ఫారం 15H అంటే ఏమిటి: ఫారం 15H డౌన్ లోడ్ చేసి ఫిల్ చేయండి
60 సంవత్సరాలు పైబడిన ఇండియన్ సిటిజన్స్ వారి ట్యాక్స్ లయబిలిటీ అనేది మినహాయింపు కంటే తక్కువగా ఉంటే ఫారం 15H సమర్పించాలని మీకు తెలుసా?
ఇది కేవలం ఒకే ఆర్థిక సంవత్సరానికి చెల్లుబాటు అవుతుంది. దీన్ని సకాలంలో సమర్పించడం చాలా ముఖ్యం. ఇది అదనంగా వచ్చే వడ్డీ ఆదాయంపై బ్యాంక్ ఎటువంటి టీడీఎస్ ను తీసివేయదని నిర్దారిస్తుంది.
ఫారం 15H ను నింపడం మరియు దాని ఉపయోగాల గురించి మరింత తెలుసుకునేందుకు స్క్రోల్ చేస్తూ ఉండండి.
ఫారం 15H అంటే ఏమిటి?
ఫారం 15H అనేది 60 సంవత్సరాలు పైబడిన వారికి టీడీఎస్ తగ్గింపు కోసం సీనియర్ సిటిజన్లు ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్. పన్ను చెల్లించే వ్యక్తి ఆదాయం పన్ను పరిమితికి మించనపుడు అతనికి రికరింగ్ డిపాజిట్స్ లేదా ఫిక్స్‌డ్ సేవింగ్స్ ద్వారా వచ్చే వడ్డీపై టీడీఎస్ భారాన్ని తగ్గించేందుకు ఇది ఒక అభ్యర్థన.
సీనియర్ సిటిజన్లకు పొదుపు నుంచి వచ్చే వడ్డీకి ఇండియన్ గవర్నమెంట్ టీడీఎస్ తగ్గింపును అనుమతిస్తుంది. ఈ డిపాజిట్స్ నుంచి వార్షిక వడ్డీ ఆదాయం అనేది రూ. 50,000కి మించితే టీడీఎస్ డిడక్ట్ చేయబడుతుంది.
ఆర్థిక సంవత్సరం కోసం వ్యక్తులు ఫారం 15H ను వడ్డీ చెల్లింపుకు ముందు డిడక్టర్ కు అందించాలి. మునుపటి సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం పన్ను విధించే ఆదాయం కిందకు రాదని చెప్పేందుకు ఫారం 15H ఉపయోగిస్తారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఫారం 15H డౌన్ లోడ్ చేసుకునేందుకు స్టెప్స్ ఏమిటి?
ఫారంను డౌన్ లోడ్ చేయడానికి కింది స్టెప్స్ ఫాలో అవండి-
- స్టెప్ 1: ఈ-ఫిల్లింగ్ పోర్టల్ సైట్ ను విజిట్ చేయండి. డౌన్ లోడ్ ఆప్షన్ నుంచి ‘‘ఆఫ్ లైన్ యుటిలిటీస్’’ ను ఎంచుకోండి.
- స్టెప్ 2: అందుబాటులో ఉన్న డౌన్ లోడ్ లింక్ మీద క్లిక్ చేసి ZIP ఫైల్ ను ఎక్స్‌ట్రాక్ట్ చేయండి.
- స్టెప్ 3: రీ డైరెక్ట్ చేయబడిన పేజ్ లో అవసరం ఉన్న ఫీల్డ్స్ ను ఫిల్ చేయండి. మరియు XML ను జెనరేట్ చేయండి. తర్వాత జెనరేట్ అయిన XML ఫైల్ ను ఈ ఫైలింగ్ వెబ్సైట్ లో అప్ లోడ్ చేయాలి.
- స్టెప్ 4: ఫైల్ మెనూకి వెళ్లి “సబ్మిట్ ఫారం 15H” మీద క్లిక్ చేయండి. ఆర్థిక సంవత్సరం, ఫారం పేరు, క్వార్టర్ మరియు ఫిల్లింగ్ రకాన్ని ఎంచుకోండి. ‘‘వాలిడేట్’’ మీద క్లిక్ చేయండి.
- స్టెప్ 5: చివరగా XML మరియు DSC ఫైల్ ను అటాచ్ చేయండి మరియు ‘‘సబ్మిట్’’ మీద క్లిక్ చేయండి.
మీ పనిని సింపుల్ గా కంప్లీట్ చేసేందుకు ఇటువంటి సేవలను అందించే ఆర్థిక సంస్థల వెబ్సైట్లను తనిఖీ చేయాలి.
