ఆయుష్మాన్ భారత్ యోజన PMJAY
భారత రాజ్యాంగం స్థానికులకు ఉచిత ఆరోగ్య సంరక్షణను వాగ్దానం చేసినప్పటికీ, వారిలో ఎంతమందికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల మధ్య, ఆర్ధిక కొరత కారణంగా ప్రజలు తగిన చికిత్స పొందేందుకు తరచుగా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడంతో ఆరోగ్య సంరక్షణ దృశ్యం మారిపోయింది. ఉదాహరణకు, ఆయుష్మాన్ భారత్ యోజన అని కూడా పిలువబడే ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) వంటి ప్రభుత్వ-మద్దతుగల ఆరోగ్య రక్షణ పథకాలు, వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఆర్థిక కవరేజీని అందిస్తాయి.
మరి, రెండవ వరుస మరియు మూడవ వరస సంరక్షణ సేవలను కోల్పోయిన భారతదేశ జనాభాలో 40% మందికి ఇది ఖచ్చితంగా ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? (1)
మరింత తెలుసుకోవడానికి చదవండి!
PMJAYతో అనుబంధించబడిన లక్షణాలు మరియు ప్రయోజనాలు ఏమిటి?
భారతదేశం యొక్క మొత్తం జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ఆర్థిక కొరత కారణంగా సరైన చికిత్స అందడం లేదు. PMJAY వారికి సరైన ఆరోగ్య సేవలను పొందడంలో సహాయం చేయడం మరియు విపరీతమైన వైద్య ఖర్చులను నివారించడం, చివరికి మధ్యతరగతి జనాభా పేదరికాన్ని నివారించడంలో సహాయం చేయడం మరియు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
కాబట్టి, ఈ ప్రభుత్వ-మద్దతు గల హెల్త్ ఇన్సూరెన్స్ పథకం నుండి మీరు ఆశించే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- ఈ పథకం కింద లబ్ధిదారుని కుటుంబం సంవత్సరానికి రూ.5 లక్షల ప్రయోజన కవరేజీని పొందుతారు.
- ఈ పథకం గది ఛార్జీలు, డాక్టర్ ఫీజులు, రోగనిర్ధారణ సేవలు, చికిత్స ఖర్చు, ఐసియు మరియు ఆపరేషన్ థియేటర్ ఖర్చులు మొదలైన వాటితో సహా దాదాపు 1393 విధానాలకు కవరేజీని అందిస్తుంది.
- లబ్ధిదారుడు భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సదుపాయాల కోసం క్లయిమ్ చేయవచ్చు.
- ఈ పథకం కింద, మీరు 3 రోజుల పాటు ఆసుపత్రిలో చేరేముందు కవర్ మరియు 15 రోజుల పాటు ఆసుపత్రిలో చేరిన తర్వాత కవర్ పొందుతారు. ఆ సమయంలో, రోగి మందులు మరియు రోగనిర్ధారణకు పూర్తి కవరేజీని కూడా పొందుతారు.
ఈ పథకం యొక్క గొప్ప ప్రయోజనాల్లో ఒకటి, వారి లింగం, వయస్సు లేదా కుటుంబ పరిమాణం ఆధారంగా ఈ ప్రయోజనాలను పొందేందుకు ఇది ఎవరినీ పరిమితం చేయదు. అయితే, ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సూచించిన IDని చేతిలో ఉంచుకోవాలి.
ఆయుష్మాన్ భారత్ యోజనకు ఎవరు అర్హులు?
ఈ ప్రయోజనాలను సమాజంలోని ఆర్థికంగా సవాలుగా ఉన్న వర్గాలకు విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది కాబట్టి అర్హత ప్రమాణాలు కొంచెం కఠినమైనవి. కాబట్టి, ఈ జాతీయ ఆరోగ్య పరిరక్షణ విధానం యొక్క క్రింది అర్హత ప్రమాణాలను పరిశీలించి, దాని ప్రయోజనాలను పొందేందుకు మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోండి:
PMJAY పథకం కింద ఆరోగ్య కవరేజీని పొందే వారు ఈ క్రింది విధంగా ఉన్నారు:
పట్టణ ప్రాంతాల్లో:
ప్రభుత్వం 11 వృత్తిపరమైన కేటగిరీలతో జాబితా తయారు చేసింది మరియు ఈ వర్గాల్లో భాగమైన వారు మాత్రమే ఆయుష్మాన్ భారత్ యోజనకు అర్హులు.
- ఎలక్ట్రీషియన్/రిపేర్ వర్కర్/మెకానిక్
- నిర్మాణ కార్మికుడు/ సెక్యూరిటీ గార్డు/ ప్లంబర్/ పెయింటర్/ మొదలైనవి.
