క్రెడిట్ నివేదిక అంటే ఏమిటి?
క్రెడిట్ నివేదిక (క్రెడిట్ సమాచారం, క్రెడిట్ ఫైల్ లేదా క్రెడిట్ చరిత్ర అని కూడా పిలుస్తారు) అనేది ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ అకౌంట్స్, క్రెడిట్ కార్డులు మరియు లోన్లతో కూడిన డిటేయిల్డ్ రికార్డ్. ఇది మీ పేమెంట్ హిస్టరీ, ప్రస్తుత మరియు గత క్రెడిట్ మిక్స్, మరియు మీరు మీ క్రెడిట్ ను ఎలా నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని రుణదాతలకు అందజేస్తుంది.
ఈ రిపోర్ట్ వ్యక్తిగత క్రెడిట్ స్కోరును లెక్కించేందుకు ఉపయోగపడుతుంది. మీ దరఖాస్తు చేసుకున్న లోన్ మరియు క్రెడిట్ ను ఆమోదించాలో లేదో నిర్ణయించుకునేందుకు రుణదాతలకు క్రెడిట్ నివేదిక మరియు క్రెడిట్ స్కోరు ఉపయోగపడుతుంది.
ఈ క్రెడిట్ సమాచారం నిర్వహించేందుకు ఇండియాలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. అవి - ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హై మార్క్ మరియు ఈక్విఫాక్స్. ఈ బ్యూరోలు మీ బ్యాంకులు, రుణదాతలు, మరియు ఇతర రుణదాతల నుంచి మీ ఆర్థిక చరిత్ర గురించి సమాచారం పొందుతాయి.
మీ క్రెడిట్ నివేదిక ఎందుకు ముఖ్యమైనది?
క్రెడిట్ నివేదిక అనేది ఒక వ్యక్తి తన క్రెడిట్ అకౌంట్స్ ను ఎలా నిర్వహిస్తున్నాడనే సారాంశం కలిగి ఉంటుంది. కనుక ఇది చాలా ముఖ్యమైన పత్రం. మీరు క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటిని ఆమోదించాలో లేదో నిర్ణయించుకునేందుకు రుణదాతలు మరియు క్రెడిటార్స్ క్రెడిట్ నివేదికలను ఉపయోగిస్తారు. మరియు మీరు అనుకూలమైన నిబంధనలను పొందుతారా? లేదా అని కూడా ఇది నిర్ణయిస్తుంది.
మీ క్రెడిట్ నివేదికలను ఇన్సూరెన్స్ ప్రయోజనాల వంటి వాటి కోసం ఇతరులు కూడా వీక్షించొచ్చు. అందువల్ల మీ క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యమైనది. అక్కడ ఉన్న సమాచారం ఖచ్చితమైనదని మీరు ఈ విధంగా నిర్దారించుకోవచ్చు.
మీ క్రెడిట్ నివేదికను ఎలా పొందాలి?
మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకోగలిగినప్పటికీ 12 నెలలకోసారి ఉచిత క్రెడిట్ నివేదిక అందించాలని లైసెన్స్ పొందిన నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. మీరు మీ క్రెడిట్ నివేదికలను మరింత తరచుగా తనిఖీ చేయాలని అనుకుంటే మీరు అదనపు చెల్లింపు రిపోర్ట్ లను ఎంచుకోవచ్చు.
మీరు మీ క్రెడిట్ నివేదికను ఎలా తనిఖీ చేయొచ్చో ఇక్కడ ఉంది:
స్టెప్ 1: సిబిల్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హైమార్క్, లేదా ఈక్విఫాక్స్ వంటి నాలుగు క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్లలో ఏదో ఒక దానికి వెళ్లండి.
స్టెప్ 2: ఉచిత క్రెడిట్ నివేదిక ఎంపిక మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: లాగిన్ చేసేందుకు మీ పేరు, మొబైల్ సంఖ్య, మరియు ఈ మెయిల్ చిరునామా వంటి వివరాలను ఎంటర్ చేయండి.
స్టెప్ 4: మీ జన్మదినం, నివాసం ఉండే చిరునామా, ప్రభుత్వం ఆమోదించిన ఐడీ కార్డు (పాన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, వంటివి.) ఉపయోగించి మీ గుర్తింపును ధృవీకరించమని మిమ్మల్ని అడుగుతారు
స్టెప్ 5: ఈ సమాచారం ధృవీకరించబడిన తర్వాత మీరు మీ క్రెడిట్ చరిత్ర గురించి మరిన్ని ప్రశ్నలు అడగవచ్చు.
స్టెప్ 6: మీరు కనుక పెయిడ్ క్రెడిట్ నివేదిక ను పొందాలని అనుకుంటే నెఫ్ట్ ద్వారా అవసరమైన ఫీజును చెల్లించండి. లేదా అవసరమైన మొత్తానికి డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయండి.
