ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్కు మారండి

ఆరోగ్య బీమాలో ఆయుష్ బెనిఫిట్ గురించి ప్రతిదీ

ఆరోగ్య బీమాలో ఆయుష్ (AYUSH) ప్రయోజనం ఏంటి?

ఆయుష్ అనేది ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి పద్ధతులను సూచిస్తుంది. ఆయుష్ (AYUSH) చికిత్సలు నిర్దిష్ట వ్యాధులను నయం చేసేందుకు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి.

ఈ మందుల్లో సహజ సిద్దమైన మూలికలు ఎక్కువగా ఉంటాయి. కావున వీటిని మన శరీరం సులభంగా గ్రహించుకుని ప్రయోజనం పొందుతుంది. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి.

ఐఆర్డీఏఐ (IRDAI) నియమాలను మార్చిన తర్వాత చాలా ఆరోగ్య బీమా సంస్థలు ప్రస్తుతం ఆయుష్ (AYUSH) చికిత్సలను కవర్ చేస్తున్నాయి. ముఖ్యంగా 60 సంవత్సరాలకు పైబడిన వారికి.

డిస్​క్లెయిమర్: డిజిట్ అందించే ఆరోగ్య పాలసీలతో ప్రస్తుతం ఆయుష్ ప్రయోజనాలను అందించట్లేదనే విషయాన్ని గమనించగలరు. 

ఆయుష్ (AYUSH) హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత

ప్రస్తుత రోజుల్లో సంప్రదాయ మందుల నుంచి హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, యోగా వంటి చికిత్సల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్​ను సపోర్ట్ చేసేందుకు మా లాంటి బీమా సంస్థలు తమ ఆరోగ్య బీమా పాలసీలో ఆయుర్వేద చికిత్స కవరేజీని అందించడం ప్రారంభించాయి.

మీరు కనుక  ప్రత్యామ్నాయ చికిత్సల కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ వాటి గురించి పూర్తిగా ఉంది. ఆరోగ్య బీమా​లో ఆయుష్ (AYUSH) వంటి చికిత్స కవర్​ల గురించి పూర్తిగా తెలుసుకోండి.

నేటి ఆరోగ్య సంరక్షణ సేవల్లో ఆయుష్

ఆయుష్ (AYUSH) వంటి చికిత్సలను మరింతగా విస్తరించేందుకు 2014లో భారత ప్రభుత్వం ఆయుష్ (AYUSH) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అలాగే నేషనల్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (NABH) ను ప్రారంభించి ఆసుపత్రులలో ప్రమాణాలను పెంచేందుకు  ప్రయత్నిస్తోంది. అంతేగాక ఆసుపత్రులు ఆయుష్ (AYUSH) చికిత్సను  మరింత బాగా అందించేలా  ప్రోత్సహిస్తోంది.

ఫలితంగా నేడు భారతదేశంలో 50 కంటే ఎక్కువ ఆసుపత్రులు నమ్మకమైన ఆయుష్ (AYUSH) సంబంధిత చికిత్సలను అందిస్తున్నాయి.

మరింత తెలుసుకోండి

ఆయుష్చి కిత్స ప్రయోజనాలు

ఆరోగ్య సంరక్షణ కోసం ఇది మరింత సమగ్రమైన విధానాన్ని కలిగి ఉంటుంది. వైద్య సేవల్లో ఉన్న  అంతరాలను పరిష్కరిస్తుంది. వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇది చాలా బాగా పని చేస్తుంది.

వయసు పైబడిన వారికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స విధానాల్లో ఇది ఒకటి.

తంబాకు వ్యసనం, మద్యపాన వ్యసనం వంటి దురలవాట్లను ఈ ఆయుష్ (AYUSH)  చికిత్స ద్వారా తగ్గించవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. యోగా

రోజురోజుకు మన  భారతదేశంలో  జీవన శైలి వలన సంభవించే వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల పెరుగుదలే అందుకు ఉదాహరణ. ఆయుష్ (AYUSH) వంటి ప్రత్యామ్నాయ చికిత్సలతో వీటిని తగ్గించవచ్చు

మొత్తంగా చూసుకున్నట్లయితే అధునాతన వైద్య విధానాల కంటే ఆయుష్ (AYUSH) తక్కువ దుష్ప్రభావాలతో, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా అర్థమవుతోంది.

ఆరోగ్య బీమాలో ఆయుష్ (AYUSH) ప్రయోజనం గురించి మరింత తెలుసుకోండి.

ఆరోగ్య బీమాలో ఆయుష్ (AYUSH) చికిత్సలను ఎవరు పొందవచ్చు?

