క్రెడిట్ రేటింగ్ అంటే ఏమిటి?
క్రెడిట్ రేటింగ్ అనేది వ్యక్తులు, వ్యాపారాలు, సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వాలు మరియు దేశాల వంటి వాటి క్రెడిట్ యోగ్యత ను అంచనా వేసేందుకు ఒక మార్గం. స్పెషల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు లోన్ తీసుకునే వారు సకాలంలో రుణాలు చెల్లించగలరా లేదా అని వారి ఆర్థిక ప్రమాదాలను అంచనా వేస్తాయి.
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇవి ఒక వివరణాత్మకమైన రిపోర్ట్ ను ఉపయోగించి రేటింగ్ ను సంకలనం చేస్తాయి. రుణాలు, మరియు రుణాలు తీసుకున్న గత చరిత్ర, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, గత అప్పులు, భవిష్యత్ ఆర్థిక సామర్థ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.
మంచి క్రెడిట్ రేటింగ్ అనేది విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. గతంలో లోన్ లను సకాలంలో చెల్లించిన చరిత్ర ను సూచిస్తుంది. ఇది బ్యాంక్ లు మరియు ఇన్వెస్టర్లకు లోన్ అప్లికేషన్ ను ఆమోదించడంలో మరియు వడ్డీ రేటు ను నిర్ణయించడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ రేటింగ్ రకాలు
క్రెడిట్ రేటింగ్ లను నిర్ణయించేందుకు వివిధ రకాల క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఒకే రకమైన చిహ్నాలను ఉపయోగిస్తాయి. ఈ రేటింగ్ లు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి - పెట్టుబడి గ్రేడ్ మరియు స్పెక్యులేటివ్ గ్రేడ్.
- పెట్టుబడి గ్రేడ్: ఈ రేటింగ్ లు పెట్టుబడులు పటిష్టంగానే ఉన్నాయనే వాస్తవాన్ని సూచిస్తాయి మరియు రుణగ్రహీత రీపేమెంట్ నియమాలకు కట్టుబడి ఉన్నాడని చెబుతుంది. అందువల్లే తరచూ తక్కువ ధర ఉంటుంది.
- స్పెక్యులేటివ్ గ్రేడ్: మీరు పెట్టిన పెట్టుబడులు అధిక ప్రమాదం లో ఉన్నాయని మరియు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉన్నాయని చూపుతాయి.
క్రెడిట్ రేటింగ్ మరియు క్రెడిట్ స్కోరు మధ్య ఏమైనా తేడా ఉందా?
కొన్ని సార్లు క్రెడిట్ స్కోరు మరియు క్రెడిట్ రేటింగ్ అనేవి మార్చి ఉపయోగించబడతాయి. అయినా కానీ అవి ఒకటి కావు.
పైన పేర్కొన్న విధంగా, క్రెడిట్ రేటింగ్ అనేది వ్యక్తుల కంటే వ్యాపారం లేదా కంపెనీ యొక్క క్రెడిట్ యోగ్యతను నిర్ణయించేందుకు ఉపయోగించబడుతుంది. ఇది తప్పనిసరిగా చెల్లింపులపై డిఫాల్ట్ అయే సంభావ్యతను సూచిస్తుంది. రేటింగ్ అనేది అక్షరాల చిహ్నాలుగా ఉంటుంది. మరియు ఇది కార్పొరేట్ ఆర్థిక సాధనాలను ఉపయోగించి లెక్కించబడుతుంది.
అయితే, క్రెడిట్ స్కోర్ అనేది ఒక సంఖ్య, సాధారణంగా ఇది 300-900 మధ్య ఉంటుంది. ఇది వ్యక్తుల క్రెడిట్ యోగ్యత ప్రకారం అందించబడుతుంది. ఇది వ్యక్తి యొక్క క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగా క్రెడిట్ బ్యూరోలచే లెక్కించబడుతుంది. దరఖాస్తుదారులకు లోన్ లు మరియు క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలో లేదో నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
క్రెడిట్ రేటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
క్రెడిట్ రేటింగ్ అనేది లోన్ తీసుకునే వ్యక్తి యొక్క క్రెడిట్ యోగ్యత అంచనా. అధిక క్రెడిట్ రేటింగ్ అనేది కంపెనీ లేదా సంస్థ తీసుకున్న క్రెడిట్ ను తిరిగి చెల్లించే అవకాశం ఉందని సూచిస్తుంది. మరో వైపు తక్కువ క్రెడిట్ రేటింగ్ అంటే వారు డిఫాల్టర్ గా మారే ఎక్కువ సంభావ్యతను కలిగి ఉంటారు. రుణాలు ఇచ్చేవారు అటువంటి వారితో అధిక ప్రమాదం అని భావిస్తారు. అందుకోసమే ఇది వారికి కష్టతరం అవుతుంది.
