హెల్త్ ఇన్సురంచె ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి మారండి.

ధూమపానం అనేది మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ధూమపానం చేసే వారికి మరియు పొగాకు వినియోగించే వారికి కవరేజ్ తిరస్కరిస్తారనే ఒక అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. మనం చూసుకుంటే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి విషయాలను కవర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ అధిక ప్రీమియంలు మరియు ఇతర నియమ నిబంధనలు వర్తిస్తాయి.

దానికున్న హానికరమైన స్వభావం వలన ధూమపానం అనేది వైద్య కవరేజ్ మరియు ఇతర వైద్య ఖర్చులను ప్రభావితం చేస్తుంది. ధూమపానం చేసే వారి జీవన శైలి ధూమపానం చేయని వారి కంటే వేరుగా ఉంటుంది. వారు తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కావున అటువంటి వారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ధూమపానం మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

ధూమపానం చేసేవారు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయవచ్చా?

పైన పేర్కొన్న విధంగా అనేక ఇన్సూరెన్స్ సంస్థలు ధూమపానం చేసే వారికి కవరేజ్ అందిస్తాయి. ధూమపానం చేసే వారు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందేందుకు IRDAI హక్కు కల్పించింది. అయితే నిబంధనలు, షరతులు మరియు ప్రీమియం ఖర్చులు ఒక ఇన్సూరెన్స్ సంస్థ నుంచి మరో ఇన్సూరెన్స్ సంస్థకు మారుతూ ఉంటాయి. 

మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ధూమపానం చేసే వ్యక్తిగా గుర్తించబడినట్లయితే మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్దారించే ముందు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోమని వారు మిమ్మల్ని అడగవచ్చు. మరీ ముఖ్యంగా మీరు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నా లేదా ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తం తీసుకున్నా.

ఇన్సూరెన్స్ సంస్థల నిబంధనల ప్రకారం ధూమపానం అంటే ఏమిటి?

ఒక నివేదిక ప్రకారం ఇండియాలో 34.6శాతం మంది పెద్దలు ధూమపానం చేస్తున్నారు. మరియు చాలా మంది పొగాకును ఇతర మార్గాల్లో వినియోగిస్తున్నారు. ఇన్సూరెన్స్ సంస్థల ప్రకారం ధూమపానం లేదా పొగాకు వినియోగం అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తరచూ రెండు ముఖ్యమైన ప్రశ్నలను అడుగుతాయి.

  • మీరు ధూమపానం చేస్తారా?
  • గత ఆరునెలల్లో మీరు ధూమపానం చేశారా?

ధూమపానం చేసే వ్యక్తి ఏ రూపంలోనైనా పొగాకు వినియోగిస్తాడు. ఉదాహరణకు సిగరెట్స్, సిగార్స్, స్నఫ్, లేదా పొగాకును నమలడం. ఎవరైనా కానీ వారానికి నాలుగు సార్ల కంటే ఎక్కువగా ధూమపానం చేస్తూ దానిని ఆరునెలల పాటు కొనసాగిస్తే వారిని ధూమపానం చేసే వారిగా పరిగణిస్తారు.

రోజూ ఎంత మొత్తంలో పొగాకు తీసుకుంటున్నారనే విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చూస్తాయి. కావున ప్రతి రోజు 10 సిగరెట్ల కంటే ఎక్కువ తాగేవారు వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది.

మీరు ధూమపానం చేస్తారని ఇన్సూరెన్స్ సంస్థకు చెప్పడం ఎందుకు అవసరం?

నిజాయతీగా ఉంటూ మీ ధూమపాన అలవాట్లను గురించి ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయడం చాలా ముఖ్యం. వాస్తవాలను తప్పుగా చూపించడం వలన మీ క్లయిమ్ స్ రిజెక్ట్ కావొచ్చు లేదా ఇది ఇన్సూరెన్స్ మోసం కింద పరిగణించబడవచ్చు. మరియు చట్టపరమైన చిక్కులు ఎదురుకావొచ్చు.

