హెల్త్ ఇన్సురంచె ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి మారండి

రిటైర్మెంట్ తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎందుకు అవసరం?

రిటైర్మెంట్ అనేది ఒక మనిషి యొక్క ఉద్యోగ జీవితానికి ముగింపుని సూచిస్తుంది, ఇది వారి జీవనశైలి, ఆదాయం మరియు ఖర్చుల సరళిలో గణనీయమైన మార్పును తెస్తుంది. జీవితంలో ఈ దశలో శ్రద్ధ వహించాల్సిన ఒక అంశం హెల్త్ కేర్.

పెరుగుతున్న వయస్సుతో, మెడికల్ ఎమర్జెన్సీలు మరియు ఖర్చులు మరింత ముఖ్యమైన ఆందోళనగా మారాయి. అందువల్ల, రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది భద్రత మరియు మనశ్శాంతిని అందిస్తుంది, ఒక వ్యక్తి తన మీద పడే ఆర్థిక భారం గురించి చింతించకుండా నాణ్యమైన హెల్త్ కేర్ ను పొందేందుకు ఇది సాయం చేస్తుంది.

రిటైర్మెంట్ తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత

రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చులు మరియు జీవనశైలి అవసరాలు కాకుండా, ముఖ్యంగా ఆ వయస్సులో ఆర్థిక భద్రత మరియు మనశ్శాంతి ఉండేలా చూసుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆవశ్యకత.

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను ఎందుకు కలిగి ఉండాలి అనే విషయం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసే కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి:

1. పెరుగుతున్న వయసులో చాలా అవసరమైన మెడికల్ కేర్

భారతదేశం మరియు రాష్ట్రాలలో జనాభా అంచనాలపై టెక్నికల్ గ్రూప్ నివేదిక 2011-2036 ప్రకారం, 2021లో భారతదేశంలో దాదాపు 138 మిలియన్ల మంది వృద్ధులు ఉన్నారు మరియు 2031లో ఈ సంఖ్య దాదాపు 56 మిలియన్ల కు పెరుగుతుందని అంచనా.

[1]

వైద్య విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక పురోగతి కారణంగా, మనం మన జీవిత కాలాన్ని విజయవంతంగా పెంచుకున్నాము. అంటే మనకు రిటైర్మెంట్ అనంతర బంగారు కాలం ఎక్కువ వ్యవధిలో ఉంటుంది . వయస్సు పెరిగే కొద్దీ, శరీరం బలహీనంగా మారుతుంది దానితో మనిషి అనారోగ్యాలు మరియు గాయాలకు ఎక్కువగా గురవుతాడు, వారికి అప్పుడు మరింత వైద్య సంరక్షణ అవసరం అవుతుంది. అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవుతుంది.

2. ఊహించని మెడికల్ ఎమర్జెన్సీ లలో ఆర్థిక మద్దతు

హెల్ప్‌ఏజ్ ఇండియా అనే NGO నిర్వహించిన జాతీయ సర్వేలో 47% మంది వృద్ధులు ఆర్థికంగా ఆదాయం కోసం వారి కుటుంబాలపై ఆధారపడుతున్నారని మరియు 34% మంది పెన్షన్‌లు మరియు నగదు బదిలీలపై ఆధారపడుతున్నారని తేలింది.

చాలా మంది సీనియర్ సిటిజన్‌లు పెన్షన్‌ల వంటి స్థిరమైన నెలవారీ ఆదాయాలపై ఆధారపడతారు కాబట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఖర్చులు వారికి అందుబాటులో ఉండకపోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఈ వైద్య ఖర్చులకు ఆర్థిక పరిపుష్టిని అందిస్తుంది.

3. అధునాతన మరియు ప్రివెంటివ్ హెల్త్ కేర్ కు మెరుగైన ప్రాప్యత

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అధునాతన హెల్త్ కేర్ ను అందుకోవడానికి అవసరమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. అంతే కాకుండా, చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పధకాలు వార్షిక హెల్త్ చెక్ అప్స్ మరియు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం లో మీకు సహాయపడే ఇతర ప్రివెంటివ్ కేర్ లను అందిస్తాయి.