అయితే క్రెడిట్ రేటింగ్‌కు ముఖ్యమైన ఇతర మార్గాలు ఉన్నాయి:
రుణదాతల కోసం
రుణాలు తీసుకునే వారు మరియు పెట్టుబడిదారులు డబ్బును తీసుకునే సంస్థ నష్టాన్ని పరిగణలోనికి తీసుకోవడం ద్వారా మెరుగైన పెట్టుబడి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది.
రుణదాతలు సంభావ్యత గల రుణగ్రహీతల క్రెడిట్ రేటింగ్ ను గురించి తెలుసుకున్నపుడు వారు డబ్బుని వడ్డీతో సహా సకాలంలో తిరిగి చెల్లిస్తారా లేదా అనే విషయం తెలుస్తుంది.
అప్పు తీసుకునే వారి కోసం
ఏవైతే కంపెనీలు అధిక క్రెడిట్ రేటింగ్ ను కలిగి ఉంటాయో అవి తక్కువ రిస్క్ ఉన్నవిగా పరిగణించబడతాయి. అందువల్ల వారి లోన్ అప్లికేషన్లను చాలా సులభంగా అప్రూవ్ అవుతాయి.
బ్యాంక్ లు మరియు రుణదాతలు అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తాయి.
అందువల్ల అధిక క్రెడిట్ రేటింగ్ ను కలిగి ఉండడం వలన డబ్బును సులభంగా సేకరించేందుకు మరియు కంపెనీని విస్తరించేందుకు సహాయపడుతుంది. అదే సమయంలో రుణం తీసుకునేందుకు అయ్యే ఖర్చును కూడా తగ్గిస్తుంది. రుణదాతలకు ఈ రేటింగ్స్ అనేవి ఎంతో సహాయపడతాయి. మరింత వివరణాత్మక ఆర్థిక సమాచారాన్ని ఇవి అందజేస్తాయి.
ఇండియాలో ఉన్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఏంటి?
క్రెడిట్ రేటింగ్ లను క్రెడిట్ ఏజెన్సీలు మూల్యాంకనం చేస్తాయి. ఇండియాలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు సెబీ (క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు) చట్టం, 1999 కింద నియంత్రించబడతాయి. ఇవి సెక్యూరిటీస్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం 1992లో భాగంగా ఉంటాయి.
ఇండియాలోని కొన్ని టాప్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు:
క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CRISIL)
ఇండియాలో ఇది మొట్టమొదటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. 1987లో స్థాపించబడింది. ఇది కంపెనీలు, బ్యాంకులు, మరియు ఆర్గనైజేషన్లకు బలాలు, మార్కెట్ షేర్, మార్కెట్ లో ఉన్న కీర్తిని బట్టి రేటింగ్ ఇస్తాయి. కంపెనీ యూఎస్‌ఏ, యూకే, హంగ్‌కాంగ్, పోలాండ్, అర్జెంటీనా, మరియు చైనాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరియు AAA – D వరకు 8 రకాల క్రెడిట్ రేటింగ్ లు ఉంటాయి.
ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా (ICRA) లిమిటెడ్
1991లో స్థాపించబడిన ఐసీఆర్‌ఏ, బ్యాంక్ లోన్ లు, కార్పోరేట్ రుణాలు, మ్యూచువల్ ఫండ్స్ మరియు మరిన్నింటి విభిన్న పరిస్థితుల కోసం కార్పొరేట్ లకు కాంప్రహెన్సివ్ రేటింగ్లను అందిస్తాయి.
