హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా తగ్గించుకోవాలి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాదానికి గురై, అనారోగ్యం బారినపడి, లేదా కోవిడ్​-19 వలన ఆసుపత్రిలో చేరితే కవర్ చేస్తుంది. మీ డిజిట్ పాలసీని రెన్యూవల్ చేయండి.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించుకోవడం గురించి క్లుప్తంగా..

గత కొన్నేళ్లుగా మన భారతదేశంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగి పోతూ ఉన్నాయి. మెడికల్​ ద్రవ్యోల్బణం తారాస్థాయిలో ఉంది. దేశంలోని పేద మధ్య తరగతికి చెందిన ప్రజలు పెరిగిన ఈ వైద్య ఖర్చులను భరించేందుకు నానా తంటాలు పడుతున్నారు.

కానీ ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి?

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం.

మన భారతదేశంలో దాదాపు 34 బీమా కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. ప్రమాదం బారిన పడి లేదా అనారోగ్యం వలన ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులను ఈ బీమా ప్లాన్లు కవర్ చేస్తాయి. కానీ కొన్ని సార్లు ఈ పాలసీల కవరేజ్ అనేది సరిపోకుండా ఉంటుంది.

ఇటువంటి పరిస్థితిలో మీరు ఏం చేయాలో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునే 9 మార్గాలు

1. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని చిన్న వయసులోనే కొనుగోలు చేయండి.

ప్రీమియం చెల్లింపులను తగ్గించుకునేందుకు బాగా సరిపోయే విధానం మీరు చిన్న వయసులోనే ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం. దీని వలన మీ ప్రీమియం విలువ తగ్గుతుంది.

మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలని భావించినపుడు చాలా బీమా సంస్థలు మీ వయసు, మెడికల్ చరిత్రను తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే మీకు పాలసీని అందిస్తారు. మీకు పెద్ద వయస్సు వచ్చిన తర్వాత పాలసీని పొందడం చాలా కష్టమవుతుంది.

మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు వంటి వయసు సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే బీమా సంస్థలు మీ పాలసీ ప్రీమియాన్ని పెంచుతారు.

అందుకే తక్కువ ప్రీమియంతో పాలసీని తీసుకోవాలని నిర్ణయించుకుంటే మీరు చిన్న వయసులో ఉన్నపుడే పాలసీని తీసుకోవడం మంచిది. మీరు చాలా వయసు అయ్యాక పాలసీని తీసుకున్న దానికి దీనికి ప్రీమియం రేటులో చాలా తేడా ఉంటుంది.

 

మరింత తెలుసుకోండి.

2. తక్కువ బీమా మొత్తం గల పాలసీని ఎంచుకోండి

అందుకోసమే మీరు తక్కువ బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్) విలువతో బీమా పాలసీని పొందడం అవసరం. మీ ఆరోగ్యం సరిగ్గా ఉన్నపుడు మాత్రమే ఇలా ఎంచుకోవాలి. అందువలన మీ ప్రీమియం ధరలు చాలా తగ్గుతాయి.

పాలసీ ప్రారంభ దశలో మీరు తక్కువ ప్రీమియం పొందొచ్చు. అలాగే రోజులు గడిచే కొద్దీ మీరు బీమా మొత్తాన్ని పెంచుకుంటూ పోవచ్చు. ఈ విధంగా చేయడం వలన మీ పాలసీ తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది.

3. కో–పే, డిడక్టబుల్స్ ఎంచుకోండి

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో డిడక్టబుల్స్​ను ఎంచుకోవడం, కో-పే షరతులను ను ఎంచుకోవడం వలన మీ ప్రీమియం ధరను తగ్గించుకోవచ్చు.

వాటిని ఎంచుకునే ముందు అసలు అవేంటనేది ముందుగా మీరు తెలుసుకోండి.

