ఇండియా నుంచి ఫ్రాన్స్ టూరిస్ట్ వీసా
ఇండియా నుంచి ఫ్రాన్స్ టూరిస్ట్ వీసా గురించి మొత్తం సమాచారం
ఫ్రాన్స్ విషయానికి వస్తే పారిస్ అనేది ప్రతి ట్రావెలర్ లిస్ట్ లో ఉంటుంది. పారిస్ లో చారిత్రక దృశ్యాలకు కొదువే లేదు. దానిలో ఉండే కళ, అదీ కాక కొన్ని రకాల టేస్టీ ఫుడ్ కూడా అక్కడ దొరుకుతుంది. మీరు పారిస్ లో తిరిగేందుకు మరియు కొత్త విషయాలను కనుక్కునేందుకు మీకు ఒక రోజు, ఒక వారం, ఒక నెల సమయం ఉన్నా కానీ ఇది మీకు ఎంతో మంచి అనుభవాన్ని అందిస్తుంది. అన్నింటితో పోల్చుకుంటే ఇది ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అలాగే అనేక ఫ్రెంచ్ పట్టణాలు ఉన్నాయి. మ్యూజియాలు, రైతు మార్కెట్లు, అందమైన గార్డెన్స్, అంతే కాకుండా చిన్న పట్టణాలు చాలా అందంగా ఉంటాయి.
మీలో ఉన్న కోరికను చంపుకునేందుకు ఇష్టం లేక ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఫ్రాన్స్ వెళ్లాలని అనుకుంటారు. ఫ్రాన్స్ కోసం వీసాను పొందడం అంత సులభం కాదు. మీ ప్రయాణ సమయం కంటే దాదాపు 60 రోజుల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రాసెసింగ్, వెరిఫికేషన్ కొరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే ముందస్తుగా ప్లాన్ చేసుకోండి. వీసా మరియు మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ తో సెక్యూర్డ్ గా ఉండండి. ఇవి మీ ప్రయాణానికి గట్టి పునాదిని వేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇండియన్లు ఫ్రాన్స్ కు వెళ్లేందుకు వీసా కావాలా?
అవును, ఫ్రాన్స్ ను సందర్శించేందుకు ఇండియన్లకు స్కెంజెన్ వీసా కావాలి.
ఇండియన్ సిటిజన్ల కోసం ఫ్రాన్స్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తోందా?
లేదు, ఇండియన్ సిటిజన్ల కొరకు ఫ్రాన్స్ వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పించడం లేదు.
ఇండియన్ సిటిజన్లకు ఫ్రాన్స్ వీసా ఫీజు
స్వల్పకాలిక వీసా కొరకు స్కెంజెన్ వీసా ఫీజు (రుసుము) 93 యూరోలు (దాదాపు రూ. 6,600)
ఇండియా నుంచి ఫ్రాన్స్ టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసే వారికి కావాల్సిన పత్రాలు
మీరు ట్రిప్ అనుకున్న తర్వాత కనీసం 3 నెలలు వ్యాలిడ్ అయ్యే పాస్ పోర్ట్ మరియు దానిలో కనీసం రెండు ఖాళీ పేజీలు ఉండాలి. మీకు ఒక వేళ గడువు ముగిసిన లేదా రద్దు అయిన పాత పాస్ పోర్ట్ ఉంటే దాన్ని కూడా తీసుకెళ్లాలి.
