ఆన్​లైన్​లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్​కు మారండి

భారతదేశంలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కనుగొనాలి?

భారతదేశంలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?

ఆరోగ్య సంరక్షణ అనేది భారతదేశంలో చాలా మార్పులు చెందుతున్న ప్రధాన రంగాల్లో ఒకటి! ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రెండింతలు పెరుగుతున్నాయి. అయితే ప్రజలు కూడా ఆరోగ్యం, డబ్బు విషయాల్లో జాగ్రత్త వహిస్తున్నారు.

ఇది చివరికి ఇప్పుడు ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడానికి దారి తీసింది. ఏదేమైనా టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ ఇంతలా పెరిగినందుకు ధన్యవాదాలు. ఆరోగ్య బీమాలు కేవలం ప్రధాన, క్లిష్టమైన అనారోగ్య సమస్యలనే గాక సాధారణ అనారోగ్యాలను కూడా కవర్ చేస్తున్నాయి.

కాబట్టి, మీకు వంధ్యత్వ చికిత్స అవసరం ఉన్నా, డేకేర్ ప్రక్రియను చేయించుకోవాల్సి ఉన్నా లేదా మీ ప్రాథమిక, వార్షిక వైద్య పరీక్షలు చేయించాలని అనుకుంటే ఇప్పుడు ఆరోగ్య బీమాలు ఇలాంటి వివిధ రకాల ప్రయోజనాలకు కవర్ అవుతాయి.

అందువల్ల ఏదో ఒక ఆరోగ్య బీమా తీసుకోవడం అని కాకుండా సరసమైన ప్రీమియం వద్ద మీకు అన్ని విలువైన ప్రయోజనాలను అందించే అత్యుత్తమ ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ఆరోగ్యం, సంపద రెండింటినీ సంరక్షిస్తుంది.

ముఖ్యమైనది (Important): కోవిడ్ 19 హెల్త్ ఇన్సూరెన్స్‎లో ఏమేం కవర్ అవుతాయో మరింత తెలుసుకోండి.

భారతదేశంలో ఆరోగ్య బీమా గణాంకాలు

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, భారతదేశ జనాభా తమ ఆదాయంలో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని వైద్యానికి ఖర్చు చేస్తోంది. జనాభాలో 3.9% మంది తమ ఆదాయంలో 25% కంటే ఎక్కువ దీని కోసమే ఖర్చు చేస్తున్నారు.

 

భారతదేశంలో ఈ ఏడాది 11.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని, మహిళల్లో 50 శాతానికి పైగా అవి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.

 

భారతదేశంలో గుండె జబ్బుల తరువాత తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి (క్రానికల్ అబ్‎స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) ఎక్కువ మరణాలకు ప్రధాన కారణం.

భారతదేశంలో అత్యుత్తమ ఆరోగ్య బీమా ప్లాన్​ను ఎందుకు ఎంచుకోవాలి?

అత్యుత్తమ ఆరోగ్య బీమా అనేది మీ ఆరోగ్యం, సంపదను సంరక్షించడంలో సహాయపడటమే కాకుండా, కొనుగోలు చేయడానికి, క్లెయిమ్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి సౌకర్యవంతంగా సరిపోయేలా కస్టమైజ్ చేయబడ్డ ప్రయోజనాలను అందిస్తుంది.

అత్యుత్తమ ఆరోగ్య బీమా ప్లాన్ దురదృష్టకరమైన ఆరోగ్య పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. అదే సమయంలో మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది.

మీ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రయోజనాలు, సేవలను అందించడం ద్వారా అత్యుత్తమ ఆరోగ్య బీమా ప్లాన్ మీ ఆరోగ్యానికి అత్యంత అర్థవంతమైన ప్రాముఖ్యత ఇచ్చేలా చూస్తుంది.

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ క్లెయిములను తేలికగా ప్రాసెస్ చేసేలా చూసుకుంటుంది. అందువల్ల మీరు ఫాలో–అప్ చేయాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు!

