డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

టీడీఎస్ అంటే ఏంటి: అర్థం, టీడీఎస్ సర్టిఫికెట్ ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

టీడీఎస్ అంటే అర్థం బిల్లును చెల్లించేటపుడు అధీకృత డిడక్టర్ ద్వారా మూలం వద్ద పన్ను మినహాయింపును సూచిస్తుంది. ఇది భారత కేంద్ర ప్రభుత్వానికి పంపబడుతుంది. మరియు ఏదైనా ఆదాయానికి వర్తిస్తుంది. తగ్గింపు మరియు థ్రెషోల్డ్ లిమిట్ తో కూడిన వివిధ (వేరు) నిబంధనలతో టీడీఎస్ కింద 27 సెక్షన్ లు ఉన్నాయి.

టీడీఎస్ అంటే ఏమిటి?

టీడీఎస్ అనేది 1961 అడ్వాన్స్‌డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆక్ట్ కిందకు వస్తుంది. అన్ని సంస్థలు లేదా వ్యక్తులు దానిని చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్ అనేది పన్ను ఎగవేతను తగ్గించేందుకు మరియు ఇన్కమ్ సోర్స్ వద్ద కలెక్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక సాధనం. సాలరీ, ఇంట్రెస్ట్, రెంట్, బ్రోకరేజ్, ప్రొఫెషనల్ సర్వీస్ కింద వచ్చే ఆదాయం.

ఒక ఆర్థిక సంవత్సరం నుంచి టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీని మించి ఉంటే మీరు ఐటీఆర్ ను దాఖలు చేయడం ద్వారా మరియు డిడక్టర్ జారీ చేసిన ఫారం 26AS/టీడీఎస్ సర్టిఫికెట్ ద్వారా టీడీఎస్ క్లయిమ్ చేసి అమౌంట్ ను పొందొచ్చు. ఒక వేళ చెల్లింపు చేసే వ్యక్తి పాన్ కార్డ్ ఇవ్వడంలో కనుక విఫలం అయితే ఇన్కమ్ మీద అధిక టీడీఎస్ ప్రభావం పడుతుంది. టీడీఎస్ డిపాజిట్ చేయడానికి TAN మరియు పాన్ అనేవి రెండు ముఖ్యమైన పత్రాలు.

[మూలం]

 

టీడీఎస్ ని ఎవరు డిడక్షన్ చేస్తారు?

ఒక సంస్థ (వ్యక్తులు లేదా HUFలు కాకుండా) అకౌంట్ బుక్ ఆడిట్ చేసి నిర్దిష్ట చెల్లింపుల టీడీఎస్ డిడక్షన్ చేయాల్సి ఉంటుంది. థ్రెషోల్డ్ లిమిట్ కు లోబడి టీడీఎస్ చలాన్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మీరు చెల్లించిన బిల్లు నుంచి టీడీఎస్ తీసివేసేందుకు అర్హులు. వ్యక్తులు లేదా HUFలు అటువంటి డిడక్షన్ చేసేందుకు అధికారం లేని కారణంగా టీడీఎస్ తీసివేయలేవు. టర్నోవర్ లేదా అమ్మకాలు లేదా రశీదులు రూ. 1 కోటికి మించిన బిజినెస్ ఉంటే నిర్దిష్ట చెల్లింపులపై టీడీఎస్ తీసివేయవచ్చు. (వృత్తి విషయంలో లిమిట్ రూ. 50 లక్షలకు మించితే)

డిడక్టర్ అనే వాడు ప్రతి నెలా 7వ తేదీ లోపు లేదా అంతకంటే ముందు గవర్నమెంట్ అకౌంట్ లో టీడీఎస్ డిపాజిట్ చేయాలి. విభిన్న రకాల ఉత్పత్తులు మరియు సేవలకు వివిధ (వేరు) రకాల రేట్ ల టీడీఎస్ డిడక్షన్ లు ఉంటాయి.

[మూలం]

టీడీఎస్ ఎప్పుడు కట్ అవుతుంది?

