2025లో భారతదేశంలో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
మనం ఎక్కడికి బయలుదేరాలని అనుకున్నా కానీ ప్రయాణం గురించి ఆలోచిస్తాం. ఇసుకతో నిండిన బీచ్‌లు, మరియు మంచుతో నిండిన పర్వతాలు, పచ్చగా ఉన్న ఎత్తైన కొండలు, అంతే కాకుండా అందమైన నగరాల వరకు మనం ఏమి చూడాలని అనుకున్నా కానీ ప్రయాణం చేయాల్సిందే. ప్రపంచం అనేది చాలా చిన్నది అందులో ప్రయాణాలు తప్పకుండా చేయాలి. మనం అందులో ఒక భాగాన్నయినా తప్పకుండా చూసి రావాలి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు, నష్టాలు, మరియు ప్రయాణానికి సంబంధించిన ఇతర ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి ప్రయాణంలో ఎదురయ్యే ఖర్చులు, నష్టాల నుంచి ఇది కవర్ చేస్తుంది.
బ్యాగేజ్/పాస్పోర్ట్ కోల్పోవడం, విమానాల ఆలస్యం, విమానాల రద్దు, వైద్య ఖర్చులు మొదలయిన అనేక రకాల సేవలను ఇది కవర్ చేస్తుంది. మీరు ప్రయాణం చేసిన ప్రతిసారి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచే ఒక పత్రం.
డిజిట్ అందజేసే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ అన్ని ప్రయాణాలలో మీకు తోడుగా ఉండేలా రూపొందించబడింది. మీరు తెలివిగా మరియు స్మార్ట్‌గా ప్రయాణించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఊహించని విధంగా ఏర్పడే విమాన ఆలస్యాల నుంచి మిస్స్డ్ కనెక్షన్స్ నుంచి బ్యాగేజీ కోల్పోవడం వరకు అంతే కాకుండా వైద్య అత్యవసర పరిస్థితుల నుంచి సాహసక్రీడల వరకు మేము అన్నీ కవర్ చేస్తాం. తద్వారా మీరు మనశ్శాంతిగా వెళ్లొచ్చు.
అన్నింటి కంటే ముఖ్యంగా ప్రయాణం అనేది మీకు పునరుజ్జీవం మరియు విశ్రాంతిని అందించేందుకు ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో ఉండే మా ట్రావెల్ ఇన్సూరెన్స్ కస్టమైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. దీని వలన మీరు మంచి అనుభూతిని పొందుతారు.
కావున మీరు బంగీ జంపింగ్ చేస్తూ అనుకోకుండా గాయపడినా లేదా మీరు కేవలం మీ వాలెట్ లేదా పాస్పోర్ట్ కోల్పోయినందుకు మాత్రమే మోసపోతారు. లేదా విదేశాల్లో కారును అద్దెకు తీసుకుని దానిని పాడు చేసినపుడు చట్టపరమైన సమస్యల్లో మాత్రమే చిక్కుకుంటారు. విదేశీ ప్రయాణ బీమాతో మీ ప్రయాణాన్ని సురక్షితం చేయడం ద్వారా మీరు అన్నిటి నుంచి కవర్ అవుతారు.
ఇందులో ఉన్న గుడ్ న్యూస్ ఏమిటంటే.. మీరు పరిహారం కోసం లేదా క్లెయిమ్ అమౌంట్ కోసం ఎటువంటి గాబరా పడక్కర్లేదు. ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం నుంచి క్లెయిమ్ చేసే వరకు ఇలా ప్రతీది సులభంగా అయిపోతుంది. నిమిషాల వ్యవధిలో డిజిటల్‌గా పూర్తవుతుంది.
“నాకు నిజంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా?
ఈ ప్రశ్న మీ మనసును తొలిచేస్తుంటే.. పూర్తిగా చదవండి
ప్రతి ఏడాది ఎయిర్‌లైన్స్ ద్వారా 28 మిలియన్ల బ్యాగేజీ మిస్ అవుతోంది. (1)
గత 3 సంవత్సరాలలో 4 మంది ప్రయాణీకులలో ఒకరు తమ చెక్-ఇన్ బ్యాగేజీని పోగొట్టుకున్నారు. (2)
దేశం దాటి బయటకు వెళ్తే వైద్యఖర్చులు 3 నుంచి 5 రెట్లు ఎక్కువ. (3)
ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ సమయంలో 47శాతం బ్యాగేజీకి నష్టం కలుగుతుంది. (4)
ఫోన్‌లు, బ్యాంక్ కార్డ్‌లు, లైసెన్స్‌లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు & పాస్‌పోర్ట్‌లు ప్రయాణంలో సాధారణంగా పోగొట్టుకునే వస్తువులు. (5)
ప్రతిరోజూ దాదాపు 20,000 ఫ్లైట్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి మరియు రద్దు చేయబడుతున్నాయి. (6)
ట్రిప్ క్యాన్సిలేషన్, ఫ్లైట్ క్యాన్సిలేషన్‌లు మరియు జాప్యాలు ఎల్లప్పుడూ ప్రయాణ క్లయిమ్‌లకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. (7)
పర్యాటకులు అధికంగా ఉండే దేశాలలో ట్రావెల్ స్కామ్స్ అనేవి సర్వసాధారణం. (8)
డిజిట్ వారి ఆన్ ది మూవ్ పాలసీ యొక్క ప్రయోజనాలను చెక్ చేయండి
డిజిట్ ద్వారా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి గొప్ప విషయం ఏమిటి?
సాహస క్రీడలు కవర్ అవుతాయి - మా అడ్వెంచర్ స్పోర్ట్స్ కవరేజీలో స్కూబా డైవింగ్, బంగీ జంపింగ్ & స్కై డైవింగ్ వంటి యాక్టివిటీలు ఉంటాయి (వ్యవధి ఒక రోజు ఉంటే)
విమానాలు ఆలస్యం అయితే వెంటనే పరిహారం - మేము మీ సమయాన్ని ఎప్పుడు వృథా చేయకూడదని అనుకుంటున్నాం. అందుకే మీ విమానం 6 గంటల కంటే ఎక్కువ సమయం పాటు ఆలస్యం అయితే మేము మీకు వెంటనే రూ. 500 నుంచి రూ. 1000 వరకు పరిహారంగా అందజేస్తాం.
స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ ప్రాసెస్ - ఎటువంటి పేపర్ వర్క్ లేదు. ఎక్కువగా తిరగాల్సిన అవసరం లేదు. మీరు క్లెయిమ్ చేసినపుడు కేవలం మీ పత్రాలను అప్లోడ్ చేయండి సరిపోతుంది.
మిస్డ్ కాల్ సౌకర్యం - +91-7303470000 అనే నంబర్ మీద మాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. మేము మీకు తిరిగి 10 నిమిషాల్లోపల కాల్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్ చార్జెస్కు ఇక స్వస్తి పలకండి.