మీరు ఎంత తరచుగా సిగరెట్లు తాగుతారనే విషయంలో కూడా నిజాయతీగా ఉండండి. వాస్తవానికి మీరు రోజుకు 6 సిగరెట్లు తాగుతూ రోజుకు 2 సిగరెట్లు మాత్రమే తాగుతానని చెప్పడం వలన కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. క్లయిమ్ సమయంలో వైద్య పరీక్షలు చేసినపుడు రక్త మరియు మూత్ర పరీక్షలో నికోటిన్ అవశేషాలు బయటపడితే వెంటనే క్లయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీరు ధూమపానం చేసే వారైనా లేక చాలా రోజుల కిందటే ధూమపానం అలవాటును వదిలేసినా కానీ అది చెప్పేందుకు వెనకాడకండి. మీరు చేసుకున్న పొదుపులను తుడిచిపెట్టుకుపోయే ఆసుపత్రి బిల్లుతో పోలిస్తే ఎక్కువ ప్రీమియం చెల్లించడం బెటర్.

ధూమపానం అనేది మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎందుకు పెంచుతుంది?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై తీవ్రంగా ప్రభావం చూపే మేజర్ కారకాల్లో ధూమపానం ఒకటి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి ఇతర అనేక క్లిష్టమైన అనారోగ్య సమస్యలు దీని వలన వస్తాయి. ఇది ధూమపానం చేసే వారికి అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ ఆరోగ్య సమస్యల వలన భవిష్యత్ లో హెల్త్ ఇన్సూరెన్స్ క్లయిమ్ ఎక్కువగా చేసే అవకాశం రావొచ్చు. అందువల్ల వారి వద్ద నుంచి అధిక ప్రీమియం వసూలు చేయబడుతుంది.

ఒక్కోసారి ధూమపానం చేసే వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ధూమపానం చేయని వారితో పోల్చుకుంటే రెట్టింపు ఖర్చుతో ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే 25 సంవత్సరాల ధూమపానం చేయని వ్యక్తి రూ. 1 కోటి ఇన్సూరెన్స్ కోసం ఏడాదికి రూ. 5,577 చెల్లిస్తాడని అనుకుందాం. అదే వయసున్న ధూమపానం చేసే వ్యక్తి అంతే మొత్తం ఇన్సూరెన్స్ కోసం ఏడాదికి రూ. 9,270 చెల్లించాలి.

ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న వారు ధూమపానం చేస్తే వారికి ఎటువంటి నిబంధనలు ఉంటాయి?

ధూమపానం చేసే వ్యక్తికి వేరే ఇతర జబ్బులు ముందుగానే ఉన్నట్లయితే (మధుమేహం మరియు హైపర్ టెన్షన్ వంటివి) అవి వారి ధూమపానానికి సంబంధించినవి అయినా లేక వేరే అయినా ఇంకా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ టెస్టుల కోసం అడగవచ్చు.

మీకున్న ఆరోగ్య పరిస్థితి బట్టి వారు ప్రీమియం నిర్ణయిస్తారు. అదనంగా ముందు ఉన్న ఈ వ్యాధులను కవర్ చేసేందుకు 1-4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ధూమపానం చేసే వారికి మరియు ధూమపానం చేయమని వారికి ఈ పీరియడ్ ఒకే రకంగా ఉన్నప్పటికీ ధూమపానం చేసే వారికి మరిన్ని నిబంధనలు ఎక్కువగా ఉండవచ్చు.

ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి?

రెగ్యులర్ గా లేదా ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే:

  • శ్వాసకోస సమస్యలు
  • క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)
  • గుండె సంబంధిత వ్యాధులు
  • క్యాన్సర్ (ముఖ్యంగా గొంతు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్)
  • గుండెపోటు
  • ఎంఫెసిమా (ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి)
  • ఆస్టియోపోరోసిస్ (ఎముకలకు సంబంధించిన వ్యాధి)
  • గర్భ సంబంధిత సమస్యలు

అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండడం వలన ధూమపానం చేసే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వారికి ఆర్థిక రక్షణను అందిస్తుంది.

ధూమపానం చేసేవారు తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించుకునేందుకు ఏం చేయొచ్చు?

ధూమపానం చేసే వారు వారి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అధిక ప్రీమియంలను చెల్లిస్తున్నారు కాబట్టి దీనిని మార్పు చేసేందుకు ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి.