అందువల్ల, రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటానికి 4 కారణాలు

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం చాలా అవసరం, ఎందుకంటే ఇది ఆర్థిక పరిమితుల గురించి చింతించకుండా నాణ్యమైన హెల్త్ కేర్ ను పొందేలా చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడానికి మీరు పరిగణించవలసిన మొదటి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి:

1. పెరుగుతున్న హెల్త్ కేర్ ఖర్చులు

హెల్త్ కేర్ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి మరియు ఈ ఖర్చులను కవర్ చేసే ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం చాలా అవసరం. వైద్యుల సందర్శనలు, మందులు మరియు ఆసుపత్రి బసపై హెల్త్ ఇన్సూరెన్స్ మీకు డబ్బు ఆదా చేస్తుంది.

రిటైర్మెంట్ దశలో, మీ దగ్గర పరిమితమైన ఆదాయ వనరులు ఉంటాయి మరియు ఆ దశలో ప్రతికూల ఆరోగ్య పరిస్థితుల సంభావ్యత ఎక్కువగా ఉన్నందున వైద్య ఖర్చులను కవర్ చేయడానికి ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండటం చాలా ముఖ్యం.

కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రిటైర్మెంట్ పొందిన వారికి మెడికల్ కేర్ కోసం వారి జేబులోంచి పెట్టాల్సిన ఖర్చులను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది మరియు అందువల్ల వారి పొదుపులను మరింతగా పెంచుకోవచ్చు.

2. మెరుగైన హెల్త్ కేర్ కు ప్రాప్యత

హెల్త్ ఇన్సూరెన్స్ తో, మీరు హెల్త్ కేర్ ప్రొవైడర్ లు మరియు నిపుణుల విస్తృత నెట్‌వర్క్‌కు ప్రాప్యతను కలిగి ఉండవచ్చు. ఇది మీ ఆరోగ్య పరిస్థితులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ మరియు చికిత్సను పొందేలా చేస్తుంది.

అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ పధకాలు తరచుగా ప్రివెంటివ్ కేర్ సేవలు మరియు కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం మరియు వాటిని వెంటనే పరిష్కరించడం ద్వారా, రిటైర్మెంట్ పొందినవారు మరింత ఖరీదైన వైద్య చికిత్సల అవసరాన్ని తగ్గించుకోవచ్చు.

3. ఊహించని మెడికల్ ఎమర్జెన్సీలను ఎదుర్కోవడం

హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తో మరియు హెల్త్ కేర్ పాలసీకి ప్రణాళికాబద్ధంగా ముందుగా నిర్ణయించిన ప్రీమియం చెల్లించడం ద్వారా, రిటైర్మెంట్ పొందినవారు ఆయా ప్లాన్ చెయ్యని వైద్య పరిస్థితులను, ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలు లేదా గాయాలను మెరుగ్గా నిర్వహించగలరు, లేకపోతే వారి జీవితకాల పొదుపులను ఖర్చు చేయాల్సి రావచ్చు.

4. మనశ్శాంతి

స్థిరమైన ఆదాయాలు ఉన్న రిటైరీలకు , హెల్త్ ఇన్సూరెన్స్ మనశ్శాంతి కి ప్రధాన కారకంగా ఉంటుంది. మీ వద్ద ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తో, అవసరం వచ్చినప్పుడు కావాల్సిన మెడికల్ కేర్ ను అందుకోగలమన్న నమ్మకం మీకు లభిస్తుంది. ఇది మీకు సరసమైన ప్రివెంటివ్ కేర్ ను కూడా అందుబాటులోకి తెస్తుంది, దీని వల్ల మీరు మీ శరీర ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు చూడవలసిన విషయాలు

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

1. మీ హెల్త్ కేర్ అవసరాలను పరిగణించండి

ఇప్పటివి మరియు భవిష్యత్తుకు సంబంధించిన, మీ హెల్త్ కేర్ అవసరాల గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీకు ఏ రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఉత్తమమో నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది.