స్టెప్ 7: ఫారంను వెబ్‌సైట్ ద్వారా లేదా కొరియర్, పోస్ట్ లేదా ఈ మెయిల్ ద్వారా సమర్పించండి.
స్టెప్ 8: ప్రామాణీకరించబడిన తర్వాత మీ పూర్తి క్రెడిట్ నివేదిక మీ ఈ-మెయిల్ చిరునామాకు గానీ లేదా మీ ఇంటి చిరునామాకు గానీ పంపబడుతుంది.
మీ క్రెడిట్ నివేదికలో ఏ సమాచారం చేర్చబడింది?
వివిధ రకాల బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోలకు షేర్ చేసే డేటాను బట్టి ఒక వ్యక్తి క్రెడిట్ నివేదిక తయారు చేయబడుతుంది. వారు క్రెడిట్ కు సంబంధించిన అంశాలైన రీపేమెంట్ రికార్డ్స్, క్రెడిట్ కార్డు వాడకం, గతంలో లోన్ల కోసం పెట్టుకున్న అప్లికేషన్, లేదా క్రెడిట్ కార్డుల వంటి వాటిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు షేర్ చేస్తాయి. ఇవి ఒక కాంప్రహెన్సివ్ పత్రాలుగా ఉంటాయి.
సాధారణంగా క్రెడిట్ నివేదిక ఈ కింది సమాచారం కలిగి ఉంటుంది.
గుర్తింపు మరియు సంప్రదింపు సమాచారం
ఈ విభాగంలో ఇవి ఉన్నాయి:
వ్యక్తిగత సమాచారం: మీ పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు కేవైసీ.
సంప్రదింపు సమాచారం: మీ చిరునామా (గత చిరునామాలు) మరియు సంప్రదింపు సంఖ్య.
ఉద్యోగ వివరాలు: బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు అందించిన మీ నెలవారీ లేదా వార్షిక ఆదాయం.
క్రెడిట్ స్కోరు
ఇది 300-900 ల మధ్య ఉండే 3 డిజిట్ సంఖ్య. ఇది మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా లెక్కించబడుతుంది.
క్రెడిట్ సమ్మరీ
చెల్లించాల్సిన క్రెడిట్ మొత్తం (మొత్తం ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య మరియు చెల్లించాల్సిన రుణం) క్రెడిట్ మొత్తం మరియు క్రెడిట్ ఎలా మేనేజ్ చేయబడుతుందనేది క్రెడిట్ సమాచారంలో ఉంటుంది.
తాజాగా జరిపిన కార్యకలాపాలు
మీరు ఇటీవల కొత్త అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారా లేదా సురక్షితం అయిన కొత్త క్రెడిట్ ను పొందారా? అనే సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాకుండా మీరు క్లోజ్ చేసిన ఖాతాలను కూడా ఇది కలిగి ఉంటుంది. (ఆ చరిత్ర కూడా ఇక్కడ లెక్కించబడుతుంది).
అకౌంట్ వివరాలు
మీ అకౌంట్ సంఖ్యల వివరాలు, మరియు రకాలు, ప్రస్తుత బ్యాలెన్స్ మరియు మీ నెలవారీ చెల్లింపుల యొక్క వివరాలు. మీ చెల్లింపులు సకాలంలో జరిగాయా లేక ఆలస్యం అయ్యాయా లేదా మిస్ అయ్యాయా అనేది కూడా ఇందులో ఉంటుంది.
విచారణలు
ఈ విభాగంలో క్రెడిట్ విచారణలకు సంబంధించిన సంఖ్యలు ఉన్నాయి. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డు వంటి క్రెడిట్ కోసం అప్లికేషన్ చేసుకున్న ప్రతిసారి మీ క్రెడిట్ నివేదిక పై కఠిన విచారణ జరుగుతుంది. మీరు మీ క్రెడిట్ ను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారని అధిక సంఖ్యలో విచారణలు సూచిస్తున్నాయి.
ఈ క్రెడిట్ నివేదికలో రుణదాతలు ఏమి చూస్తారు?
పైన పేర్కొన్న విధంగా రుణాలు మరియు లోన్ల కొరకు మీ అభ్యర్థనను అంగీకరించాలో లేదో తెలుసుకునేందుకు రుణదాతలు మీ క్రెడిట్ నివేదిక మీద చూస్తారు. సంభావ్యత ఉన్న రుణ గ్రహీతలను నిర్ణయించేందుకు ప్రత్యేకమైన రూల్స్ ఏమీ లేనప్పటికీ వారు పరిగణలోనికి తీసుకునే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి:
క్రెడిట్ స్కోర్: ఎవరైనా రుణదాతలకు మీ మీద కలిగే మొదటి అభిప్రాయం క్రెడిట్ స్కోర్. ఎందుకంటే ఇది మీరు లోన్ మీద ఎంత ఆధారపడుతున్నారో తెలియజేస్తుంది. అందుకే మంచి క్రెడిట్ స్కోరు (700 పైన) కలిగి ఉండడం ముఖ్యమైనది.