  • ధూమపానం వదిలేయండి - పాలసీ పీరియడ్ లో మీరు కనీసం 2 సంవత్సరాలు ధూమపానం మానేసినట్లయితే, ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని పరిగణించి మీ ప్రీమియంను తక్కువ చేసే అవకాశం ఉంటుంది.
  • ధూమపాన విరమణ ప్రోగ్రామ్ లో చేరండి - ధూమపానాన్ని మీరు మీ సొంతంగా మానేయలేకపోతే ధూమపాన విరమణ ప్రోగ్రామ్ లో చేరండి. చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇది కలిగి ఉంటాయి లేదా అటువంటి కంపెనీలతో పొత్తు పెట్టుకుని ఉంటాయి. మీ ప్రీమియం మారకముందే కనీసం 2 సంవత్సరాల పాటు ధూమపానం చేయకుండా ఉండాలి.
  • వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీలను వెతకండి - ఇండియాలో ధూమపానం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తక్కువ ప్రీమియం మొత్తాలకే పాలసీను అందించే కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. మీరు పరిశోధించి అటువంటి కొన్ని కంపెనీల కోసం వెతకవచ్చు.

చివరగా

ధూమపానం చేసే వారు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అధిక మొత్తం చెల్లించేందుకు సమాయత్తమై ఉండాలి. ఎందుకంటే వారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం చేయడం వల్ల మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య పాలసీని తీసుకోకుండా ఇది మిమ్మల్ని ఆపకూడదు.

ధూమపానం చేసే వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ఈ ఇన్సూరెన్స్ వారికి చాలా అవసరం.

డిస్‌క్లెయిమర్: ధూమపాన అలవాట్లు ఉంటే బహిర్గతం చేయాలని ప్రపోజల్ ఫామ్ లో సూచించబడింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అంగీకరించే లేదా తిరస్కరించే హక్కు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు ధూమపానం చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చా?

అవును. మీరు ధూమపానం చేసినప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం సాధ్యమే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ధూమపానం చేయని వారితో పోలిస్తే మీరు అధిక ప్రీమియం చెల్లించాలి.

మీరు ధూమపానం చేస్తారని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా తెలుస్తుంది?

మీరు ధూమపానం చేస్తున్నారా? లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు మీపై ఆధారపడతాయి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు వారు ఇవి అడుగుతారు. కొన్ని కంపెనీలు నికోటిన్ వాడకం గురించిన కొన్ని సాధారణ పరీక్షలు చేసి దీన్ని ధృవీకరించుకుంటాయి.

మీరు మీ ధూమపాన అలవాట్లను తప్పుగా చెప్పడం వలన క్లయిమ్ రిజెక్షన్ కు అవకాశం ఉంటుంది మరియు తర్వాత చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ధూమపాన అలవాట్లను బహిర్గతం చేయకుంటే ఏమవుతుంది?

ధూమపాన అలవాట్లు ఉండడం వలన మీ ప్రీమియం పెరుగుతుందని తెలుసుకోవడం వల్ల ప్రజలు ఈ అలవాటు గురించి ఇన్సూరెన్స్ సంస్థతో చెప్పేందుకు నిరాకరించవచ్చు. కానీ అది చాలా చెడ్డ ఆలోచన. ఇది మీ క్లయిమ్ తిరస్కరణకు దారి తీస్తుంది. అంతేకాకుండా కొన్ని సీరియస్ సందర్భాల్లో చట్టపరమైన సమస్యలను కూడా తెస్తుంది.

ధూమపానం చేసే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఖరీదైనది?

ధూమపానం చేసేవారు ధూమపానం చేయని వారి కంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యల (శ్వాసకోస సమస్యలు, గుండె జబ్బులు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులు) తో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ పెరిగిన రిస్కులను కవర్ చేసేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు ధూమపానం చేయని వారి వద్ద కంటే ధూమపానం చేసే వారి వద్ద ఎక్కువ ప్రీమియంను వసూలు చేస్తాయి

ధూమపానం చేసే వారి హెల్త్ ఇన్సూరెన్స్ ను హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఎప్పుడు తిరస్కరించవచ్చు?

చాలా సందర్భాలలో ధూమపానం చేసే వారు రోజుకు కొన్ని సిగరెట్లు మాత్రమే తాగుతూ ఫిట్ గా ఉంటారు. అటువంటి వారికి సులభంగా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏదేమైనా రోజుకు 20-40 సిగరెట్లు తాగే హెవీ స్మోకర్స్, చెయిన్ స్మోకర్స్, ఎవరైతే ధూమపానం వలన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతిపాదన తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.