ఉదాహరణకు, మీకు నిరంతరం సంరక్షణ అవసరమయ్యే దీర్ఘకాలిక పరిస్థితులు ఉంటే, మీ జేబునుండి అయ్యే ఖర్చుల కోసం సహాయం చేయడానికి మీరు తక్కువ సహ-చెల్లింపులతో ప్రణాళికను కోరుకోవచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే సాధారణ మరియు దీర్ఘకాలిక పరిస్థితులను కవర్ చేసే ప్రణాళికల కోసం వెదకండి.

2. ప్రీ ఎక్జిస్టింగ్ కండీషన్స్ కవర్ చేయబడి ఉన్నాయో లేదో చెక్ చేయండి

వయసుతో పాటు, ప్రీ ఎక్జిస్టింగ్ మెడికల్ కండీషన్స్ కూడా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చే మీ ప్రీ ఎక్జిస్టింగ్ పరిస్థితుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించడం ఈ సీనియర్ వయస్సులో ఒక ఆప్షన్ కాదు. అందువల్ల, ఈ ప్రీ ఎక్జిస్టింగ్ కండీషన్స్ ను కవర్ చేసే మరియు కవరేజీకి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్‌లు లేని ప్లాన్ కోసం వెతకండి.

3. డొమిసిలియరీ కేర్ ఆప్షన్ కోసం చెక్ చేయండి

హోమ్ కేర్ అని కూడా పిలువబడే డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ అనేది శిక్షణ పొందిన సంరక్షకులు లేదా హెల్త్ కేర్ నిపుణులు వ్యక్తులకు వారి స్వంత ఇళ్లలోనే అందించే సంరక్షణ యొక్క ఒక రూపం.

ఒక సీనియర్ సిటిజన్‌గా, మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును నిర్వహించడానికి మీకు పెర్సనలైజ్డ్ కేర్ మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. కాబట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లో చూడవలసిన ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి.

4. అన్ని అంశాలలో మీ ధరను అంచనా వేయండి

వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి వివిధ రకాల పాలసీలను పరిశోధించి, సరిపోల్చండి. ప్రీమియం మాత్రమే కాకుండా, ప్లాన్ యొక్క మొత్తం ఖర్చు గురించి మెరుగైన అవగాహన పొందడానికి డిడక్టిబుల్స్, కో-పే, కో ఇన్సూరెన్స్ మరియు అవుట్-ఆఫ్-పాకెట్ మాక్సిమం లను కూడా పరిగణించండి.

ఏ ఆప్షన్ ఏమేమి కవర్ చేస్తుందో మరియు మీరు దేనికి అర్హులో తెలుసుకోవడం అనేది పూర్తి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

5. విస్తారమైన నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ ని ఎంచుకోండి

మీరు ఇష్టపడే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ లేదా నిపుణులు ఉంటే, వారు మీ హెల్త్ ప్లాన్ యొక్క నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాలో ఉన్నారని నిర్ధారించుకోవడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన. నెట్‌వర్క్ వెలుపల సంరక్షణ చాలా ఖరీదైనది కావచ్చు మరియు కవర్ చేయబడకపోవచ్చు.

అలాగే, అనేక క్యాష్ లెస్ ఆసుపత్రులను కలిగి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ కి అత్యంత అధిక ప్రాముఖ్యతను ఇవ్వండి. అప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, మీరు నగదు కోసం ఏర్పాటు చేసుకోవడం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. అవాంతరాలు లేని అనుభవాన్ని పొందటానికి క్యాష్ లెస్ ఆసుపత్రి సౌకర్యాలను అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పధకాన్ని ఎంచుకోండి.