టీడీఎస్ చెల్లించాల్సిన సమయం లో లేదా అసలు చెల్లింపు సమయంలో ఏది ముందుగా ఉంటే అది తీసివేయబడుతుంది. మే 2023 కి చెందిన ఇన్వాయిస్ అయి జూన్ 2023లో చెల్లింపు చేయాల్సి ఉంటే టీడీఎస్ మే నెలలో చెల్లించాల్సి ఉంటుంది. కావున దానిని మేలో డిడక్ట్ చేయాలి మరియు జూన్ 7 లోపు చెల్లింపు చేయాలి.

టీడీఎస్ ఎందుకు కట్ అవుతుందనేది తెలిస్తే అది ఎప్పుడు కట్ అవుతుందో సులభంగా తెలుస్తుంది. టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక భాగం. తదుపరి తేదీ కొరకు ఇది వెయిట్ చేయదు. అందువల్ల మీరు మొత్తం అమౌంట్ లేదా బిల్లును చెల్లించినపుడు తీసేసేందుకు ఉత్తమ సమయం.

వివిధ రకాల పేమెంట్స్ కోసం టీడీఎస్ రేట్ ఎంత?

వివిధ రకాల విభాగాలను బట్టి టీడీఎస్ రేట్ మారుతూ ఉంటుంది.

వేర్వేరు రకాల టీడీఎస్ రేట్ లు అర్థం చేసుకునేందుకు కింది పట్టికను చూడండి.

