (రుసుం) పెద్దలకు EUR 75 మరియు చిన్న పిల్లలకు 37.50. ఈ ఫీజుల నుంచి మినహాయింపు పొందిన కొంత మంది వ్యక్తులెవరో కింద ఉంది:
జర్మన్ టూరిస్ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జర్మనీ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసే విధానం కింద పేర్కొన్న విధంగా చాలా సులభంగా ఉంటుంది:
జర్మనీ టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ టైమ్
జర్మనీ టూరిస్ట్ వీసా 15 రోజుల ప్రాసెసింగ్ టైమ్ ను తీసుకుంటుంది. కానీ కొన్ని అనుకోని కేస్ లలో మీకు 30 రోజుల సమయం పట్టొచ్చు.
నేను జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?
స్కెంజెన్ వీసా అవసరాల ప్రకారం జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇండియన్ ప్రయాణికులకు తప్పనిసరి. అయితే మీరు దానిని పొందేందుకు అదే కారణం కాకూడదు! మనం ఎంత ప్లాన్ (ప్రణాళిక) వేసినా కానీ కొన్ని విషయాలు జరుగుతాయి. జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అటువంటి విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుతుంది. ఫ్లైట్ ఆలస్యం వంటి చిన్న ప్రమాదాల దగ్గరి నుంచి ట్రిప్ రద్దు వంటి పెద్ద ప్రమాదాలు కూడా ఉండొచ్చు.
ట్రావెలర్స్ ఎదుర్కొనే కొన్ని రకాల పరిస్థితులు ఈ కింది విధంగా ఉన్నాయి. వాటి వల్ల కలిగే నష్టాల నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా రక్షిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం:
ఇండియా నుంచి జర్మనీ టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరా
మీ వీసా అప్లికేషన్ ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం మ్యాండేటరీ (తప్పనిసరి). ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుంటే మీ వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
అప్లికేషన్ ప్రాసెస్ లో నేను ఆర్థిక స్థితిని గురించి పేర్కొనాలా?
అవును. మీరు గత 3 నెలల మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ల గురించి పేర్కొనాలి. అధికారులు వాటిని పరిశీలించి మీరు వీసాకు అర్హులో కాదో నిర్ణయిస్తారు.
ఇండియన్ విజిటర్స్ జర్మనీకి చేరుకున్నపుడు వీసా పొందొచ్చా?
లేదు. అన్ని ఇతర యూరప్ దేశాల వలే జర్మనీ కూడా ఆన్ అరైవల్ కోసం ప్రత్యేక స్కీమ్ కలిగిలేదు. మీరు ముందుగానే ప్రాంతీయ జర్మనీ కాన్సులేట్ లో అప్లై చేసుకోవాలి.
నేను స్కెంజెన్ వీసాతో జర్మనీకి ట్రావెల్ చేయొచ్చా?
అవును. జర్మనీ స్కెంజెన్ ప్రాంతంలో ఒక భాగమే. మీరు స్కెంజెన్ వీసాపై జర్మనీకి వెళ్లొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అదే విధంగా ఉంటుంది.
నా వీసా అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించిన చార్జీల గురించి నాకెలా తెలుస్తుంది?
జర్మనీ పర్యాటక శాఖ అఫిషియల్ వెబ్సైట్ ను తనిఖీ చేయడం ద్వారా మీరు ఈ చార్జీల గురించి తెలుసుకోవచ్చు. రేట్లు చేంజ్ అయినపుడు దానిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన పత్రికలలో ప్రకటనలు ఇస్తారు.