అంతర్జాతీయ సపోర్ట్ - మీకు గొప్ప సపోర్ట్‌ను అందించేందుకు మేము అంతర్జాతీయంగా పెద్దదైన హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ అలియాంజ్ (Allianz) భాగస్వామ్యం కలిగి ఉన్నాము. T&C*
మీ అవసరాలకు సరిపోయే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
బేసిక్ ఆప్షన్ | కంఫర్ట్ ఆప్షన్ |
మెడికల్ కవర్ |
|
అత్యవసర పరిస్థితులలో యాక్సిడెంటల్ ట్రీట్మెంట్, తరలింపుప్రమాదాలు అనుకోని సమయాల్లో జరుగుతాయి. దురదృష్టవశాత్తు మేము అక్కడ మిమ్మల్ని ఆ సమయంలో రక్షించలేం. మీకు ఉత్తమమైన చికిత్సను అందించడంలో మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తాం. వెంటనే అందించాల్సిన వైద్య చికిత్సకు కావాల్సిన వాటిని మేము కవర్ చేస్తాం. |
|
ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ & తరలింపుఎక్కడో తెలియని దేశంలో మీరు పర్యటనలో ఉండగా.. అనారోగ్యానికి గురైతే దేవుడు కూడా పట్టించుకోడు. కానీ మీరు ఏం చింతించకండి. మేము మీ చికిత్స ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటాం. ఆసుపత్రి గది అద్దె, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు మొదలైన అన్ని ఖర్చులను మేము కవర్ చేస్తాం. |
|
పర్సనల్ యాక్సిడెంట్ఈ కవర్ ఎప్పటికీ అవసరం కాకూడదని మేము ఆశిస్తున్నాం. కానీ మీరు పర్యటనలో ఉన్నపుడు యాక్సిడెంట్ జరిగి మరణం లేదా వైకల్యం సంభవించినపుడు ఈ కవర్ మీకు మద్దతును అందిస్తుంది. |
|
డెయిలీ క్యాష్ అలొవెన్స్ (రోజు చొప్పున గరిష్టంగా 5 రోజుల వరకు)మీరు పర్యటనలో ఉన్నపుడు క్యాష్‌ను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. మీకు అత్యవసర పరిస్థితులు వచ్చి అదనంగా చెల్లించాలని మేము కోరుకోవడం లేదు. కావున మీరు ఆసుపత్రిలో ఉన్నపుడు మీ రోజువారీ ఖర్చులను మేనేజ్ చేసేందుకు మేము మీకు స్థిరమైన నగదును అందిస్తాం. |
|
యాక్సిడెంటల్ డెత్ మరియు అంగవైకల్యంఈ కవర్లో ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ ట్రీట్మెంట్ కవర్ వంటి ప్రతీదీ ఉన్నప్పటికీ అంతే కాకుండా ఈ కవర్‌కు ఒక అదనపు రక్షణ పొర ఉంది. ఇది విమానంలో ఎక్కేటపుడు, డీ బోర్డింగ్ (విమానం దిగేటపుడు), లేదా విమానంలో ఉన్నపుడు మరణం లేదా వైకల్యం సంభవించినపుడు ఇది కవర్ చేస్తుంది. |
|
ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్మీరు పర్యటనలో ఉన్నపుడు ఏదైనా భరించలేని నొప్పిని ఎదుర్కొంటే లేదా ప్రమాదవశాత్తు మీ దంతాలకు గాయం అయితే వైద్యుడు అందించే అత్యవసర దంత చికిత్సకు అయ్యే ఖర్చులను మేము మీకు అందజేస్తాం. |
|
స్మూత్ ట్రాన్సిట్ కవర్స్ |
|
ట్రిప్ క్యాన్సలేషన్దురదృష్టవశాత్తు మీ ట్రిప్ రద్దు చేయబడితే మీరు ముందస్తుగా ట్రిప్ బుకింగ్ కొరకు ఖర్చు చేసిన తిరిగి చెల్లించలేని ఖర్చులను కూడా మేము కవర్ చేస్తాం. |
|
కామన్ క్యారియర్ డిలేమీ విమానం ఒక నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ సేపు ఆలస్యం అయితే మీకు బెనిఫిట్ అమౌంట్ మొత్తం అందుతుంది. ఇందుకోసం ఎటువంటి ప్రశ్నలు అడగబడవు. |
|
బ్యాగేజ్ చెకింగ్‌లో ఆలస్యంకన్వేయర్ బెల్డ్ వద్ద వెయిట్ చేయడం చాలా బాధిస్తుంది. కావున మీ చెక్ ఇన్ బ్యాగేజీకి ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే మీరు మొత్తం ప్రయోజనాన్ని పొందుతారు. ఎటువంటి ప్రశ్నలు అడగబడవు. |
|
చెక్ చేసిన బ్యాగేజీకి నష్టంట్రిప్లో సంభవించే చివరి విషయం ఏమిటంటే.. మీ సామగ్రిని పోగొట్టుకోవడం. కానీ ఇటువంటి విషయం జరిగితే మీరు మొత్తం బ్యాగేజీ శాశ్వతంగా పోయిందని ప్రయోజనాన్ని పొందుతారు. రెండు మూడు బ్యాగులు పోగొట్టుకుంటే మీరు వాటి ప్రకారంగా ప్రయోజనం పొందుతారు. అంటే ప్రయోజనం మొత్తంలో 2/3వ వంతు అన్నమాట. |
|
మిస్స్డ్ కనెక్షన్మీరు ఫ్లైట్ మిస్సయ్యారా? ఎటువంటి చింత అక్కర్లేదు. మేము మీకు వసతి కల్పించి మీరు టికెట్లో లేదా మీ ప్రయాణ ప్రణాళికలో ఉన్న తదుపరి స్థానం చేరుకునేందుకు అదనంగా చెల్లిస్తాం. ఒక వేళ ఫ్లైట్ ఆలస్యం కావడం వల్ల మీరు ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ మిస్సయితే.. |
|
ఫ్లెక్సిబుల్ ట్రిప్ |
|
లాస్ ఆఫ్ పాస్పోర్ట్మీకు తెలియని దేశంలో పాస్పోర్ట్ లేదా వీసా కోల్పోవడం వంటి చెత్త విషయం మరొకటి ఉండదు. ఇలాంటివి ఏవైనా జరిగి విదేశాల్లో మీ వస్తువులు దొంగిలించబడినా లేదా పాడయిపోయినా మేము మీకు ఖర్చులను తిరిగి చెల్లిస్తాం. |
|
ఎమర్జెన్సీ క్యాష్ఏదైనా చెడ్డరోజున అనుకోకుండా మీ నగదు అంతా దొంగిలించబడి మీకు అత్యవసరంగా నగదు అవసరం అయితే ఈ కవర్ మిమ్మల్ని కాపాడుతుంది. |
|
ఎమర్జెన్సీ ట్రిప్ ఎక్స్టెన్షన్ (అత్యవసరంగా ట్రిప్‌ను పొడగించడం)సెలవులు అప్పుడే పూర్తి కావడం మాకు ఇష్టం లేదు. అలాగని ఆసుపత్రిలో ఉండడం కూడా ఇష్టం లేనపుడు.. మీ పర్యటనలో అత్యవసర పరిస్థితి కారణంగా..మీరు ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే.. మేము హోటల్ ఖర్చలు, మరియు మరలా విమానం బుక్ చేసేందుకు అయ్యే ఖర్చులను మేము మీకు అందజేస్తాం. అత్యవసర పరిస్థితి అంటే మీరు పర్యటించే ప్రాంతంలో సహజవిపత్తు లేదా ఆసుపత్రిలో చేరడం. |
|
ట్రిప్ రద్దవడంఏదైనా అత్యవసర పరిస్థితి కారణంగా మీరు పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావడం బాధాకరం. మేము దానిని పరిష్కరించలేం కానీ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, తిరిగి చెల్లించని ప్రయాణ ఖర్చులైన వసతి, ముందుగా ప్లాన్ చేసిన ఈవెంట్స్ మరియు విహారయాత్ర ఖర్చులను మేము కవర్ చేస్తాం. |
|
పర్సనల్ లయబులిటీ బెయిల్ బాండ్అనుకోని సంఘటన కారణంగా మీరు ప్రయాణం చేస్తున్నపుడు మీ మీద ఏవైనా చట్టపరమైన ఆరోపణలు ఉంటే అందుకు మేము చెల్లిస్తాం. |
|
Get Quote | Get Quote |
పైన సూచించబడిన కవరేజ్ ఆప్షన్ కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే. ఇది మార్కెట్ అధ్యనం మరియు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అవసరానికి అనుగుణంగా ఏదైనా అదనపు కవరేజీలను ఎంచుకోవచ్చు. మీరు ఏవైనా ఇతర కవరేజీలను ఎంచుకోవాలని అనుకున్నా లేక ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే దయచేసి 1800-258-5956 నెంబర్‌పై కాల్ చేయండి.