సెక్షన్ మరియు పేమెంట్ యొక్క నేచర్ పేయర్ వర్తించే రేట్
సెక్షన్ 192 సాలరీ సాలరీడ్ ఇండివిజువల్ వర్తించే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్
సెక్షన్ 192A ఈపీఎఫ్ యొక్క ముందస్తు విత్ డ్రాయల్ ఇండివిజువల్ టోటల్ ఆదాయంలో 10 శాతం
సెక్షన్ 193 సెక్యూరిటీల మీద వడ్డీ మొత్తం ఇండివిజువల్ 10%
సెక్షన్ 194 డివిడెంట్స్ దేశీయ కంపెనీలు 10%
సెక్షన్ 194A, ఆస్తులు & సెక్యూరిటీ లపై ఇంట్రెస్ట్ టాక్స్ పేయర్ నుంచి ఇండివిజువల్ మినహాయింపు ఉంటుంది. మరియు HUF పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాలి 10%
సెక్షన్ 194B, ఏదైనా పోటీ లేదా లాటరీ ద్వారా సంపాదించిన డబ్బుపై వర్తిస్తుంది ఇండివిజువల్ 30%
సెక్షన్ 194BB, గెలుపొందిన గుర్రపు పందేలపై బహుమతి మొత్తం ఎవరైనా వ్యక్తి 30%
సెక్షన్ 194C, కాంట్రాక్టర్లు టాక్స్ పేయర్ నుంచి ఇండివిజువల్ మినహాయింపు ఉంటుంది. మరియు HUF పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాలి వ్యక్తులు మరియు HUF కోసం 1 శాతం, ఇతర ట్యాక్స్ పేయర్ లకు 2 శాతం
సెక్షన్ 194D, ఇన్సూరెన్స్ కమిషన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ వ్యక్తులు మరియు HUF కోసం 5శాతం మరియు ఇతర ఏజెంట్లకు 10శాతం
సెక్షన్ 194DA, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇండివిజువల్ 1%
సెక్షన్ 194E, ఇక్కడ నివాసం లేని క్రీడాకారులకు చెల్లించడం ఇండివిజువల్ 20%
సెక్షన్ 194EE, NSS కింద డిపాజిట్ ఇండివిజువల్ 10%
సెక్షన్ 194G, లాటరీ టికెట్ విక్రయం ద్వారా వచ్చిన కమిషన్ ఇండివిజువల్ 10%
సెక్షన్ 194H, సంపాదించిన కమిషన్ లేదా బ్రోకరేజ్ మీద టీడీఎస్ టాక్స్ పేయర్ నుంచి ఇండివిజువల్ మినహాయింపు ఉంటుంది. మరియు HUF పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాలి 5%
సెక్షన్ 194I, రెంట్ మీద టీడీఎస్ టాక్స్ పేయర్ నుంచి ఇండివిజువల్ మినహాయింపు ఉంటుంది. మరియు HUF పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాలి 2 శాతం (యంత్రాలు లేదా పరికరాల నుంచి) 10 శాతం (భూములు, బిల్డింగ్ లు మరియు సామగ్రి నుంచి)
సెక్షన్ 194IA,స్థిరాస్తుల ట్రాన్స్ఫర్ మీద టీడీఎస్ (వ్యవసాయ భూములు మినహా) ఇండివిజువల్ 1%
సెక్షన్ 194IB, వ్యక్తులు మరియు HUF ద్వారా అద్దె టాక్స్ పేయర్ నుంచి ఇండివిజువల్ మినహాయింపు ఉంటుంది. మరియు HUF పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాలి 5%
సెక్షన్ 194IC, ఒప్పందం పై చెల్లింపు ఇండివిజువల్ 10%
సెక్షన్ 194J, రాయల్టీ, ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ సర్వీసెస్ టాక్స్ పేయర్ నుంచి ఇండివిజువల్ మినహాయింపు ఉంటుంది. మరియు HUF పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాలి 10%
సెక్షన్ 194LA, స్థిరమైన ఆస్తిని స్వాధీనంచేసుకున్నందుకు పరిహారం ఇండివిజువల్ 10%
సెక్షన్ 194LB, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చే ఆదాయం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ 5%
సెక్షన్ 194LBA, బిజినెస్ ట్రస్ట్ యూనిట్ల నుంచి వచ్చే ఆదాయం బిజినెస్ ట్రస్ట్ లు రెసిడెంట్స్ (ఇక్కడే నివాసం ఉండేవారు) ఇండివిజువల్స్ కు 10 శాతం మరియు ఎన్ఆర్ఐ లకు 5 శాతం
సెక్షన్ 194LBB, పెట్టుబడి పెట్టిన యూనిట్ల నుంచి వచ్చే ఆదాయం ఇన్వెస్టింగ్ ఫండ్ లు 40%
సెక్షన్ 194 LBC, సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ ల ద్వారా ఆర్జించిన ఆదాయం మీద టీడీఎస్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ లు ఇండివిజువల్స్ కు మరియు HUFలకు 25 శాతం మరియు ఇన్వెస్టర్లకు 30%
సెక్షన్ 194LC, ఇండియన్ కంపెనీ నుంచి వచ్చే ఆదాయం ఇండియన్ కంపెనీలు మరియు బిజినెస్ ట్రస్ట్ లు 5%
సెక్షన్ 194LD, నిర్దిష్ట గవర్నమెంట్ సెక్యూరిటీ మరియు బాండ్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ పై టీడీఎస్ ఇండివిజువల్ 5%
సెక్షన్ 195 నాన్ ఆర్గనైజేషనల్ కంపెనీ లేదా విదేశీ కంపెనీకి చెల్లింపులు ఇండివిజువల్ DTAA లేదా ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో పేర్కొన్న విధంగా
సెక్షన్ 196B, ఆఫ్ షోర్ ఫండ్ ల నుంచి వచ్చే ఆదాయం ఇండివిజువల్ 10%
సెక్షన్ 196C, విదేశీ కరెంట్ బాండ్ల నుంచి వచ్చే ఆదాయం ఇండివిజువల్ 10%
సెక్షన్ 196D, ఫారిన్ ఇన్‌స్టిస్టూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా వచ్చే ఆదాయం ఇండివిజువల్ 20%

మీరు కనుక పాన్ కార్డ్ సమర్పించికపోతే అది 20 శాతం డిడక్షన్ అవుతుంది

[మూలం]

 

టీడీఎస్ ఎలా డిపాజిట్ చేయాలి?

