ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెనాల్టీ ఏమిటి?
మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లను ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే లేట్ చెల్లింపులు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లోని వివిధ సెక్షన్ ల కింద వేరు పెనాల్టీలకు దారి తీస్తాయి.
వర్తించే ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే వివిధ సెక్షన్ ల కింద పడే అన్ని పెనాల్టీల గురించి వివరించాం. మీకు ఏది వర్తిస్తుందో మరియు చెల్లింపును ఎలా క్లియర్ చేయాలో అర్థం చేసుకునేందుకు చదువుతూ ఉండండి.
ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే ఉండే సెక్షన్ వైజ్ పెనాల్టీలు ఏమిటి?
ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుచేయడం వల్ల మీరు ఎదుర్కొనే వివిధ రకాల చార్జీల గురించి ఈ కింది టేబుల్ లో తెలుసుకోండి.
సెక్షన్లు | నేరం యొక్క స్వభావం | విధించే పెనాల్టీ |
సెక్షన్ 234F | ఐటీఆర్ ను గడువు తేదీ దాటిన తర్వాత ఫైల్ చేస్తే | అసెస్‌మెంట్ ఇయర్ డిసెంబర్ 31లోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ. 5000 అసెస్‌మెంట్ ఇయర్ మార్చి 31లోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ. 10,000. రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారి కోసం. తక్కువ ఆదాయం ఉన్నవారికి జరిమానా రూ. 1000. |
సెక్షన్ 234A | ఒక వ్యక్తి గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలం అయితే అతడు అవుట్ స్టాండింగ్ అన్ పెయిడ్ ట్యాక్స్ కలిగి ఉంటాడు. | నిర్ణీత గడువు తేదీ నుంచి చెల్లించాల్సిన ట్యాక్స్ అమౌంట్ పై 1 శాతం వడ్డీ లేదా నెలలో కొంత భాగం చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ఇంట్రెస్ట్ |
సెక్షన్ 271H | ఇచ్చిన గడువు తేదీలోపు టీడీఎస్ మరియు TCS రిటర్న్ లు ఫైల్ చేయడంలో వైఫల్యం | రూ. 10,000-రూ. 1,00,000 కట్టాల్సి ఉన్నపుడు లేట్ దాఖలు చేస్తే సెక్షన్ 234E కింద పెనాల్టీ రోజుకు రూ. 200 టీడీఎస్/TCS చెల్లించే వరకు |
సెక్షన్ 270A | ట్యాక్స్ కట్టాల్సిన ఇన్కమ్ ఉన్న వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలం అయినా లేక రిటర్న్ లలో తప్పుడు రిపోర్ట్ చేర్చినా | ఎటువంటి రిటర్న్ అందించని ఆదాయంపై చెల్లించాల్సిన ట్యాక్స్ లో 50 శాతం |
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లను ఫైల్ చేయకపోవడం లేదా ఆలస్యంగా ఫైల్ చేసినట్లయితే టాక్స్ పేయర్ కు పడే పెనాల్టీ ఏమిటి?
గడువు తేదీ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లు దాఖలు చేయకపోతే పడే పెనాల్టీల జాబితా కేటగిరీల వారీగా ఇక్కడ ఉంది.
- సాలరీ పొందిన వ్యక్తులు: ఇక్కడ మూడు కేటగిరీలకు చెందిన వ్యక్తులు పరిగణించబడతారు.
- రూ. 2.5 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్నవారు: వారికి ఎటువంటి పెనాల్టీ లేదు (రిటర్న్ లు ఫైల్ చేయకపోతే ఎటువంటి ఐటీఆర్ పెనాల్టీ లేదు)
- మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ: పెనాల్టీ రూ. 1000 దాటకూడదు
- రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తం వార్షిక ఆదాయం: రూ. 10,000 వరకు
- కంపెనీలు: రూ. 10,000 వరకు
- స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు: రూ. 10,000 వరకు
- సీనియర్ సిటిజన్లు: సెక్షన్ 234F కింద ఐటీఆర్ ఫైల్ చేయకపోతే పడే పెనాల్టీ ఈ ప్రమాణాలు ఉన్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తించే అవకాశం ఉంది.