- చాకలి వాడు/చౌకీదార్
- చెత్త ఏరుకునే వాడు
- బిచ్చగాడు
- గృహ కార్మికుడు
- డ్రైవర్/రవాణా కార్మికుడు/కండక్టర్లు మరియు దీనితో అనుబంధించబడిన ఇతర వ్యక్తులు
- వీధుల్లో పని చేస్తున్న చెప్పులు కుట్టేవాడు/ వీధి వ్యాపారులు/ అమ్మేవాడు/ ఇతర సర్వీస్ ప్రొవైడర్లు
- గృహ ఆధారిత కార్మికుడు/దర్జీ/కళాకారుడు
- డెలివరీ అసిస్టెంట్/షాప్ వర్కర్
గ్రామీణ ప్రాంతాల్లో:
- SC/ST కుటుంబ సభ్యులు
- శారీరకంగా వికలాంగ సభ్యులు ఉన్న కుటుంబాలు (కనీసం ఒకరు)
- 16 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుష వయోజన సభ్యులు లేని స్త్రీ నేతృత్వంలోని కుటుంబం
- చట్టబద్ధంగా విడుదలైన బంధిత కార్మికులు
- కేవలం మాన్యువల్ క్యాజువల్ లేబర్ మాత్రమే సంపాదనా మార్గం గా ఉన్న భూమి లేని కుటుంబాలు
- కచ్చా పైకప్పు మరియు గోడలతో ఒకే గది ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు
ఆయుష్మాన్ భారత్ యోజన కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం ఏమిటి?
SECC 2011 డేటా ద్వారా ఇప్పటికే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో భాగమైన అందరు గ్రహీతలు గుర్తించబడినందున ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక ప్రక్రియ లేదు. అర్హత ప్రమాణాలను తనిఖీ చేయడంతో పాటు, మీరు PMJAY వెబ్‌సైట్‌ని ఉపయోగించి స్కీమ్‌కు అర్హులో కాదో నేరుగా తనిఖీ చేయవచ్చు. మీరు చేయవలసినది ఇక్కడ ఇవ్వబడింది:
స్టెప్ 1: PMJAY యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌ని సందర్శించి, ‘యామ్ ఐ ఎలిజిబుల్’ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: ఇది వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను పంపేందుకు మీ కాంటాక్ట్ వివరాలను అడుగుతుంది.
స్టెప్ 3: ఈ వివరాలన్నింటినీ అందించిన తర్వాత, మీ రాష్ట్రాన్ని ఎంచుకొని ముందుకు సాగండి. PMJAY యొక్క లబ్ధిదారుల జాబితాలో మీ పేరును కనుగొనడానికి మరియు ఆ వైద్య ప్రయోజనాలు పొందవచ్చో లేదో ధృవీకరించడానికి, రేషన్ నంబర్/మొబైల్ నంబర్/పేరు/HHD నంబర్ మొదలైనవాటి ద్వారా శోధించండి.
దరఖాస్తు చేసేటప్పుడు మీరు సమర్పించాల్సిన అన్ని పత్రాలు ఏమిటి?
మీరు ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటుంటే, దాని యొక్క అన్ని ముఖ్యమైన ప్రయోజనాలను పొందడానికి, ఈ పత్రాలను సిద్ధం చేసుకోండి:
- కుల ధృవీకరణ పత్రం
- వయస్సు మరియు గుర్తింపు రుజువుగా పాన్ మరియు ఆధార్ కార్డ్
- ఆదాయ ధృవీకరణ పత్రం (గరిష్ట వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు)
- కుటుంబం యొక్క ప్రస్తుత స్థితి (ఉమ్మడి/అణు) మరియు దానికి మద్దతుగా మీరు సమర్పించే పత్రము
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఎలా పొందాలి?
PMJAY పథకం కింద పేపర్‌లెస్, క్యాష్‌లెస్ మరియు పోర్టబుల్ లావాదేవీల సౌలభ్యాన్ని పొందడానికి లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ యోజన గోల్డెన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేగవంతమైన మరియు అవాంతరాలు లేని సేవను పొందడానికి మీరు కేవలం ఆసుపత్రిలో కార్డును చూపించాల్సి ఉంటుంది.
కార్డ్‌ని పొందే ప్రక్రియ ఇక్కడ ఇవ్వబడి ఉంది:
స్టెప్ 1: PMJAY యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు లాగిన్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించండి.
స్టెప్ 2: క్యాప్చా కోడ్‌ని నమోదు చేయడం ద్వారా OTPని జెనెరేట్ చెయ్యండి మరియు HHD కోడ్ కోసం చూడండి.
స్టెప్ 3: ఆ తర్వాత, మీరు CSC లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కి HHD కోడ్‌ను అందించాలి, ఇక్కడ ఆయుష్మాన్ మిత్ర లేదా CSC ప్రతినిధులు ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో మీకు సహాయం చేస్తారు.