2 ఇటీవలి కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు (ఫొటో ప్రమాణాలు కింద ఇచ్చిన విధంగా ఉండాలి)
కవర్ లెటర్
పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ
ఫ్లైట్ రిజర్వేషన్ (టికెట్స్) కాపీ
అక్కడ ఉండేందుకు మనం తీసుకున్న బస రుజువు
ఆర్థిక స్థోమత యొక్క రుజువు
ఫొటోలు ఇలా ఉండాలి:
ఫొటో ప్లేన్, న్యాచురల్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉండాలి
ఆ ఫొటో అనేది మీ వీసా అప్పాయింట్మెంట్ తేదీకి 6 నెలల ముందుగానే తీసి ఉండాలి. (అంతకన్నా పాత ఫొటో పనికిరాదు)
టోటల్ ఫ్రేమ్ లో మీ ముఖం 70-80 శాతం ఆక్యుపై చేసి ఉండాలి. అలాగే 35-40mm సైజులో ఉండాలి
ఇది అధిక నాణ్యత ఉన్న కాగితంపై ముద్రించబడాలి మరియు దాని మీద ఎటువంటి మరకలు కానీ ముడతలు కానీ ఉండకూడదు.
రెండు చెవులతో పాటు నుదిటి నుంచి గడ్డం కింది వరకు ముఖం స్పష్టంగా కనిపించాలి.
మీరు కళ్లద్దాలను ధరించినట్లయితే అవి మీ కళ్లను కప్పి ఉంచకుండా, రంగులు లేని లైట్ ఫ్రేమ్ ను ఎంచుకోండి
మతపరమైన కారణాలు ఉంటే తప్ప తలపాగాలు ధరించేందుకు వీలు లేదు. అటువంటి కేస్లలో అది మీ ముఖంపై ఎటువంటి నీడలను క్రియేట్ చేయకూడదు. మీ ఫోర్ హెడ్ ని కానీ గడ్డాన్ని కానీ కవర్ చేయకూడదు
పిల్లల ఫొటోల విషయంలో ఫ్రేమ్ లో ఇంకెవరూ కనిపించకూడదు
ఇండియా నుంచి ఫ్రాన్స్ కు టూరిస్ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ ఎంబసీ వీఎఫ్ఎస్ ద్వారా వీసా అప్లికేషన్ లను అంగీకరిస్తుంది. వీఎఫ్ఎస్ అనేది ఫ్రెంచ్ ఎంబసీకి సర్వీస్ పార్ట్‌నర్. మీకు ఫ్రాన్స్ కోసం స్కెంజెన్ వీసా అనేది అవసరం. దానికి అప్లై చేసుకునే ముందు మీరు చేయాల్సిన మొదటి స్టెప్ మీ వీసా రకాన్ని ఎంచుకోవడం.
1) షార్ట్ స్టే యూనిఫాం వీసా- ఇది ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, డెన్మార్మ్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్‌లాండ్, ఇటలీ, లాట్వియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ గరిష్టంగా 3 నెలలకు, ప్రతి ఆరు నెలలకు.
2) పరిమిత ప్రాంతాలకు వెళ్లేలా షార్ట్ స్టే వీసా - మీ వీసా స్టికర్ మీద వేసిన ప్రాంతాలకు మీరు వెళ్లేందుకు మాత్రమే ఇది అనుమతిస్తుంది.
మీ వీసా టైప్ గురించి మీకు తెలిసిన తర్వాత దరఖాస్తు చేసేందుకు కింది సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి:
వీఎఫ్ఎస్ గ్లోబల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
అవసరం అయిన అన్ని రకాల పత్రాలతో మీ ఫామ్ సమర్పించండి
మీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సమీపంలో ఉన్న వీఎఫ్ఎస్ గ్లోబల్ ను సందర్శించండి
మీ అప్లికేషన్ ను ట్రాక్ చేయండి
ఇండియన్లు సమర్పించిన వీసా అప్లికేషన్లను ముంబై, చెన్నై / పుదుచ్చేరి, కోల్‌కతా, బెంగళూరులలో ఉన్న ఫ్రెంచ్ కాన్సులేట్లు మరియు ఢిల్లీలో ఉన్న ఫ్రాన్స్ ఎంబసీ వీసా సెక్షన్ వారు పరిశీలిస్తారు. వీసాల గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ కాన్సులేట్ మరియు ఎంబసీలకు ఉంటుంది.