రీపేమెంట్ చరిత్ర: రుణదాతలు పరిగణించే ముఖ్య విషయాల్లో ఒకటి మీరు తిరిగి డబ్బులను సమయానికి కడుతున్నారా? లేదా? అని. సమయం తర్వాత చేసిన చెల్లింపులను (లేట్ పేమెంట్స్) కూడా వారు చూస్తారు (గతంలోవి మరియు వర్తమానంలోవి) అంతేకాకుండా లోన్ల కోసం చేసుకున్న వన్ టైమ్ సెటిల్‌మెంట్లను కూడా చూస్తారు.
మీరు ఎంత చెల్లించాలి: ఇందులో మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డులు మరియు లోన్ల సంఖ్య మరియు లోన్ల రకం గురించి ఉంటుంది. జనరల్ గా మీరు ఎక్కువ లోన్లు కలిగి ఉండడం వల్ల కొత్త రుణం తిరిగి రీపేమెంట్ చేసేందుకు మీ సామర్థ్యం తగ్గుతుంది.
క్రెడిట్ మీద ఆధారపడడం: రుణదాతలు మీ క్రెడిట్ హంగ్రీ ప్రవర్తన (ఎక్కువ మంది రుణదాతలు మీ క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయడం) క్రెడిట్ మీద ఎక్కువగా ఆధారపడడం. తక్కువ వ్యవధిలో ఎక్కువ లోన్ lలు లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం మరియు ఎక్కువ క్రెడిట్ వినియోగం వంటివి ఇందులో ఉన్నాయి.
వ్యక్తి యొక్క వివరాలు: మీ ఆర్థిక మరియు స్థిరత్వాన్ని నిర్దారించేందుకు రుణదాతలు వారు రుణం ఇచ్చే ఉపాధి మరియు నివాస చరిత్రను కూడా తనిఖీ చేయొచ్చు.
జనరల్ గా మీరు బాధ్యత గల లాంగ్ ట్రాక్ రికార్డును ప్రదర్శిస్తే రుణదాతలు మీతో తక్కువ అపాయం ఉందని భావిస్తారు. అంతేకాకుండా మీరు క్రెడిట్ కోసం త్వరగా ఆమోదం పొంది మంచి డీల్స్ పొందుతారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
క్రెడిట్ స్కోరు మరియు క్రెడిట్ నివేదికకు మధ్య గల వ్యత్యాసం ఏమిటి?
క్రెడిట్ స్కోరు అనేది 300-900 మధ్య ఉండే ఒక 3 డిజిట్ సంఖ్య. ఇది వ్యక్తిగత క్రెడిట్ యోగ్యతను వర్ణిస్తుంది. అయినప్పటికీ క్రెడిట్ నివేదిక (క్రెడిట్ సమాచారం రిపోర్ట్ లేదా సీఐఆర్ అని పిలుస్తారు) అనేది వారి క్రెడిట్ చరిత్ర యొక్క మరింత వివరణాత్మకమైన సమాచారం అందిస్తుంది.
మీ క్రెడిట్ నివేదిక ఎప్పుడెప్పుడు అప్డేట్ చేయబడుతుంది?
సాధారణంగా రుణదాతలు, బ్యాంకులు మరియు ఇతర క్రెడిటార్లు నెలవారీగా మీ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు చేరవేస్తుంటారు. (అయితే నెలలో వారు పంపే తేదీలు మాత్రం మారొచ్చు). మీ క్రెడిటార్స్ మీ పేమెంట్ హిస్టరీని పంపినపుడు మీ క్రెడిట్ నివేదిక అనేది నెలవారీగా అప్టేట్ అవుతుంది.
మీరు మీ క్రెడిట్ నివేదికను ఎంత తరచుగా తనిఖీ చేయవచ్చు?
ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి ఒక క్రెడిట్ నివేదిక ను 12 నెలలకోసారి మీరు ఉచితంగా పొందడాన్ని ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.
మీరు మీ క్రెడిట్ నివేదికను ఏడాది ఒక సారైనా తనిఖీ చేయాలి. 3 నెలలకొకసారి క్రెడిట్ నివేదికను తనిఖీ చేస్తే చాలా మంచిది. మీరు తరచూ క్రెడిట్ యాక్టివిటీని కలిగి ఉంటే... మీరు తరచుగా చెక్ చేసేందుకు వీలుంటుంది.
మీ క్రెడిట్ నివేదికను మీరే యాక్సెస్ చేయడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటారు. అది మీ క్రెడిట్ నివేదిక మరియు స్కోర్ ను ప్రభావితం చేయదు.