క్రెడిట్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ (CARE)
ఇది 1993 ఏప్రిల్, సీఏఆర్ఈ నుంచి అనేక రకాల క్రెడిట్ రేటింగ్ సర్వీసులను అందిస్తోంది. వీటిలో రుణాలు, బ్యాంక్ లోన్లు, కార్పొరేట్ గవర్నెన్స్, రికవరీ, ఫైనాన్షియల్ సెక్టార్ వంటివి ఉంటాయి. వాటి రేటింగ్ స్కేల్‌లో రెండు వర్గాలు ఉన్నాయి - దీర్ఘకాలిక రుణ సాధనాలు మరియు స్వల్పకాలిక రుణ రేటింగ్‌లు.
ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్
గతంలో ఫిచ్ రేటింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా పిలవబడేది.. ఈ కంపెనీ కార్పోరేట్ ఇష్యూయర్స్, ఆర్థిక సంస్థలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్ కంపెనీలు, మేనేజ్‌డ్ ఫండ్స్, అర్బన్ లోకల్ బాడీల విశ్వసనీయతను అంచనా వేసేందుకు క్రెడిట్ రేటింగ్లను అందిస్తుంది.
అక్యూట్ రేటింగ్స్ & రీసెర్చ్
గతంలో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లేదా (SMERA రేటింగ్స్ లిమిటెడ్) గా పిలవబడేది. 2011లో స్థాపించబడిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇది. ఇది రెండు రకాల డివిజన్స్ ను కలిగి ఉంటుంది. ఎస్ఎంఈ రేటింగ్లు మరియు బాండ్ రేటింగ్స్, అంతేకాకుండా ఇందులో 8 రకాలైన రేటింగ్స్ ఉంటాయి. AAA – D వరకు.
బ్రిక్ వర్క్ రేటింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్యాంక్ లోన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి, ఎన్‌జీవోలు, క్యాపిటల్ మార్కెట్ సాధనాలు, ఎస్ఎంఈలు.
కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తనిఖీ చేసేందుకు పైన పేర్కొన్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను సంప్రదించాలి.
వివిధ రకాల క్రెడిట్ రేటింగ్ కొలమానాలు ఏమి
వివిధ రకాల క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఏదైనా ఒక కంపెనీ యొక్క క్రెడిట్ యోగ్యతను మరియు క్రెడిట్ ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ఒకే విధమైన రేటింగ్ లను (AAA – D) కలిగి ఉంటాయి.
రేటింగ్ స్కేల్ | సింబల్ (గుర్తు) |
---|---|
తక్కువ క్రెడిట్ రిస్క్/అత్యద్భుత క్రెడిట్ రేటింగ్ | AAA |
చాలా తక్కువ క్రెడిట్ రిస్క్/ చాలా మంచి క్రెడిట్ రేటింగ్ | AA |
తక్కువ క్రెడిట్ రిస్క్ / మంచి క్రెడిట్ రేటింగ్ | A |
పరిమితమైన క్రెడిట్ రిస్క్/యావరేజ్ క్రెడిట్ రేటింగ్ | BBB |
హై క్రెడిట్ రిస్క్/ లో (తక్కువ) క్రెడిట్ రేటింగ్ | B |
చాలా ఎక్కువ క్రెడిట్ రిస్క్/ చాలా తక్కువ క్రెడిట్ రేటింగ్ | C |
డిఫాల్ట్ చేయబడింది | D |
క్రెడిట్ రేటింగ్ ను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?
కంపెనీ క్రెడిట్ రేటింగ్ లను ప్రభావితం చేసేలా అనేక అంశాలు ఉంటాయి. కంపెనీ క్రెడిట్ రేటింగ్ కింది వాటిని కలిగి ఉంటుంది:
కంపెనీ ఆర్థిక చరిత్ర:
లోన్స్ ఇవ్వడం మరియు లోన్స్ తీసుకోవడం గురించి చరిత్ర
పాత రుణాలు
పేమెంట్ హిస్టరీ
ఆర్థిక నివేదికలు
ప్రస్తుత రుణస్థాయి మరియు రకం
కంపెనీ యొక్క భవిష్యత్ ఆర్థిక సామర్థ్యం:
లోన్ ని తిరిగి చెల్లించే సామర్థ్యం
అంచనా వేసిన లాభాలు
ప్రస్తుత పనితీరు