పాలసీ వివరాలను చదవాలని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నొక్కండి..
ఏం ఏం కవర్ కావు?
డిజిట్‌తో అంతర్జాతీయ ప్రయాణ బీమాను ఎలా కొనుగోలు చేయాలి?
Step 1
డిజిట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో, భౌగోళికం/దేశం, ప్రయాణికుల సంఖ్య మరియు పుట్టిన తేదీని ఎంచుకుని, ‘ధరలను వీక్షించండి.’ క్లిక్ చేయండి.
Step 2
ప్లాన్‌ని ఎంచుకుని, బీమా మొత్తాన్ని ఎంచుకుని, 'కొనసాగించు' క్లిక్ చేయండి.
Step 3
తర్వాత, మీ వ్యక్తిగత మరియు నామినీ వివరాలను పూరించండి, పూర్తి ఆరోగ్య ప్రకటన, 'ఇప్పుడే చెల్లించండి' క్లిక్ చేసి, చెల్లింపును పూర్తి చేయండి.
Step 4
మీరు పూర్తి చేసారు! పాలసీ డాక్యుమెంట్ మీకు ఇమెయిల్, SMS మరియు WhatsApp ద్వారా పంపబడుతుంది. మీరు దీన్ని డిజిట్ యాప్‌లో 24/7 కూడా యాక్సెస్ చేయవచ్చు.
డిజిట్ అందించే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో ముఖ్యమైన ఫీచర్స్
కీ ఫీచర్స్ | డిజిట్ ద్వారా కలిగే ప్రయోజనం |
---|---|
ప్రీమియం | ₹395 నుంచి ప్రారంభం |
క్లెయిమ్ ప్రాసెస్ | ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ద్వారా పూర్తవుతుంది. |
క్లెయిమ్ సెటిల్‌మెంట్ | 24x7 మిస్స్డ్ కాల్ ఫెసిలిటీ (సౌకర్యం) అందుబాటులో ఉంది |
ఏయే దేశాలు కవర్ అవుతాయి | ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కంటే ఎక్కువదేశాలు & దీవులు |
ఫ్లైట్ ఆలస్యం అయితే కలిగే ప్రయోజనం | 6 లేదా అంతకంటే ఎక్కువ గంటలు విమానం ఆలస్యం అయితే రూ. 500 నుంచి రూ.1000 వరకు ఆటోమేటిగ్గా మీకు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. |
అందుబాటులో ఉన్న కవర్స్ | ట్రిప్ క్యాన్సలేషన్, మెడికల్ కవర్, ఫ్లైట్ ఆలస్యం కావడం, బ్యాగేజీ చెకింగ్‌లో ఆలస్యం కావడం, పాస్పోర్ట్ కోల్పోవడం, డైలీ ఎమర్జెన్సీ క్యాష్ మొదలయినవి. |
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు మా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసిన తరువాత, 3 స్టెప్‌లలో పూర్తి డిజిటల్ విధానంలో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నందున మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు!
స్టెప్ 1
1800-258-5956 పై మాకు కాల్ చేయండి (ఒకవేళ భారతదేశంలో ఉన్నట్లయితే) లేదా +91-7303470000పై మిస్డ్ కాల్ ఇవ్వండి. మేం 10 నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తాం.
స్టెప్ 2
పంపిన లింక్‌పై అవసరమైన డాక్యుమెంట్లు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్లోడ్ చేయండి.
స్టెప్ 3
మిగతాదంతా మేము చూసుకుంటాం!
డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో సరళమైన క్లెయిమ్‌లు
మేము ఇన్సూరెన్స్‌ను సరళతరం చేస్తున్నాము అని చెప్పడమే కాదు, దాన్ని నిజంగా చేసి చూపాం! ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీ ప్రయాణంలో మీరు ఇప్పటికే ఖర్చు చేసిన సమయం, డబ్బును మేం అర్థం చేసుకున్నాం. అందుకే మేము మా ప్రక్రియలన్నింటినీ సూపర్ సింపుల్‌గా, పేపర్‌లెస్‌గా, వేగవంతంగా చేశాం!
మీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి
మీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోవడం కోసం మీ పాలసీ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. అన్నింటికంటే, అనిశ్చిత సమయాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ఈ పాలసీని కొనుగోలు చేసారు. డిజిట్ అనేది ఇన్సూరెన్స్‌ని ఎంతగానో సులభతరం చేయడం అంటే 5 ఏళ్ల పిల్లవాడు కూడా సంక్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోగలడు!
మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కాంప్రహెన్సివ్ కాబట్టి, దిగువ మీ పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న కొన్ని క్లిష్ట నిబంధనలను మేము సరళీకృతం చేసాము:
- సమాచార నియమావళికి బహిర్గతం: తప్పుగా సూచించడం, తప్పుగా వివరించడం లేదా ఏవైనా అవసరమైన వాస్తవాలను బహిర్గతం చేయనట్లయితే, మీ పాలసీ నిరర్థకం/చెల్లదు మరియు చెల్లించిన ప్రీమియం మొత్తం కంపెనీకి జప్తు చేయబడుతుంది.
- నగదు రహిత సదుపాయం: నగదు రహిత సదుపాయం అనేది మీ వైద్య చికిత్స ఖర్చులకు అనుకూలమైన చెల్లింపు విధానం, ఇక్కడ మీ ఇన్సూరర్ (మాకు) ద్వారా నేరుగా నెట్‌వర్క్ ప్రొవైడర్/హాస్పిటల్/ఎఎస్‌పి (ASP) కి ముందస్తు అధీకృత చెల్లింపులు చేయబడతాయి.
- వైద్యపరంగా అవసరమైన చికిత్స: వైద్యపరంగా అవసరమైన చికిత్స ఏదైనా చికిత్స, పరీక్షలు, మందులు లేదా ఆసుపత్రిలో ఉండిపోవడమే, ఇన్సూర్డ్ (మీరు) ఎదుర్కొన్న ఏదైనా అనారోగ్యం/గాయం నిర్వహణ, సంరక్షణ లేదా చికిత్స కోసం అవసరం.
- ఫ్రీ లుక్ వ్యవధి: ఇది నిర్దిష్ట రోజుల సెట్ (మొదటి పాలసీ పత్రం అందిన తేదీ నుండి 15 రోజులు) ఇక్కడ మీరు మీ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించవచ్చు మరియు మీరు మీ పాలసీని రద్దు చేయాలా లేదా కొనసాగించాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవచ్చు. ఒక సంవత్సరం కంటే తక్కువ పాలసీ వ్యవధి గల పాలసీలకు మరియు రెన్యూవల్ చేయబడిన పాలసీలకు ఫ్రీ లుక్ వ్యవధి వర్తించదు.