తమ ఆరోగ్య బీమా కింద ఆయుష్(AYUSH) కవర్​ను ఎవరైనా ఎంచుకోవచ్చు. మీ వయసు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా, లేక మీరు మీ తల్లిదండ్రుల కోసం మీ ప్లాన్​లో భాగంగా బీమా చేసినా లేదా వారికోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్  Senior Citizen Health Insurance ప్లాన్​ను కొనుగోలు చేసినా కానీ ఆయుష్ కవర్​ను తప్పకుండా తీసుకోవాలి. వివిధ బీమా సంస్థలలో ఏజ్ క్రైటీరియా (వయస్సుల ప్రమాణాలు) వివిధ రకాలుగా ఉంటాయి. 

తమ ఆరోగ్య బీమా కింద ఆయుష్(AYUSH) కవర్​ను ఎవరైనా ఎంచుకోవచ్చు. మీ వయసు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా, లేక మీరు మీ తల్లిదండ్రుల కోసం మీ ప్లాన్​లో భాగంగా బీమా చేసినా లేదా వారికోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్  Senior Citizen Health Insurance ప్లాన్​ను కొనుగోలు చేసినా కానీ ఆయుష్ కవర్​ను తప్పకుండా తీసుకోవాలి. వివిధ బీమా సంస్థలలో ఏజ్ క్రైటీరియా (వయస్సుల ప్రమాణాలు) వివిధ రకాలుగా ఉంటాయి. 

ఆరోగ్య బీమాలో ఆయుష్ (AYUSH) ప్రయోజనం కింద ఏమేం కవర్ అవుతాయి?

మీరు కనుక మీ  ఆరోగ్య బీమాలో  భాగంగా ఆయుష్ (AYUSH) కవర్​ను ఎంచుకుంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి అన్ని వైద్య ఖర్చులను డిజిట్ భరిస్తుంది. నోట్ : మీ ఆరోగ్య బీమా కింద చేసిన క్లెయిమ్ చెల్లించడానికి మీరు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Quality Council of India) లేదా నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆన్ హెల్త్ (National Accreditation Board on Health) ధృవీకరించిన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఉండాలి.

మీరు కనుక మీ  ఆరోగ్య బీమాలో  భాగంగా ఆయుష్ (AYUSH) కవర్​ను ఎంచుకుంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి అన్ని వైద్య ఖర్చులను డిజిట్ భరిస్తుంది.

నోట్ : మీ ఆరోగ్య బీమా కింద చేసిన క్లెయిమ్ చెల్లించడానికి మీరు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Quality Council of India) లేదా నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆన్ హెల్త్ (National Accreditation Board on Health) ధృవీకరించిన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఉండాలి.

ఆరోగ్య బీమాలో ఆయుష్ (AYUSH) ప్రయోజనం కింద ఏమేం కవర్ కావు?

24 గంటల కంటే తక్కువ సమయం పాటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే.. ఆస్పత్రిపాలు కావడానికి ముందు, తర్వాతి ఖర్చులు. డే కేర్ ప్రొసీజర్స్, అవుట్ పేషంట్ వైద్య ఖర్చులు వైద్యపరంగా అవసరం లేని నివారణ చికిత్సలు, రిజువేషన్  చికిత్సలు  దీనిలో కవర్ కావు. (కావున కేరళ వైద్యం, రిసార్ట్ ట్రీట్​మెంట్ ఇందులో చేర్చబడలేదు 😉)

  • 24 గంటల కంటే తక్కువ సమయం పాటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే..
  • ఆస్పత్రిపాలు కావడానికి ముందు, తర్వాతి ఖర్చులు. డే కేర్ ప్రొసీజర్స్, అవుట్ పేషంట్ వైద్య ఖర్చులు
  • వైద్యపరంగా అవసరం లేని నివారణ చికిత్సలు, రిజువేషన్  చికిత్సలు  దీనిలో కవర్ కావు. (కావున కేరళ వైద్యం, రిసార్ట్ ట్రీట్​మెంట్ ఇందులో చేర్చబడలేదు 😉)

ఆరోగ్య బీమాలో ఆయుర్వేద చికిత్స తీసుకునే సమయంలో ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి?