మీ క్రెడిట్ స్కోరును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ఎంత ముఖ్యమైనది?
మీరు క్రమం తప్పకుండా క్రెడిట్ అకౌంట్లను (క్రెడిట్ కార్డులు లేదా లోన్) వంటివి ఉపయోగిస్తుంటే మీ క్రెడిట్ నివేదికను మరియు క్రెడిట్ స్కోరును తప్పకుండా తనిఖీ చేయడం చాలా అవసరం. మీ క్రెడిట్ స్కోరు ఏమిటో తెలుసుకోవడం పెద్ద కొనుగోళ్లు చేపట్టేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోరు అత్యధికంగా ఉండేలా సహాయపడుతుంది.
మీ క్రెడిట్ నివేదికలో ఏదైనా సమాచారం మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటే... వెంటనే గుర్తించి వాటిని సరిదిద్దుకోవచ్చు.
మీ క్రెడిట్ నివేదికలో ఎటువంటి తప్పులు ఉండవచ్చు?
మీ క్రెడిట్ నివేదికలో వచ్చే కొన్ని సాధారణ లోపాలు:
- పాత సమాచారం: కాలం చెల్లిన వ్యక్తిగత సమాచారం అయిన చిరునామాలు, సంప్రదింపు సంఖ్యలు వంటివి.
- తప్పుడు అకౌంట్ సమాచారం: తప్పు అకౌంట్ సంఖ్య, తప్పుడు పేమెంట్ హిస్టరీ లేదా ఇతర తప్పుడు వివరాలు.
- అకౌంట్ లోపాలు: మీ పేరుతో ఉన్న అకౌంట్స్ మిస్ అయ్యాయి. లేదా వేరొకరి చెందిన అకౌంట్ తప్పుగా మీకు జత చేయబడింది. ఇది తప్పు రిపోర్ట్ లు లేదా తప్పుడు ఐడెంటిటీకి దారి తీయొచ్చు.
- క్లరికల్ (ఒక డాక్యుమెంట్ లో సమాచారం రాసేటపుడు కానీ కాపీ చేసేటపుడు కానీ జరిగే తప్పులు): మీ పుట్టిన తేదీ, చిరునామా, సంప్రదింపు సంఖ్య మొదలయిన వాటిలో జరిగే తప్పులు కూడా ఐడెంటిటీ క్రైసెస్ కు దారి తీయొచ్చు.
అందిన వివాద పరిష్కార ఫారం (డిస్‌ప్యూట్ రిసొల్యూషన్) ఉపయోగించి వీలైనంత త్వరగా తప్పులను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ తప్పులు మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతాయి. కొన్ని సందర్భాలలో ఇది ఐడెంటిటీ దొంగతనానికి కూడా కారణం కావచ్చు. అందుకోసమే వీటిని తప్పనిసరిగా పరిష్కరించాలి. పరిష్కరించకుండా వదిలేస్తే ఇది తీవ్రమైన సమస్య కావొచ్చు.
మీ క్రెడిట్ నివేదికలో తప్పులను ఎలా సరిదిద్దాలి?
మీరు కనుక మీ క్రెడిట్ నివేదికలో సమస్య లేదా పొరపాటును కనుక్కుంటే మీ సమస్య పరిష్కారం అయ్యేందుకు కింది స్టెప్స్ అనుసరించండి:
స్టెప్ 1: మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా చెక్ చేయండి. మరియు ఏవైనా తప్పులుంటే గుర్తించండి.
స్టెప్ 2: రిపోర్ట్ లో తప్పును గుర్తించిన తర్వాత సంబంధిత అధికారికి నివేదించండి. ఉదాహరణకు మీకు లోన్ ఇచ్చిన ఆర్థిక సంస్థలో లోపం ఉంటే క్రెడిట్ బ్యూరో మార్పులు చేసే ముందు వారు ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
స్టెప్ 3: మనం తప్పు ఉందని రిపోర్ట్ చేసి 30 రోజుల లోపు సంబంధిత వ్యక్తి తగిన మార్పులు చేయకపోతే లోపాలను సరిదిద్దేందుకు మీరు అంబుడ్స్‌మన్ (లేదా ప్రభుత్వ అధికారిని) సంప్రదించొచ్చు.
స్టెప్ 4: మార్పులు అమలు చేయబడిన తర్వాత (ఒక వేళ లోపాలను సరిదిద్దడం సాధ్యం కాకపోతే), క్రెడిట్ బ్యూరో మీకు అదే సమాచారాన్ని తెలియజేస్తుంది.
లోపాలను గురించి మీరు రిపోర్ట్ చేసేందుకు వివాద ఫారంలను ఇక్కడ కనుక్కోవచ్చు: సిబిల్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హైమార్క్, లేదా ఈక్విఫాక్స్.