- సాధారణ క్యారియర్ ఆలస్యం: సాధారణ క్యారియర్ అనేది ప్రయాణీకులు మరియు/లేదా కార్గోను రవాణా చేయడానికి ఏదైనా కమర్షియల్, పబ్లిక్ ఎయిర్‌లైన్, రైల్వే, మోటారు రవాణా లేదా నీటి ద్వారా నడిచే నౌకను సూచిస్తుంది. సాధారణ క్యారియర్ ఆలస్యం అయినప్పుడు మీ ఇన్సూరెన్స్ పాలసీ పరిహారం అందిస్తుంది. ఉదాహరణకు, మీరు మీ షెడ్యూల్డ్ ఫ్లైట్‌ని పట్టుకోవాల్సిన అవసరం ఉంటే, అది 3 గంటలు ఆలస్యమైందని తెలుసుకుంటే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న అదనపు సమయం 3 గంటల కంటే తక్కువగా ఉంటే, సాధారణ క్యారియర్ ఆలస్యం కవర్ కింద మీరు క్లయిమ్‌ను ఫైల్ చేయవచ్చు. ఈ మొత్తం మీ పాలసీలో వాతావరణం, సమ్మెలు, పరికరాల వైఫల్యం మొదలైన కారణాల వల్ల ఆలస్యం వంటి నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులకు లోబడి పేర్కొనబడింది.
- (మాఫీ) ముందుగా ఉన్న వ్యాధులు: మీరు కొత్త హెల్త్ ప్లాన్ ను (ఈ సందర్భంలో, కాంప్రహెన్సివ్ ట్రావెల్ ప్లాన్) ప్రారంభించే ముందు మీకు ఉన్న జబ్బులు లేదా అనారోగ్యాలను ముందుగా ఉన్న వ్యాధులు అంటారు. మధుమేహం, క్యాన్సర్, ఆస్తమా, అధిక రక్తపోటు మొదలైనవి ముందుగా ఉన్న వ్యాధులకు (పిఈడి) (PED) ఉదాహరణలు కావచ్చు. పిఈడి (PED) యొక్క మినహాయింపు అంటే, మీరు పిఈడి (PED) కవర్‌ని ఎంచుకుంటే మీ ముందుగా ఉన్న వ్యాధులకు సంబంధించిన అత్యవసర చికిత్స కోసం మీ ఇన్సూరెన్స్ పాలసీ మీకు వర్తిస్తుంది.
- వ్యక్తిగత లయబిలిటీ మరియు బెయిల్ బాండ్: వ్యక్తిగత లయబిలిటీ అనేది, అనుకోకుండా మూడవ పక్షానికి ఆస్తి లేదా శారీరక డ్యామేజ్ లు లేదా గాయాలు కలిగిస్తే, వాటికి మీరు చట్టబద్ధంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. బెయిల్ బాండ్ అనేది ఒక నేరానికి పాల్పడిన వ్యక్తి, విచారణ వరకు స్వేచ్ఛగా ఉండేందుకు ఒక నిర్దిష్ట అమౌంట్ చెల్లించినట్లు తెలిపే పత్రం. ఇది కస్టడీ నుండి విడుదల చేయడానికి ప్రతివాది అందించే లేదా డిపాజిట్ చేసిన ష్యూరిటీ బాండ్ (డబ్బు లేదా ఆస్తి). మీరు విదేశాలకు వెళ్లి, ఏదైనా ఊరగాయలో ఉండి, విదేశాల్లో ఉన్నప్పుడు చట్టపరమైన సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నట్లయితే, ఈ కవర్లు వ్యాజ్యాల విషయంలో భారీ అప్పుల నుండి మిమ్మల్ని రక్షించే ప్రయోజనాలను అందిస్తాయి.
- ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ క్యాష్: మీరు ఎప్పుడైనా ఒక విదేశీ దేశంలో కనుగొనబడి, మీ వాలెట్ దొంగిలించబడినట్లయితే, మీకు నగదు కొరత ఉండవచ్చు లేదా అన్ని ఆర్థిక వనరులను కోల్పోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీఅటువంటి సందర్భాలలో, అత్యవసర పరిస్థితుల్లో మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు నగదును అందించగలదు. ఆర్థిక అత్యవసర నగదును అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను పొందడం అనేది ఒక తెలివైన ఎంపిక, ఎందుకంటే మీకు జేబు దొంగతనం మరియు దొంగతనాలు వంటి చిన్న చిన్న నేరాలు ఎప్పుడు జరుగుతాయో మీకు తెలియదు.
మా పాలసీ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, అందుకే మేము మా కవరేజీలను మరింత బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి కొన్నింటిని కూడా సరళీకృతం చేసాము. మీరు మా కవరేజీల గురించి ఇక్కడ చదువుకోవచ్చు.
మా గురించి మా కస్టమర్లు ఏమంటున్నారు
నేను ముగ్గురికి డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను బుక్ చేసుకున్నాను. అయితే, మొదట్లో నాకు పాలసీ వివరాల గురించి కాస్త గందరగోళం ఉండేది. దాంతో నేను కస్టమర్ కేర్ని సంప్రదించాను. మొదట వారి సపోర్ట్‌తో టచ్‌లోకి రావడం చాలా సులభం. అది చాలా బాగుంది! రెండవది, కస్టమర్ హ్యాపీనెస్ టీమ్‌కు చెందిన శ్రీమతి సుష్మ నా క్వెరీని ఎస్కలేట్ చేశారు. 2 గంటల్లోగా సవిస్తారమైన రెస్పాన్స్‌తో తిరిగి వచ్చారు. ఆమె చాలా ప్రొఫెషనల్, వెంటనే స్పందించారు. చాలా ధన్యవాదాలు!
నేను ఒక ట్రావెల్ ఏజెంట్‌ను. ఇటీవల మా క్లయింట్ కొరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ బుక్ చేశాం. ప్యాసింజర్ బ్యాగేజీ ఒక రోజు ఆలస్యమైంది. టూర్ తరువాత ప్రయాణికుడికి సరైన డాక్యుమెంట్‌తో బ్యాగేజ్ డిలేడ్ క్లెయిమ్ సబ్మిట్ చేయబడింది. 8 రోజుల లోపు ప్రయాణికుడు తన క్లెయిమ్‌ను ఖాతాలో పొందాడు... సూపర్ ఫాస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్.. 👍😃
అద్భుతమైన సర్వీస్. వేగవంతమైన, విశ్వసనీయమైన, కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ ఉంటుంది. నాకు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇద్దరూ గో డిజిట్ (Go Digit)తో ఇన్సూర్ చేయబడ్డారు. ఇటీవల నేను కూడా యాక్సిడెంటల్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియతో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. క్లెయిమ్‌ను మిస్టర్. ఆకాశ్ టోండే డిజిటల్‌గా సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన నాకు చాలా సహకరించారు. ప్రమాద పరిస్థితిని అర్థం చేసుకున్నారు. క్లెయిమ్‌ను ప్రాసెస్ చేశారు. ఈ అనుభవం తరువాత మూడు రోజుల క్రితం నేను నా కుటుంబంతో దీపావళికి యూరప్ పర్యటనకై ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సైతం తీసుకున్నాను.
మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?
ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు
సాధరణంగా విమానాలు ఆలస్యం కావడాన్ని ఎవరూ ఇష్టపడరు. అయితే అలాంటివి జరిగిన ప్రతిసారి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు రూ.500 నుంచి రూ.1,000 చెల్లిస్తే? అవును, డిజిట్ సరిగ్గా అదే చేస్తుంది. దీంతో మీరు కొంత అదనపు డబ్బును ఆదా చేసుకోవచ్చు లేదా ఎయిర్‌పోర్ట్‌లో భోజనం చేయొచ్చు లేదంటే మీరు ఇష్టంగా చదివే పుస్తకాన్ని కొనడానికి ఉపయోగించవచ్చు.
సాధరణంగా బ్యాగేజీ నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిలో బ్యాగేజీ ఆలస్యం కూడా ఒకటి! అందుకే కొన్ని దురదృష్టకర సమయాల్లో మీకు ఇది జరిగినప్పుడు, ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన మీరు కోల్పోయిన వాటికి $100 వరకు ఆర్థిక పరిహారం అందుకుంటారు!