ఫారం 15H నింపి ఎలా సబ్మిట్ చేయాలి?
మీకు అవసరం అయిన కాపీలను మీరు డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. అప్పుడు సీనియర్ సిటిజన్ దరఖాస్తుదారుడు ఈ ఫారంను పూరించి బ్యాంక్ లేదా అథారిటీకి సమర్పించాలి.
ఫైల్ చేసిన తర్వాత 15H ఫారంను ఎలా సబ్మిట్ చేయాలో ఇక్కడ ఉంది.
పార్ట్ 1. సీనియర్ సిటిజన్ కావాల్సిన వివరాలతో ఫారం నింపాలి. ఇందులో ఇవి ఉంటాయి-
- దరఖాస్తుదారుని పేరు
- పాన్ వివరాలు
- ప్రస్తుతం ఉంటున్న చిరునామా వివరాలు
- జన్మదినం
- పేర్కొన్న ఆదాయానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం
- సంప్రదింపు సమాచారం మొదలయినవి.
- ఈ ఆర్థిక సంవత్సరం కంటే ముందు ఏదైనా సంవత్సరంలో సీనియర్ సిటిజన్ పన్ను చెల్లించి ఉంటే అవును అని ఎంటర్ చేయండి
- దరఖాస్తుదారు తన డిక్లరేషన్ లో సమర్పించాలని అనుకుంటున్న మొత్తం ఆదాయం మెన్షన్ చేయండి.
- ప్రస్తుత సంవత్సరం అంచనా వేసిన మొత్తం ఆదాయం మరియు మునుపటి సంవత్సరం అంచనా వేసిన ఆదాయం పేర్కొనండి.
- ఈ డిక్లరేషన్ అనేది దరఖాస్తుదారు మొత్తం ఆదాయంతో అతడు ఫిల్ చేసిన ఖచ్చితమైన సంఖ్య.
- డిక్లరేషన్ లో దాఖలు చేయబడిన ఆదాయ వివరాలు.
- మదింపుదారు సంతకం.
ఈ ఫారం నెక్ట్స్ పార్ట్ అనేది పన్ను చెల్లింపుదారుడు ఇండియాలో నివసిస్తున్నట్లు చేసిన డిక్లరేషన్. ఇక్కడ తెలిపిన సమాచారం తనకు తెలిసినంత మట్టుకు సరైందని మరియు తన ఆదాయం ఐటీ చట్టం 1961 నిబంధనల ప్రకారం లెక్కించడిందని అంతకుముందు సంవత్సరానికి కూడా పన్ను శూన్యమని డిక్లేర్ చేయాలి.
ఫారం 15H యొక్క ఇతర ఉపయోగాలు ఏమిటో చూద్దాం.
ఫారం 15H ఉపయోగాలు
ఫారం 15H అనేక రంగాలలో ఉపయోగపడుతుంది. ఈ కింది జాబితా వాటి గురించి మొత్తం వివరిస్తుంది.
- Pకార్పొరేట్ బాండ్ల నుంచి వచ్చే ఆదాయంపై టీడీఎస్ - రూ. 5,000 కంటే ఎక్కువగా కార్పొరేట్ బాండ్ల నుంచి ఆర్జిస్తే దానికి టీడీఎస్ వర్తిస్తుంది. టీడీఎస్ తగ్గింపు కోసం రిక్వెస్ట్ చేసేందుకు ఒక వ్యక్తి ఫారం 15Hను ఇష్యూయర్‌కు సమర్పించాలి. అయితే నిర్దిష్ట ప్రమాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ ను సరళీకృతం చేసేందుకు ఫారం 15Hను ఎప్పుడు సబ్మిట్ చేయాలో చెక్ చేయాలి.
- ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ - ఈ ఫారం సీనియర్ సిటిజన్లకి బాగా ఉపయోగపడుతుంది. అతని మొత్తం ఆదాయం ట్యాక్స్ పరిమితికి మించనపుడు బ్యాంక్ నుంచి డిపాజిట్స్ మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ పై ట్యాక్స్ ను ఇది ఆదా చేస్తుంది.
- ఉపసంహరణలపై టీడీఎస్ - ఒక కంపెనీలో ఐదు సంవత్సరాల సర్వీసు కంటే తక్కువ చేసి EPF ఉపసంహరించుకున్నపుడు దాని మీద టీడీఎస్ వర్తిస్తుంది. అయితే ఒక వ్యక్తి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ను కలిగి ఉంటే ప్రభుత్వం మినహాయింపును ఇస్తుంది. EPF బ్యాలెన్స్ పై టీడీఎస్ తగ్గింపును అవాయిడ్ చేసేందుకు మీరు ఈ ఫారం ను సమర్పించాల్సి ఉంటుంది. పేర్కొన్న కారణం కోసం ఫారం 15Hను సబ్మిట్ చేసే ముందు అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించండి. EPF బ్యాలెన్స్ అనేది పన్ను పరిధిలోకి రాదు.