టీడీఎస్ కాన్సెప్ట్ ఒకటే.. మూలం వద్ద ఆదాయాన్ని డిడక్షన్ చేసుకోవడం మరియు దానిని ప్రభుత్వానికి చెల్లించడం. కావున డిడక్షన్ చేసే సంస్థ లేదా వ్యక్తికి దానిని ప్రభుత్వానికి డిపాజిట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. టీడీఎస్ డిపాజిట్ చేసే ప్రక్రియ ఈ కింది విధంగా ఉంటుంది:

  • ఈ-పేమెంట్ కోసం ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ లో లాగిన్ అవండి.

  • TCS/టీడీఎస్ సెక్షన్ కింద చలాన్ సంఖ్య ITNS 281 ఎంచుకోండి. ఇక్కడ మీరు TAN, అసెస్‌మెంట్ ఇయర్, పిన్ కోడ్, చెల్లింపు విధానం ఎంటర్ చేయాలి.

  • తర్వాత, రెగ్యులర్ వాటి మీద టీడీఎస్ మరియు డిడక్షన్ అయిన టీడీఎస్ లేదా పేయబుల్ ఎంచుకోండి. ‘‘సబ్మిట్’’ మీద క్లిక్ చేయండి.

  • మాస్టర్ డేటా ప్రకారం TAN మరియు టాక్స్ పేయర్ పూర్తి పేరుతో కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది.

  • ఇప్పుడు ఇది మిమ్మల్నిచెల్లింపు పేజీకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చెల్లింపు చేయండి.

విజయవంతమైన చెల్లింపు తర్వాత CINతో కూడిన కౌంటర్ ఫాయిల్, చెల్లింపు కన్ఫర్మేషన్, బ్యాంక్ డిటెయిల్స్ పేమెంట్ ప్రూఫ్ గా వస్తాయి. ఇప్పుడు మీరు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి.

అసలు టీడీఎస్ రిటర్న్ అంటే ఏమిటి?

టీడీఎస్ గురించి తెలుసుకున్న వ్యక్తులు టీడీఎస్ రిటర్న్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇది టీడీఎస్ గా మినహాయించబడిన అదనపు అమౌంట్ ను టాక్స్ పేయర్ కు అందిస్తుంది.

టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో భాగమనేనా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వ్యక్తులు దానిని చెల్లించిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం చివర్లో ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ని కలిగి ఉంటారు?

చెల్లింపు ఆలస్యాన్ని నివారించేందుకు టీడీఎస్ అనేది ఆదాయ మూలం వద్ద పన్ను ను మినహాయిస్తుందని అర్థం చేసుకోవాలి. ఒక సంవత్సరంలో మీరు చెల్లించిన టీడీఎస్ మీ ట్యాక్స్ లయబిలిటీ ని మించి ఉంటే మీరు అదనంగా చెల్లించిన అమౌంట్ ను ప్రభుత్వం మీకు రిటర్న్ చేస్తుంది.

ఈ రిటర్న్ ను పొందేందుకు మీరు టీడీఎస్ సర్టిఫికెట్ ను ఎలా పొందాలో డిడక్టర్ ను అడగాలి. టీడీఎస్ రిటర్న్ ను ఫైల్ చేసేటపుడు టీడీఎస్ సర్టిఫికెట్ అవసరం.

టీడీఎస్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి?

మీరు ప్రతి సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక లావాదేవీల కోసం టీడీఎస్ రిటర్న్ ను ఫైల్ చేయొచ్చు. TAN, ఎవరి దగ్గరైతే డిడక్డ్ అవుతుందో వారి పాన్, చెల్లింపు రకం, డిడక్షన్ అయ్యే అమౌంట్ ఫైల్ చేసేటపుడు అవసరం.