మహమ్మారులను కవర్ చేస్తుంది - కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడుతున్నారని మాకు తెలుసు, అందుకే మేము దానిని కవర్ చేస్తాము!

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్​ను భారతదేశంలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఒకటిగా ఏది చేస్తుంది?

మా సరళమైన ఆన్​లైన్ ప్రక్రియతో పాటుగా, మార్కెట్​లోని ఇతర ఆరోగ్య బీమా సంస్థలతో పోలిస్తే, డిజిట్ భారతదేశంలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఒకటిగా నిలుస్తుంది. దీని యొక్క ప్రత్యేకమైన, అర్థవంతమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు.

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS ఇండస్ట్రీ సగటు

ముఖ్యమైన ఫీచర్లు

డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సగటు
కొనుగోలు మరియు క్లెయిమ్ ప్రాసెస్ సులభంగా ఉంటుంది. అంతా డిజిటల్ ప్రాసెస్‌లో ఉంటుంది పూర్తి డిజిటల్‌గా ఉండదు
కోపేమెంట్ వయసు మరియు ప్రాంతానికి సంబంధించి కో పేమెంట్స్ ఉండవు కో పేమెంట్ ఉంటుంది
రూం రెంట్ క్యాపింగ్ ఎటువంటి రూం రెంట్ క్యాపింగ్ లేదు గది అద్దె విషయంలో పరిమితులు ఉంటాయి
క్యుములేటివ్ బోనస్ సంవత్సరానికి 50 శాతం వరకు క్యుములేటివ్ బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీలకు వేరుగా ఉంటుంది.
నగదు రహిత ఆసుపత్రులు ఇండియా వ్యాప్తంగా మాకు 10500 కంటే ఎక్కువ క్యాస్​లెస్ క్లెయిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వేర్వేరుగా ఉంటుంది

మా హెల్త్​ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ అవుతుంది?

కవరేజెస్

డబుల్ వాలెట్ ప్లాన్

ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్

వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్ ప్లాన్

ముఖ్యమైన ఫీచర్లు

అన్ని రకాల ఆసుపత్రి చికిత్సల కొరకు - యాక్సిడెంట్ల వలన లేదా అనారోగ్యం, లేదా తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్​ వలన ఆసుపత్రిలో చేరితే..

అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు

ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్

ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.

వెల్​నెస్ ప్రోగ్రాం

హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్​లు, యోగా, మైండ్​ఫుల్​నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్​లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.

సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్

మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్​గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్​ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.

పాలసీ సమయంలో రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ జబ్బులు కూడా.. ఎటువంటి ఎగ్జాషన్ నిబంధనలు లేవు. (ఎగ్జాషన్ నిబంధన అనగా క్లెయిమ్ సమయంలో ఆస్తి యజమాని కూడా కొంత నష్టాన్ని భరించాలనే నిబంధన) అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో అపరిమిత పునరుద్ధరణ. సంబంధిత మరియు సంబంధం లేని వ్యాధులు కూడా కవర్ అవుతాయి. ఎగ్జాషన్ నిబంధన లేదు. అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.

క్యుములేటివ్ బోనస్
digit_special Digit Special

పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్​లో అదనపు మొత్తాన్ని బోనస్​గా పొందుతారు.

ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి బేస్​మొత్తంలో 10శాతం గరిష్టంగా 100 శాతం వరకు
ప్రతి క్లెయిమ్ చేయని సంవత్సరానికి బీమా చేయబడిన బేస్ మొత్తంలో 50 శాతం. గరిష్టంగా 100 శాతం వరకు

రూం రెంట్ క్యాపింగ్

వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్​లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.

డే కేర్ ప్రొసీజర్స్

24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.

వరల్డ్​వైడ్ కవరేజ్
digit_special Digit Special

వరల్డ్​వైడ్ కవరేజ్​తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.