ఫ్రాన్స్ టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ టైమ్
మీ వీసా అప్లికేషన్ అనేది 15 క్యాలెండర్ రోజులలో ప్రాసెస్ చేయబడుతుంది. కానీ ఒక్కోసారి దీనికి 30 రోజుల సమయం కూడా పట్టొచ్చు. ఇంకా ఏవైనా అదనపు పత్రాలు అవసరం అయితే మీ వీసా అప్లికేషన్ 60 రోజులలో డిసైడ్ చేయబడుతుంది.
ఫ్రాన్స్ కోసం నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?
అవును, ఫ్రాన్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. 2004 నుంచి యురోపియన్ చట్టాలు స్కెంజెన్ దేశాలకు వీసా అప్లికేషన్ చేసేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ను తప్పనిసరి చేశాయి. కావున వీసా అప్లికేషన్ సమయంలో మీరు వ్యాలిడ్ అయ్యే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి.
ఇది ఊహించని ప్రమాదాలైన అనుకోని మెడికల్ ఎక్స్పెన్స్ (ఖర్చులు) మరియు ఇతర ట్రావెల్ ఎమర్జెన్సీలు అయిన లగేజ్ సెక్యూరిటీ, ఆలస్యం అయిన లేదా రద్దయిన ఫ్లైట్స్, దొంగతనాలు మరియు ఇతర పరిస్థితుల నుంచి మీకు రక్షణ అందిస్తుంది. మీరు హోమ్ కు దూరంగా తెలియని ప్రదేశంలో ఉన్న కారణంగా మీరు ఎక్కువ హానిని కలిగి ఉంటారు.
మరింత తెలుసుకోండి:
జాగ్రత్తపడటాన్ని మూలమంత్రంలా భావించాలి. ఇన్సూరెన్స్ తీసుకుని ఫ్రాన్స్ లో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ గడపండి! :)
ఇండియన్ సిటిజన్ల కోసం ఫ్రాన్స్ టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
ఇండియా నుంచి ట్రావెల్ చేసే ఇండియన్ సిటిజన్లకు ఫ్రాన్స్ వీసా ఆన్ అరైవల్ సౌలభ్యం అందజేస్తోందా?
లేదు, ఇండియా నుంచి ట్రావెల్ చేసే వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం లేదు. స్కెంజెన్ వీసా మీద ప్రయాణిస్తున్నవారు అందుకు అర్హులవుతారు.
ఫ్రాన్స్ ట్రావెల్ చేసేటపుడు నాకు మ్యాండేటరీగా ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా?
అవును. వీసా పొందేందుకు ఉండాల్సిన ప్రాథమిక అర్హతల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి. స్కెంజెన్ దేశాలన్నింటికి తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలి.
ఇతర డాక్యుమెంట్లతో పాటు వసతికి సంబంధించిన రుజువులను నేను చూపించాలా?
అవును, ట్రిప్ సమయంలో మీరు ఎక్కడ బస చేస్తారనే విషయాలను సమర్పించాల్సి ఉంటుంది.
సాధారణంగా వీసా ప్రాసెసింగ్ కు ఎంత సమయం పడుతుంది?
యావరేజ్ ప్రాసెసింగ్ వ్యవధి వచ్చే 15 బిజినెస్ డేస్. అయితే అప్లై చేసుకున్న వారి సంఖ్యను బట్టి ఇది 30 రోజుల వరకు సమయం తీసుకోవచ్చు.
పుదుచ్చేరిలోని ఫ్రెంచ్ కాన్సులేట్ ట్రావెల్ వీసాలను మంజూరు చేస్తుందా?
అవును, పుదుచ్చేరిలో ఉన్న కాన్సులేట్ వీసాను జారీ చేస్తుంది. ఇండియాలో ఉన్న ఇతర ఎంబసీలు కూడా దానిని జారీ చేయగలవు.