టీడీఎస్ రిటర్న్ ఫైల్ తేదీలు కింద ఉన్నాయి-

ఫారమ్ నెం. ఏ ట్రాన్సాక్షన్ మీద టీడీఎస్ డిడక్షన్ అయింది రిటర్న్ ఫైల్ కోసం గడువు తేదీ
24Q/26Q సాలరీ Q1 – 31st జూలై, Q2 – 31st అక్టోబర్, Q3 – 31st జనవరి, Q4 – 31st మే
27Q నివాసితులు కాని వారు చేసే ఏదైనా చెల్లింపు (సాలరీ కాదు) Q1 – 31st జూలై, Q2 – 31st అక్టోబర్, Q3 – 31st జనవరి, Q4 – 31st మే
26QB ఆస్తి అమ్మకం టీడీఎస్ డిడక్షన్ అనేది నెలాఖరు నుంచి 30 రోజులు
26QC రెంట్ టీడీఎస్ డిడక్షన్ అనేది నెలాఖరు నుంచి 30 రోజులు

టీడీఎస్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి?

టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేందుకు-

1. మీరు ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి

2. నేవిగేషన్ బార్ లో టీడీఎస్ బార్ కింద ఉన్న “అప్ లోడ్ టీడీఎస్” మీద క్లిక్ చేయండి.

3. కింది స్టేట్మెంట్ వివరాలు నమోదు చేసి ఆపై వెరిఫై చేయండి-

  • FVU వెర్షన్
  • ఆర్థిక సంవత్సరం
  • ఫారం పేరు
  • క్వార్టర్
  • అప్లోడ్ టైప్

4. ఇప్పుడు మీరు టీడీఎస్ జిప్ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు సిగ్నేచర్ చేసిన ఫైల్ ను లేదా DSCని అటాచ్ చేయాలి. అన్ని ఫైల్ లను అప్లోడ్ చేసిన తర్వాత ‘‘అప్లోడ్’’ మీద క్లిక్ చేయండి.

5. టీడీఎస్ విజయవంతంగా ఫైల్ చేయబడితే మీరు ఇచ్చిన మెయిల్ ఐడీ కి ఒక మెయిల్ మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది.

మీరు ఇప్పుడు నేవిగేషన్ బార్ లో ఉన్న వ్యూ ఫైల్ టీడీఎస్ ట్యాబ్ మీద క్లిక్ చేయడం ద్వారా ఫైల్ చేసిన టీడీఎస్ రిటర్న్ ను చూడొచ్చు.

ప్రభుత్వానికి టీడీఎస్ డిపాజిట్ చేసేందుకు గడువు తేదీ

ప్రభుత్వానికి టీడీఎస్ ను డిపాజిట్ చేసేందుకు గడువు తేదీ తదుపరి నెల 7. ఉదాహరణకు మీకు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య ఎప్పుడైనా టీడీఎస్ డిడక్షన్ చేయబడితే అక్టోబర్ 7 లోపు మీరు దానిని డిపాజిట్ చేయాలి. అయితే ఇది రెండు సందర్భాల్లో భిన్నంగా ఉంటుంది:

  • మార్చిలో టీడీఎస్ డిడక్షన్ జరిగితే మీరు 30 ఏప్రిల్ వరకు దానిని డిపాజిట్ చేయొచ్చు.
  • ఏదైనా ఆస్తి కొనుగోలు లేదా అద్దెపై డిడక్షన్ అయిన టీడీఎస్ నెలాఖరున 30 రోజులలోపు డిపాజిట్ అవుతుంది.

[మూలం]

టీడీఎస్ సర్టిఫికెట్ అంటే ఏమిటి?

టీడీఎస్ సర్టిఫికెట్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడం ద్వారా వివిధ మార్గాల్లో వచ్చే ఇన్కమ్ కు సంబంధించి టీడీఎస్ డిడక్షన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరికైతే టీడీఎస్ డిడక్షన్ అయిందో ఆ వ్యక్తికి లేదా ముదింపుదారునికి టీడీఎస్ ను డిడక్ట్ చేసుకునే ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ఒక రకమైన సర్టిఫికెట్. మీ అకౌంట్ నుంచి డిడక్షన్ రూపంలో తీసుకున్న టీడీఎస్ ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ చేయబడిందని ఇది ప్రూఫ్ గా పని చేస్తుంది.

ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే టీడీఎస్ సర్టిఫికెట్ రకం మరియు వివిధ రకాల టీడీఎస్ సర్టిఫికెట్లు

ఫారం చెల్లింపు రకం సర్టిఫికెట్ ఫ్రీక్వెన్సీ (ఎంత తరచుగా) మరియు గడువు తేదీ
ఫారం 16 సాలరీ పేమెంట్ ప్రతి సంవత్సరం 31 మే
ఫారం 16 A నాన్-సాలరీ పేమెంట్ లు క్వార్డర్ లో రిటర్న్ ఫైల్ చేసేందుకు గడువు తేదీ నుంచి 15 రోజులు
ఫారం16 B ఆస్తి అమ్మకం ప్రతి లావాదేవీ రిటర్న్ ను దాఖలు చేసేందుకు గడువు తేదీ నుంచి 15 రోజులు
ఫారం 16 C రెంట్ ప్రతి లావాదేవీ రిటర్న్ ను దాఖలు చేసేందుకు గడువు తేదీ నుంచి 15 రోజులు

టీడీఎస్ సర్టిఫికెట్ ను వీక్షించేందుకు స్టెప్ లు

మీరు డిడక్టర్ నుంచి టీడీఎస్ సర్టిఫికెట్ కోసం అడగవచ్చు. లేదా కింది స్టెప్ లు ఉపయోగించి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు:

1. TRACES అధికారిక పోర్టల్ను సందర్శించండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘‘ప్రొసీడ్’’ మీద క్లిక్ చేయండి.

2. వీటితో సహా పత్రాలను అందించండి-

  • తగ్గింపు యొక్క TAN
  • చెల్లింపుదారుని పాన్
  • టీడీఎస్ సర్టిఫికెట్ నెంబర్
  • ఆర్థిక సంవత్సరం
  • ఇన్కమ్ సోర్స్ (ఆదాయ వనరు)
  • సర్టిఫికెట్ ప్రకారం టీడీఎస్ అమౌంట్

3. “వ్యాలీడేట్” మీద క్లిక్ చేయండి.

4. టీడీఎస్ సర్టిఫికెట్ ను మరోసారి డౌన్లోడ్ చేసేందుకు సంబంధించిన డేటాను అందించండి -

  • పాన్
  • TAN
  • ఆర్థిక సంవత్సరం
  • క్వార్టర్
  • రిటర్న్ రకం

ఇప్పుడు ‘‘డౌన్లోడ్ లకు వెళ్లు’’ మీద క్లిక్ చేయండి.

'టీడీఎస్ సర్టిఫికెట్' ఆప్షన్ అనేది డీడక్టీ ఎలా ఉపయోగపడుతుంది?

టీడీఎస్ సర్టిఫికెట్ మీ నుంచి తీసుకున్న అమౌంట్ ప్రభుత్వానికి డిపాజిట్ చేసిందని నిర్దారిస్తుంది. కావున మీరు సంబంధిత పత్రాన్ని ప్రదర్శించడం ద్వారా సమయానికి టీడీఎస్ రిటర్న్ క్లయిమ్ చేయొచ్చు.

టీడీఎస్ ఆలస్యమైనా లేక ఫైలింగ్ చేయకపోయినా పెనాల్టీ నిబంధనలు ఏమిటి?

ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే

ట్యాక్స్ ఫైల్ చేయకపోవడం శిక్షార్హమైన నేరం. ఏదేమైనా లేట్ పేమెంట్ కు పెనాల్టీ విధించబడుతుంది. ఆలస్యంగా చెల్లింపు చేస్తే జరిమానా 200. మీ డేట్ అయిపోయిన నుంచి మీరు చెల్లించే వరకు. లేట్ ఫీ అనేది మీరు చెల్లించల్సిన మొత్తం అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటే ఫైన్ అనేది టీడీఎస్ అమౌంట్ కి సమానంగా వేస్తారు.