కో పేమెంట్ డిడక్టబుల్ కో-ఇన్సూరెన్స్
మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్ చేసినపుడు ఆ ఖర్చులో కొంత భాగాన్ని మీరు భరించే విధంగా కో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. మీ చికిత్స ఖర్చులకు ఇన్సూరెన్స్ పాలసీ కంట్రిబ్యూట్ చేసే ముందే డిడక్టబుల్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ఫిక్డ్​గా ఉంటుంది. కో ఇన్సూరెన్స్ అనేది కొన్ని సార్లు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల చేత కో పే అని కూడా యూజ్ చేయబడుతుంది.
కో పే అమౌంట్ అనేది ఫిక్డ్​గా ఉంటుంది. కానీ వివిధ సర్వీసులను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ మీ బిల్లులో ఎక్కువ మొత్తాన్ని కవర్ చేస్తుంది. కో ఇన్సూరెన్స్​లో మీరు చికిత్స ఖర్చులో కొంత మొత్తాన్ని మీరు భరించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మిగతా అమౌంట్​ను భరిస్తుంది. కో ఇన్సూరెన్స్ విషయంలో ఎటువంటి లిమిట్ నిర్ణయించబడలేదు.

మీకు ఇప్పుడు వీటి గురించి మొత్తం తెలుసు కాబట్టి మీ హెల్త్ ఇన్సూరెన్స్​లకు తక్కువ ప్రీమియం చెల్లించేందుకు వీటిని ఉపయోగించుకోండి.

మీరు ఈ విధానం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు ఈ ఖర్చు పంచుకునే ఆప్షన్లను అందించే ఆరోగ్య బీమా పాలసీలను మీరు పోల్చి చూడాల్సి ఉంటుంది.

మీరు సరైన విధంగా కో–పే, డిడక్టబుల్స్ ఎంచుకోకపోతే మీరు మీ చికిత్స ఖర్చుల కోసం మీ ప్రీమియంల మీద ఆదా చేసిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

 

కో–పే, కో–ఇన్సూరెన్స్, డిడక్టబుల్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.

4. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను బ్యాలెన్స్ చేసుకోండి

కొన్ని సార్లు మీ యజమాని (ఎంప్లాయర్) మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని అందజేస్తాడు. మిమ్మల్ని మీరు ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు మీరు ఇండివిజువల్ పాలసీని తీసుకుంటారు.

అంతేకాకుండా పాలసీదారులు తమ కుటుంబం కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​ను కూడా తీసుకుంటారు.

మీకు ఇప్పటికే అనేక ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే.. అన్ని పాలసీలకు బీమా ప్రీమియాలను చెల్లించడం కష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మీరు ఇతర పాలసీల నుంచి ఇప్పటికే పొందుతున్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇండివిజువల్ పాలసీని పొందడం ఉత్తమం.

ఈ విధంగా మీరు మీ బీమా పాలసీలకు ప్రీమియంలను మరింత ప్రభావవంతంగా చెల్లించే అవకాశం ఉంటుంది.

5. టాప్–అప్ ప్లాన్లను ఎంచుకోండి

ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా అత్యధిక కవరేజీని పొందేందుకు టాప్–అప్ ప్లాన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

టాప్–అప్​ ప్లాన్లు మీ కవర్​ను రెండు భాగాలుగా విభజిస్తాయి. ఇది క్లెయిమ్​ను పెంచేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఉదాహరణ ద్వారా మరింతగా తెలుసుకోండి.

మీ వద్ద రూ. 10 లక్షల ప్లాన్ రూ. 5 లక్షల బెంచ్​మార్క్​తో ఉంటే.. మీరు ఈ ప్లాన్​లో రూ. 7 లక్షల మేర క్లెయిమ్ చేశారని అనుకుందాం. మీ చికిత్స కోసం అయిన అదనపు రూ. 2 లక్షలను ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది.

ఇలా మీరు మీ ఆరోగ్య బీమా కోసం తక్కువ ప్రీమియాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. మీకు చికిత్స ఖర్చులు అవసరమైతే టాప్–అప్​ ప్లాన్​ను పొందండి.