- మొత్తం వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే ఎక్కువగా ఉన్న 60-80 మధ్య వయసువారు.
- మొత్తం వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు.
ట్యాక్స్ విధించే లిమిట్ ను మించకుండా గ్రాస్ సాలరీలు కలిగిన ఇండివిజువల్స్ చాలా మంది ఉన్నారు. మీరు కూడా వారిలో ఒకరైతే ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినందుకు పెనాల్టీ మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇక్కడ ఉంది. దానికి కూడా మా దగ్గర సమాధానం ఉంది.
పన్ను చెల్లించే లిమిట్ కంటే తక్కువ ఆదాయ ఉన్న వారు కూడా లేట్ ఐటీఆర్ పెనాల్టీని చెల్లించాల్సిన అవసరం ఉందా?
సాధారణంగా మినహాయింపు లిమిట్ కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఎటువంటి పెనాల్టీ విధించదు. యూనియన్ బడ్జెట్ 2019, 2020-21 వార్షిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో సవరణలు ప్రవేశపెట్టింది. ట్యాక్స్ చెల్లించే ఆదాయం లేనప్పటికీ ఈ పరిస్థితులకు సరిపోయే టాక్స్ పేయర్ లు మ్యాండేట్ గా ఐటీఆర్ ఫైల్ చేసేలా చట్టం తీసుకొచ్చింది.
- రూ. 1 లక్షకు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం కోసం ఖర్చు చేసిన వారు
- విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసిన వ్యక్తులు
- బ్యాంక్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ అకౌంట్ లలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారు
- భారతీయ నివాసి అయినప్పటికీ విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నవారు.
ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో చేర్చిన సవరణల ఆధారంగా ఈ షరతులకు సమానంగా ఉండి ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లింపు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే పేర్కొన్నట్లుగా ట్యాక్స్ విధించే గ్రాస్ ఇన్కమ్ లేనివారికి కూడా ఇది వర్తిస్తుంది.
ఐటీఆర్ ను ఫైల్ చేయడంలో మిమ్మల్ని ఎటువంటి షరతులు (పరిస్థితి) బాధ్యులుగా చేస్తుందో మీకు తెలుసు. మీరు నిర్ణీత గడువులోగా రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎటువంటి పెనాల్టీ చెల్లించుతారో కూడా ఇప్పుడు తెలుసుకోండి.
ఐటీఆర్ పెనాల్టీ ఎలా చెల్లించాలి?
అటు ఆన్ లైన్ ఇటు ఆఫ్ లైన్ ప్రక్రియల ద్వారా మీరు లేట్ గా ఐటీఆర్ ఫైల్ చేసినందుకు పడే పెనాల్టీని క్లియర్ చేయొచ్చు. ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ను ఫైల్ చేయనందుకు పడే పెనాల్టీని ఎలా క్లియర్ చేయాలో ప్రక్రియ ఇక్కడ ఉంది.
ఆన్ లైన్ ప్రాసెస్
స్టెప్ 1: అఫిషియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ ను సందర్శించండి.
స్టెప్ 2: లెఫ్ట్ కాలమ్ లో ఉన్న “ఈ-పే ట్యాక్స్” మీద క్లిక్ చేయండి’’
స్టెప్ 3: మీరు చెల్లింపు చేసేందుకు ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ కు మళ్లించబడుతున్నారని తెలిపే మెసేజ్ విండో ప్రదర్శించబడుతుంది. ఇతర బ్యాంక్ ల కోసం ప్రోటీన్ (గతంలో ఎన్ఎస్డీఎల్) ట్యాక్స్ చెల్లింపు పేజ్ కు వెళ్లేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ లో ఉన్న కొత్త పేజీకి మీరు మళ్లించబడతారు. మీకు అక్కడ “నాన్-టీడీఎస్/TCS కింద మల్టీపుల్ చలాన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.” చలాన్ నెంబర్ /ITNS 280 కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి”
స్టెప్ 5: నెక్స్ట్ పేజ్ మీరు చెల్లింపు కోసం పూరించాల్సిన ఫారంను ప్రదర్శిస్తుంది.