మనలో చాలామంది ప్రయాణాలు బడ్జెట్‌లోనే ఉంటాయి. ఇక్కడే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగంలోకి వస్తుంది. ఎందుకంటే వస్తువులను కోల్పోవడం, విమాన కనెక్షన్లు మిస్సవడం, ట్రిప్ క్యాన్సెలేషన్‌లు, మీ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ఇతర దురదృష్టకర పరిస్థితుల విషయంలో జరిగే ఆర్థిక నష్టాల నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది!
విదేశాలలో స్టమక్ ఫ్లూ వంటి చిన్న చిన్న, సాధారణమైన వాటికి కూడా మీకు వేలల్లో ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీ ట్రిప్‌ను మీరు సురక్షితం చేసుకోవచ్చు. మీరు తీవ్రమైన, చిన్న వైద్య అత్యవసర పరిస్థితుల నుంచి రక్షించుకునేలా ఇది చూసుకుంటుంది.
మీరు విదేశాలకు రోడ్ ట్రిప్ చేయాలని ప్లాన్ చేస్తే,ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే, మీరు అద్దెకు తీసుకున్న కారుకు లేదా భారీగా జరిగే ఏదైనా థర్డ్-పార్టీ డ్యామేజ్లకు, అలాగే మీ వల్ల కలిగే ఏవైనా డ్యామేజ్లకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ప్రయాణికులు విదేశాలలో ఎదుర్కొనే అత్యంత సాధారణ నష్టాలలో ఒకటి వారి ఫోన్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, డబ్బు, వారి పాస్‌పోర్ట్‌లను కోల్పోవడం! అదృష్టవశాత్తూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇది మీ నష్టాలను కవర్ చేస్తుంది. అలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో మీకు అండగా ఉంటుంది!
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు కొనుగోలు చేయాలి?
మీరు వారిలో ఒకరా?
విస్తృతమైన నోట్స్, చెక్‌లిస్ట్‌లు, చక్కగా రూపొందించబడిన ప్రయాణాలకు, మీరు బాగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా చేసే ప్రయాణాలను ఇష్టపడతారు. మీరు ఇబ్బందికరమైన వాటిని ఇష్టపడరు. నియంత్రణ, భద్రతతో కూడిన వాటికి ప్రాముఖ్యతను ఇస్తారు. కాబట్టి మీరు ఇలాంటి ప్రయాణికులను ఫాలో కావాలనుకుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అన్నింటికంటే ప్రణాళిక లేని వాటిని కూడా ఇది కవర్ చేస్తుంది?
మీరు ఏదైనా కావచ్చు. కానీ ప్రణాళిక ముఖ్యమైనది! ప్రయాణానికి సంబంధించి మీ బ్యాగ్‌లను ప్యాక్ చేయడం నుంచి మీ హోటళ్లను బుక్ చేయడం వరకు ఏదీ కూడా ప్లాన్ చేయలేదు. కొన్ని సందర్భాలలో అంతా చివరి నిమిషంలో జరుగుతుంది. మీరు ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడుతారు. మీరు ప్రయాణాలను చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ వీసా చివరి నిమిషంలో తిరస్కరించబడకుండా ఉండేందుకు మీరు కనీసం చేయవలసినది ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం. ప్రణాళిక లేనిది ఏది కూడా మిమ్మల్ని నగదు రహితంగా ఉంచదు.
నిశ్చలం లేని వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. లేదా మీరు అలాంటి వారే కావచ్చు! మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకవిధంగా మీరు ఎల్లప్పుడూ ఇబ్బందుల్లో పడుతూనే ఉంటారు. మీరు దురదృష్టవంతులని భావిస్తుంటారు. నిశ్చలం లేకుండా ఉన్న సమయంలో ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు దేనినీ కోల్పోకుండా చూసుకోవడానికి మీరు చేయగలిగేది ట్రావెల్ ఇన్సూరెన్స్ మాత్రమే!
మీరు తరచూ విదేశాలలో రోడ్డు మార్గంలో ప్రయాణించాలని ఎంచుకుంటే, మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఎందుకంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ ప్రయాణ సమయంలో విమాన ఆలస్యం లేదా బ్యాగేజ్ లాస్ వంటి సాధారణ ప్రమాదాల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా, మీరు మీ కారుకు తీవ్రంగా నష్టం జరిగినా లేదా వేరొకరి కారును పాడుచేసిన కూడా మీకు ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది.!
మీకు అడ్వెంచర్స్ అంటే ప్రాణం. అవి స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, బంగీ జంపింగ్, ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, స్కై డైవింగ్ మొదలైనవి. మీరు ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. బహుశా మీరు ప్రయాణాలు చేయడానికి ఇలాంటివి మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. అదృష్టవశాత్తూ మా ట్రావెల్ ఇన్సూరెన్స్ అడ్వెంచర్ యాక్టివిటీలను కూడా కవర్ చేస్తుంది (ఒక రోజు కార్యకలాపాలు మాత్రమే కవర్ చేయబడతాయి), కాబట్టి మీరు వీటన్నింటికీ కవర్ చేయబడతారు!
ఈ రోజుల్లో మీరు ఇప్పటి యువ ప్రయాణికుల మాదిరిగానే ఆలోచిస్తున్నారు. మీరు ప్రయాణాలను ఇష్టపడతారు. మీరు బడ్జెట్‌లో వాటిని పూర్తి చేయాలనుకుంటున్నారు. అందరు అనుకున్నట్లుగా కాకుండా, ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా అందుబాటులోని అంశం. ఇది మీ బడ్జెట్‌కు సరిపోయేది. మీ ప్రయాణంలో అనూహ్యంగా జరిగే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షించగలదు!
ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్‌లను ఆన్‌లైన్‌లో ఎలా పోల్చాలి?
ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు వెతకాల్సిన, సరిపోల్చవలసిన మొదటి మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి
కొన్ని దేశాల్లో వైద్య ఖర్చులు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పొందగలిగే వైద్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా చెక్ చేయడం ముఖ్యం. సంఖ్యా పరంగా మేము $50,000 నుంచి $500,000 వరకు ఇన్సూరెన్స్ పరిధిని అందిస్తాము!
క్లెయిమ్‌లు ఇన్సూరెన్స్ మొత్తం పొందడానికి సంబంధించిన అంశం. అందువల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియలు, నిష్పత్తిని చెక్ చేయండి. తద్వారా మీరు ఏం జరిగినా మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని విశ్వసించవచ్చు.
చాలా సార్లు క్లెయిమ్‌లకు నిర్దిష్ట నిబంధనలు జోడించబడతాయి. అందువల్ల, వాటిని ఎప్పుడూ చెక్ చేయండి. తద్వారా మీరు దేని కోసం క్లెయిమ్ చేయగలరో తెలుసుకుంటారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు
ప్రయాణాలు చేసేటపుడు మీరు తప్పకుండా బీమాను కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? మీ ట్రిప్ స్వభావం, మీరు వెళ్లే సమయం, పర్పస్ను బట్టి మీకు అనేక రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లాన్ ఎంచుకునే ముందు కవరేజ్ మరియు ప్రీమియం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
కొన్ని రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు:
- ఇండివిజువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్: ఎవరైతే ఒంటరిగా విహారయాత్రకు వెళ్తారో వారికి ఇండివిజువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరిగ్గా సరిపపోతుంది. తప్పుగా జరిగే అనేక విషయాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా మీ సొంతగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.
- కార్పోరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్: బిజినెస్ ట్రిప్‌లో పర్యటిస్తున్న ఉద్యోగికి కార్పోరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందించబడుతుంది. ఉద్యోగి విహారయాత్రను సురక్షితంగా ఉంచేందుకు సంస్థ లేదా యజమాని ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తారు.