×
×

హెల్త్ చెకప్

మీ హెల్త్ చెకప్స్​​ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్​ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్​ను ఓ సారి పరిశీలించండి.

బేస్​మొత్తంలో 0.25శాతం, రెండు సంవత్సరాల తర్వాత గరిష్టంగా రూ. 1, 000
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత గరిష్టంగా రూ. 1, 500

అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు

మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్​లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.

×

ఏజ్ /జోన్ మీద ఆధారపడి కో పేమెంట్
digit_special Digit Special

కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్​లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.

ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు

రోడ్ అంబులెన్స్ ఖర్చులు

మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.

బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 15,000 వరకు.

ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం

30/60 రోజులు
60/180 రోజులు

ఇతర ప్రయోజనాలు

ముందే నిర్దారణ అయిన వ్యాధికి(PED) వెయిటింగ్ పీరియడ్

మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
3 సంవత్సరాలు

నిర్దిష్ట అనారోగ్యం కొరకు వెయిటింగ్ పీరియడ్

నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్​లోని స్టాండర్డ్ ఎక్స్​క్లూజన్స్ (Excl02) చూడండి.

2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
2 సంవత్సరాలు

ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

పాలసీ పీరియడ్​ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్​లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.

₹ 50,000
₹ 1,00,000
₹ 1,00,000

అవయవ దాత ఖర్చులు
digit_special Digit Special

మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్

ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.

బారియాట్రిక్ సర్జరీ

ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.

మానసిక అనారోగ్యం

గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్​నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్​నెస్ వెయిటింగ్ పీరియడ్​తో సమానంగా ఉంటుంది.

కన్స్యూమబుల్స్ కవర్

ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్​ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది

ఏమేం కవర్​ కావంటే?

ప్రీ–నేటల్​, పోస్ట్​–నేటల్​ ఖర్చులు

ఆస్పత్రిలో చేరక ముందు అయ్యే ప్రీ–నేటల్​, పోస్ట్​–నేటల్​ మెడికల్​ ఖర్చులు కవర్​ కావు.

ముందునుంచే ఉన్న వ్యాధులు

ఒకవేళ మీకు ముందు నుంచే ఉన్న వ్యాధులు ఏవైనా ఉంటే వాటి వెయిటింగ్​ పీరియడ్​ ముగిసేవరకు మీరు క్లెయిమ్​ చేయలేరు.

డాక్టర్​ సిఫారసు లేకుండా ఆస్పత్రిలో చేరితే

మీరు ఆస్పత్రిలో చేరిన కారణానికి డాక్టర్​ సిఫారసుకు మ్యాచ్​ కాకపోతే అది పాలసీ క్లెయిమ్​లో కవర్​ కాదు.

క్లెయిమ్​ ఎలా ఫైల్​ చేయాలి?

రీయింబర్స్​మెంట్​ క్లెయిములు​  – మీరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 నెంబర్​పై మాకు ఫోన్​ చేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్​కు ఈమెయిల్​ చేయండి. మేము మీకు సంబంధించిన ఆస్పత్రి బిల్లుల​ను అప్​లోడ్​ చేసేందుకు ఒక లింకును పంపుతాం. ఈ డాక్యుమెంట్లతో మీ రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్​ ప్రాసెస్​ అవుతుంది.

క్యాష్​లెస్​ క్లెయిములు  – మీకు క్యాష్​లెస్​ క్లెయిమ్​ కావాలంటే అందుకోసం మీరు మా నెట్​వర్క్​ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నెట్​వర్క్​ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మీ ఈ-హెల్త్​ కార్డును ఆస్పత్రి హెల్ప్​ డెస్క్​లో చూపిస్తే వారు మీకు క్యాష్​లెస్​ రిక్వెస్ట్​ ఫామ్​ను అందిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ క్లెయిమ్​ పరిష్కరించబడుతుంది.