6. సరైన జోన్​లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి

భారతదేశంలో ఉన్న వివిధ నగరాలు, ఆ నగరాల్లో ఉన్న వైద్య ఖర్చుల ఆధారంగా జోన్లుగా విభజించబడ్డాయి. ఒకవేళ ఒక నగరంలో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటే ఆ నగరం జోన్ Aలో ఉంటుంది. వైద్య ఖర్చుల ఆధారంగా జోన్లు A, B, Cలుగా విభజించబడ్డాయి. కింది టేబుల్ ఏ జోన్​లో ఏ నగరాలు ఉన్నాయో పూర్తిగా వివరిస్తుంది.

జోన్ A జోన్ B జోన్ C
ఢిల్లీ/NCR, ముంబై (నేవీ ముంబై, థానే, కల్యాణ్ కూడా) హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగుళూరు, కోల్​కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగుళూరు, కోల్​కతా, అహ్మదాబాద్, వడోదరా, చెన్నై, పూనే, మరియు సూరత్ జోన్​ A, B లలో లేని నగరాలన్ని జోన్​ C కి చెందుతాయి
ప్రీమియం విలువ అటూ ఇటుగా రూ. 6,448 ప్రీమియం విలువ అటూఇటుగా రూ. 5,882 దాదాపుగా ₹5,315 ప్రీమియం

 

అందువలన మీరు నివసించే జోన్​లోనే పాలసీని తీసుకోవడం మంచిది. ఉదాహరణకు: మీరు జోన్ B లేదా C నగరాల్లో నివసిస్తూ జోన్ A పాలసీని తీసుకోవడం వలన మీరు అధిక ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుంది. కావున సరైన జోన్​ను ఎంచుకోవడం వలన మీరు మరింత ప్రభావవంతంగా పాలసీ ప్రీమియంలను చెల్లించేందుకు వీలుంటుంది.

7. దీర్ఘకాలిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం చూడండి

దీర్ఘకాలిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంవత్సరం కోసం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో పోల్చుకుంటే ప్రీమియం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కావున 2-3 సంవత్సరాలకు సరిపోయే దీర్ఘకాలిక హెల్త్ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం వలన ప్రీమియం అమౌంట్​ను తగ్గించుకోవచ్చు.

నేటి రోజుల్లో అనేక బీమా కంపెనీలు దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ పాలసీలను అందించేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. మీరు ఈ ప్లాన్​ల నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందాలని అనుకుంటే వివిధ కంపెనీలు అందిస్తున్న ఇటువంటి ప్లాన్లను తనిఖీ చేయండి. మీ అవసరాలకు సరిగ్గా సరిపోయే ప్లాన్​ను ఎంచుకోండి.

8. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లను ఎంచుకోండి

ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా కొనుగోలు చేయాలో, దానితో ఎలా ప్రీమియం తగ్గించుకోవాలో తెలుసుకునే ముందు ఇండివిజువల్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ల మధ్య గల తేడాలను గురించి తెలుసుకోండి.

వీటి మధ్య వ్యత్యాసాన్ని కింది టేబుల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

పారామీటర్స్ ఇండివిజువల్ ప్లాన్స్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్
అప్లికబులిటీ ఈ ప్లాన్ కింద ఒకే ఇన్సూరెన్స్ కింద కుటుంబ సభ్యులందరికీ సమ్ ఇన్సూర్డ్ నిర్ణయించబడుతుంది. ఈ ప్లాన్​లో ఒక వ్యక్తి టోటల్ చికిత్స ఖర్చును కవర్ చేయడం కోసం మొత్తం బీమా విలువను వాడేందుకు అవకాశం ఉంటుంది.
ప్రీమియం పేమెంట్ ఈ రకమైన పాలసీకి ప్రీమియం అనేది దాని కింద కవర్ చేయబడిన వ్యక్తులను బట్టి వారి వయసును బట్టి నిర్ణయించబడుతుంది. ఇటువంటి సందర్భంలో చాలా హెల్త్ ఇన్సూరెన్స్​ల ప్రీమియం కవర్ చేయబడిన కుటుంబంలోని పెద్ద వ్యక్తి వయసు మీద ఆధారపడి ఉంటాయి.
ధరల్లో తేడా ప్రతి పాలసీ ప్రీమియం పేమెంట్​ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ తీసుకుంటే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కంటే పాలసీ ధర దాదాపు 20 శాతం మేర తక్కువగా ఉంటుంది.

