డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

87A ఇన్కమ్ టాక్స్ సెక్షన్ ద్వారా ఇచ్చే పన్ను రాయితీ

1961 ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ అనేది వ్యక్తులు వారి ట్యాక్స్ లయబిలిటీ లను తగ్గించుకునేందుకు పన్ను మినహాయింపులను అందించే అనేక నిబంధనలను కలిగి ఉంటుంది. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లోని సెక్షన్ 87A కూడా అటువంటి ఒక నిబంధనే. వ్యక్తులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5,00,000 కంటే తక్కువ ఆదాయాన్ని సంపాధించినపుడు వారు సెక్షన్ 87A కింద పన్ను రాయితీని ఎంజాయ్ చేయొచ్చు. అర్హత గల అభ్యర్థులు రూ. 12,500 వరకు ట్యాక్స్ రాయితీని లేదా అసెస్‌మెంట్ ఇయర్ లో చెల్లించాల్సిన మొత్తం పన్ను లేదా ఏది తక్కువైతే అది క్లయిమ్ చేసుకోవచ్చు. (సెస్ యాడ్ చేయకముందు).

దీని గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటే ఈ ఆర్టికల్ చదువుతూ ఉండండి!

సెక్షన్ 87A కింద ట్యాక్స్ రాయితీలు పొందేందుకు అందుబాటు లో ఉన్న అర్హత ప్రమాణాలు ఏమిటి?

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్‌లో సెక్షన్ 87A కింద అందుబాటు లో ఉన్న ట్యాక్స్ రాయితీల నిబంధనలను మార్చలేదు.

సెక్షన్ 87A కింద అందుబాటు లో ఉన్న ట్యాక్స్ రాయితీలను పొందేందుకు వ్యక్తులు ఈ కింది అర్హత ప్రమాణాలు పాటించాలి:

  • ట్యాక్స్ పేయర్ ఇండియన్ పౌరుడై ఉండాలి.
  • చాప్టర్ VI-A కింద పేర్కొన్న విధంగా ఒక వ్యక్తికి సెక్షన్ 80D, 80C, మొదలైన వాటి కింద మినహాయింపులు లభించిన తర్వాత నికర ట్యాక్స్ చెల్లించే ఆదాయం రూ. 5,00,000 కంటే తక్కువగా ఉండాలి.
  • ఎవరైతే (60 సంవత్సరాల లోపు) 60 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉండే సీనియర్లు 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సెక్షన్ కింద ట్యాక్స్ క్లయిమ్ చేసుకునేందుకు అర్హులు.
  • 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న సూపర్ సీనియర్ ఇండియన్ రెసిడెంట్స్ ఈ సెక్షన్ కింద ట్యాక్స్ రాయితీని క్లయిమ్ చేసుకునేందుకు అర్హులు కారు.
  • అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 నుంచి సెక్షన్ 87A కింద గరిష్టంగా రూ. 25,000 వరకు రాయితీ అనుమతించబడుతుంది. సెక్షన్ 115BAC (1A) కింద రూ. 7,00,000 వరకు ఆదాయం ఉంటే కొత్త ట్యాక్స్ స్కీమ్ ను ఎంచుకునే ఎవరైనా.

అంతే కాకుండా ఆరోగ్యం మరియు విద్య సెస్ లో 4 శాతం యాడ్ చేసే ముందు ఆ అసెస్‌మెంట్ ఇయర్ కు చెల్లించాల్సిన ట్యాక్స్ కు పన్ను రాయితీ వర్తిస్తుంది.

[మూలం 1]

[మూలం 2]

సెక్షన్ 87A కింద ట్యాక్స్ రాయితీని క్లయిమ్ చేసుకునే వారి మీద ఉండే లయబిలిటీ లు

సెక్షన్ 87A కింద వ్యక్తులు ట్యాక్స్ లయబిలిటీ లకు వ్యతిరేఖంగా పన్ను రాయితీలు పొందొచ్చు:

  • వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం ఈ సెక్షన్ కింద ట్యాక్స్ మినహాయింపును క్లయిమ్ చేసుకోవచ్చు.
  • వ్యక్తి కింది ఆదాయాల కింద ట్యాక్స్ రాయితీని క్లయిమ్ చేసుకోవచ్చు:
  • సెక్షన్ 112 కింద పేర్కొన్న దీర్ఘకాలిక క్యాపిటల్ లాభాలు - ఒక వ్యక్తి ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లు లేదా లిస్టెడ్ ఈక్విటీ షేర్లు కాకుండా ఇతర క్యాపిటల్ ఆస్తులు అమ్మినపుడు ఇది వర్తిస్తుంది. వ్యక్తులు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లు, షేర్స్ మీద, LTCG మీద పే చేసే ట్యాక్స్ అడ్జస్ట్ చేయలేరు.
  • సెక్షన్ 111A కింద పేర్కొన్న స్వల్వకాలిక క్యాపిటల్ లాభాలు- ఇది ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లు మరియు లిస్టెడ్ ఈక్విటీ షేర్లకు వర్తిస్తుంది. స్వల్ప కాలిక మూలధన లాభం మీద ఫ్లాట్ 15 శాతం రేట్ తో ట్యాక్స్ విధించబడుతుంది.

[మూలం]

సెక్షన్ 87A కింద పన్ను రాయితీని క్లయిమ్ చేసే విధానం ఏమిటి?

సెక్షన్ 87A కింద ట్యాక్స్ రాయితీ పారమితి ఏమిటో తెలుసుకునేందుకు వ్యక్తులు ఈ ట్యాక్స్ రిబేట్ పద్ధతులను గురించి తెలుసుకోవాలి.

కావున ఈ కింది ప్రక్రియను పరిశీలించండి:

  • స్టెప్ 1: వ్యక్తులు వారి స్థూల వార్షిక ఆదాయాన్ని అంచనా వేయాలి.
  • స్టెప్ 2: మొత్తం ట్యాక్స్ చెల్లించాల్సిన నికర ఆదాయాన్ని పొందేందుకు పన్ను మినహాయింపు కింద క్లయిమ్ చేసుకోగలిగే ఇన్వెస్టింగ్ మొత్తాలను తీసేస్తే సరిపోతుంది.
  • స్టెప్ 3: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లను ఫైల్ చేస్తున్నపుడు పన్ను మినహాయింపు మరియు గ్రాస్ ఇన్కమ్ పేర్కొనండి.
  • స్టెప్ 4: నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి మొత్తం ఆదాయం రూ. 5,00,000 కంటే తక్కువగా ఉంటే లేకుంటే, (ఆర్థిక సంవత్సరం (A.Y) 24-25 కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం ప్రకారం రూ. 7,00,000 కంటే తక్కువైతే) మీరు సెక్షన్ 87A కింద పన్ను రాయితీని క్లయిమ్ చేసుకోవచ్చు.

ITA యొక్క సెక్షన్ 87A కింద పన్ను రాయితీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి?

 

సెక్షన్ 87A కింద క్లయిమ్ ప్రాసెస్ గురించి తెలుసుకునేందుకు ఈ సరళమైన ఉదాహరణను పరిశీలించండి:

మిస్టర్ అలోక్ 60 సంవత్సరాల లోపు ఉన్నారు. ఆయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,50,000 వార్షిక ఆదాయం పొందారు. అతడు పాత పన్ను విధానంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతడు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందేందుకు వివిధ స్కీమ్ లలో రూ. 1,50,000 ఇన్వెస్టింగ్ చేశాడు. అందువల్ల 2022-2023 ఆర్థిక సంవత్సరంలో డిడక్షన్ తర్వాత అతడికి నికర పన్ను విధించగల ఆదాయం రూ. 5,00,000.

సెక్షన్ 87A కింద వ్యక్తులు రూ. 12,500 వరకు, లేదా మొత్తం ట్యాక్స్ చెల్లించిన అమౌంట్ నుంచి మినహాయింపును క్లయిమ్ చేసుకోవచ్చు. ఏది తక్కువగా ఉంటే అది. కావున నిర్దేశిత సంవత్సరంలో చెల్లించాల్సిన మొత్తం ట్యాక్స్:

వివరాలు అమౌంట్
గ్రాస్ వార్షిక ఆదాయం ₹ 6,50,000
మినహాయింపు: సెక్షన్ 80C* కింద డిడక్షన్ ₹ 1,50,000
ట్యాక్స్ కట్టాల్సిన ఆదాయం (డిడక్షన్ తర్వాత) ₹ 5,00,000
2022-23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ (రూ. 2,50,000-రూ. 5,00,000 మధ్య ఆదాయం కొరకు 5శాతం) ₹ 12,500
డిడక్షన్: 87A కింద ట్యాక్స్ తగ్గింపు ₹ 12,500
2022-23 అసెస్‌మెంట్ ఇయర్ లో చెల్లించాల్సిన పూర్తి ట్యాక్స్ NIL
ఆరోగ్యం మరియు విద్య సెస్ లో 4 శాతం జోడించండి -