స్టెప్ 6: మీరు వ్యక్తిగత టాక్స్ పేయర్గా ఐటీఆర్ ఫైల్ చేయనందుకు పెనాల్టీ చెల్లిస్తున్నట్లయితే ట్యాక్స్ అప్లికేబుల్ కోసం “(0021) ఎంచుకోండి. (కంపెనీలు కాకపోతే). తర్వాత, చెల్లింపు రకంలో “(300) సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్” ను ఎంచుకుని కిందికి స్క్రోల్ చేయండి.
స్టెప్ 7: ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ మరియు డెబిట్ కార్డ్ మోడ్ ల నుంచి ఎంచుకోండి. ఎటువంటి సందర్భంలోనైనా డ్రాప్ డౌన్ మెనూ నుంచి బ్యాంక్ ను ఎంచుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను నమోదు చేయండి. మరియు సరైన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
స్టెప్ 8: తర్వాత మీ చిరునామా డిటెయిల్స్, ఈమెయిల్ ఐడీ, మరియు మొబైల్ నంబర్ వంటి వాటిని పూరించండి. సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద నొక్కండి.
ఆఫ్ లైన్ ప్రాసెస్
మీరు ఐటీఆర్ లేట్ ఫీజును ఆఫ్ లైన్ లో కూడా చెల్లించొచ్చు. అందుకోసం కింది స్టెప్ లు ఫాలో అవండి.
స్టెప్ 1: ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్లండి.
స్టెప్ 2: హోమ్ పేజీలో ఉన్న టాప్ మెనూ నుంచి “ఫారం లు/డౌన్లోడ్ లు” ఎంచుకోండి. డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న చలాన్స్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: నెక్స్ట్ పేజీలో మీరు డౌన్లోడ్ చేయగలిగే చలాన్ ల జాబితా కనుగొంటారు. మీ అవసరాన్ని బట్టి “ITNS-280,” పక్కన ఉన్న “PDF” మరియు “పూరించగల్గిన ఫారం” దేనిమీదైనా క్లిక్ చేయండి.
స్టెప్ 4: డౌన్లోడ్ చేసిన ఫారం కింద ఇచ్చిన చిత్రం వలే కనిపిస్తుంది.
మీరు ఈ ఫారంను డౌన్లోడ్ చేయలేకపోతే మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించవచ్చు. కచ్చితమైన డిటెయిల్స్ తో ఈ ఫారం పూరించండి. తర్వాత అవసరమైన పెనాల్టీ అమౌంట్ కోసం ఫారంను సమర్పించండి. మీరు నగదు లేదా చెక్ ద్వారా చెల్లింపు చేయొచ్చు. రశీదుని కలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ చలాన్ అనేది చెల్లింపు రశీదుగా పని చేస్తుంది. తర్వాత చలాన్ ధృవీకరణ కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఈ పత్రాన్ని కలిగి ఉండకపోతే మీరు ఫైన్ చెల్లించారని ప్రూఫ్ ఉండదు. తర్వాత ఎదురయ్యే దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయకపోతే మీకు జైలు శిక్ష పడుతుందా?
గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలకు సంబంధించిన అనేక షరతులు ఇక్కడ విధించబడ్డాయి. ఒక టాక్స్ పేయర్ తన ఇన్కమ్ టాక్స్ ను అసెస్‌మెంట్ ఇయర్ కు ఫైల్ చేయడంలో విఫలం అయితే అతడు/ఆమె సెక్షన్ 142 (1), 148, లేదా 153A ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా నోటీసులు అందుకుంటారు. ఈ చర్యల తర్వాత కూడా సంబంధిత వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అతడు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ సెక్షన్ 276CC కింద ప్రాసిక్యూషన్ చేయబడతారు.
జైలు శిక్షకు సంబంధించిన ప్రత్యేకతలు కింది విధంగా ఉన్నాయి.