 

పైన ఉన్న పట్టికను మీరు కనుక గమనిస్తే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​లు ఇండివిజువల్ ప్లాన్​ల కంటే చాలా చౌకగా ఉన్నాయని అర్థం అవుతోంది.

మీరు మీ కుటుంబం మొత్తానికి సరిపోయే ప్లాన్ల గురించి చూస్తుంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​ ఎంచుకోవడం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం వలన మీరు బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.

9. ప్లాన్ల స్థోమతను ఆన్​లైన్​లో పోల్చిచూడండి

మీరు పాలసీలను ఆన్​లైన్​లో పోల్చి చూసి కొనుగోలు చేయడం వలన మీ బీమా పాలసీ మీద ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను పొందొచ్చు. ఈ ఆఫర్ల వలన మీరు బీమా పాలసీకి చెల్లించే ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.

తక్కువ ప్రీమియంలనే కాకుండా ఆన్​లైన్​లో లభించే ప్రతీ ఇన్సూరెన్స్ ప్లాన్​ను పోల్చడం ద్వారా మీరు గరిష్ట ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

 

ఆరోగ్య బీమాను పోల్చడం గురించి మరింత తెలుసుకోండి.

10. మీ తల్లిదండ్రులు 60 సంవత్సరాలకు చేరకముందే బీమా పాలసీ కొనుగోలు చేయండి

చాలా ఇన్సూరెన్స్ ప్లాన్స్​లో మీరు బీమా చేసే వ్యక్తి వయసు 60 సంవత్సరాలు దాటితే మీ పాలసీ ప్రీమియం ధర పెరుగుతుంది.

అందుకోసమే మీరు మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా తీసుకుంటే 60 సంవత్సరాలు దాటకముందే వారికి బీమా తీసుకోవడం వలన ప్రీమియం తగ్గుతుంది.

ఈ 10 పాలసీలతో మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవడం గురించి తరచూ అడిగే ప్రశ్నలు

తక్కువ ప్రీమియం చెల్లించడం అంటే పాలసీలు సరిపోవని అర్థమా?

ఇది అన్ని వేళలా నిజం కాదు. ఎందుకంటే ఒక్కో కంపెనీకి బీమా పాలసీ ధర మారుతూ ఉంటుంది. ఒక కంపెనీ అందించే బీమా కవర్ మరో కంపెనీ కవర్ కంటే తక్కువ ధరలో లభ్యం కావొచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్​లో మెటర్నటీ కేర్ కవరేజ్ వస్తుందా?

మెటర్నటీ కేర్ కవర్ ఎక్కువ పాలసీల్లో యాడ్–ఆన్​గా లభ్యమవుతుంది.

మెటర్నిటీ ప్రయోజనాలతో కూడిన ఆరోగ్య బీమా గురించి మరింత తెలుసుకోండి.

నెట్​వర్క్​ ఆసుపత్రి అంటే ఏమిటి?

ఏ ఆసుపత్రులలో అయితే మీ బీమా ప్లాన్​తో మీరు నగదు రహిత చికిత్సలను పొందుతారో వాటిని నెట్​వర్క్​ ఆస్పత్రులు అంటారు.

నగదు రహిత (క్యాష్​లెస్) ఆరోగ్య బీమా గురించి మరింత తెలుసుకోండి.