మీరు కనుక కరోనా వైరస్​కు సంబంధించిన చికిత్స గురించి క్లెయిమ్​ చేస్తే పాజిటివ్​ టెస్ట్​ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును మీరు ఐసీఎంఆర్​ (ICMR) ద్వారా గుర్తించబడిన అధీకృత సెంటర్ల ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్‎ని ఏవిధంగా ఎంచుకోవాలి?

ప్రస్తుతం భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం విపరీతంగా మార్పులకు లోనవుతోంది. ఆరోగ్యం మన జీవితంలో అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి, సరైన రకమైన ఆరోగ్య సంరక్షణ అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్​కు కూడా ఇదే వర్తిస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి, మనకు కొంత మనశ్శాంతిని ఇవ్వడానికి సహాయపడే వాటిలో ఒకటి.

ఏదేమైనా ఈరోజుల్లో అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుండి మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకుంటారు? ఇక్కడ మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. కవరేజీ వివరాలను లెక్కించండి: చాలా మంది ప్రజలు పొరపాటున హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మాత్రమే పోలుస్తారు. అయితే ప్రతీ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న కవరేజీ స్పెసిఫికేషన్లతో వస్తుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మీ కోసం బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంలో మీకు సహాయపడే సూక్ష్మమైన వివరాలతో పాటు లభ్యం అవుతున్న అన్ని కవర్లను మీరు పోల్చడం, మదింపు చేయడం ఎంతో ముఖ్యం.

2. ప్రాసెస్​లను చెక్ చేయండి: కొనుగోలు చేసే ప్రక్రియ, మరీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ ఎల్లప్పుడూ సుదీర్ఘమైనదిగా, గజిబిజిగా ఉంటుంది. అయితే సరళమైన, ఆన్​లైన్ ప్రక్రియలతో వచ్చే బీమా సంస్థలను ఎంచుకోండి. అందువల్ల, మీరు కోరుకున్న బీమా సంస్థ క్లెయిమ్, కొనుగోలు ప్రక్రియ ఎలా ఉంటుందో ఎల్లప్పుడూ గమనించండి. దానికి అనుగుణంగా మీ ఆప్షన్లను లెక్కించండి.

3. సర్వీస్ ప్రయోజనాలు: కవరేజీ ప్రయోజనాలతో పాటుగా, బీమా సంస్థలు తమ కస్టమర్లకు ప్రత్యేక సర్వీస్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అందువల్ల మీరు ఎంచుకోవడానికి ముందు విభిన్న సర్వీస్ ప్రయోజనాలను కూడా పరిశీలించండి.

4. క్యుములేటివ్ బోనస్: క్యుములేటివ్ బోనస్ అనేది మీరు ఎన్నడూ హెల్త్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోనట్లయితే రెన్యువల్ సమయంలో మీరు పొందే బీమా మొత్తం యొక్క అదనపు శాతం. ఒక్కో బీమా సంస్థ ఒక్కోలా క్యుములేటివ్ బోనస్​ను అందిస్తాయి. అందువల్ల మీ ఆప్షన్లను పోల్చి, మీకు ఏది సరిగ్గా సరిపోతుందో చూడండి.

5. కోపేమెంట్: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో మీ జేబు నుండి మీరు చెల్లించాల్సిన డబ్బు మొత్తాన్ని కోపేమెంట్ సూచిస్తుంది. సాధారణంగా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ లు వారి ప్లాన్లలో కనీసం 10 నుండి 20% కోపేమెంట్ ను కలిగి ఉంటాయి. ఏదేమైనా మాలాంటి ప్లాన్లకు వయసు ఆధారిత కోపేమెంట్లు ఉండవు. అందువల్ల మీకు ఏది సరిపోతుందో చూసుకోండి, దానికి తగ్గట్టుగా ఒక దానిని ఎంపిక చేసుకోండి.

భారతదేశంలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నా హెల్త్ ఇన్సూరెన్స్ భారతదేశం అంతటా చెల్లుబాటు అవుతుందా?