- రూ. 25 లక్షలకు మించిన ఆదాయం పన్ను ఎగవేత: ఐటీఆర్ ఫైల్ చేయనందుకు పెనాల్టీ పడొచ్చు. అంతే కాకుండా 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
- ఇతర కేసులకు: నిర్దేశించబడిన పెనాల్టీ ప్లస్ కనీసం 3 నెలల జైలు శిక్ష, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం.
ట్యాక్స్ రిటర్న్ ఆలస్యం అయితే ఎటువంటి పెనాల్టీలు విధిస్తారో ఇక్కడ సమగ్ర గైడ్ ఉంది. మీరు ఈ సారి సరైన సమయంలో ఫైల్ చేసినట్లయితే జరిమానాను క్లియర్ చేసినట్లు నిర్దారించుకోండి. మీకు ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని సమస్యల గురించి తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితిని నివారించేందుకు తదుపరి వార్షిక సంవత్సరంలో ఐటీఆర్ ను ముందస్తుగా ఫైల్ చేయండి.
తరచూ అడిగే ప్రశ్నలు
టాక్స్ పేయర్ లు సెక్షన్ 234A కింద ఐటీఆర్ ను ఆలస్యంగా ఫైల్ చేస్తే ఇంట్రెస్ట్ కి అదనంగా పెనాల్టీ చెల్లించాలా?
సెక్షన్ 234A కింద ఇంట్రెస్ట్ అనేది మీరు ఏదైనా ట్యాక్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటేనే విధించబడుతుంది. అలాగే మీరు అన్ని రకాల ట్యాక్స్ లను ముందుగా క్లియర్ చేయకుంటే మీరు ఆదాయపు పన్ను రిటర్న్ లను క్లయిమ్ చేయలేరు. కావున ఐటీఆర్ ను ఆలస్యంగా ఫైల్ చేస్తే జరిమానా వర్తించదు. ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల కలిగే పరిణామాలు చాలా లిటిట్ గా ఉంటాయి.
సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ ను ఆలస్యంగా ఫైల్ చేసినపుడు పెనాల్టీలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?
అవును యూనియన్ బడ్జెట్ 2021 ప్రకారం సీనియర్ సిటిజన్లు ఈ ప్రమాణాలకు అనుగణంగా ఉంటే వారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ విషయంలో మినహాయింపు లభిస్తుంది.
- వారు 75 సంవత్సరాల పైబడిన వారు.
- వారి ఆదాయ వనరులు పెన్షన్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ ల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే.
- అలాగే పెన్షన్ డిపాజిట్ చేసిన అదే ఆర్థిక సంస్థ నుంచి ఇంట్రెస్ట్ తప్పనిసరిగా సంపాదించాలి.
- సంబంధిత వ్యక్తులు తమకు సంబంధించిన ఆర్థిక సంస్థలకు అవసరం అయిన డిటెయిల్స్ చెబుతూ డిక్లరేషన్ సమర్పించాలి.
- మీరు పేర్కొన్న ఆర్థిక సంస్థ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన లిస్ట్ లో ఉండాలి.
ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఐటీఆర్ ఫైల్ చేయనందుకు పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా వారు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దానిని వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి కట్ చేస్తారు.
ఐటీఆర్ దాఖలు చేయనుందుకు సెక్షన్ 276CC ప్రకారం ప్రాసిక్యూషన్ కు ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?
అవును. కింది కండీషన్స్ ప్రకారం ఉన్న ముదింపుదారులు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లోని సెక్షన్ 276CC కింద ఉన్న నిబంధనలను పాటించకపోవచ్చు.
- ట్యాక్స్ పేయర్ AY (వార్షిక సంవత్సరం) ముగిసేలోపు ఐటీఆర్ అందజేస్తాడు.
- ఒక వ్యక్తిగత ట్యాక్స్ పేయర్ చెల్లించాల్సిన అతని/ఆమె ఇన్కమ్ మీది టోటల్ ట్యాక్స్ అమౌంట్ టీడీఎస్ మరియు అడ్వాన్స్డ్ ట్యాక్స్ కాకుండా రూ. 10,000 మించదు.