- పోస్ట్ ఆఫీసుల్లోని డిపాజిట్స్ ద్వారా వచ్చే ఆదాయంపై టీడీఎస్ - సీనియర్ సిటిజన్లు పోస్టాఫీసుల్లో ఫారం 15Hను సబ్మిట్ చేయొచ్చు. ఎవరికైతే డిపాజిట్స్ పై టీడీఎస్ డిడక్ట్ చేస్తారో వారు దీనిని ఉపయోగించుకోవచ్చు. వారు పేర్కొన్న ప్రమాణాలు ఉంటే టీడీఎస్ డిడక్షన్ చేయమని అభ్యర్థించవచ్చు.
- అద్దెపై టీడీఎస్ - ఒక ఏడాదిలో రూ. 1.8 లక్షల కంటే ఎక్కువ అద్దె చెల్లించేవారికి టీడీఎస్ వర్తిస్తుందని మీరు తెలుసుకోవాలి. సీనియర్ సిటిజన్ అతని/ఆమె అద్దె దారులకు ఫారం 15H ని సబ్మిట్ చేసి టీడీఎస్ రద్దును అవాయిడ్ చేయమని వారిని అభ్యర్థించవచ్చు. అయితే మీరు మునుపటి సంవత్సరం వచ్చిన ఆదాయంపై చెల్లించిన ట్యాక్స్ శూన్యం అని తనిఖీ చేయాలి.
సీనియర్ సిటిజన్స్ ఫారం 15Hను సమర్పించేందుకు చివరి తేదీ ఎప్పుడు అనేది కూడా తనిఖీ చేయాలి. ఇది అన్ని పారామితులను నెరవేర్చిందని మరియు టీడీఎస్ చెల్లింపులో ఎటువంటి తప్పిదాలు లేవని నిర్దారిస్తుంది.
ఫారం 15H ఎల్జిబులిటీ క్రైటీరియా (అర్హత ప్రమాణం) ఏమిటి?
ఫారం 15H ను సబ్మిట్ చేసే ముందు చెక్ చేయాల్సిన కొన్ని అంశాలు.
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ నివాసి అయి ఉండాలి
- అతను లేదా ఆమె వ్యక్తిగతంగా పన్ను చెల్లించే వ్యక్తి అయి ఉండాలి, సంస్థ అయి ఉండకూడదు
- ఒక వ్యక్తికి కనీసం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసుండాలి
- ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించే వ్యక్తి బాధ్యత (లయబిలిటీ) శూన్యంగా ఉండాలి.
ఫారం 15H మినహాయింపు లిమిట్ ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లు తప్పనిసరిగా ఈ ఫారంను సమర్పించాలి.
దానికి సంబంధించిన నియమాలు ఈ కింది విధంగా ఉన్నాయి -
- 60 ఏళ్లలోపు మరియు రూ. 2.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపులు వర్తిస్తాయి
- 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు సేవింగ్స్ నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందే వారు కూడా ఫారం 15Hను బ్యాంక్ కు సమర్పించవచ్చు.
- 60-80 వయస్సు గల వ్యక్తులు రూ. 3 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తులు కూడా పన్ను మినహాయింపును పొందొచ్చు.
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఫారం 15Hలో ఇది చాలా ముఖ్యం. ఫారం 15Hని తప్పనిసరిగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే డిపాజిట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి. లేకపోతే ఇన్కమ్ ప్రొవైడర్ టీడీఎస్ కు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫారం 15H ను సమర్పించడానికి చివరి తేదీ 15 జూలై 2023. అందువల్ల ఈ ఫారంను సకాలంలో సమర్పించడం కోసం కొత్త నిబంధనలు అప్డేట్ల మీద ఓ కన్నేసి ఉంచాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
నేను బ్యాంక్ వద్ద ఫారం 15H సమర్పించాలా?
అవును. మీరు మీ బ్యాంక్ బ్రాంచిలో ఫారం 15H సమర్పించాలి.
ఫారం 15H ను నేరుగా ఆదాయపు పన్ను శాఖకు సమర్పించడం తప్పనిసరా?
లేదు. మీరు ఈ ఫారంలను నేరుగా ఇన్కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కు సమర్పించాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు డిడక్టర్ ద్వారా దీనిని చేయవచ్చు.