ఇంకా, మీరు కార్డును పొందేందుకు మరియు అన్ని ఆయుష్మాన్ కార్డ్ ప్రయోజనాలను వినియోగించుకోవడానికి రూ.30 చెల్లించవలసి ఉంటుంది.
PMJAY లబ్ధిదారుల జాబితాలో మీ పేరును మీరు ఎలా తనిఖీ చేస్తారు?
PMJAY లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేయడానికి మీరు వివిధ పద్ధతులను ఉపయోగించవచ్చు. ముందే చెప్పినట్లుగా, మీరు స్కీమ్‌కు అర్హులా కాదా అని తనిఖీ చేయడానికి మీరు ఆన్‌లైన్ పోర్టల్‌ని ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ కాకుండా, మీరు ప్రయత్నించగల రెండు ఇతర అనుకూలమైన పద్ధతులు ఉన్నాయి:
- కామన్ సర్వీస్ సెంటర్ (CSC): హెల్త్‌కేర్ స్కీమ్‌కు మీ అర్హతను గుర్తించడానికి సమీపంలోని CSC లేదా ఏదైనా ఎంప్యానెల్ అయిన ఆసుపత్రిని కనుగొనండి.
- హెల్ప్‌లైన్ నంబర్‌లు: అవసరమైన మొత్తం సమాచారాన్ని పొందేందుకు మీరు 1800-111-565 లేదా 14555 హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా ఉపయోగించవచ్చు.
PMJAY కింద ఏయే జబ్బులు కవర్ చేయబడతాయి?
ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ చేయబడిన వ్యాధుల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
- కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్
- స్కల్ బేస్ సర్జరీ
- ముందరి వెన్నెముక స్థిరీకరణ
- డబుల్ వాల్వ్ భర్తీ
- ప్రోస్టేట్ క్యాన్సర్
- పల్మనరీ వాల్వ్ భర్తీ
- గ్యాస్ట్రిక్ పుల్-అప్‌తో లారింగోఫారింజెక్టమీ
- స్టెంట్‌తో కరోటిడ్ యాంజియోప్లాస్టీ
- కాలిన గాయాల తర్వాత వికృతీకరణ కోసం టిష్యూ ఎక్స్పాండర్
ఇప్పుడు, లబ్ధిదారులు ఈ పథకం కింద కోవిడ్-19 పరీక్ష మరియు చికిత్సను కూడా ఉచితంగా పొందవచ్చు.
ఈ పథకం చాలా క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక కవరేజీని విస్తరిస్తున్నప్పటికీ, మీరు తెలుసుకోవలసిన కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి:
- అవయవ మార్పిడి
- ఓపిడి
- వ్యక్తిగత రోగ నిర్ధారణ
- కాస్మెటిక్ సంబంధిత విధానాలు
- డ్రగ్ పునరావాస కార్యక్రమం
- సంతానోత్పత్తి సంబంధిత విధానాలు
ఎలాంటి ప్రీమియం ఖర్చు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు మరియు ఆర్ధిక కవరేజీతో, ఆయుష్మాన్ భారత్ యోజన పౌరులకు ఆదర్శవంతమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పటికే ఉన్న వ్యాధుల నుండి తీవ్రమైన వైద్య సమస్యల వరకు, ఇప్పుడు మీరు PMJAY పథకం కింద వాటన్నింటినీ నుండి పరిష్కారం పొందవచ్చు.
PMJAY గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
PMJAY పథకం 80 ఏళ్ల వృద్ధులకు కవరేజీని అందిస్తుందా?
అవును. ఈ పథకానికి నిర్దిష్ట వయస్సు ప్రమాణాలు లేవు కాబట్టి, 80 ఏళ్లు పైబడిన వారు కూడా ఆయుష్మాన్ యోజన నమోదు ప్రక్రియలో నమోదు చేసుకోవడం ద్వారా ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు.
వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో PMJAY లబ్ధిదారుడు ఎవరిని సంప్రదించాలి?
PMJAY ప్రతినిధులు లేదా ఆయుష్మాన్ మిత్ర ఎంపానెల్డ్ ఆసుపత్రిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు మరియు PMJAY పథకం కింద వైద్య సదుపాయాలను పొందడానికి లబ్ధిదారులు వారిని సంప్రదించవచ్చు.
గర్భిణీ స్త్రీలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందుబాటులో ఉందా?
PMJAY లేదా ఆయుష్మాన్ భారత్ యోజన కింద, గర్భిణీ స్త్రీలు రూ.5 లక్షల వరకు ఆర్థిక కవరేజీని పొందవచ్చు.
నేను ఆయుష్మాన్ యోజన కార్డ్ కలిగి ఉంటే నేను మరణ ప్రయోజనాలను పొందగలనా?
లేదు, PMJAY పథకం పాలసీదారుల లబ్ధిదారులకు మరణ ప్రయోజనాలను అందించదు.