*కేవలం 80C మాత్రమే కాకుండా వ్యక్తులు 80D, 80CCD సెక్షన్లను కూడా డిడక్షన్ కొరకు ఉపయోగించుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇన్వెస్టింగ్ పెట్టినపుడు సెక్షన్ 80D కింద, ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టినపుడు సెక్షన్ 80CCD కింద క్లయిమ్ చేసుకోవచ్చు. అదే సమయం లో ఇతర డిడక్షన్ లతో పాటు వారు అర్హత కలిగిన విరాళాలపై సెక్షన్ 80G కింద కూడా పన్ను మినహాయింపు లు పొందొచ్చు.

FY (ఆర్థిక సంవత్సరం) 2022-23 నుంచి 2013-14 వరకు గరిష్ట ట్యాక్స్ రాయితీ లిమిట్ ఎంత?

 

ప్రతి ఆర్థిక సంవత్సరంలో నికర ట్యాక్స్ విధించగలిగే ఆదాయంతో పాటు గరిష్ట పన్ను ప్రయోజనం పొందే ఆదాయం లిమిట్ గురించి ఈ పట్టిక వివరిస్తుంది:

ఆర్థిక సంవత్సరం నికరంగా పన్ను విధించదగిన ఆదాయం సెక్షన్ 87A కింద ట్యాక్స్ మినహాయింపు లిమిట్
2021-2022 ₹ 5,00,000 ₹ 12,500
2020-2021 ₹ 5,00,000 ₹ 12,500
2019-2020 ₹ 5,00,000 ₹ 12,500
2018-2019 ₹ 3,50,000 ₹ 2,500
2017-2018 ₹ 3,50,000 ₹ 2,500
2016-2017 ₹ 5,00,000 ₹ 5,000
2015-2016 ₹ 5,00,000 ₹ 2,000
2014-2015 ₹ 5,00,000 ₹ 2,000
2013-2014 ₹ 5,00,000 ₹ 2,000

 

పైన పేర్కొన్న ఈ విషయాలను పాటించడం ద్వారా సెక్షన్ 87A కింద ట్యాక్స్ భారాన్ని తగ్గించుకునేందుకు వీలుపడుతుంది. ప్రాసెస్ సులభంగా పూర్తి అవుతుంది.

[మూలం]

తరచూ అడిగే ప్రశ్నలు

HUF (హిందూ అవిభాజ్య కుటుంబం) మరియు సంస్థలు సెక్షన్ 87A కింద ట్యాక్స్ రాయితీని క్లయిమ్ చేసుకునేందుకు అర్హులా?

లేదు. సెక్షన్ 87A కింద ఇండియాలో నివాసి అయిన రెసిడెంట్స్ మాత్రమే ట్యాక్స్ రాయితీలను క్లయిమ్ చేసుకోవచ్చు.

పాత మరియు కొత్త ట్యాక్స్ విధానాలు రెండింటిలో సెక్షన్ 87A వర్తిస్తుందా?

అవును. పాత మరియు కొత్త ట్యాక్స్ విధానాలు రెండింటిలో సెక్షన్ 87A చెల్లుబాటు అవుతుంది.

సెక్షన్ 87A కింద ట్యాక్స్ రాయితీని కంప్యూట్ చేస్తున్నపుడు సర్ చార్జీ విధించబడుతుందా?

లేదు, వ్యక్తులు సెక్షన్ 87A కింద ట్యాక్స్ రాయితీ కోసం క్లయిమ్ చేసినపుడు నికర పన్ను ఆదాయం రూ. 5 లక్షల లోపు (24-25 A. Y (వార్షిక సంవత్సరం) కొత్త ట్యాక్స్ విధానం అయితే రూ. 7 లక్షల లోపు) నికర పన్ను విధించదగిన ఆదాయాన్ని సంపాదించాలి. అతను లేదా ఆమె రూ. 50 లక్షల కంటే ఎక్కువ రూ. 1 కోటి కంటే తక్కువ ఆదాయం ఆర్జిస్తే సర్ చార్జీ విధించబడుతుంది.