- స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్: మీరు విద్యా ప్రాతిపదికన విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులయితే ఈ స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. విద్యార్థులకు ఉండే ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ రూపొందించబడింది. తక్కువ ఖర్చుతో ఈ ప్లాన్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
- గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్: ఒక గ్రూప్ మొత్తం ట్రిప్‌కు వెళ్లినపుడు సంభవించే అనుకోని ఖర్చుల నుంచి ఈ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్లాన్ రూపొందించబడింది. ఈ ప్లాన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవడం కంటే కూడా తక్కువ ఖర్చుతో వస్తుంది.
- ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్: పాలసీ చేసే వ్యక్తి కుటుంబం మొత్తాన్ని ఒకే పాలసీ కింద ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. కలిసి ప్రయాణాలు చేసే కుటుంబాల కోసం ఈ ట్రావెల్ ప్లాన్ రూపొందించబడింది.
- సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్: 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసులో ప్రయాణాలు చేయడం వలన అనేక ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండడం వలన ఊహించని వైద్య ఖర్చులు, అనూహ్యంగా వచ్చే అత్యవసర ఆర్థిక పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
- డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్: మీరు మన దేశ సరిహద్దుల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నపుడు డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
- ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్: అదే విధంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఇంటర్నేషనల్ ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. చాలా దేశాల వీసాలకు అప్లై చేసుకునేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి. ఇది మిమ్మల్ని అనుకోని ఖర్చుల నుంచి కాపాడుతుంది.
- స్కెంజెన్ (26 యూరోప్ దేశాలు) ట్రావెల్ ఇన్సూరెన్స్: స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది 26 స్కెంజెన్ దేశాలకు వెళ్లినపుడు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ పాలసీని మీరు ఎంచుకుంటే అందులో నిర్వచించబడిన ప్రకారం అనేక రకాల ప్రయోజనాలు అందుతాయి.
- యాన్యువల్ లేదా మల్టీట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్: కార్పోరేట్ సెక్టార్లో ఉన్న వారు ఏడాది పొడవునా చేసే పర్యటనలకు యాన్యువల్ లేదా మల్టీట్రిప్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. మీరు తరచుగా లేదా ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు పర్యటనలకు వెళ్తే ఇది సరిగ్గా సూట్ అవుతుంది.
- సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్: తరచుగా కాకుండా అప్పుడపుడు విదేశాలకు వెళ్లే వారికి సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.
నా ప్రీమియం దేనిమీద ఆధారపడి ఉంటుంది.. నేను దానిని ఎలా తగ్గించగలను?
ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీకి అయ్యే ఖర్చు. పాలసీ హోల్డర్‌గా మీరు ఈ ఖర్చును భరించాల్సి ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత తప్పనిసరిగా చెల్లించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ వయస్సు, ట్రిప్ డ్యురేషన్, స్థానం, ఎంత మంది ప్రయాణికులు, మీరు ఏం ఏం యాడ్ ఆన్స్ తీసుకుంటున్నారనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ కవర్స్ తీసుకుంటారో మీ ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది. డిజిట్లో కేవలం రూ. 225 నుంచే ప్రీమియం స్టార్ట్ అవుతుంది. మీరు మీ ప్రీమియం అమౌంట్‌ను తగ్గించుకోవాలని చూస్తే ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకోండి.
- మీకు అవసరమైన కవర్స్‌ను ఎంచుకోండి: చాలా మంది పాలసీ హోల్డర్లు తరచుగా వారి ప్యాక్‌కు అవసరమైన కవర్స్‌ను ఎంచుకోవడం మరచిపపోతారు. ఎక్కువ ప్రీమియాన్ని చెల్లిస్తారు. దీనిని తప్పించుకునేందుకు మీరు మీ ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. కేవలం మీకు అత్యంత అవసరమైన ఫ్లైట్ డిలే, మిస్డ్ కనెక్షన్, బ్యాగేజ్/పాస్పోర్ట్ లాస్, మెడికల్ కవర్స్ వంటిని మాత్రమే ఎంచుకోండి.
- మందస్తుగా కొనుగోలు చేయండి: మీరు కనుక మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ముందుగానే కొనుగోలు చేసినట్లయితే మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకుని.. భవిష్యత్ ప్రణాళికల కోసం అందులో మీకు అవసరమైన మార్పులను చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు తమ పాలసీని ముందుగా కొనుగోలు చేసిన కొంత మంది వ్యక్తులకు అధిక డిస్కౌంట్లు కూడా అందించవచ్చు.
- హై రిస్క్ యాక్టివిటీలకు స్వస్తి పలకండి: మీ ప్రీమియం ధరలను తగ్గించుకునేందుకు మీరు హై రిస్క్ ఉన్న ఎక్కువ నిడివి యాక్టివిటీలకు దూరంగా ఉండండి. లేదా హై రిస్క్ అని నిరూపించే గమ్యస్థానాలకు ప్రయాణాలను కూడా తగ్గించుకోండి. డిజిట్లో సాహస కార్యకలాపాలైన స్కూబా డైవింగ్, బంగీ జంప్, మరియు స్కై డైవింగ్ వంటి యాక్టివిటీలను కవర్ చేస్తాం. కానీ వాటి వ్యవధి కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. కొండ ప్రాంతాలకు వారాల కొద్దీ నడవడం లేదా సాంప్రదాయ సాహస క్రీడలను మేము కవర్ చేయం.
- ఎంత మంది ప్రయాణికులు ట్రిప్‌కు వెళ్తున్నారనేది: ప్రీమియం అమౌంట్ అనేది మీరు ప్రయాణిస్తున్న వ్యక్తుల సంఖ్య మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు కనుక ఒంటరిగా విహారయాత్రకు వెళ్లాలని భావించినట్లయితే ఇండివిజువల్ ట్రావెల్ ప్లాన్‌ను తీసుకోండి. మీరు ఒంటరిగా కాకుండా గ్రూప్‌తో కలిసి విహారయాత్రకు వెళ్తుంటే.. ప్రతి ఒక్కరికీ సింగిల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడానికి బదులు గ్రూప్ ప్లాన్స్ తీసుకోవడం ఉత్తమం.
- అన్నింటినీ తనిఖీ చేయండి: ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వల్ల అది ట్రిప్ సమయంలో మీ భద్రతకు మాత్రమే గ్యారంటీ ఇస్తుంది. కావున సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు సరిగ్గా సరిపోయే దానిని ఎంచుకోండి. మీ లక్ష్యాలకు సరిగ్గా సరిపోయే ప్రయోజనాలు కలిగి ఉన్నదానిని ఎంచుకోండి. వివిధ రకాల చోట్ల ధరలను కంపేర్ చేయండి. అలా కంపేర్ చేసి మీకు ఏది ఉత్తమమో ఎంచుకోండి.
ఇంటర్నేషనల్ ప్రయాణానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?
లేదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. అయితే, విదేశంలో దురదృష్టకర పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా, అనేక సందర్భాల్లో మీ వీసా దరఖాస్తు ఆమోదం పొందేలా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
స్కెంజెన్ ప్రాంతంలోని దేశాలతో సహా అనేక దేశాలకు వెళ్లాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది లేకుండా, మీరు ఆ దేశాల వీసాలు పొందలేరు.