ఆయుష్ (AYUSH ) చికిత్సకు అర్హత పొందిన చికిత్సా కేంద్రంలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటేనే అది కవర్ అవుతుంది. ఆయుష్ (AYUSH) చికిత్స కోసం ఎటువంటి ఆసుపత్రులు క్వాలిఫై అయ్యాయో ఐఆర్డీఏఐ (IRDAI) నివేదించింది.  ఈ నిబంధన కింద అర్హత పొందిన సెంటర్ల రకాలు కింద ఇవ్వబడ్డాయి. 1. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (CCIM) మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి (CCH) చే గుర్తింపు పొందిన ఆయుష్ (AYUSH) బోధనా కళాశాలలు. 2. ఆయుష్ (AYUSH) ఆసుపత్రులు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత చట్టాల మేరకు లోబడి నమోదు చేసుకొని, కింది కనీస ప్రమాణాలతో ఉన్నవి: కనీసం 15 ఇన్-పేషంట్ పడకలు ఉన్నవి. కనీసం ఐదుగురు ఆయుష్ (AYUSH) సర్టిఫైడ్ డాక్టర్లు ఉండాలి తగిన శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది రోజంతా అందుబాటులో ఉండాలి ప్రత్యేకమైన ఆయుష్ (AYUSH) థెరపీ సెక్షన్లు ఉండాలి. బీమా సంస్థకు చెందిన అధీకృత వ్యక్తి రోగుల రోజూవారి రికార్డులను నిర్వహిస్తారు. అంతే కాకుండా రోగి క్లెయిమ్ చేసుకునేందుకు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం పాటు చికిత్స కోసం చేరి ఉండాలి. కొందరి  బీమా క్లెయిమ్ అంగీకరించేందుకు చికిత్స వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. హెచ్చరిక: ఆయుష్​ కవర్​లో అన్ని వివరాలు సమర్పించారా? లేదా అని ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​తో మరియు అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. 

ఆయుష్ (AYUSH ) చికిత్సకు అర్హత పొందిన చికిత్సా కేంద్రంలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటేనే అది కవర్ అవుతుంది. ఆయుష్ (AYUSH) చికిత్స కోసం ఎటువంటి ఆసుపత్రులు క్వాలిఫై అయ్యాయో ఐఆర్డీఏఐ (IRDAI) నివేదించింది. 

ఈ నిబంధన కింద అర్హత పొందిన సెంటర్ల రకాలు కింద ఇవ్వబడ్డాయి.

1. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (CCIM) మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి (CCH) చే గుర్తింపు పొందిన ఆయుష్ (AYUSH) బోధనా కళాశాలలు.

2. ఆయుష్ (AYUSH) ఆసుపత్రులు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత చట్టాల మేరకు లోబడి నమోదు చేసుకొని, కింది కనీస ప్రమాణాలతో ఉన్నవి:

  • కనీసం 15 ఇన్-పేషంట్ పడకలు ఉన్నవి.
  • కనీసం ఐదుగురు ఆయుష్ (AYUSH) సర్టిఫైడ్ డాక్టర్లు ఉండాలి
  • తగిన శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది రోజంతా అందుబాటులో ఉండాలి
  • ప్రత్యేకమైన ఆయుష్ (AYUSH) థెరపీ సెక్షన్లు ఉండాలి.
  • బీమా సంస్థకు చెందిన అధీకృత వ్యక్తి రోగుల రోజూవారి రికార్డులను నిర్వహిస్తారు.

అంతే కాకుండా రోగి క్లెయిమ్ చేసుకునేందుకు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం పాటు చికిత్స కోసం చేరి ఉండాలి. కొందరి  బీమా క్లెయిమ్ అంగీకరించేందుకు చికిత్స వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

హెచ్చరిక: ఆయుష్​ కవర్​లో అన్ని వివరాలు సమర్పించారా? లేదా అని ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​తో మరియు అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. 

ఆయుష్ ప్రయోజనం గురించి తరచూ అడిగే ప్రశ్నలు

ఆరోగ్య బీమాలో హోమియోపతి మెడిసిన్ కవర్ అవుతుందా?

అవును. అల్టర్​నేట్ ట్రీట్​మెంట్ ఇన్సూరెన్స్​లో భాగంగా మీకు హోమియోపతి కూడా కవర్ అవుతుంది. ఏదేమైనా  బీమా కంపెనీలు హోమియోపతి  మందుల వంటి చిన్న ఖర్చులను కవర్ చేయవు. అవి ప్రిస్కిప్షన్ మెడిసిన్స్​కు మాత్రమే చెల్లించబడతాయి. రోగి 24 గంటల కంటే ఎక్కువ సమయం పాటు ఆసుపత్రిలో  చేరి ఉంటే ఇది వర్తిస్తుంది.

ఆరోగ్య బీమాలో న్యాచురోపతి కవర్ అవుతుందా?

అవును. ఆసుపత్రిలో తీసుకునే న్యాచురోపతి చికిత్స ఆరోగ్య బీమాలో కవర్ అవుతుంది.