6. అవాంతరాలు లేని క్లయిమ్ ప్రక్రియ

హెల్త్ ఇన్సూరెన్స్ క్లయిమ్ విషయం లో అవాంతరాలు లేని అనుభవం యొక్క ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే, ముఖ్యంగా టెక్-అవగాహన లేని మరియు ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లను దాఖలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉన్న సీనియర్ సిటిజన్‌ల గురించి మాట్లాడితే.

ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లయిమ్ ను ఎలా ఫైల్ చేయాలనే దానిపై స్పష్టమైన సూచనలతో సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు నావిగేట్ చేయడానికి సులభమైన మరియు సరళమైన క్లయిమ్ ప్రక్రియను కలిగి ఉండాలి. క్లయిమ్ లను దాఖలు చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు సహాయం చేయడానికి మరియు వారికి అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడానికి ప్రత్యేక బృందం ఉండటం అనేది ఇంకా సాయం చేస్తుంది.

7. అనుబంధ ఇన్సూరెన్స్ ను పరిగణించండి

మీ అవసరాలను బట్టి, మీరు డెంటల్, విజన్ లేదా దీర్ఘకాలిక సంరక్షణ ఇన్సూరెన్స్ వంటి అనుబంధ ఇన్సూరెన్స్ ను పరిగణించాలనుకోవచ్చు. ఈ ప్లాన్‌లు కవరేజీలో ఉన్న గ్యాప్ లను పూరించడంలో సహాయపడతాయి మరియు మీ ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో చేర్చబడని అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడానికి మీ హెల్త్ కేర్ అవసరాలు మరియు బడ్జెట్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. సరైన ప్రశ్నలను పరిశోధించడం మరియు అడగడం ద్వారా, మీరు కొనుగోలు చేయగల ధరలో మీకు అవసరమైన కవరేజీని అందించే ప్లాన్‌ను మీరు కనుగొనవచ్చు.

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజి గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నేను రిటైర్మెంట్ చేసిన తర్వాత నా యజమాని-ప్రాయోజిత హెల్త్ ఇన్సూరెన్స్ ను ఉంచుకోవచ్చా?

ఇది యజమాని పాలసీ పై ఆధారపడి ఉంటుంది. కొంతమంది యజమానులు రిటైర్ అయినా వారు అధిక ప్రీమియంలు లేదా తగ్గిన ప్రయోజనాలతో తమ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోవడానికి అనుమతించవచ్చు. అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ను గుర్తించడానికి మీ యజమానిని సంప్రదించడం చాలా అవసరం.

భారతదేశంలోని సీనియర్ సిటిజన్‌ల కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏవి?

భారతదేశంలో సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి, అవి:

  1. వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు
  2. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు
  3. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు
  4. క్రిటికల్ ఇల్ నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు
  5. టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

రిటైర్మెంట్ తర్వాత కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చా?

అవును, మీరు భారతదేశంలో రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు చెల్లించిన దానికంటే ఇన్సూరెన్స్ ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు.

రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ఏదైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయా?

అవును, భారతదేశంలో రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ల కోసం చెల్లించే ప్రీమియంలు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80డి కింద ట్యాక్స్ డిడక్షన్ లకు అర్హులు అవుతాయి. అలాగే, సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు పరిమితి ₹50000/-

నేను మెరుగైన ఆప్షన్ ను కనుగొంటే, రిటైర్మెంట్ తర్వాత నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను మార్చవచ్చా?

అవును, పోర్టబిలిటీతో, మీరు మెరుగైన ఎంపికను కనుగొంటే రిటైర్మెంట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను మార్చుకోవచ్చు. అయితే, మీరు ఎప్పుడు మార్పులు చేయవచ్చనే దానిపై పరిమితులు ఉండవచ్చు, కాబట్టి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ లేదా ఏజెంట్‌ని సంప్రదించడం చాలా అవసరం.