భారతీయులకు వీసా అవసరం లేని/రాకపై వీసా పొందే దేశాల జాబితా
భారతీయులకు వీసా అవసరం లేని/చేరిన తర్వాత వీసా ఇచ్చే దేశాల జాబితా
వీసా దరఖాస్తులు, ప్రక్రియలు ఎంత అలస్యం అవుతాయో మనందరికీ తెలుసు. అదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు భారతీయులు వీసా దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
భారతీయ పౌరులకు వీసా అవసరం లేని, లేదా ఆ దేశానికి చేరుకున్నాక వీసా ఇచ్చే దేశాల జాబితాను చెక్ చేయండి.
- ఆసియా - థాయ్‌లాండ్, భూటాన్, కంబోడియా, మాల్దీవులు, మకావు, ఇండోనేషియా, ఇరాక్, నేపాల్, లావోస్, జోర్డాన్, తైమూర్ లెస్టే
- ఆఫ్రికా - మారిషస్, సీషెల్స్, టోగో, ఇథియోపియా, మడగాస్కర్, ఉగాండా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్, గినియా-బిస్సావు, కేప్ వెర్డే, కొమొరో దీవులు
- దక్షిణ అమెరికా - ఈక్వెడార్, డొమినికా, బొలీవియా, గయానా
- ఉత్తర అమెరికా - బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, హైతీ, జమైకా, గ్రెనడా, మోంట్‌సెరాట్, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ & నెవిస్, సెయింట్ విన్సెంట్ & ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ & టొబాగో, నికరాగ్వా, టర్క్స్ & కైకోస్
- ఓషియానియా - కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, వనాటు, టువాలు, పలావు, నియు, సమోవా, ఫిజి, మైక్రోనేషియా.
స్కెంజెన్ దేశాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్
ప్రతి ట్రావెలర్ స్కెంజెన్ దేశాలలో ఒకదానిని కనీసం ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటాడు. కాబట్టి మీరు పూర్తి యూరో రైల్ టూర్ కోసం వెళుతున్నా లేదా ఎస్టోనియా, ఫిన్లాండ్ లేదా పోర్చుగల్ వంటి దేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నా, మీ స్కెంజెన్ టూరిస్ట్ వీసా ఆమోదం పొందడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం.
అయితే, స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మీ వీసా ఆమోదం పొందడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఫ్లైట్ డిలే, బ్యాగేజ్ కోల్పోవడం లేదా ఆలస్యం, పాస్‌పోర్ట్ కోల్పోవడం, మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్, ట్రిప్ క్యాన్సెలేషన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఆర్థిక అత్యవసర పరిస్థితులు మొదలైన అనేక దురదృష్టకర పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.
మీరు విదేశాలకు వెళ్లినప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులు
ఒక్కో ప్రయాణికుడి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. అయితే, మీరు ఎలాంటి ప్రయాణికుడైనప్పటికీ, ప్రతి ప్రయాణానికి అవసరమైన కొన్ని ప్రయాణ అవసరాలు ఉన్నాయి.
విదేశాలకు వెళ్లేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన వివిధ వస్తువులకు సంబంధించిన జాబితా ఇక్కడ ఉంది.
- పాస్‌పోర్ట్ (తప్పనిసరి!)
- అంతర్జాతీయ అడాప్టర్‌లు (మీ భారతీయ ప్లగ్‌లు సాకెట్‌లలోకి రావని మీరు గ్రహించినప్పుడు, మీరు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉండకూడదు!)
- అవసరమైన మందులు (పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ-అలెర్జీ మాత్రలు)
- మీరు వేసవిలో ప్రయాణిస్తున్నట్లయితే సన్‌స్క్రీన్, మీరు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లయితే మాయిశ్చరైజర్ అవసరం
- సౌకర్యవంతమైన బూట్లు (మీరు వెళ్లాల్సిన ప్రాంతాన్ని అంచనా వేయలేరు!)
- ఫారెక్స్ కార్డ్ ఉంటే మీరు ఎలాంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోరు.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా కొనసాగించగలరు!
- మీ కెమెరా! (ఆ జ్ఞాపకాలన్నింటినీ భద్రపరుచుకోవచ్చు)
- మీరు ఊహించలేని వాతావరణం ఉన్న ప్రదేశానికి ప్రయాణిస్తుంటే రెయిన్ కోట్ లేదా గొడుగు వెంట ఉంచుకోండి! (యూరప్, యూకే (UK)లో ఇలాంటి పరిస్థితి!)
- మీకు నచ్చిన పుస్తకం (సుదీర్ఘ విమాన సమయాల్లో మిమ్మల్ని శ్రద్దగా ఉంచడానికి, మీరు సెలవులో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి!)
- మీ ఫ్లైట్‌లో, నగరంలో సౌకర్యవంతంగా ఉండడానికి జాకెట్ లేదా హుడీ అవసరం.
- ఒంటరిగా ప్రయాణించడం, మీ భార్యతో, కుటుంబంతో లేదా పిల్లలతో ప్రయాణించడానికి అవసరమైన పూర్తి గైడ్ ఇక్కడ ఉంది.
విదేశాలకు వెళ్లే ముందు గుర్తుంచుకోవలసిన జాగ్రత్తలు
మీ పాస్‌పోర్ట్‌ని ప్రతిచోటికి తీసుకెళ్లడం మానుకోండి. దానిని మీ హోటల్ లాకర్‌లో ఉంచండి. బదులుగా మీ ధృవీకరణ కోసం దాని కాపీని తీసుకెళ్లడం మంచిది.
ATM నుంచి నగదును విత్‌డ్రా చేయకండి. ఎక్కువ నగదును తీసుకెళ్లకండి. మీ డబ్బు తీసుకున్న తర్వాత ఎల్లప్పుడూ మీ పరిసరాలను చెక్ చేయండి. నోట్లను కూడా చెక్ చేసుకోండి.
నకిలీ వ్యక్తులు విరాళాలు అడగడం, క్యాబ్ డ్రైవర్లు, నకిలీ టూర్ గైడ్‌లు మొదలైన చిన్న చిన్న ట్రావెలింగ్ మోసాలకు గురి కాకండి. వివిధ ప్రదేశాలలో జరిగే ట్రావెల్ స్కామ్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, అటువంటి పరిస్థితుల నుంచి మీరు ఎలా సురక్షితంగా ఉండవచ్చో తెలుసుకోవడానికి, మా హౌస్ కౌచ్ పొటాటోను చూడండి.
మీ నగదును ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో ఉంచండి. ఉదాహరణకు; మీరు మీ వాలెట్‌లో కొంత నగదును తీసుకెళ్లవచ్చు, అయితే కొంత భాగాన్ని మీ బ్యాక్‌ప్యాక్ లోపలి జేబులో సురక్షితంగా ఉంచుకోవచ్చు.
మీరు బస చేసిన స్థానాన్ని బాగా గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ మీటర్ ద్వారా వెళ్లే క్యాబ్‌లనే ఉపయోగించండి. లేకుంటే వాళ్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది!
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు
వీసాకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలా?
వీసా ప్రయోజనాల కోసం అన్ని దేశాలు ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెర్స్ను తప్పనిసరి చేయవు. కానీ ఇది ప్రయాణికులందరూ తాము టూర్‌కు బయలుదేరే ముందు కలిగి ఉండాల్సిన ముఖ్యమైన విషయం.
మరింత చదవండి: ఇండియన్స్ కి వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా ఆన్ అరైవల్ కు అనుమతినిచ్చే 34 దేశాల జాబితా
ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఖచ్చితంగా అవసరమా?