అవుతుంది, డిజిట్ ద్వారా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ భారతదేశంలోని అన్ని నగరాల్లో చెల్లుబాటు అవుతుంది.

 

డిజిట్ ఎన్ని నెట్వర్క్ ఆస్పత్రులను కలిగి ఉంది?

మేము భారతదేశం అంతటా 10500+ పైచిలుకు నెట్వర్క్ ఆస్నత్రులను కలిగి ఉన్నాము.

 

ఫిట్​నెస్ ట్రాకర్‎లను ఉపయోగించి, ప్రతిరోజూ అనేక అడుగులు నడిస్తే, అనేక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నేడు డిస్కౌంట్లు లేదా బోనస్​లను అందిస్తున్నాయి. డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ అటువంటి ప్రయోజనాలను అందిస్తుందా?

అందిస్తుంది, మేము మా కస్టమర్లకు నో క్లెయిం బోనస్ (NCB) అందిస్తాం. అంటే ఒకవేళ మీరు సంవత్సరం పొడవునా ఆరోగ్యంగా ఉండటం వల్ల ఎలాంటి క్లెయిమ్ చేయనట్లయితే, మీ మొదటి క్లెయిమ్ రహిత సంవత్సరానికి 20% నుంచి ప్రారంభమయ్యే నో క్లెయిం బోనస్ (NCB) ని మేము మీకు అందిస్తాం. మీ ఫిట్​నెస్ ట్రాకర్లు లేదా అలాంటి వాటితో మీరు దానిని నిరూపించాల్సిన అవసరం లేదు😊

 

ఇంతకు ముందు నుంచే ఉన్న వ్యాధులు (ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజెస్) అంటే ఏమిటి?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడానికి కన్నా ముందు, మీరు ఇప్పటికే  ఎదుర్కొంటున్న ఏవైనా ఆరోగ్య పరిస్థితులను ‘ముందుగా ఉన్న వ్యాధులు (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్)’ సూచిస్తాయి. ఐఆర్​డీఏఐ (IRDAI) ప్రకారం, దీనికి అధికారిక నిర్వచనం: ముందస్తుగా ఉన్న వ్యాధి అనగా, సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి 48 నెలల ముందు అతడు/ఆమె లక్షణాలను ఎదుర్కొన్న లేదా ఇప్పటికే నిర్ధారణ అయిన ఏదైనా ఆరోగ్య పరిస్థితి, అస్వస్థత లేదా గాయం లేదా సంబంధిత పరిస్థితులతో ముడిపడినది అని అర్థం.

 

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ల విషయానికి వస్తే డిజిట్ యొక్క క్లెయిం సెటిల్ మెంట్ రేషియో ఎంత?

ప్రస్తుతం డిజిట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 93.37%గా ఉంది😊

 

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం సిఫారసు చేయబడ్డ సమ్ ఇన్సూర్డ్ ఎంత?

Choosing the ideal sum insured would primarily depend on the number of peoplబీమా మొత్తాన్ని (సమ్ ఇన్సూర్డ్ ని) ఎంచుకోవడం అనేది ప్రాథమికంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద బీమా చేయబడ్డ వ్యక్తుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. దీని విషయంలో ముందుకు వెళ్లడానికి ఉన్న మంచి మార్గం ఏంటంటే ముందుగా మీ  కుటుంబం యొక్క వార్షిక ఆదాయ స్థాయిని తెలియజేయడం, సిఫారసు చేయబడ్డ బీమా మొత్తానికి ప్లాన్లను ఎంచుకోవడం. బీమా మొత్తం మీకు, మీ కుటుంబానికి తగినంతగా, సరసమైనదిగా ఉండేలా ఇది చూసుకుంటుంది.e insured under your health insurance plan. The best way to go about this would be, to mention your family’s annual income range and go for the recommended Sum Insured plan. This would ensure the sum insured is both sufficient and affordable for you and your family.