ఉదాహరణకు మీరు చెల్లించాల్సిన టీడీఎస్ అమౌంట్ రూ. 5000 గడువు తేదీ మే 20. మీరు నవంబర్ 24న క్వార్టర్ 1 రిటర్న్ ని ఫైల్ చేశారు. మీరు 105 రోజులు ఆలస్యం అయ్యారు.

₹200 X 105 రోజులు = ₹21000.

 మీరు చెల్లించాల్సిన టీడీఎస్ మొత్తం రూ. 5000 ఇది రూ. 21000 కంటే తక్కువ. కాబట్టి మీరు కేవలం రూ 5000ను పెనాల్టీ గా చెల్లించాలి.

టీడీఎస్ లేట్ డిపాజిట్ కోసం[మూలం]

టీడీఎస్ అనేది సరైన సమయం లో డిడక్ట్ చేయబడినా కానీ డిపాజిట్ చేయడంలో విఫలం అయితే మీరు టీడీఎస్ చెల్లించే తేదీ వరకు టీడీఎస్ అమౌంట్ పై నెలకు 1.5 శాతం ఇంట్రెస్ట్ విధించబడుతుంది.

టీడీఎస్ పూర్తిగా డిడక్ట్ చేయబడకపోతే టీడీఎస్ తీసివేయబడిన తేదీ నుంచి అసలు తగ్గింపు తేదీ వరకు నెలకు 1 శాతం ఇంట్రెస్ట్ విధించబడుతుంది.

ఎటువంటి పరిస్థితులలో టాక్స్ పేయర్ లు వర్తించే టీడీఎస్ కు రీఫండ్ లేదా తగ్గింపును క్లయిమ్ చేసుకోవచ్చు?

  • టోటల్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన స్లాబ్ లో లేదు.
  • టీడీఎస్ చెల్లింపు అనేది ట్యాక్స్ చెల్లించే లయబిలిటీ కంటే ఎక్కువ.
  • ప్రస్తుత నెలలో టాక్స్ పేయర్ ఆదాయం కోల్పోయారు.
  • గత సంవత్సరం వచ్చిన నష్టాలను ప్రస్తుత సంవత్సరం ముందుకు తీసుకెళ్లారు.
  • టాక్స్ పేయర్ ట్యాక్స్ మినహాయింపు కు అర్హుడు.

మీరు ఫారం 15G/15H సమర్పించడం ద్వారా టీడీఎస్ డిడక్షన్ నివారించవచ్చు. రీఫండ్ క్లయిమ్ చేయడానికి లేదా టీడీఎస్ తగ్గించకుండా ఉండేందుకు ఫారం 13ని సమర్పించవచ్చు.

ప్రతి టాక్స్ పేయర్ అసలు టీడీఎస్ అంటే ఏమిటి మరియు గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు ఎందుకు రిటర్న్ ఫైల్ చేయాలని తెలుసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు ను అంతరాలు లేకుండా చెల్లించడం కోసం ఇది ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది.

తరచూ అడిగే ప్రశ్నలు

సాలరీ మీద టీడీఎస్ రేట్ ఎంత?

సాలరీ మీద టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లను బట్టి ఉంటుంది. వర్తించే రేట్ అనేది సెస్ తో పాటు సాలరీ మీద ఎఫెక్ట్ అవుతుంది.

సాలరీ యొక్క CTC అమౌంట్ పై టీడీఎస్ ప్రభావం చూపుతుందా?

మీ సాలరీ లోని ప్రాథమిక మరియు డియర్‌నెస్ అలవెన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది వర్తిస్తుంది. టీడీఎస్ అనేది మీ ట్యాక్స్ లయబిలిటీ స్లాబ్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల CTCపై టీడీఎస్ అనేది ఎఫెక్టివ్ గా ఉండదు.