కొన్ని దేశాలు తమ వీసా పత్రాల కింద దానిని తప్పనిసరి చేస్తాయి. కానీ అవి లేనప్పటికీ, ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు విదేశీ గడ్డ మీద ఉన్నప్పుడు ప్రమాదం, ఆసుపత్రిలో చేరడం, పాస్పోర్ట్ పోగొట్టుకోవడం లేదా మీ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ కావడం, మీ చెక్ ఇన్ బ్యాగేజీ ఆలస్యం కావడం లేదా మీ ట్రిప్ కట్ చేయాల్సిన అవసరం ఉన్న కుటుంబంలో మరణం వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా మీకు ఆర్థిక, విధానపరమైన మద్దతు అవసరం కావొచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, తప్పు జరగగల విషయాల జాబితా చాలా పొడవుగా ఉంటుంది. కానీ మీరు అన్నింటి గురించి ఆలోచించడానికి, మీ, మీ కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన సరైన నిర్ణయం తీసుకునేంత తెలివైనవారు అని మాకు తెలుసు.
మరింత చదవండి: ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదా వీసాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?
మిస్ అయిన విమానాలను ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
అవును. కానీ, మీరు కంఫర్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే.
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్రిప్ క్యాన్సెలేషన్లను కవర్ చేస్తుందా?
అవును. కానీ, మీరు కంఫర్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే.
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ హోటల్ బుకింగ్ క్యాన్సెలేషన్లను కవర్ చేస్తుందా?
అవును. ఒకవేళ మీరు కంఫర్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొని, ట్రిప్ క్యాన్సెలేషన్ కోసం క్లెయిమ్ చేయాల్సి వస్తే, మీ బుకింగ్ యొక్క రీఫండ్ చేయలేని భాగాన్ని మేం కవర్ చేస్తాం.
నా టిక్కెట్లను బుక్ చేసిన తరువాత నేను ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చా?
అవును, మీరు చేయగలరు. కానీ మీరు బయలుదేరే తేదీకి ముందే కొనుగోలు చేసేలా చూసుకోండి..
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడానికి అర్హతా ప్రమాణాలు ఏమిటి?
మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఒకవేళ మీ వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువైతే, మీరు కచ్చితంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారితో కలిసి ప్రయాణించాలి. డిజిట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాలు. ఇవి వేర్వేరు కంపెనీలకు భిన్నంగా ఉండవచ్చు.
ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు ఏదైనా మెడికల్ టెస్టులు అవసరం అవుతాయా?
లేదు. అయితే మీకు ముందుగా ఉన్న వ్యాధి లేదా కండీషన్ ఉన్నట్లయితే, మాకు ఈమెయిల్ పంపడం లేదా మాకు కాల్ చేయడం ద్వారా పాలసీని కొనుగోలు చేసినప్పుడు దయచేసి దానిని తెలియజేయండి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?
ఇంటర్నేషనల్ ప్రయాణాలకు చెల్లించాల్సిన ప్రీమియం ప్రయాణికుల సంఖ్య, ప్రయాణికుల వయస్సు, గమ్యస్థానం, ట్రిప్ వ్యవధి, మీరు ఎంచుకునే ప్లాన్ ఆధారంగా లెక్కించబడుతుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎప్పుడు ప్రారంభం అయి, ఎప్పుడు ముగుస్తుంది?
ట్రిప్ క్యాన్సెలేషన్ బెనిఫిట్ వంటి మీ ట్రిప్ ప్రారంభానికి ముందు ప్రారంభమయ్యే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తిరిగి వచ్చేంత వరకు ఇవి ఉంటాయి. మిగతావి మీరు ట్రిప్పుకి బయలుదేరిన తర్వాత ప్రారంభమవుతాయి.
ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు రుజువుగా ఇవ్వవల్సిన డాక్యుమెంట్ ఏది?
ప్రయాణ షెడ్యూల్ సరిపోవాలి. కానీ, మీ ప్రధాన పాలసీ నిబంధనలు, షరతులను కూడా ఉంచుకోవాలని, మీ స్వంత రిఫరెన్స్ కొరకు సమ్మరీని అందుబాటులో ఉంచాలని మేము మీకు సలహా ఇస్తాము. పాలసీ గురించి సవిస్తారంగా చదవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్‌లో ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మంచి ఆలోచనేనా?
అవును, ఆన్‌లైన్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడమనేది సులభంగా ఉండటంతో పాటు త్వరగా పూర్తవుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ ప్రయాణ వివరాలను నమోదు చేసి, డబ్బు చెల్లించడమే. పాలసీ కొన్ని నిమిషాల్లో మీ ఇన్‌బాక్స్‌లో ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఏమేం చూడాలి?
ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నట్లయితే, మీ ప్రయాణ వ్యవధి, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, కస్టమర్ కేర్‌ను సులభంగా సంప్రదించవచ్చా లేదా, కోట్ తదితర అంశాలను మీరు చెక్ చేసుకోవాలి.
నేను డిజిట్ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొన్నాను. క్లెయిమ్ విషయంలో నేను వేరే దేశం నుంచి కస్టమర్ కేర్‌ను ఎలా సంప్రదించాలి?
ఏదైనా క్లెయిమ్ ఉన్నట్లయితే, 1800-258-5956 (భారతదేశంలో ఉన్నప్పుడు)పై మాకు కాల్ చేయండి లేదా +91-7303470000 పై మిస్డ్ కాల్ ఇవ్వండి. మేం 10 నిమిషాల్లో తిరిగి కాల్ చేస్తాం.
ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది?
ట్రిప్ క్యాన్సిలేషన్ మరియు కామన్ క్యారియర్ డిలే వంటి కొన్ని కవరేజీలు మీ ట్రిప్ ప్రారంభానికి ముందే ప్రారంభమవుతాయి. మీ ట్రిప్ ప్రారంభమైన తర్వాత మీరు తిరిగి వచ్చే వరకు మిగిలినవి మొదలవుతాయి.
మిస్ అయిన ఫ్లైట్ లకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
అవును, మీరు మా డిజిట్ ఆన్ ది మూవ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కంఫర్ట్ ఎంపికను తీసుకుంటే.
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్రిప్ క్యాన్సిలేషన్‌లను కవర్ చేస్తుందా?
అవును, మీరు మా డిజిట్ ఆన్ ది మూవ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కంఫర్ట్ ఎంపికను తీసుకుంటే.
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ హోటల్ బుకింగ్ రద్దులను కవర్ చేస్తుందా?
అవును, మీరు మా డిజిట్ ఆన్ ది మూవ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కంఫర్ట్ ఎంపికను తీసుకుంటే మరియు ట్రిప్ రద్దు కోసం క్లయిమ్ చేయవలసి వస్తే, మేము మీ బుకింగ్‌లో రీఫండ్ చేయలేని భాగాన్ని కవర్ చేస్తాము.
డిజిట్ వారి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోవిడ్-19ని కవర్ చేస్తుందా?
అవును. మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని డిజిట్ నుండి కొనుగోలు చేసినప్పుడు, మీరు మహమ్మారి సంభవించినప్పుడు కవర్ చేయబడతారు. ఉదాహరణకు, క్వారంటైన్ పరిస్థితిలో, మీరు మీ పాలసీని పొడిగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, మీరు 10 రోజుల వరకు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌లతో అలా చేయవచ్చు. అదనంగా, నిర్బంధ నిర్బంధం కారణంగా మీరు మీ ట్రిప్‌ను రద్దు చేయవలసి వస్తే లేదా వదిలివేయవలసి వస్తే, ట్రిప్ క్యాన్సిలేషన్ మరియు ట్రిప్ విడిచిపెట్టిన కవర్లు యాక్టివేట్ చేయబడతాయి.
కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భంలో మీరు అత్యవసర వైద్య చికిత్స మరియు తరలింపు కవర్‌తో వైద్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
భారతదేశం నుంచి పలు ప్రముఖమైన ప్రాంతాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్
భారతదేశం నుంచి పలు ప్రముఖమైన ప్రాంతాలకు వీసా గైడ్స్